TSPSC Group 4 Model Paper | సంపద తరలింపు సిద్ధాంతాన్ని వివరించినది ఎవరు?
గ్రూప్-4 మోడల్ పేపర్ Paper -I
33. ఐరోపాకు చెందిన ఈస్టిండియా కంపెనీలు,భారత్ లో వాటి స్థాపన సంవత్సరాలను జతపర్చండి.
1. ఇంగ్లిష్ ఈస్టిండియా కంపెనీ ఎ. 1664
2. డచ్ ఈస్టిండియా కంపెనీ బి. 1616
3. డానిష్ (డెన్మార్క్) ఈస్టిండియా కంపెనీ సి. 1602
4. ఫ్రెంచ్ ఈస్టిండియా కంపెనీ డి. 1600
ఎ) 1-సి, 2-డి, 3-ఎ, 4-బి
బి) 1-డి, 2-సి, 3-బి, 4-ఎ
సి) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
డి) 1-బి, 2-ఎ, 3-డి, 4-సి
34. భారతదేశానికి వచ్చిన ఐరోపా దేశాల సరైన ఆరోహణ క్రమాన్ని గుర్తించండి.
ఎ) పోర్చుగీస్, బ్రిటన్, డచ్ (నెదర్లాండ్స్), ఫ్రాన్స్, డెన్మార్క్ (డానిష్)
బి) ఫ్రాన్స్, డెన్మార్క్, పోర్చుగీస్, బ్రిటన్, డచ్
సి) పోర్చుగీస్, డచ్, బ్రిటన్, డెన్మార్క్, ఫ్రాన్స్
డి) బ్రిటన్, డెన్మార్క్, ఫ్రాన్స్, పోర్చుగీస్, డచ్
35. భారతదేశానికి అందరి కంటే మొదట వచ్చి చివరగా దేశాన్ని విడిచి వెళ్లిన ఐరోపా దేశం?
ఎ) బ్రిటన్ బి) డచ్
సి) పోర్చుగీస్ డి) ఫ్రెంచ్
36. కింది వ్యాఖ్యల్లో సరికానివి?
1. ఐరోపా దేశాలు ప్రధానంగా సుగంధ ద్రవ్యాలు, పట్టు, విలువైన రాళ్లు, కాలికోస్ మొదలైన వాటి కోసం భారతదేశంలో వర్తకం చేసేవారు
2. 1453లో ముస్లింలు కాన్స్టాంటినోపుల్ (ఇస్తాంబుల్) ఆక్రమించడం వల్ల ఐరోపా దేశాలకు తూర్పు, పడమర దేశాలతో వర్తక, వ్యాపారాలు నిలిచిపోయాయి. దాంతో గత్యంతరం లేక ఈ దేశాలు భారత దేశానికి సముద్ర మార్గాలను కనుగొనడానికి ప్రయత్నాలు మొదలుపెట్టాయి
3. దీంతో 1498లో పోర్చుగీస్ నావికుడు కొలంబస్ భారతదేశం (కాలికట్ ప్రాంతం) ఉనికిని కనుగొన్నాడు
ఎ) 1 బి) 2 సి) 3 డి) 1, 2
37. యూరోపియన్లు భారత్‌కు వచ్చిన సంవత్సరాలను జతపర్చండి.
1. డచ్ ఎ. 1668
2. బ్రిటిష్ బి. 1620
3. డానిష్ సి. 1608
4. ఫ్రెంచ్ డి. 1605
ఎ) 1-సి, 2-డి, 3-ఎ, 4-బి
బి) 1-డి, 2-సి, 3-బి, 4-ఎ
సి) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
డి) 1-బి, 2-ఎ, 3-డి, 4-సి
38. మొదటి కర్ణాటక యుద్ధానికి తక్షణ కారణం?
ఎ) బ్రిటిష్, ఫ్రెంచి మధ్య వైరం
బి) ఆస్ట్రియా వారసత్వ యుద్ధం
సి) కర్ణాటక వారసత్వ సమస్యలు
డి) బ్రిటిష్ వారు ఫ్రెంచి నౌకలను పట్టుకోవడం
39. భారత్‌లో యూరోపియన్ గవర్నర్ జనరళ్లను వారి దేశాలతో జతపర్చండి.
1. డూప్లే ఎ. డచ్/నెదర్లాండ్స్
2. మార్టిన్ ఆల్ఫోన్సో డిసౌజా బి. బ్రిటన్
3. పీటర్ బోత్ సి. ఫ్రాన్స్
4. బార్నెట్ డి. పోర్చుగల్
ఎ) 1-సి, 2-డి, 3-ఎ, 4-బి
బి) 1-డి, 2-సి, 3-బి, 4-ఎ
సి) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
4) 1-బి, 2-ఎ, 3-డి, 4-సి
40. ప్రతిపాదన (ఎ): వందవాసి దగ్గర జరిగిన మూడో కర్ణాటక యుద్ధంలో ఫ్రెంచి వారు బ్రిటిష్ సేనల చేతిలో ఓడిపోయారు
కారణం (ఆర్): భారతదేశ స్థానిక పాలకులు ఫ్రెంచివారికి యుద్ధంలో మద్దతు ఇవ్వలేదు
ఎ) ఎ, ఆర్ సరైనవి. ఆర్ ఎ కు సరైన వివరణ
బి) ఎ, ఆర్ సరైనవే. కానీ ఆర్ ఎ కు సరైన వివరణ కాదు
సి) ఎ సరైనది, ఆర్ తప్పు
డి) ఎ తప్పు, ఆర్ సరైనది
41. భారత్‌లో నిర్మాణాలు, వాటి ఐరోపా వాస్తు శైలులను గుర్తించండి.
1. రాష్ట్రపతి భవన్ ఎ. కార్టీసియన్ గ్రిడ్ ప్రణాళిక
2. గేట్ వే ఆఫ్ ఇండియా బి. ఇబేరియన్ వాస్తు శైలి
3. పుదుచ్చేరి పట్టణం సి. నియో రోమన్ వాస్తు శైలి
4. సెయింట్ కేథడ్రల్ చర్చి డి. గోథిక్ వాస్తు శైలి
ఎ) 1-సి, 2-డి, 3-ఎ, 4-బి
బి) 1-డి, 2-సి, 3-బి, 4-ఎ
సి) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
4) 1-బి, 2-ఎ, 3-డి, 4-సి
42. ఐరోపా దేశాలు భారత్‌లో వాటి ప్రధాన వర్తక స్థావరాలను జతపర్చండి.
1. పోర్చుగీస్ ఎ. కొచ్చిన్
2. డచ్ బి. పులికాట్
3. ఫ్రెంచ్ సి. పాండిచ్చేరి
4. డానిష్ డి. సేరంపూర్
ఎ) 1-సి, 2-డి, 3-ఎ, 4-బి
బి) 1-డి, 2-సి, 3-బి, 4-ఎ
సి) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
4) 1-బి, 2-ఎ, 3-డి, 4-సి
43. చీకటి గది ఉదంతం ఎప్పుడు జరిగింది?
ఎ) 1757, జూన్ 23
బి) 1756, జూన్ 20
సి) 1757, సెప్టెంబర్ 20
డి) 1756, ఏప్రిల్ 8
44. కింది వాటిలో ఏ రెండు జతలు సరైనవి?
1. 1767-69 – మొదటి ఆంగ్లో- మరాఠా యుద్ధం
2. 1790-92 – మూడో ఆంగ్లో- మైసూర్ యుద్ధం
3. 1824-26 – మొదటి ఆంగ్లో- బర్మా యుద్ధం
4. 1845-46 – రెండో ఆంగ్లో- సిక్కు యుద్ధం
ఎ) 2, 4 బి) 3, 4 సి) 1, 2 డి) 2, 3
45. ఏ యుద్ధానంతరం ఆంగ్లేయులకు బెంగాల్లోను, భారతదేశంలోను సర్వాధిపత్యం చెలాయించడానికి వీలయ్యింది?
ఎ) ప్లాసీ బి) బక్సార్
సి) వందవాసి డి) అడయార్
46. ఎవరి పాలనా కాలంలో గురు నానక్ సిక్కు మతాన్ని స్థాపించాడు?
ఎ) సికిందర్ లోడీ బి) అక్బర్
సి) హుమాయూన్ డి) ఫిరోజ్ షా తుగ్లక్
47. కింది వాటిని జతపర్చండి.
1. ఆదిగ్రంథ్ ఎ. రంజిత్ సింగ్
2. పంజాబ్ కేసరి బి. గురు అర్జున్ సింగ్
3. ఖల్సా సి. గురు నానక్
4. సిక్కు మత స్థాపకుడు
డి. గురు గోవింద్ సింగ్
ఎ) 1-సి, 2-డి, 3-ఎ, 4-బి
బి) 1-డి, 2-సి, 3-బి, 4-ఎ
సి) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
4) 1-బి, 2-ఎ, 3-డి, 4-సి
48. భారత్‌లో ‘రాజ్య సంక్రమణ సిద్ధాంతం (డాక్ట్రిన్ ఆఫ్ ల్యాప్స్)’ను డల్హౌసీ ఎప్పుడు ప్రవేశపెట్టాడు?
ఎ) 1847 బి) 1848
సి) 1849 డి) 1850
49. ప్రతిపాదన (ఎ): బ్రిటిష్ వారు రెవెన్యూ విధానం, సైన్య సహకార విధానం, రాజ్య సంక్రమణ విధానాల ద్వారా భారతదేశంలో తమ అధికారాన్ని సుస్థిరం చేసుకున్నారు
కారణం (ఆర్): 1773లో చేసిన రెగ్యులేటింగ్ చట్టం ప్రకారం భారత్‌లో బ్రిటిష్ వారు 1600 నుంచి 1772 వరకు ఆక్రమించిన భూభాగాలన్నింటిపై సంపూర్ణ పాలనాధికారాన్ని పార్లమెంట్ నియమించిన గవర్నర్ జనరల్, అతని కౌన్సిల్ సభ్యులు పొందారు
ఎ) ఎ, ఆర్ సరైనవి. ఆర్ ఎ కు సరైన వివరణ
బి) ఎ, ఆర్ సరైనవే. కానీ ఆర్ ఎ కు సరైన వివరణ కాదు
సి) ఎ సరైనది, ఆర్ తప్పు
డి) ఎ తప్పు, ఆర్ సరైనది
50. సంపద తరలింపు సిద్ధాంతాన్ని వివరించినది ఎవరు?
ఎ) బాల గంగాధర్ తిలక్
బి) సత్యేంద్రనాథ్ ఠాగూర్
సి) దాదాభాయ్ నౌరోజీ
డి) రమేష్ చంద్ర దత్తా
51. కింది వాటిని జతపర్చండి.
1. ప్రార్థనా సమాజం ఎ. స్వామి దయానంద సరస్వతి
2. బ్రహ్మ సమాజం బి. అనీ బీసెంట్
3. ఆర్య సమాజం సి. ఆత్మారాం పాండురంగ
4. దివ్యజ్ఞాన సమాజం డి. రాజా రామ్మోహన్ రాయ్
ఎ) 1-సి, 2-డి, 3-ఎ, 4-బి
బి) 1-డి, 2-సి, 3-బి, 4-ఎ
సి) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
4) 1-బి, 2-ఎ, 3-డి, 4-సి
52. నవయుగ వైతాళికులు (హెరాల్డ్ ఆఫ్ న్యూ ఏజ్), భారత పునరుజ్జీవనోద్యమ పితామహుడు బిరుదలతో పేరుగాంచింది?
ఎ) మహాత్మాగాంధీ
బి) సురేంద్రనాథ్ బెనర్జీ
సి) రాజా రామ్మోహన్ రాయ్
డి) అనీ బీసెంట్
53. రాజా రామ్మోహన్ రాయ్‌కు సంబంధించి సరైన వ్యాఖ్యలను గుర్తించండి.
1. 1825లో రామ్మోహన్ రాయ్ కలకత్తాలో వేదాంత కళాశాలను స్థాపించి వేదాంతాన్ని బెంగాలీ భాషలోకి అనువదించాడు
2. 1892, డిసెంబర్ 4న విలియం బెంటింక్ సహకారంతో సతీ సహగమన దురాచారాన్ని రద్దు చేయించాడు
3. రాజా రామ్మోహన్ రాయ్ అనంతరం బ్రహ్మ సమాజ బాధ్యతలను దేవేంద్రనాథ్ ఠాగూర్, కేశవ్‌చంద్ర సేన్ స్వీకరించారు
ఎ) 1 బి) 2 సి) 1, 2, 3 డి) 3
54. 1815లో స్థాపితమైన ‘ఆత్మీయ సభ (ఫ్రెండ్లీ అసోసియేషన్)’ కాలక్రమేణ ఏ సమాజంగా మార్పు చెందింది?
ఎ) ఆర్య సమాజం బి) బ్రహ్మ సమాజం
సి) దివ్యజ్ఞాన సమాజం
డి) ప్రార్థనా సమాజం
55. కింది వాటిలో సరికాని వ్యాఖ్యలను గుర్తించండి.
1. ప్రార్థనా సమాజ సభ్యుడైన విఠల్ రాంజీ షిండే 1906లో ‘డిప్రెస్ట్ క్లాసెస్ మిషన్ ఆఫ్ ఇండియా’ సంస్థను స్థాపించాడు. ఈ సంస్థ బడుగు జాతుల సముద్ధరణకు కృషి చేసి గాంధీ హరిజనోద్యమానికి స్ఫూర్తినిచ్చింది
2. గురజాడ అప్పారావు ప్రార్థనా సమాజాన్ని దక్షిణ భారతదేశంలో విస్తరింజేశారు
3. దేశంలోనే తొలి చట్టబద్ధ వితంతు వివాహాన్ని 1858లో కేశవచంద్ర విద్యాసాగర్ కలకత్తాలో జరిపించారు
ఎ) 1 బి) 2 సి) 3 డి) 1, 3
56. బ్రహ్మ సమాజ సూత్రాలను క్రోడీకరించి ‘బ్రహ్మ ధర్మం’ అనే గ్రంథాన్ని రచించినవారు?
ఎ) రాజా రామ్మోహన్ రాయ్
బి) రఘుపతి వెంకటరత్నం నాయుడు
సి) దేవేంద్రనాథ్ ఠాగూర్
డి) కేశవచంద్ర సేన్
57. బ్రహ్మ సమాజం, ఆర్య సమాజం, రామకృష్ణ మిషన్ ఉద్యమాల మధ్య ఉన్న సారూప్య లక్షణం ఏమిటి?
ఎ) ఈ మూడింటికీ ఎటువంటి రాజకీయ లక్ష్యాలు లేవు. కానీ ఇవి దేశభక్తికి స్ఫూర్తినిచ్చేందుకు సాయపడ్డాయి
బి) ఈ మూడు కూడా బెంగాల్లో ఉద్భవించాయి
సి) మూడింటి స్థాపకులు ఇంగ్లండ్‌లో విద్యను అభ్యసించినవారే
డి) మూడింటి స్థాపకులు రాజకీయాల్లో చురుకుగా పాల్గొనేవారు
58. కింది సూక్తులు, వాటికి సంబంధించిన వ్యక్తులకు సంబంధించి సరికానివి గుర్తించండి.
1. అవసరమైతే చిరిగిన చొక్కా తొడుక్కోగాని, ఒక మంచి పుస్తకం కొనుక్కో- కందుకూరి వీరేశలింగం పంతులు
2. ఆర్య సమాజం నా తల్లి, వైదిక ధర్మ నా తండ్రి- లాలా లజపతి రాయ్
3. స్వరాజ్యం నా జన్మ హక్కు- మహాత్మాగాంధీ
ఎ) 1 బి) 2 సి) 3 డి) 1, 2
59. ఏ సంవత్సరంలో స్వామి వివేకానంద చికాగోలో జరిగిన ప్రపంచ మత సమ్మేళనం (వరల్డ్ పార్లమెంట్ ఆఫ్ రిలీజియన్స్)లో పాల్గొని ప్రసంగించారు?
ఎ) 1890 బి) 1892
సి) 1893 డి) 1894
60. దేశంలో 19వ శతాబ్దపు పునరుద్ధరణోద్యమం ఏ వర్గాలకు పరిమితమయ్యిందని చెప్పవచ్చు?
ఎ) పూజారి వర్గం
బి) ఉన్నత మధ్య తరగతి
సి) ధనిక రైతు వర్గం
డి) పట్టణ భూస్వాములు
61. కింది సంస్థల ఏర్పాటుకు సంబంధించి సరైన కాలక్రమాన్ని గుర్తించండి.
ఎ) బ్రహ్మసభ- ఆర్య సమాజ్- మద్రాస్ మహాజన్ సభ
బి) బ్రహ్మసభ- మద్రాస్ మహాజన్ సభ- ఆర్య సమాజ్
సి) మద్రాస్ మహాజన్ సభ- బ్రహ్మసభ- ఆర్య సమాజ్
డి) మద్రాస్ మహాజన్ సభ- ఆర్య సమాజ్- బ్రహ్మసభ
62. హిందూ సమాజంలో కులతత్వాన్ని విమర్శిస్తూ ‘హై క్యాస్ట్ హిందూ ఉమెన్’ అనే గ్రంథాన్ని రాసింది ఎవరు?
ఎ) సరోజినీ నాయుడు
బి) పండిత రమాబాయి
సి) అనీ బీసెంట్
డి) దుర్గాబాయి దేశ్‌ముఖ్
63. ప్రతిపాదన (ఎ): పాశ్చాత్య భావాల ఫలితంగా ముస్లింల్లో కలిగిన తొలి స్పందనే ‘వహాబి ఉద్యమం’గా ఆవిర్భవించింది
కారణం (ఆర్): తొలి ఇస్లాం సంస్కరణోద్యమంగా ప్రారంభమైన వహాబి ఉద్యమం తర్వాత సిక్కులపై పవిత్ర యుద్ధంగా, బ్రిటిష్ వారిని బెంగాల్ నుంచి తరిమేసే యుద్ధంగా మారింది
ఎ) ఎ, ఆర్ సరైనవి. ఆర్ ఎ కు సరైన వివరణ
బి) ఎ, ఆర్ సరైనవే. కానీ ఆర్ ఎ కు సరైన వివరణ కాదు
సి) ఎ సరైనది, ఆర్ తప్పు
డి) ఎ తప్పు, ఆర్ సరైనది
64. అలీగఢ్ ఉద్యమ స్థాపకుడు ఎవరు?
ఎ) సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్
బి) సర్ సయ్యద్ అహ్మద్ బెరిల్వీ
సి) అబ్దుల్ వహాబి
డి) మౌలానా హుస్సేన్ అహ్మద్
65. సిక్కు మత సంస్కరణోద్యమాలకు సంబంధించి కింది వాటిని సరిగా జతపర్చండి.
1. నిరంకారీ ఉద్యమం ఎ. సిక్కుల్లో విద్యను ప్రోత్సహించడం
2. నాంధారీ ఉద్యమం బి. గురుద్వారా సంస్కరణోద్యమం
3. అకాలీ ఉద్యమం సి. భాయీ రాంసింగ్
4. సింగ్ సభ ఉద్యమం డి. ఆనంద వివాహ శాసనం
ఎ) 1-సి, 2-డి, 3-ఎ, 4-బి
బి) 1-డి, 2-సి, 3-బి, 4-ఎ
సి) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
4) 1-బి, 2-ఎ, 3-డి, 4-సి
66. అగ్రకుల పెత్తనానికి వ్యతిరేకంగా పని చేసిన పత్రికలు, వాటిని నిర్వహించినవారిని జతపర్చండి.
1. దీనబంధు ఎ. బీఆర్ అంబేద్కర్
2. దర్పణ్ బి. ముకుందరావు పాటిల్
3. దీనమిత్ర సి. బాలశాస్త్రి జంబేకర్
4. మూక్ నాయక్ డి. జ్యోతిరావు ఫులే
ఎ) 1-సి, 2-డి, 3-ఎ, 4-బి
బి) 1-డి, 2-సి, 3-బి, 4-ఎ
సి) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
4) 1-బి, 2-ఎ, 3-డి, 4-సి
67. వెనుకబడిన తరగతులకు సంబంధించి కింది వ్యాఖ్యల్లో సరైనవి?
1. కాకా కాలేల్కర్ కమిషన్ (1955) ప్రకారం దేశంలో మొత్తం 2399 ఇతర వెనుకబడిన కులాలు ఉన్నాయి
2. మండల్ కమిషన్ (1980) ప్రకారం దేశంలో మొత్తం ఇతర వెనుకబడిన కులాల ప్రజలు (హిందూయేతరులతో కలిపి) 52 శాతంగా ఉన్నారు. అలాగే దేశంలో వెనుకబడిన కులాలు, కమ్యూనిటీల సంఖ్య 3,743గా కమిషన్ పేర్కొంది
3. 2006లో వెనుకబడిన తరగతుల జాతీయ కమిషన్ నివేదిక ప్రకారం ఇతర వెనుకబడిన తరగతుల కేంద్ర జాబితా (కేంద్రపాలిత ప్రాంతాలను మినహాయించి) అనుసరించి ఓబీసీ సంఖ్య 5,013కి పెరిగింది
ఎ) 1 బి) 2 సి) 3 డి) 1, 2, 3
ANS :-
33-బి, 34-సి, 35-సి, 36-సి,
37-బి, 38-డి, 39-ఎ, 40-సి, 41-ఎ, 42-సి, 43-బి, 44-డి, 45-ఎ, 46-ఎ, 47-డి, 48-బి, 49-బి, 50-సి, 51-ఎ, 52-సి, 53-సి, 54-బి, 55-బి, 56-సి, 57-ఎ, 58-సి, 59-సి, 60-బి, 61-ఎ, 62-బి, 63-బి, 64-ఎ, 65-బి, 66-బి, 67-డి,
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు