Indian History | 1921-22 సింధూనదీ లోయలో తవ్వకాలు నిర్వహించింది ఎవరు?
1. ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం ?
1) డిసెంబర్ 1 2) డిసెంబర్ 2
3) డిసెంబర్ 3 4) డిసెంబర్ 4
2. 1389లో సిల్క్ మ్యాప్‌ను తయారు చేసినవారు?
1) అల్ఇద్రిసీ 2) టాలమీ
3) డిమింగ్ హున్యితు
4) హెకేషియస్
3. కొలంబస్ ఏ దిక్కుకు ప్రయాణం చేసి అమెరికాను కనుగొన్నాడు?
1) తూర్పు వైపు 2) పడమర వైపు
3) దక్షిణం వైపు 4) ఉత్తరం వైపు
4. కింది వాటిలో పంటకు వర్తించని వాక్యం?
1) ఒక ప్రాంతం ఎంత వేడిగా ఉంది, అక్కడ మాట్లాడే భాషలను పటంలో చూపవచ్చు
2) పటం ఒక ప్రదేశపు యథాతథ దృశ్యాన్ని ఆవిష్కరిస్తుంది
3) పటం ఒక ప్రదేశంలోని నిమ్నోన్నతాలను వివరించవచ్చు
4) పటంలో ఏదైనా ఒక అంశాన్ని తెలుపవచ్చు
5. సుమేరియా అంటే ప్రస్తుతం ఏ ప్రాంతం?
1) ఇరాన్ 2) ఇరాక్
3) సౌదీ అరేబియా 4) సిరియా
6. 2300 సంవత్సరాల క్రితం ప్రపంచాన్ని జయించాలని భారతదేశం వచ్చిన గ్రీకు రాజు?
1) డేరియస్ 2) సీజర్
3) అలెగ్జాండర్ 4) అగస్టీన్
7. అక్షాంశాలు, రేఖాంశాల ఆధారంగా పటాలను కచ్చితంగా గీయడానికి ప్రయత్నించిన వారు?
1) బాబిలోనియన్లు 2) సుమేరియన్లు
3) రోమన్లు 4) గ్రీకులు
8. కింది వాటిని సరిగా జతపరచండి.
1. అతి పురాతన పటాల తయారీ ఎ. బాబిలోనియన్లు
2. మొదటి ప్రపంచ పటాల తయారీ బి. గ్రీకులు
3. అక్షాంశాలు రేఖాంశాల ఆధారంగా మొదటి పటాలు సి. సుమేరియన్లు
1) 1-సి, 2-బి, 3-ఎ
2) 1-సి, 2-ఎ, 3-బి
3) 1-బి, 2-ఎ, 3-సి
4) 1-ఎ, 2-బి, 3-సి
9. సుమేరియన్లు ప్రపంచంలో మొదటి పటాలు దేనికోసం రూపొందించారు?
1) రాజు భూముల వివరాలు తెలుసుకోవటానికి
2) దేవాలయ భూముల నుంచి లభించే ఆదాయం అంచనా వేయడానికి
3) రాజ్యంలోని రహదారులను తెలుసుకోవడానికి
4) రాజ్యంలోని సైనిక బలాలను అంచనా వేయడానికి
10. కింది వారిలో బాబిలోనియన్లు రూపొందించిన ప్రపంచ పటం లక్షణం కానిది?
1) వీరు ప్రపంచం గుండ్రటి పళ్లెం మాదిరి ఉంటుందని అంచనా వేశారు
2) లోపలి వలయంలో వారికి తెలిసిన అన్ని పట్టణాలు, గ్రామాలు గుర్తించారు
3) చేదునదిలో ఏడు దీవులను గుర్తించారు
4) రోమ్ పట్టణాన్ని మధ్యలో చూపించారు
11. కింది వాటిలో సరికాని జతను గుర్తించండి.
1) మిలెటస్ – ప్రస్తుత టర్కీ
2) లిబియా – ఆసియా ఖండ దేశం
3) డచ్ – హాలెండ్ దేశస్థులకు గల పేరు
4) జెరూసలెం – ఆసియా ఖండంలో ఉంది
12. కింది వాటిలో అనాక్సిమాండర్, హెకాటియస్లు రూపొందించిన ప్రపంచ పటం లక్షణాన్ని గుర్తించండి.
1) భూమి గుండ్రంగా ఉంది
2) భూమి మధ్యభాగంలో పెద్ద సముద్రం ఉంది
3) ప్రపంచమంతా ఐదు ఖండాలుగా విభజించబడి ఉంది
4) పైవేవీ కావు
13. అనాక్సిమాండర్, హెకాటియస్లు ప్రపంచ పటంలో ప్రదేశాలను ఏ విధంగా గుర్తించారు?
ఎ. తూర్పు నుంచి పడమరకు
బి. ఉత్తరం నుంచి దక్షిణానికి
సి. పడమర నుంచి ఉత్తరానికి
డి. దక్షిణం నుంచి తూర్పునకు
1) ఎ, బి, సి, డి 2) ఎ, బి
3) బి, సి 4) ఎ, డి
14. మౌర్య రాజ్య స్థాపకుడు?
1) చంద్రగుప్తుడు 2) అశోకుడు
3) బింబిసారుడు 4) బిందుసారుడు
15. శాతవాహన రాజ్య స్థాపకుడు?
1) శాతకర్ణి-1 2) శ్రీముఖుడు
3) హాలుడు 4) గౌతమీ పుత్రశాతకర్ణి
16. నవరత్నాలు అనే కవి పండితులు ఎవరి ఆస్థానంలో ఉండేవారు?
1) చంద్రగుప్త విక్రమాదిత్యుడు
2) శ్రీగుప్తుడు
3) సముద్రగుప్తుడు 4) కుమారగుప్తుడు
17. దేశ భాషల యందు తెలుగు లెస్స అని పలికింది?
1) అల్లసాని పెద్దన
2) శ్రీకృష్ణదేవరాయలు
3) గణపతి దేవుడు 4) శ్రీనాథుడు
18. రుద్రమ దేవి తండ్రి?
1) గణపతి దేవుడు 2) ప్రతాపరుద్రుడు
3) మహాదేవుడు 4) రుద్రదేవుడు
19. ఛత్రపతి శివాజీ గురువు?
1) సమర్థ రామదాసు 2) ఏక్నాథ్
3) తుకారాం 4) వామన్ పండిట్
20. కింది వాటిలో హాలుని రచనను గుర్తించండి.
1) బృహత్కథ 2) గాథసప్తశతి
3) కాతంత్ర వ్యాకరణం
4) ఆముక్త మాల్యద
21. ఎల్లోరా గుహాలయాలు ప్రధానంగా ఎవరికాలానికి చెందినవి?
1) మౌర్యులు 2) శుంగులు
3) గుప్తులు 4) చౌహాన్లు
22. కింది వాటిలో శ్రీకృష్ణదేవరాయల రచన?
1) మనుచరిత్ర
2) ఆముక్తమాల్యద
3) శ్రీకాళహస్తీశ్వర మహత్మ్యం
4) శివరాత్రి మహత్మ్యం
23. 1921-22 సింధూనదీ లోయలో తవ్వకాలు నిర్వహించింది?
1) అలెగ్జాండర్ కన్నింగ్‌హాం
2) సర్జాన్ మార్షల్
3) కల్నల్ మెకంజీ 4) వీ ఏ స్మిత్
24. హరప్పా నాగరికత ప్రధాన రేవు పట్టణం?
1) మొహంజోదారో 2) కాళీభంగల్
3) లోథాల్ 4) సుర్కొటొడా
25. హరప్పా నాగరికతకు సంబంధించి సరికానిది గుర్తించండి.
1) ప్రధాన దైవం – అమ్మతల్లి పశుపతి
2) లిపి – బొమ్మలతో కూడినది
3) నివాసప్రదేశం – గ్రామాలు
4) ముఖ్యవృత్తి – వ్యవసాయం
26. హరప్పా నాగరికత ప్రజలు ఏ ప్రాంతంలో వ్యాపారం చేశారు?
1) శ్రీలంక 2) చైనా
3) పశ్చిమ ఆసియా 4) రోమ్
27. కింది ఏ ప్రదేశంలో గిరిజన ప్రదర్శన ఉంది?
1) విశాఖపట్నం 2) శ్రీకాకుళం
3) శ్రీశైలం 4) తిరుపతి
28. సాలార్జంగ్ మ్యూజియం గల ప్రదేశం?
1) సికింద్రాబాద్ 2) హైదరాబాద్
3) విజయవాడ 4) విశాఖపట్నం
29. ఒక ప్రదేశంలోని ప్రజల ఆహారపు అలవాట్లు వేషభాషలు, పండుగలు, ఉత్సవాలను తెలిపేది?
1) చరిత్ర 2) సంస్కృతి
3) నాగరికత 4) జీవనశైలి
30. కింది వాటిలో భారతదేశ సంస్కృతి కానిది?
1) పెద్దలను గౌరవించడం
2) చెట్లను పక్షులను జంతువులను గాలిని నీటిని నిప్పును ఆరాధించడం
3) వివాహం కాకుండా స్త్రీ పురుషులు సహజీవనం చేయడం
4) సహాయం చేసిన వారికి ధన్యవాదాలు తెలపడం
31. మహాత్మాగాంధీ దక్షిణాఫ్రికా నుంచి తిరిగి వచ్చిన సంవత్సరం?
1) 1912 2) 1914
3) 1915 4) 1916
32. రాక్షస చట్టంగా విమర్శలకు గురైన చట్టం?
1) 1909 చట్టం
2) మాంటేగ్ ఛేమ్స్‌ఫర్డ్ చట్టం
3) రౌలత్ చట్టం 4) 1935 చట్టం
33. కింది వాటిలో గాంధీజీ భారతదేశంలో నిర్వహించిన మొదటి ఉద్యమం?
1) చంపారన్ 2) ఖేదా
3) అహ్మదాబాద్ నూలు మిల్లు
4) బార్దోలి
34. గాంధీజీ ఏ రోజున ప్రార్థనా గౌరవ భంగ దినంగా ప్రకటించారు?
1) 1905 అక్టోబర్ 16
2) 1919 ఏప్రిల్ 6
3) 1919 ఏప్రిల్ 13
4) 1919 అక్టోబర్ 16
35. ముస్లింలీగ్ స్థాపించిన సంవత్సరం?
1) 1903 2) 1905
3) 1906 4) 1909
36. ప్రత్యేక నియోజకవర్గాలు 1909లో ఎవరికి కేటాయించారు?
1) హిందూ 2) ముస్లిం
3) సిక్కు 4) మహిళలు
37. బెంగాల్ విభజనను సమర్థించినది?
1) జాతీయ కాంగ్రెస్
2) హిందూ మహాసభ
3) ముస్లింలీగ్
4) బెంగాల్ భూస్వాముల సంఘం
38. జలియన్‌వాలాబాగ్‌కు నిరసనగా నైట్‌హుడ్ బిరుదును తిరస్కరించినది?
1) గాంధీ 2) ఠాగూర్
3) బంకించంద్ర ఛటర్జీ 4) సీవీ రామన్
39. సహాయ నిరాకరణ ఉద్యమం ప్రారంభమైన సంవత్సరం?
1) 1905 2) 1920
3) 1929 4) 1942
40. చీరాల పేరాల ఉద్యమానికి నాయకుడు?
1) దుగ్గిరాల గోపాలకృష్ణయ్య
2) కొండా వెంకటప్పయ్య
3) పర్వతనేని వీరయ్య చౌదరి
4) ప్రగడ కోటయ్య
41. ప్రత్యక్ష చర్యదినంగా ఏ రోజున ముస్లింలీగ్ ప్రకటించింది?
1) 1946 జూలై 6
2) 1946 ఆగస్టు 16
3) 1947 ఆగస్టు 15
4) 1945 జూలై 4
42. 1947లో భారతదేశంలో చివరి వైస్రాయ్గా నియమించినది?
1) గాంధీ 2) మౌంట్‌బాటన్
3) వేవెల్ 4) ఇర్విన్
43. మహాత్మాగాంధీ దక్షిణాఫ్రికా నుంచి తిరిగి వచ్చి భారతదేశంలో స్థిరపడిన సంవత్సరం?
1) 1914 2) 1915
3) 1916 4) 1917
44. కింది ఘటనలను కాలక్రమంలో సరిగా అమర్చండి.
ఎ. జలియన్ వాలాబాగ్
బి. ఖిలాపత్ ఆందోళన
సి. ఖేదా ఉద్యమం
డి. రౌలత్ చట్టం
1) సి, ఎ, డి, బి 2) సి, బి, ఎ, డి
3) సి, డి, ఎ, బి 4) సి, బి, డి, ఎ
45. 1947 ఆరంభంలో భారతదేశ వైస్రాయ్గా నియమించబడింది?
1) వేవెల్ 2) మౌంట్‌బాటన్
3) లిన్లిథ్గో 4) అట్లీ
46. పాకిస్థాన్ స్వాతంత్య్రం పొందిన రోజు?
1) 1947 ఆగస్టు 14
2) 1947 ఆగస్టు 15
3) 1947 ఆగస్టు 16
4) 1947 ఆగస్టు 17
47. 1947 ఆగస్టు నాటికి భారతదేశంలో విలీనం కాని సంస్థానం?
1) కశ్మీర్ 2) హైదరాబాద్
3) జునాఘడ్ 4) పైవన్నీ
48. దేశంలో స్వాతంత్య్రం పొందాక నూతన రాష్ర్టాలు ఏర్పాటు చేసే ప్రక్రియ ఏ సంవత్సరం వరకు కొనసాగింది?
1) 1953 2) 1956
3) 1958 4) 1960
49. ఆంధ్ర మహాసభ స్థాపించిన సంవత్సరం?
1) 1929 2) 1930
3) 1932 4) 1935
50. ఆంధ్ర మహాసభ స్థాపనలో ముఖ్యపాత్ర పోషించింది?
1) మాడపాటి హన్మంతరావు, రావి నారాయణరెడ్డి
2) కొమర్రాజు లక్ష్మణరావు, రావిచెట్టు రంగారావు
3) సురవరం ప్రతాపరెడ్డి, నాయిని వెంకట రంగారావు
4) రావి నారాయణరెడ్డి
51. కింది వాటిని సరిగా జతపరచండి.
1. ఆంధ్ర జన సంఘం ఎ. స్వామి రామానందతీర్థ
2. గోల్కొండ పత్రిక బి. మాడపాటి హన్మంతరావు
3. హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ సి. సురవరం ప్రతాపరెడ్డి
1) 1-బి, 2-సి, 3-ఎ
2) 1-బి, 2-ఎ, 3-సి
3) 1-సి, 2-బి, 3-ఎ
4) 1-సి, 2-ఎ, 3-బి
52. 1935లో జరిగిన ఆంధ్రమహాసభ వార్షిక సమావేశంలో ప్రభుత్వాన్ని కోరిన కోరికలు?
ఎ. నిర్బంధ ప్రాథమిక విద్య
బి. మాతృభాషలో బోధన
సి. బాల్యవివాహాల నిషేధం
డి. మద్యపాన నిషేధం
1) ఎ, బి, సి, డి 2) ఎ, బి, సి
3) ఎ, బి, డి 4) బి, సి, డి
53. హైదరాబాద్ రాష్ట్ర స్వాతంత్య్రోద్యమంలో పాల్గొన్న సాహితీవేత్తలు?
1) కాళోజీ నారాయణరావు
2) దాశరథి కృష్ణమాచార్యులు
3) దాశరథి రంగాచార్యులు
4) పైవారందరూ
54. చివరగా ఎ.ఎం.ఎస్పై ఆధిపత్యం సాధించిన వారు?
1) మితవాదులు 2) రజాకార్లు
3) కమ్యూనిస్టులు
4) హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ నాయకులు
55. హైదరాబాద్ రాజ్యంలో వందేమాతర ఉద్యమం జరిగిన సంవత్సరం?
1) 1905 2) 1910
3) 1930 4) 1938
56. హైదరాబాద్ రాష్ట్ర కాంగ్రెస్ స్థాపించిన సంవత్సరం?
1) 1935 2) 1938
3) 1941 4) 1943
57. హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్‌కు సంబంధించి సరికానిది గుర్తించండి.
1) హైదరాబాద్ రాష్ట్ర కాంగ్రెస్ స్థాపకుల్లో ముఖ్యుడు స్వామి రామానందతీర్థ
2) హైదరాబాద్ రాష్ట్ర కాంగ్రెస్‌లో క్రియాశీలంగా పనిచేసి రాష్ర్టానికి ముఖ్యమంత్రి అయినది – మర్రి చెన్నారెడ్డి
3) హైదరాబాద్ రాష్ట్ర కాంగ్రెస్‌లో పనిచేసి తర్వాత దేశానికి ప్రధాని అయినది – పీవీ నరసింహారావు
4) పైవన్నీ సరైనవే
సమాధానాలు
1.3 2.3 3.2 4.2
5.2 6.3 7.4 8.2
9.2 10.4 11.2 12.1
13.2 14.1 15.2 16.1
17.2 18.1 19.1 20.2
21.3 22.2 23.2 24.3
25.3 26.3 27.3 28.2
29.2 30.3 31.3 32.3
33.1 34.2 35.3 36.2
37.3 38.2 39.2 40.1
41.2 42.2 43.2 44.3
45.2 46.1 47.4 48.2
49.2 50.1 51.1 52.1
53.4 54.3 55.4 56.2
57.4
ఎస్ అండ్ ఎస్ పబ్లికేషన్స్ సౌజన్యంతో
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు