IITM Admissions 2023-24 | జేఈఈ అడ్వాన్స్డ్ రాయకున్నా.. ఐఐటీలో ప్రవేశాలు!
ఐఐటీ.. దేశంలో ఈ పేరు తెలియని వారు ఉండరు. ఇంజినీరింగ్ విద్యకు ప్రతిష్ఠాత్మకమైన విద్యాసంస్థలుగా పేరుగాంచాయి ఐఐటీలు. అయితే దీనిలో ప్రవేశం అంటే అత్యంత కఠినమైన జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షలో మంచి ర్యాంక్ సాధిస్తేనే సాధ్యం. కానీ అడ్వాన్స్డ్ ర్యాంక్‌తో సంబంధం లేకుండా నేరుగా ఐఐటీలో బీఎస్సీ డిగ్రీ చేసే అవకాశాన్ని ఐఐటీ మద్రాస్ కల్పిస్తుంది. డేటా సైన్స్‌తోపాటు డేటా ఎలక్ట్రానిక్స్ కోర్సును కూడా ప్రారంభించనున్నది. ఆ వివరాలు నిపుణ పాఠకుల కోసం…
- ఐఐటీఎం: ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) మద్రాస్. దేశంలోని మొదటి జనరేషన్ ఐఐటీ ఇది. అంతేకాకుండా గత ఐదేండ్లుగా ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్స్‌లో టాప్‌లో నిలుస్తున్న సంస్థ. ఈ సంస్థ జూన్ 2020లో ఆన్లైన్లో బీఎస్సీ డిగ్రీని అందిస్తామని ప్రకటించింది. 2021, జనవరి నుంచి ఈ కోర్సును ప్రారంభించింది. ఐఐటీఎం దేశంలోనే మొదటిసారి 2001 నుంచి ఆన్లైన్ కంటెంట్ కోర్సులను ఎన్పీటీఈఎల్ రూపంలో అందిస్తుంది.
- ఆఫర్ చేస్తున్న కోర్సులు: బీఎస్సీ డేటా సైన్స్ అండ్ అప్లికేషన్స్, బీఎస్సీ ఎలక్ట్రానిక్ సిస్టమ్స్
బీఎస్సీ డేటా సైన్స్ - అర్హతలు: ఇంటర్ ఉత్తీర్ణులైతే చాలు. ఏ గ్రూప్ వారైనా దరఖాస్తు చేసుకోవచ్చు. పదోతరగతి స్థాయిలో మ్యాథ్స్, ఇంగ్లిష్ సబ్జెక్టులుగా చదివి ఉండాలి.
వయస్సు: గరిష్ఠ వయోపరిమితి లేదు.
ఎంపిక విధానం: రెగ్యులర్ ఎంట్రీ, జేఈఈ బేస్డ్ ఎంట్రీ విధానంలో ప్రవేశాలు కల్పిస్తారు. - రెగ్యులర్ ఎంట్రీ విధానంలో ‘క్వాలిఫయర్ ప్రాసెస్’ ఉంటుంది. వీరికి మొదట ఫౌండేషన్ లెవల్లో ప్రవేశం కల్పిస్తారు. క్వాలిఫయర్ ప్రిపరేషన్లో భాగంగా నాలుగు వారాలపాటు కోర్సు వర్క్బేస్డ్ అందిస్తారు. దీనిలో లెక్చర్ వీడియోలు, అసైన్మెంట్స్, లైవ్ సెషన్స్ ఉంటాయి.
- వీటిలో ఇంగ్లిష్-1, మ్యాథ్స్ ఫర్ డేటా సైన్స్-1, స్టాటిస్టిక్స్ ఫర్ డేటా సైన్స్-1, కంప్యూటేషనల్ థింకింగ్ ఉంటాయి. ఆన్లైన్ పోర్టల్ ద్వారా పై కోర్సును సంస్థ అందిస్తుంది. ప్రతి వారం అభ్యర్థులు తప్పనిసరిగా ఇచ్చిన అసైన్‌మెంట్స్‌ను సబ్మిట్ చేయాలి. అసైన్‌మెంట్స్‌కు గ్రేడింగ్ ఇస్తారు. నాలుగు వారాలు చెప్పిన అంశాలపై క్వాలిఫయర్ ఎగ్జామ్‌ను నిర్వహిస్తారు. దీనిలో వచ్చిన మార్కుల ఆధారంగా ప్రవేశాలను కల్పిస్తారు.
జేఈఈ బేస్డ్ ఎంట్రీ - ప్రస్తుత సంవత్సరంలో జేఈఈ అడ్వాన్స్డ్ రాసిన అభ్యర్థులకు నేరుగా ఈ కోర్సులో ప్రవేశం కల్పిస్తారు.
బీఎస్సీ డేటా సైన్స్ అండ్ అప్లికేషన్స్
- ఇది నాలుగేండ్ల కోర్సు
- ఫౌండేషన్ లెవల్, డిప్లొమా లెవల్, డిగ్రీ (బీఎస్సీ) లెవల్, డిగ్రీ లెవల్ (బీఎస్).
- అభ్యర్థులు కోర్సు పూర్తి చేయలేకపోతే వారి వారి స్థాయిలను బట్టి ఫౌండేషన్, డిప్లొమా లేదా డిగ్రీ లెవల్లో విరమించుకోవచ్చు. ఆయా స్థాయికి సంబంధించిన సర్టిఫికెట్స్‌ను ఐఐటీ ప్రదానం చేస్తుంది.
- దరఖాస్తు: ఆన్లైన్లో జూన్ 14 నుంచి ప్రారంభం
పూర్తి వివరాల కోసం
IITM BS Degree Office,
3rd Floor,
ICSR Building,
IIT Madras, Chennai – 600036
7850999966
(Mon-Fri 9am-6pm)
support@study.iitm.ac.in
బీఎస్ (ఎలక్ట్రానిక్ సిస్టమ్స్)
- ఇది నాలుగేండ్ల డిగ్రీ కోర్సు.
- ఈ కోర్సును ఆన్లైన్ విధానంలో ఐఐటీ మద్రాస్ అందిస్తుంది
- అర్హతలు: ఇంటర్ (మ్యాథ్స్, ఫిజిక్స్)తో ఉత్తీర్ణులైన వారు దరఖాస్తు చేసుకోవచ్చు.
- వయస్సు: ఎటువంటి గరిష్ఠ వయోపరిమితి లేదు
- కోర్సు స్ట్రక్చర్: దీనిలో నాలుగు లెవల్స్ ఉంటాయి. అవి ఫౌండేషన్, డిప్లొమా, డిగ్రీ లెవల్+అప్రెంటిస్‌షిప్. మొత్తం 142 క్రెడిట్స్.
- క్రెడిట్స్ పూర్తిచేసిన దాన్నిబట్టి ఆయా సర్టిఫికెట్స్‌ను ఐఐటీఎం అందిస్తుంది.
- దరఖాస్తు: ఆన్లైన్లో
- చివరితేదీ: జూన్ 25
- వెబ్సైట్: https://study.iitm.ac.in/es
పూర్తి వివరాల కోసం
- +91-9711397993 (Mon-Fri 9am-6pm)
- support-es@study.iitm.ac.in
Next article
Success Stories | ఆత్మవిశ్వాసం @ ఆరు ఉద్యోగాలు
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు