TSPSC Group 4 Model Paper | కాజెస్ ఆఫ్ ది ఇండియన్ మ్యూటినీ గ్రంథ రచయిత ఎవరు?
గ్రూప్-4 మోడల్ పేపర్ Paper -I
68. కింది వాటిని జతపర్చండి.
1. భిల్లుల తిరుగుబాటు ఎ. 1831-32
2. అహోమ్ తిరుగుబాటు బి. 1829-32
3. ఖాసీ తిరుగుబాటు సి. 1828
4. కోల్ తిరుగుబాటు డి. 1817-19
ఎ) 1-సి, 2-డి, 3-ఎ, 4-బి
బి) 1-డి, 2-సి, 3-బి, 4-ఎ
సి) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
4) 1-బి, 2-ఎ, 3-డి, 4-సి
69. బ్రిటిష్ వారిపై తిరుగుబాటు చేసిన నాయకులు, వారి ప్రాంతాలను జతపర్చండి.
1. వీరపాండ్య కట్టబ్రహ్మన ఎ. తిరునెల్వేలి (తమిళనాడు)
2. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి బి. రూపనగుడి (ఆంధ్రప్రదేశ్)
3. కిట్టూరు చెన్నయ్య సి. కిత్తూరు (కర్ణాటక)
4. వేలుతంపి డి. ట్రావెన్కోర్ (కేరళ)
ఎ) 1-సి, 2-డి, 3-ఎ, 4-బి
బి) 1-డి, 2-సి, 3-బి, 4-ఎ
సి) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
4) 1-బి, 2-ఎ, 3-డి, 4-సి
70. ప్రతిపాదన (ఎ): బ్రిటిష్ పాలనా కాలంలో దేశంలో అన్ని రంగాల కంటే వ్యవసాయ రంగం బాగా నష్టపోయింది
కారణం (ఆర్): రైతులపై బ్రిటిష్ వారి అన్యాయమైన భూమి శిస్తు విధానాలు, వాణిజ్య పంటలకు ప్రాధాన్యం, జమీందార్ల భూస్వామ్య దోపిడీ, వడ్డీ వ్యాపారుల అధిక వడ్డీ రైతుల తిరుగుబాట్లను అనివార్యం చేశాయి
ఎ) ఎ, ఆర్ సరైనవి. ఆర్ ఎ కు సరైన వివరణ
బి) ఎ, ఆర్ సరైనవే. కానీ ఆర్ ఎ కు సరైన వివరణ కాదు
సి) ఎ సరైనది, ఆర్ తప్పు
డి) ఎ తప్పు, ఆర్ సరైనది
71. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం దేనికి సంబంధించింది?
ఎ) అధిక భూమి శిస్తు పట్ల వ్యతిరేకత
బి) ప్రత్యేక తెలంగాణ కోసం
సి) పంటకు గిట్టుబాటు ధర కోసం
డి) హైదరాబాద్ రాష్ట్రంలో నిజాం పరిపాలనకు వ్యతిరేకంగా సీపీఐ నడిపించిన ఉద్యమం
72. ఏ సత్యాగ్రహం ఫలితంగా బ్రిటిష్ ప్రభుత్వం తీన్‌కథియా విధానాన్ని రద్దు చేసింది?
ఎ) ఖేడా సత్యాగ్రమం బి) బార్డోలి సత్యాగ్రహం
సి) దక్కన్ తిరుబాటు డి) చంపారన్ సత్యాగ్రహం
73. ఏ రైతాంగ ఉద్యమం నక్సలైట్ ఉద్యమానికి దారి తీసిందని భావిస్తారు?
ఎ) తేభాగ చాయ్ ఉద్యమం
బి) తెలంగాణ రైతాంగ పోరాటం
సి) మోప్లా తిరుగుబాటు
డి) ఖేడా సత్యాగ్రహం
74. సంఘ సంస్కర్తలు వారు స్థాపించిన సంస్థలను జతపర్చండి.
1. గోపాలకృష్ణ గోఖలే ఎ. సహోదర సంఘం
2. సహోదరన్ అయ్యప్పన్ బి. సర్వెంట్స్ ఆఫ్ ఇండియన్ సొసైటీ
3. పండిత రమాబాయి సి. భారత బడుగు జాతుల సమితి
4. విఠల్ రాజ్ షిండే డి. శారదా సదన్
ఎ) 1-సి, 2-డి, 3-ఎ, 4-బి
బి) 1-డి, 2-సి, 3-బి, 4-ఎ
సి) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
4) 1-బి, 2-ఎ, 3-డి, 4-సి
75. 1857 తిరుగుబాటు కారణాలకు సంబంధించి కింది వాటిలో సరైనవి?
1. డల్హౌసీ రాజ్య సంక్రమణ సిద్ధాంతం వల్ల తమ రాజ్యాలకు ముప్పు ఏర్పడుతుందన్న అభద్రతాభావం స్వదేశీ పాలకుల్లో బ్రిటిష్ వారి పట్ల వ్యతిరేకత, భయం కలుగజేసింది
2. బ్రిటిష్ వారు ప్రవేశపెట్టిన సతీసహగమన నిషేధ చట్టం, భారతీయ వారసత్వ చట్టం, వితంతు పునర్వివాహ చట్టాలు హిందువుల మనోభావాలను దెబ్బతీసి, బ్రిటిష్ పట్ల వ్యతిరేకత పెంచాయి
3. ఆంగ్లేయులు అధికారంతో హిందువులు, ముస్లింలను క్రిస్టియన్లుగా మార్చివేస్తారనే భయం ప్రజల్లో ఏర్పడింది
ఎ) 1 బి) 2 సి) 2, 3 డి) 1, 2, 3
76. సిపాయిల తిరుబాటుపై వెలువడిన గ్రంథాలు, వాటి రచయితలను జతపర్చండి.
1. కాజెస్ ఆఫ్ ది ఇండియన్ మ్యూటినీ ఎ. ఎస్బీ చౌదరి
2. సివిల్ రెబలియన్ ఇన్ ఇండియన్ మ్యూటినీస్ బి. సయ్యద్ అహ్మద్ ఖాన్
3. ది ఇండియన్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్-1857 సి. టీఆర్ హోమ్స్
4. హిస్టరీ ఆఫ్ ది ఇండియన్ మ్యూటినీ డి. వీడీ సావర్కర్
ఎ) 1-సి, 2-డి, 3-ఎ, 4-బి
బి) 1-డి, 2-సి, 3-బి, 4-ఎ
సి) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
4) 1-బి, 2-ఎ, 3-డి, 4-సి
77. లక్ష్మీబాయికి సంబంధించి కింది వాటిలో సరైనవి?
1. డల్హౌసీ ప్రవేశపెట్టిన రాజ్య సంక్రమణ సిద్ధాంతం ఫలితంగా లక్ష్మీబాయి తన రాజ్యాన్ని కోల్పోయింది
2. దీంతో లక్ష్మీబాయి బ్రిటిష్ వారికి ఎదురు తిరిగి ఝాన్సీ కోట లోపల బ్రిటిష్ సైనికులను విచక్షణారహితంగా సంహరించింది. దీన్నే బిబైన్ బాగ్ లేదా జోఖన్బాగ్ హత్యాకాండ/జాన్ హత్యాకాండ అని అంటారు
3. తర్వాత బ్రిటిష్ సైన్యాలు ఝాన్సీపై యుద్ధాన్ని విరమించుకుని వెనుదిరిగాయి
ఎ) 1 బి) 1, 3 సి) 1, 2 డి) 3
78. కింది సంస్థల స్థాపనను కాలక్రమానుసారం అమర్చండి.
1. బొంబాయి అసోసియేషన్
2. మద్రాస్ మహాజన్ సభ
3. ఇండియన్ అసోసియేషన్
4. ఇండియన్ లీగ్
ఎ) 1, 2, 3, 4 బి) 2, 3, 1, 4
సి) 3, 4, 2, 1 డి) 1, 4, 3, 2
79. భారత జాతీయ కాంగ్రెస్ (ఐఎన్‌సీ) సమావేశాలు, ముఖ్య నిర్ణయాలు జతపర్చండి.
1. 44వ సమావేశం ఎ. గాంధీ-ఇర్విన్ ఒప్పందం ఆమోదం
2. 45వ సమావేశం బి. సంపూర్ణ స్వరాజ్ తీర్మానం ఆమోదం
3. 43వ సమావేశం సి. మొదటిసారి ఆంధ్రప్రదేశ్‌లో జరిగింది
4. 38వ సమావేశం డి. అఖిల భారత యువజన కాంగ్రెస్ ఏర్పాటు
ఎ) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
బి) 1-డి, 2-సి, 3-బి, 4-ఎ
సి) 1-సి, 2-డి, 3-ఎ, 4-బి
4) 1-బి, 2-ఎ, 3-డి, 4-సి
80. రవీంద్రనాథ్ ఠాగూర్ రచించిన ‘జనగణమన’ గీతం మొదటిసారి ఏ జాతీయ కాంగ్రెస్ సమావేశంలో ఆలపించారు?
ఎ) 1911 కలకత్తాలో జరిగిన 26వ సమావేశం
బి) 1909 లాహోర్‌లో జరిగిన 24వ సమావేశం
సి) 1913 కరాచీలో జరిగిన 28వ సమావేశం
డి) 1916 లక్నోలో జరిగిన 31వ సమావేశం
81. కింది జాతీయోద్యమ నాయకులను సరిగా జత చేయండి.
1. గోపాలకృష్ణ గోఖలే ఎ. అతివాది
2. ఫిరోజ్‌షా మెహతా బి. అతివాది
3. బాలగంగాధర్ తిలక్ సి. మితవాది
4. అరవింద ఘోష్ డి. మితవాది
ఎ) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
బి) 1-డి, 2-సి, 3-బి, 4-ఎ
సి) 1-సి, 2-డి, 3-ఎ, 4-బి
డి) 1-బి, 2-ఎ, 3-డి, 4-సి
82. కందుకూరి వీరేశలింగం పంతులును దక్షిణ భారత విద్యాసాగరుడు అని అభివర్ణించింది?
ఎ) మహాదేవ గోవింద రనడే
బి) దాస్ బిహారి ఘోష్
సి) మదన్ మోహన్ మాలవీయ
డి) ఉమేష్ చంద్ర బెనర్జి
83. శాసనసభల్లో ఎన్నికల పద్ధతిని మొదటిసారి దేశంలో ప్రవేశపెట్టిన చట్టం ఏది?
ఎ) మున్సిపల్ చట్టం-1895
బి) భారత ప్రభుత్వ చట్టం-1932
సి) ఇండియన్ కౌన్సిల్ చట్టం-1892
డి) భారత ప్రభుత్వ చట్టం-1934
84. అతివాదులు, వారు నడిపిన పత్రికలను సరిగా జత చేయండి.
1. బాల గంగాధర తిలక్ ఎ. కర్మయోగి
2. లాలా లజపతి రాయ్ బి. పారదర్శక్
3. బిపిన్ చంద్రపాల్ సి. పంజాబీ
4. అరబిందో ఘోష్ డి. కేసరి
ఎ) 1-బి, 2-ఎ, 3-డి, 4-సి
బి) 1-డి, 2-సి, 3-బి, 4-ఎ
సి) 1-సి, 2-డి, 3-ఎ, 4-బి
డి) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
85. కాకతీయుల చరిత్రను తెలిపే శాసనాలు, వాటిని వేయించిన వారిని సరిగా జత చేయండి.
1. మాగల్లు శాసనం ఎ. దానర్ణవుడు
2.బయ్యారం చెరువు శాసనం బి. మైలాంబ
3. శనిగరం శాసనం సి. మొదటి బేతరాజు
4. ఖాజీపేట శాసనం డి. రెండో బేతరాజు
ఎ) 1-సి, 2-డి, 3-ఎ, 4-బి
బి) 1-డి, 2-సి, 3-బి, 4-ఎ
సి) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
డి) 1-బి, 2-ఎ, 3-డి, 4-సి
86. కింది వాటిలో సరైన వ్యాఖ్య/వ్యాఖ్యలను గుర్తించండి.
1. కాకతీయులు తెలుగు భాషను ఆదరించడం మొదటి ప్రోలరాజు తర్వాతే మొదలైంది.
2. అప్పటి వరకు ఉన్న శాసనాలు కన్నడం, సంస్కృత భాషలో ఉన్నాయి
3. కాకతీయుల కాలాన్ని తెలంగాణ సాహిత్యంలో స్వర్ణయుగంగా భావిస్తారు
ఎ) 2, 3 బి) 1, 3
సి) 2, 1 డి) 1, 2, 3
87. మేడారం సమ్మక్క-సారలమ్మలు ఏ కాకతీయ రాజు సమకాలీనులు?
ఎ) రెండో ప్రతాపరుద్రుడు
బి) మొదటి ప్రతాపరుద్రుడు
సి) రాణి రుద్రమదేవి
డి) గణపతి దేవుడు
88. కింది వ్యాఖ్యలను పరిశీలించి సరైన వాటిని గుర్తించండి.
1. కాకతీయుల కాలం నాటికి బౌద్ధమతం దాదాపు క్షీణించిపోయింది. జైన మతం బలంగా ఉంది
2. తొలి కాకతీయులు దిగంబర్ జైన మతాన్ని ఆచరించారు
3. మలి కాకతీయులు శైవ మతాన్ని ఆచరించారు
ఎ) 1 బి) 1, 3
సి) 1, 2, 3 డి) 1, 2
89. కింది వ్యాఖ్యల్లో సరైనవి ఏవి?
1. సర్వాయి పాపన్న తెలంగాణలో మహ్మదీయ పాలకుల నిరంకుశత్వాన్ని ఎదిరించిన తెలంగాణ తొలి విప్లవకారుడిగా గుర్తింపు పొందాడు
2. సర్వాయి పాపన్న పూర్వపు వరంగల్ జిల్లాలోని తరికొండ సమీపంలోని లింగంపల్లిలో జన్మించాడు
3. యూసఫ్ ఖాన్ అనే ఫౌజ్దార్ పాపన్నను బందీగా పట్టుకుని చంపేశాడు
ఎ) 1, 2 3 బి) 1
సి) 2 డి) 3
90. అసఫ్‌జాహీల మొదటి 40 సంవత్సరాల కాలంలో పాలించిన రాజులు వారి పాలనా కాలాలను జత చేయండి.
1. నిజాం ఉల్ ముల్క్ ఎ. 1748-50
2. నాజర్ జంగ్ బి. 1724-48
3. ముజఫర్ జంగ్ సి. 1951-61
4. సలాబత్ జంగ్ డి. 1750-51
ఎ) 1-సి, 2-డి, 3-ఎ, 4-బి
బి) 1-డి, 2-సి, 3-బి, 4-ఎ
సి) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
డి) 1-బి, 2-ఎ, 3-డి, 4-సి
91. కింది నవాబులను సరిగా జత చేయండి.
1. రెండో నిజాం ఎ. అఫ్జలుద్దౌలా
2. మూడో నిజాం బి. నసీరుద్దౌలా
3. నాలుగో నిజాం సి. మీర్ అక్బర్ అలీఖాన్
4. ఐదో నిజాం డి. నిజాం అలీఖాన్
ఎ) 1-సి, 2-డి, 3-ఎ, 4-బి
బి) 1-డి, 2-సి, 3-బి, 4-ఎ
సి) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
డి) 1-బి, 2-ఎ, 3-డి, 4-సి
ANS :-
68-బి, 69-సి, 70-ఎ, 71-డి, 72-డి, 73-ఎ, 74-డి, 75-డి, 76-డి,
77-సి, 78-సి, 79-డి, 80-సి, 81-సి, 82-ఎ, 83-సి, 84-బి, 85-సి, 86-డి, 87-ఎ, 88-సి, 89-ఎ, 90-బి, 91-బి,
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు