Gurukula JL Special | ఆహార కర్మాగారాలు.. పోషకాల కోశాగారాలు
మొక్కల ఆర్థిక ప్రాముఖ్యత
మొక్కలు మానవుడికి కావలసిన ఆహారం, ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేస్తాయి. మొక్కలు సమస్త లోకానికి కావలసిన ఆహారం, ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేయకపోతే ఈ సృష్టి అంతమవుతుందనడంలో సందేహం లేదు. ఈ నేపథ్యంలో మొక్కల ఆర్థిక ప్రాముఖ్యత, మొక్కల వ్యాధుల గురించి సంక్షిప్తంగా తెలుసుకుందాం..
- మానవుడికి ఉపయోగపడే మొక్కల లక్షణాలను అధ్యయనం చేసే వృక్షశాస్త్ర విభాగాన్ని ఆర్థిక వృక్షశాస్త్రం అంటారు.
- ఆర్థికంగా ఉపయోగపడే మొక్కలను, అవి ఉత్పత్తి చేసే ఉపయోగకర ఉత్పన్నాలను బట్టి అనేక రకాలుగా విభజించారు.
మొక్కల ఉత్పన్నాలు
తృణ ధాన్యాలు
1. ప్రధాన తృణ ధాన్యాలు
2. చిరు తృణ ధాన్యాలు
పప్పు ధాన్యాలు (అపరాలు)
నూనెగింజలు నారలు
ఫలాలు మందు మొక్కలు
ఆర్థికంగా ఉపయోగపడే మొక్కలు
వరి, గోధుమ జొన్న, సజ్జ కందులు, శనగలు వేరుశనగ, కొబ్బరి పత్తి, జనుము మామిడి, అరటి, వేప, ఉసిరి - తృణ ధాన్యాల్లో ఫలాలు కవచ బీజకం రకానికి చెందినవి. ఈ రకానికి చెందిన ఫలాలను గింజలు అని కూడా అంటారు.
- తృణ ధాన్యాల్లో ఎక్కువ క్యాలరీల శక్తి ఉంటుంది. కార్బోహైడ్రేట్స్ అధిక శాతంలో ఉంటాయి. వీటితోపాటు ప్రొటీన్లు, కొవ్వులు, విటమిన్లు కూడా ఉంటాయి. ఈ పోషక పదార్థాలన్నీ గింజల్లోని అంకురచ్ఛదంలో నిల్వ ఉంటాయి.
- వరి నుంచి మత్తు పానీయాలు తయారు చేస్తారు. జపాన్‌లో ‘సాకీ’ అనే సారాయిని వరి నుంచి తయారు చేస్తారు.
- గోధుమలో 68-72 శాతం కార్బోహైడ్రేట్లు, 10-15 శాతం ప్రొటీన్లు ఉండటం చేత వరి కన్నా గోధుమ పుష్టికరమైంది.
- జొన్నను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో వరి తర్వాత బలవర్ధకమైన ఆహారంగా పరిగణిస్తారు.
- సజ్జలో కొవ్వులు 5-7 శాతం ఉండటం వల్ల సజ్జలతో తయారు చేసిన ఆహారం శరీరానికి ఎక్కువ వేడిని కలిగించి, చలికాలంలో మంచి ఆహారంగా ఉపయోగపడుతుంది.
- పప్పు ధాన్యా ల్లో ప్రొటీన్లు అధికంగానూ, కార్బోహైడ్రేట్లు, కొవ్వులు, విటమిన్లు, ఖనిజ లవణాలు తగినంత స్థాయిలోనూ ఉంటాయి.
- నూనెలు కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్లతో తయారయ్యే కర్బన ఆమ్లాలు.
- వేరుశనగ నూనెను వంటకాల్లో, సబ్బులు, సౌందర్య పోషకాలు, కందెనల తయారీలో వాడతారు.
- నూనె తీయగా వచ్చిన పిండిని ఎరువుగా వాడతారు. దీన్ని పశువులకు, కోళ్లకు దాణాగా ఉపయోగిస్తారు.
- ప్రస్తుతం సన్‌ఫ్లవర్ నూనె ఎక్కువ వాడకంలో ఉంది. ఇది ఎక్కువ శాతం పాలి అన్సాచ్యురేటెడ్ ఫ్యాటీ ఆమ్లాలను కలిగి దేహంలో కలిగే హృద్రోగాలను నివారిస్తుంది.
- లావెండర్, నిమ్మ, కర్పూర తైలం నూనెలను సువాసన ఇచ్చే నూనెలు అంటారు.
- గింజల నుంచి తీసిన నూనెను సూక్ష్మజీవ నాశనిగా ఉపయోగిస్తారు.
- లేత కొబ్బరి కాయల్లోని నీటిని బలవర్ధకమైన రుచికరమైన పానీయంగా సేవిస్తారు.
- నారలను జౌళి వస్ర్తాలు, తాళ్లు, వలలు, గోనెసంచులు, కుంచె (బ్రష్)లు, చీపుళ్లు, తట్టలు, కుర్చీలు, ప్యాకింగ్ వస్తువులు, కాగితం తయారీలో ఉపయోగిస్తారు.
- కొబ్బరి నార ఇతర మొక్కల నార కంటే మేలైంది. ఇది తేలికగా సాగే గుణం, నీటిని పీల్చుకోకుండా ఉండే గుణం కలది. ఫలాల నుంచి వచ్చే నార మొక్క కొబ్బరి ఒక్కటే.
- కొబ్బరి నారతో కూర్చునే కుషన్లు, పరుపులు తయారు చేస్తారు.
- రొట్టెలు తయారు చేసుకునే గోధుమ రకం పేరు ట్రిటికమ్ ఎస్టివం.
- గోధుమ పిండిని ఆల్కహాల్ తయారీలోనూ, గోధుమ గడ్డిని పరిశ్రమల్లో ప్యాకింగ్ అట్టలుగా ఉపయోగిస్తారు.
- మొక్కజొన్న మొక్క శాస్త్రీయనామం జియామేస్. ఇది ఆహారంగా, పశుగ్రాసంగా, ఆల్కహాల్, ప్లాస్టిక్, గ్లూకోస్, రేయాన్, కాగితం పరిశ్రమల్లో ముడి పదార్థంగా ఉపయోగపడుతుంది.
- మొక్కలు, జంతువులు లేదా ఖనిజాల నుంచి లభించే ముడి ఔషధాల విజ్ఞానాన్ని ఫార్మకోగ్నసి అంటారు.
- ఔషధాల్లో ఆల్కలాయిడ్లు, ైగ్లెకోసైడ్లు, సుగంధ తైలాల వంటి అనేక సంక్లిష్ట రసాయనాలుంటాయి.
- మొక్కలు తాము తయారు చేసుకునే కొన్ని రసాయన పదార్థాలను వాటి ఆకులు, కాండం, బెరడు, ఫలాలు, విత్తనాల్లో
నిల్వ చేసుకుంటాయి.
మొక్కల వ్యాధిశాస్త్రం
- మొక్కలకు సంక్రమించే వివిధ రకాల వ్యాధులను, వాటిని కలుగజేసే వ్యాధి జనకాలు, వాటి నివారణ, నియంత్రణ విధానాల గురించి అధ్యయనం చేయడాన్ని మొక్కల వ్యాధిశాస్త్రం అంటారు.
- సాధారణ జీవక్రియలు సక్రమంగా జరగకుండా ఉండటాన్ని తెగులు లేదా వ్యాధి అంటారు. ప్రతి తెగులు నిర్దిష్టమైన లక్షణాలను ప్రదర్శిస్తుంది.
- తెగులును కలగజేసే జీవకారకాన్ని వ్యాధి జనకం అంటారు. వ్యాధి జనకానికి ఉండే వ్యాధికారక శక్తిని వ్యాధిజనక శక్తి అంటారు.
- జీవ సంబంధ కారకాలైన శిలీంధ్రాలు, బ్యాక్టీరియాలు, వైరస్లు, నిమటోడ్ల వల్ల వచ్చే తెగుళ్లను సంక్రమిక వ్యాధులు అంటారు.
- వాయు కాలుష్యకాలు, ప్రతికూల మృత్తిక పరిస్థితులు, మంచు, పోషక పదార్థాల లోపం వల్ల వచ్చే తెగుళ్లను అసంక్రమిక వ్యాధులు అంటారు.
వ్యాధులు-లక్షణాలు
డౌనీ మిల్డ్యూ : ఈ రకమైన తెగులు సోకిన పత్రాల ఉపరితలం మీద పౌడర్ (తెల్లటి పిండి) చల్లినట్లుగా కనబడుతుంది. మిల్డ్యూ తెగుళ్లలో దూది లాంటి తెల్లటి శిలీంధ్ర జాలం పెరుగుదల చూపే పత్రాల అడుగు భాగంలో కనబడుతుంది.
ఉదా: ద్రాక్ష డౌనీ మిల్డ్యూ- ప్లాస్మాపర్ విటికోలా (శిలీంధ్రం), సజ్జ ఆకుపచ్చ కంకి తెగులు- స్లీరోస్ఫోరా గ్రామినికోలా (శిలీంధ్రం)
కుంకుమ తెగులు: మొక్కల్లో కుంకుమ తెగులు సోకిన పత్రాలు, కాండాలపై గోధుమ, ఎరుపు రంగులో ఉండే మచ్చలు ఏర్పడతాయి. ఈ మచ్చలు శిలీంధ్ర సిద్ధబీజాల వల్ల ఏర్పడతాయి.
ఉదా: గోధుమ కుంకుమ తెగులు- పక్సీనియా గ్రామినిస్ (శిలీంధ్రం), జొన్న కుంకుమ తెగులు- పక్సీనియా పర్పూరియా
(శిలీంధ్రం)
కాటుక తెగులు: కాటుక తెగులు లక్షణాలు పుష్పాలు, పుష్ప విన్యాసాల్లో ప్రధానంగా అండాశయాల్లో కనబడుతాయి. ఈ తెగులు సోకిన మొక్కల పుష్పాల్లో విత్తనాలకు బదులు బొగ్గుపొడి లాంటి నల్లటి శిలీంధ్ర సిద్ధబీజాలు ఏర్పడతాయి.
ఉదా: జొన్నగింజ కాటుక తెగులు- స్ఫెసిలోథీకా సోైర్గె (శిలీంధ్రం)
తెల్ల కుంకుమ తెగులు: తెగులు సోకిన పత్రాలపై, లేత కాండాలపై తెల్లగా మెరిసే మచ్చలు ఏర్పడతాయి. ఇవి పగిలినప్పుడు తెల్లటి సిద్ధబీజాలు వెదజల్లుతాయి.
ఉదా: క్రూసీఫెర్స్లో తెల్ల కుంకుమ తెగులు- ఆల్బుగోకాండికా (శిలీంధ్రం) రంగు మారడం - పత్రాలు ఆకుపచ్చ రంగు నుంచి తెలుపు లేదా పసుపు రంగులోకి మారడాన్ని నిర్హరితం అంటారు.
ఉదా: వరిలో పసుపుపచ్చ తెగులు - పత్రాలపై అక్కడక్కడ తెల్లటి మచ్చలుగా ఏర్పడితే దాన్ని చిత్రవర్ణం లేదా మొజాయిక్ అంటారు.
ఉదా: పొగాకులో మొజాయిక్ తెగులు - ఈనెల వెంట ఉన్న పత్ర భాగాలు రంగు మారితే దాన్ని ఈనెల వివర్ణం అంటారు.
ఉదా: బెండలో ఈనెల వివర్ణం - ఈనెల వెంట ఉన్న పత్రభాగాలు పట్టీలాగా ఆకుపచ్చ రంగులో ఉండి, మిగిలిన పత్రదళం అంతా నిర్హరితమైతే దాన్ని ఈనెల పట్టీ లేదా వెయిన్ బాండింగ్ అంటారు.
ఉదా: నిమ్మజాతి మొక్కల్లో వెయిన్ బాండింగ్
విచెస్ బ్రూమ్: వైరస్, ఫైటోప్లాస్మాల వల్ల వచ్చే కొన్ని తెగుళ్లలో మొక్కల కణుపుల నుంచి అనేక శాఖలు గుంపుగా ఏర్పడి చీపురులాగా కన్పిస్తాయి. దీన్ని విచెస్ బ్రూమ్ అంటారు.
ఉదా: చెర్రీలో విచెస్ బ్రూమ్
నెక్రోసిస్: తెగులు సోకిన భాగాల్లో కణాలు చనిపోయి గోధుమ లేదా నలుపు రంగులోకి మారడాన్ని నెక్రోసిస్ అంటారు. దీనివల్ల పత్రాలపై మచ్చలు ఏర్పడతాయి.
ఉదా: వేరుశనగ టిక్కా మచ్చ తెగులు- సెర్కోస్ఫోరా పర్సోనేటా (శిలీంధ్రం)
బ్లైట్ తెగులు: తెగులు సోకిన భాగాలు కాలిపోయినట్లుగా మారటాన్ని అగ్గి తెగులు అంటారు. ఈ తెగులు లేత కాండాలు, పత్రాల్లో కన్పిస్తుంది.
ఉదా: బంగాళదుంప లేట్ బ్లైట్ తెగులు- ఫైటాప్తెరా (శిలీంధ్రం)
నారుకుళ్లు: తెగులు సోకిన నారు మొక్కలు కుళ్లి, కిందికి వాలిపోవడాన్ని నారు కుళ్లు అంటారు. సాధారణంగా నీరు నిలిచి ఉండే నారుమళ్లల్లో ఈ తెగులు కన్పిస్తుంది.
ఉదా: పొగాకులో నారు కుళ్లు తెగులు
విల్డ్ తెగులు: తెగులు సోకిన మొక్కలు పూర్తిగా ఎండిపోవడాన్ని విల్డ్ (వడలడం) అంటారు.
ఉదా: పత్తిలో వడలే తెగులు- ఫ్యుసేరియమ్ (శిలీంధ్రం)
కాంకర్: ముదిరిన కాండం, వల్కలం, బెండు వంటి కణాలు నిర్జీవమై ఆభాగాలు గట్టు లాంటి అంచులతో కూడి ఉంటాయి. వీటిని కాంకర్ అంటారు.
ఉదా: సిట్రస్ కాంకర్ -జాంథోమోనాస్ సిట్రీ (బ్యాక్టీరియా)
నివారణ చర్యలు - విత్తనాలను విత్తే ముందు రసాయనాలతో శుద్ధి చేయడం.
- వ్యాధి సోకిన మొక్కలను నాశనం చేయడం.
- కలుపు మొక్కలను ఏరివేసి వాటిని నాశనం చేయడం.
- క్రిమినాశక మందులు చల్లటం.
- వ్యాధులను తట్టుకునే మొక్కలను పొలాల్లో పెంచడం.
- పంట మార్పిడి చేయడం.
- వ్యాధి నివారణకు పురుగులు చిన్నవిగా ఉన్నప్పుడు మోనోక్రోటోపాస్‌ను, కీటకాలు లార్వా దశలో ఉన్నప్పుడు మెటసిడ్ అనే కీటక నాశనులను చల్లాలి.
Previous article
Punjab & Sind Bank | పంజాబ్ అండ్ సింద్ బ్యాంకులో 183 పోస్టులు
Next article
Economy | గాసెవ్ ప్రథమ సూత్రం అని దేన్ని అంటారు?
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు