Economy | గాసెవ్ ప్రథమ సూత్రం అని దేన్ని అంటారు?
1. ఉచిత వస్తువులకు ప్రయోజనం ఉంటుంది. మారకం విలువ?
ఎ) మారకం విలువ కూడా ఉంటుంది
బి) మారకం విలువ ఉండదు
సి) అవసరాన్ని బట్టి ఉంటుంది
డి) ఏదీకాదు
2. ఎలిమెంట్స్ ఆఫ్ ప్యూర్ ఎకనామిక్స్ గ్రంథ రచయిత ఎవరు?
ఎ) మార్షల్ బి) రాబిన్స్
సి) వాల్రస్ డి) డికెన్స్
3. కిందివాటిలో కార్డినల్ ప్రయోజనం పరంగా సరైంది కానిది?
ఎ) వస్తువు ప్రయోజనాన్ని సంఖ్యా రూపంలో కొలవవచ్చు.
బి) దీన్ని మార్షల్ ప్రతిపాదించాడు
సి) 1,2,3,4 అనేవి కార్డినల్ సంఖ్యలు
డి) వస్తువు ప్రయోజనాన్ని పోల్చవచ్చు
4. కింది వాటిని జతపరచండి.
ఎ) కార్డినల్ ప్రయోజనం 1) రాబిన్స్
బి) ఆర్డినల్ ప్రయోజనం 2) ఆడమ్‌స్మిత్
సి) సంపద నిర్వచనం 3) మార్షల్
డి) కొరత నిర్వచనం 4) అలెన్, హిక్స్
ఎ) ఎ-3, బి-4, సి-2, డి-1
బి) ఎ-4, బి-3, సి-2, డి-1
సి) ఎ-1, బి-2, సి-3, డి-4
డి) ఎ-1, బి-4, సి-3, డి-2
5. కిందివాటిలో సరైనది ఏది?
ఎ) సూక్ష్మ అర్థశాస్ర్తాన్ని ధరల సిద్ధాంతం అని అంటారు
బి) సూక్ష్మ అర్థశాస్త్రం వైయక్తిక యూనిట్లను అధ్యయనం చేస్తుంది.
సి) సూక్ష్మ, స్థూల అర్థశాస్త్రం వర్గీకరణ 1933
డి) పైవన్నీ సరైనవే
6. టూత్ పేస్ట్, బ్రష్ అనేవి?
ఎ) ప్రత్యామ్నాయ వస్తువులు
బి) పూరక వస్తువులు
సి) చరానుపాతాల సూత్రం
డి) ప్రతిస్థాపన సూత్రం
7. గాసెవ్ ప్రథమ సూత్రం అని దేన్ని అంటారు?
ఎ) క్రమక్షీణోపాంత ప్రయోజన సూత్రం
బి) సమోపాంత ప్రయోజన సూత్రం
సి) చరానుపాతాల సూత్రం
డి) ప్రతిస్థాపన సూత్రం
8. వస్తువు ధర తగ్గినపుడు మొత్తం ఖర్చు పెరిగితే డిమాండ్ వ్యాకోచత్వం?
ఎ) సాపేక్ష వ్యాకోచం బి) సాపేక్ష అవ్యాకోచం
సి) పూర్తి వ్యాకోచం డి) పూర్తి అవ్యాకోచం
9. మూలధనం పెరుగుదలకు మూలం
ఎ) ఆదాయం బి) సంపద
సి) పొదుపు డి) పెట్టుబడి
10. శ్రామిక సప్లయ్ రేఖ ఏ ఆకారంలో ఉంటుంది?
ఎ) U- ఆకారంలో ఉంటుంది
బి) వెనుకకు వంగి ఉంటుంది
సి) ఎడమ నుంచి కుడికి కిందికి వాలి ఉంటుంది
డి) ఎడమ నుంచి కుడికి పైకి వాలి ఉంటుంది
11. ధర విచక్షణ అంటే ?
ఎ) ఒకే రకమైన వస్తువులకు వివిధ ధరలు
బి) వివిధ మార్కెట్లలో ఒకే ధరలు
సి) స్వల్పకాలంలో ఎక్కువ ధర, దీర్ఘకాలంలో తక్కువధర
డి) స్వల్పకాలంలో తక్కువ ధర దీర్ఘకాలంలో ఎక్కువ ధర
12. బదిలీ సంపాదన అనే భావనను ప్రవేశపెట్టినవారు?
ఎ) బెవరిడ్జి బి) ఎడ్వర్త్
సి) రాబిన్స్ డి) రాబిన్సన్
13. మార్కెట్ ధర అంటే?
ఎ) స్వల్పకాలిక సమతుల్య ధర
బి) దీర్ఘకాలిక సమతుల్య ధర
సి) స్వేచ్ఛగల మార్కెట్లో సగటు ధర
డి) అన్ని మార్కెట్లలో సగటు ధర
14. చర వ్యయాలను మార్షల్ ఏమని వివరించాడు?
ఎ) అనుబంధ వ్యయాలు
బి) సాపేక్ష వ్యయాలు
సి) ప్రత్యక్ష వ్యయాలు
డి) వ్యవస్థా వ్యయాలు
15. కింది వాటిని జతపరచండి?
ఎ) పూర్తి వ్యాకోచం 1) ఒకటికి సమానం
బి) పూర్తి అవ్యాకోచం 2) ఒకటి కంటే ఎక్కువ
సి) సాపేక్ష వ్యాకోచం 3) ఒకటి కంటే తక్కువ
డి) సాపేక్ష అవ్యాకోచం 4) సున్నా
ఇ) ఏకత్వ వ్యాకోచం 5) అనంతం
ఎ) ఎ-5, బి-4, సి-2, డి-3, ఇ-1
బి) ఎ-5, బి-4, సి-3, డి-2, ఇ-1
సి) ఎ-1, బి-2, సి-3, డి-4, ఇ-5
డి) ఎ-2, బి-3, సి-4, డి-1, ఇ-5
16. ఏకస్వామ్య పోటీ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు ఎవరు?
ఎ) మార్షల్ బి) గాసెన్
సి) చాంబర్లీన్ డి) ఎడ్వర్త్
17. కిందివాటిలో సరైనది ఏది?
ఎ) దీర్ఘకాలంలో స్థిర, వ్యయాలు, చర వ్యయాల కంటే ఎక్కువగా ఉంటాయి
బి) దీర్ఘకాలంలో స్థిర వ్యయాలు చర వ్యయాలు, కంటే తక్కువగా ఉంటాయి
సి) దీర్ఘకాలంలో అన్ని వ్యయాలు చర వ్యయాలే
డి) దీర్ఘకాలంలో అన్ని వ్యయాలు స్థిర వ్యయాలే
18. కాపీరైట్ గల పుస్తకం?
ఎ) సహజ ఏకస్వామ్యం
బి) చట్టబద్ధ ఏకస్వామ్యం
సి) పరిమిత ఏకస్వామ్యం
డి) ద్విదాధిపత్యం
19. డిమాండ్ స్థిరంగా ఉండి సప్లయ్ తగ్గితే?
ఎ) ధరలు తగ్గుతాయి
బి) ధరలు పెరుగుతాయి
సి) ధరలు స్థిరంగా ఉంటాయి
డి) ఏదీకాదు
20. ఒక ఉత్పత్తి కారకానికి దాని కనిష్ఠ సప్లయ్ ధరకన్నా అధికంగా వచ్చే ప్రతిఫలం?
ఎ) ఆర్థిక బాటకం బి) ఆర్థిక మిగులు
సి) ఆర్థిక లాభాలు డి) దోపిడి
21. కింది వాటిని జతపరచండి?
ఎ) ఉచిత వస్తువులు 1) పాలు పండ్లు
బి) ఆర్థిక వస్తువులు 2) మినరల్ వాటర్
సి) ప్రత్యామ్నాయ వస్తువులు 3) ఎడారిలో ఇసుక
డి) పూరక వస్తువులు 4) టీవీ రిమోట్
ఎ) ఎ-1, బి-2, సి-3, డి-4
బి) ఎ-2, బి-4, సి-1, డి-3
సి) ఎ-3, బి-2, సి-1, డి-4
డి) ఎ-3, బి-1, సి-2, డి-4
22. కిందివాటిలో స్థూల అర్థశాస్త్రం వేటిని అధ్యయనం చేస్తుంది?
ఎ) ఒక సంస్థ బి) ఒక పరిశ్రమ
సి) మొత్తం పొదుపు డి) కుటుంబం
23. శుద్ధ ఏకస్వామ్యంలో డిమాండ్ రేఖ కింది విధంగా ఉంటుంది?
ఎ) లంబ అతి పరావలయం
బి) నిలువు రేఖ
సి) అడ్డరేఖ
డి) వెనుకకు వాలి ఉంటుంది
24. కిందివాటిని జతపరచండి?
ఎ) సగటు వ్యయరేఖ 1) U ఆకారంలో ఉంటుంది
బి) చర వ్యయరేఖ 2) కాలంతోపాటు మారుతుంది
సి) ఉపాంత వ్యయరేఖ 3) ధర నిర్ణయమందు అతి ముఖ్యరేఖ
డి) సగటు స్థిర వ్యయరేఖ 4) ఉత్పత్తి పెరిగే కొద్ది తగ్గుతుంది
ఎ) ఎ-1, బి-2, సి-3, డి-4
బి) ఎ-4, బి-3, సి-2, డి-1
సి) ఎ-3, బి-4, సి-1, డి-2
డి) ఎ-2, బి-1, సి-4, డి-3
25. కొద్దిమంది అమ్మకందారులు ఉన్న మార్కెట్‌ను ఏమంటారు?
ఎ) ఏకస్వామ్యం బి) ద్విస్వామ్యం
సి) పరిమిత స్వామ్యం డి) సంపూర్ణ పోటీ
26. వస్తు వైవిధ్యత కలిగిన మార్కెట్?
ఎ) ఏకస్వామ్యం బి) పరిమిత స్వామ్యం
సి) సంపూర్ణ పోటీ డి) ఏకస్వామ్య పోటీ
27. మారుతున్న ఆర్థిక వ్యవస్థలో …?
ఎ) సప్లయ్ మారుతుంది
బి) డిమాండ్ మారుతుంది
సి) ఎ, బి డి) ఏదీకాదు
28. భూమికి …?
ఎ) ఉత్పత్తి వ్యయం లేదు
బి) గమనశీలత లేదు
సి) ఎ, బి
డి) ఉత్పత్తి వ్యయం ఉంది, గమనశీలత లేదు
29. బహుళ ప్రయోజనాలు గల వస్తువు డిమాండ్ ఎలా ఉంటుంది?
ఎ) వ్యాకోచం బి) అవ్యాకోచం
సి) ఏకత్వం డి) ఏదీకాదు
30. కింది వాటిలో తప్పును గుర్తించండి?
ఎ) పరిశ్రమ పెరుగుతున్నప్పుడు వచ్చే ఆదాయాలను బహిర్గత ఆదాలు అంటారు
బి) సంస్థ పెరుగుతున్నప్పుడు వచ్చే ఆదాయాలను అంతర్గత ఆదాలు అంటారు
సి) మూలధనం ఉత్పత్తి చేసిన ఉత్పత్తి సాధనం
డి) మూలధనం పెరుగుదలకు మూల సంపద
31. జనాభా పెరుగుతున్న కొద్దీ బాటకం?
ఎ) పెరుగుతుంది బి) తగ్గుతుంది
సి) స్థిరంగా ఉంటుంది డి) ఏదీకాదు
32. కింది వాటిలో ఒకటి పరిపూర్ణ పోటీ లక్షణం?
ఎ) అధిక సంఖ్యలో పోటీదార్లు, సజాతీయ వస్తువు
బి) అధిక సంఖ్యలో పోటీదార్లు, వైవిధ్యం
సి) ఒకే ఉత్పత్తి దారుడు సజాతీయ వస్తువు
డి) కొద్ది మంది ఉత్పత్తి దారులు – వస్తు వైవిధ్యం
33. కిందివాటిని జతపరచండి?
ఎ) రికార్డో 1) నవ కల్పన లాభ సిద్ధాంతం
బి) మార్షల్ 2) ఆధునిక బాటక సిద్ధాంతం
సి) రాబిన్ సన్ 3) కృత్రిమ బాటకం
డి) షుం పీటర్ 4) సంప్రదాయక బాటక సిద్ధాంతం
ఎ) ఎ-1, బి-2, సి-3, డి-4
బి) ఎ-4, బి-3, సి-2, డి-1
సి) ఎ-2, బి-1, సి-3, డి-4
డి) ఎ-4, బి-1, సి-2, డి-3
34. కీన్స్ సార్వత్రిక సిద్ధాంతాన్ని ప్రచురించిన సంవత్సరం?
ఎ) 1930 బి) 1935
సి) 1936 డి) 1938
35. సార్థక డిమాండ్ కొరత వల్ల ఏర్పడేది?
ఎ) ద్రవ్యోల్భణం బి) నిరుద్యోగం
సి) లాభం రేటు తక్కువ
డి) వినియోగం తక్కువ
36. ప్రయోజనాన్ని సంఖ్యారూపంలో కొలవడం, పోల్చడం?
ఎ) కార్డినల్ ప్రయోజనం
బి) ఆర్డినల్ ప్రయోజనం
సి) నామినల్ ప్రయోజనం డి) ఏదీకాదు
37. కాబ్- డగ్లస్
ఎ) డిమాండ్ ఫలం బి) ఉత్పత్తి ఫలం
సి) సప్లయ్ ఫలం డి) పైవన్నీ
38. అతి స్వల్పకాలిక సప్లయ్ రేఖ ఆకారం?
ఎ) ఎల్- ఆకారం
బి) యూ- ఆకారం
సి) ఎక్స్- అక్షానికి సమానం
డి) వై- అక్షానికి సమానం
39. ఏకస్వామ్యం సంస్థ, పరిశ్రమ…?
ఎ) ఒక్కటే
బి) రెండు వేర్వేరుగా ఉంటాయి
సి) ఒకానొక కాలంలో కలుస్తాయి
డి) పైవన్నీ
40. కింది వాటిలో వినియోగదారుని మిగులుకు ఉదాహరణ?
ఎ) పోస్టుకార్డు బి) కారు
సి) విమానం డి) బైకు
41. జతపరచండి?
ఎ) ఎగెల్ రేఖ 1) ఆదాయం వినియోగం
బి) లారెంజ్ రేఖ 2) పన్నురేటు, పన్ను రాబడి
సి) లాఫర్ రేఖ 3) ఆదాయ అసమానతలు
డి) ఫిలిప్ రేఖ 4) ద్రవ్యోల్బణం వేతన రేటు పెరుగుదల
ఎ) ఎ-1, బి-3, సి-2, డి-4
బి) ఎ-2, బి-3, సి-1, డి-4
సి) ఎ-1, బి-2, సి-3, డి-4
డి) ఎ-4, బి-3, సి-2, డి-1
42. కింది వాటిని అవి అభివృద్ధి పరచిన క్రమంలో అమర్చండి?
1) డిమాండ్ సూత్రం
2) అభిరుచి ప్రకటనా సిద్ధాంతం
3) ఉదాసీనత వక్రరేఖ విశ్లేషణ
4) క్రమక్షీణోపాంత ప్రయోజన సూత్రం
ఎ) 1, 3, 2, 4 బి) 1, 4, 3, 2
సి) 1, 2, 4, 3 డి) 1, 3, 4, 2
43. కింది వాటి అమలును సరైన వరుస క్రమం అమర్చండి?
1) మహలనోబిస్ ప్రణాళిక నమూనా
2) నిరంతర ప్రణాళిక నమూనా
3) ప్రణాళికా విరామ ప్రకటన
4) సమ్మిళిత వృద్ధి దృక్పథం
ఎ) 4, 2, 3, 1 బి) 1, 2, 4, 3
సి) 2, 3, 1, 4 డి) 1, 3, 2, 4
44. వ్యవస్థాపకుడి అతి ముఖ్య విధి?
ఎ) స్థాపకత్వం బి) సమన్వయం
సి) పర్యవేక్షణ
డి) నష్టభయాన్ని భరించడం
45. అమ్మకం వ్యయాలు ఏ మార్కెట్లో ఉంటాయి?
ఎ) ఏకస్వామ్యం బి) ఏకస్వామ్య పోటీ
సి) పరిపూర్ణ పోటీ డి) పైవన్నీ
46. వ్యవసాయ పరిశ్రమ ఏ సూత్రానికి లోబడి ఉంటుంది?
ఎ) క్షీణోపాంత ప్రయోజన సూత్రం
బి) సమోపాంత ప్రయోజన సూత్రం
సి) క్షీణ ప్రతిఫల సూత్రం డి) పైవన్నీ
47. అభివృద్ధి చెందిన దేశాల్లో వేతనాలు పెరిగితే శ్రమ సప్లయ్?
ఎ) పెరుగుతుంది బి) తగ్గుతుంది
సి) స్థిరంగా ఉంటుంది డి) ఏదీకాదు
48. కింది వాటిని జతపరచండి?
ఎ) పండ్లు 1) నశ్వర వస్తువు
బి) పెన్ను 2) వినియోగ వస్తువు
సి) మంత్రం 3) ఉత్పాదక వస్తువు
డి) గాలి 4) ఉచిత వస్తువు
ఎ) ఎ-1, బి-2, సి-3, డి-4
బి) ఎ-4, బి-3, సి-2, డి-1
సి) ఎ-2, బి-1, సి-3, డి-4
డి) ఎ-4, బి-3, సి-1, డి-2
49. ఏక స్వామ్యంలో?
ఎ) ధర ఎక్కువ, ఉత్పత్తి తక్కువ
బి) ధర ఎక్కువ, ఉత్పత్తి ఎక్కువ
సి) ధర ఉత్పత్తి సమానం డి) ఏదీకాదు
50. అర్థశాస్త్రంలో మార్కెట్ ఏ విధంగా ఉంటుంది?
ఎ) ప్రదేశం బి) వస్తువు
సి) ద్రవ్యం డి) పైవన్నీ
51. సమతుల్య స్థితి అంటే?
ఎ) కదలలేని స్థితి
బి) విరామ స్థితి
సి) మార్పు లేని స్థితి డి) పైవన్నీ
సమాధానాలు
1-బి 2-సి 3-డి 4-ఎ
5-డి 6-బి 7-ఎ 8-ఎ
9-సి 10-బి 11-ఎ 12-డి
13-ఎ 14-సి 15-ఎ 16-సి
17-సి 18-బి 19-బి 20-బి
21-సి 22-సి 23-ఎ 24-ఎ
25-సి 26-డి 27-సి 28-సి
29-ఎ 30-డి 31-ఎ 32-ఎ
33-బి 34-సి 35-బి 36-బి
37-బి 38-డి 39-ఎ 40-ఎ
41-ఎ 42-బి 43-డి 44-డి
45-బి 46-సి 47-బి 48-ఎ
49-ఎ 50-బి 51-డి
పానుగంటి కేశవ రెడ్డి
రచయిత
వైష్ణవి పబ్లికేషన్స్
గోదావరిఖని
9949562008
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు