KGBV Recruitment | కేజీబీవీల్లో 1,241 పోస్టులు.. ఈ నెల 26 నుంచి 5 వరకు దరఖాస్తులు
KGBV Recruitment | హైదరాబాద్, జూన్ 16 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయాలు (కేజీబీవీ), అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్స్ (యూఆర్ఎఎస్)లో ఖాళీ పోస్టులు భర్తీ చేయాలని తెలంగాణ సర్కారు నిర్ణయించింది. కేజీబీవీ, యూఆర్ఎస్లో మొత్తం 1,241 పోస్టులను కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేయనున్నారు. ఈ మేరకు డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ శుక్రవారం ప్రకటన జారీ చేసింది. కేజీబీవీల్లో స్పెషల్ ఆఫీసర్, పీజీసీఆర్టీ, సీఆర్టీ, పీఈటీలు, అర్బన్ రెసిడెన్షియల్ పాఠశాలల్లో స్పెషల్ ఆఫీసర్, సీఆర్టీల ఖాళీలను తాతాలిక కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ కోసం అర్హత, ఆసక్తిగల అభ్యర్థులను ఆన్లైన్లో దరఖాస్తులు ఆహ్వానించింది. కేజీబీవీల్లో పోస్టులకు మహిళా అభ్యర్థులు మాత్రమే అర్హులని పేర్కొన్నది.
మొత్తం 1,241 ఖాళీల్లో ఎస్ఓలు 42, పీజీసీఈటీ 849, సీఆర్టీ 273, పీఈటీ పోస్టులు 77 ఉన్నట్టు పేర్కొన్నది. అభ్యర్థుల అర్హత, రాత పరీక్షా విధానం, పరీక్ష సిలబస్, అభ్యర్థుల ఎంపిక విధానం తదితర వివరాలతో కూడిన సమగ్ర నోటిఫికేషన్ పాఠశాల విద్యాశాఖ వెబ్సైట్ https://schooledu. telangana.gov.in లో ఈ నెల 17 (నేటి) నుంచి అందుబాటులో ఉంటుందని ప్రకటనలో పేర్కొన్నది. దరఖాస్తు, ఇతర వివరాలు ఈ నెల 25 నుంచి వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయని తెలిపింది. అభ్యర్థులు ఈ నెల 26 నుంచి వచ్చే నెల 5 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. అభ్యర్థులకు వచ్చె నెలలో ఆన్లైన్లో ఆబ్జెక్టివ్ విధానంలో పరీక్ష ఉంటుందని పేర్కొన్నది.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు