TSPSC Group 4 Special | రాజ్యాంగ ప్రవేశిక భారతదేశాన్ని ఏమని వర్ణించింది?
భారత రాజ్యాంగం
1. భారత రాజ్యాంగ పరిషత్ అధ్యక్షుడు?
ఎ) జవహర్లాల్ నెహ్రూ
బి) బీ ఆర్ అంబేద్కర్
సి) రాజేంద్రప్రసాద్
డి) వల్లభాయ్ పటేల్
2. కింది వారిలో రాజ్యాంగ రచనా కమిటీలో సభ్యులు కానివారు?
ఎ) అల్లాడి కృష్ణస్వామి అయ్యర్
బి) ఎన్ మాధవ రావు
సి) కె ఎం మున్షీ
డి) హెచ్.సి. ముఖర్జీ
3. భారత రాజ్యాంగం రూపొందించడానికి పట్టిన కాలం?
ఎ) 2 సంవత్సరాల 11 నెలల 8 రోజులు
బి) 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు
సి) 2 సంవత్సరాల 11 నెలల 28 రోజులు
డి) 2 సంవత్సరాల 10 నెలల 18 రోజులు
4. కింది వాటిలో లిఖిత రాజ్యాంగం లేని దేశం?
ఎ) అమెరికా బి) బ్రిటన్
సి) ఫ్రాన్స్ డి) ఆస్ట్రేలియా
5. కింది వాటిలో ప్రవేశికకు సంబంధించి సరికానిది గుర్తించండి.
ఎ) ప్రవేశిక రాజ్యాంగానికి పరిచయంలాంటిది
బి) ప్రవేశిక రాజ్యాంగానికి ఉపోద్ఘాతం వంటిది
సి) ప్రవేశిక రాజ్యాంగ జాతీయ లక్ష్యాల గురించి తెలుపుతుంది
డి) ప్రవేశిక రాజ్యాంగ మూడో భాగంలో ఉంది
6. రాజ్యాంగ ప్రవేశిక భారతదేశాన్ని ఎలా వర్ణించింది?
ఎ) సర్వసత్తాక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యం
బి) సర్వసత్తాక, సామ్యవాద, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యం
సి) సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యం
డి) సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య రాజ్యం
7. భారత రాజ్యాంగ ప్రవేశిక ఏ పదాలతో ప్రారంభమవుతుంది?
ఎ) సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యం
బి) పౌరులందరికీ సాంఘిక, ఆర్థిక, రాజకీయ న్యాయం కోసం
సి) భారతదేశ ప్రజలమైన మేము
డి) భారత రాజ్యాంగాన్ని మాకు మీకు ఇచ్చుకుంటున్నాం
8. భారత రాజ్యాంగ ప్రవేశికలో లేని పదాన్ని గుర్తించండి.
ఎ) న్యాయం బి) స్వాతంత్య్రం
సి) సౌభ్రాతృత్వం డి) విశ్వశాంతి
9. రాజ్యాంగ ప్రవేశికలోని ‘భారతదేశ ప్రజలమైన మేము’ అనే వాక్యం ఎవరిని ఉద్దేశించింది?
ఎ) రాజ్యాంగ పరిషత్ సభ్యులను
బి) భారతదేశంలో ఓటుహక్కు కలిగిన వారిని
సి) భారతదేశంలో నివసించే వయోజనులను
డి) భారతదేశంలో నివసిస్తున్న వయోజనులు, పిల్లలను
10. కింది వాటిలో సర్వసత్తాక రాజ్య లక్షణం కానిది?
ఎ) ఒక దేశానికి సంబంధించిన నిర్ణయాలు ఆ దేశం తీసుకోవడం
బి) ఇతర దేశాలతో ఒప్పందాలు చేసుకోవడం
సి) అగ్రదేశాలు ఆదేశించినట్లు నడుచుకోవడం
డి) వాణిజ్యం, విద్యా సంబంధాల కోసం ఇతర దేశాలతో సంప్రదింపులు చేయడం
11. జతపరచండి.
1. సామ్యవాద రాజ్యం ఎ. మత ప్రమేయం లేని రాజ్యం
2. లౌకిక రాజ్యం బి. రాజులు రాణులు లేని రాజ్యం
3. గణతంత్ర రాజ్యం సి. సంపదను అందరూ సమానంగా అనుభవించే అవకాశం గల రాజ్యం
ఎ) 1-ఎ, 2-సి, 3-బి
బి) 1-బి, 2-ఎ, 3-సి
సి) 1-సి, 2-ఎ, 3-బి
డి) 1-ఎ, 2-బి, 3-సి
12. కింది వాటిలో లౌకిక రాజ్య లక్షణం కానిది?
ఎ) అన్ని మతాలకు సమాన గౌరవం ఇవ్వడం
బి) మత ప్రమేయం లేని రాజ్యం
సి) మతాలు లేని రాజ్యం
డి) మత ప్రాతిపదికన ప్రభుత్వాలు ఏర్పడని రాజ్యం
13. కింది వాటిలో భారతదేశంలో జన్మించని మతం?
ఎ) సిక్కుల మతం బి) బౌద్ధ మతం
సి) జైన మతం డి) పార్శీ మతం
14. దేశంలో గల మతాల వారీగా జనాభాను ఎక్కువ సంఖ్య నుంచి తక్కువకు గుర్తించండి.
1. హిందువులు 2. ముస్లింలు
3. క్రైస్తవులు 4. సిక్కులు
ఎ) 1, 2, 3, 4 బి) 1, 3, 2, 4
సి) 1, 4, 3, 2 డి) 1, 3, 4, 2
15. పార్లమెంట్లో ప్రస్తుత సభ్యుల సంఖ్య?
ఎ) 700 బి) 740
సి) 765 డి) 790
16. నేపాల్‌లో రాచరికం రద్దు చేసిన సంవత్సరం?
ఎ) 2004 బి) 2005
సి) 2006 డి) 2007
17. రాజ్యాంగ సభకు, రాష్ర్టాలకు, సంస్థానాలకు స్థానాల కేటాయింపు జరిపినది?
ఎ) క్యాబినెట్ మిషన్ ప్రణాళిక
బి) వేవెల్ ప్రణాళిక
సి) మౌంట్‌బాటన్ ప్రణాళిక
డి) మిషన్ ప్రణాళిక
18. రాజ్యాంగ సభలో షెడ్యూల్డ్ కులాలకు చెందిన సభ్యుల సంఖ్య?
ఎ) 21 బి) 26
సి) 31 డి) 36
19. రాజ్యాంగ సభలో మహిళల సంఖ్య?
ఎ) 15 బి) 19
సి) 29 డి) 39
20. రాజ్యాంగ ముసాయిదా కమిటీ చైర్మన్?
ఎ) నెహ్రూ బి) రాజేంద్ర ప్రసాద్
సి) బీ ఆర్ అంబేద్కర్ డి) కుమార్ చౌదరి
21. భారత రాజ్యాంగ సభ రాజ్యాంగాన్ని ఆమోదించిన తేది?
ఎ) 1947 ఆగస్టు 15
బి) 1948 ఆగస్టు 14
సి) 1949 నవంబర్ 26
డి) 1950 జనవరి 26
22. భారత ముసాయిదా రాజ్యాంగంలో ఉన్న అధికరణలు, షెడ్యూల్ల సంఖ్య?
ఎ) 315, 8 బి) 326, 8
సి) 395, 8 డి) 395, 10
23. అమెరికాలోని అధ్యక్ష తరహా ప్రభుత్వంలో కార్యనిర్వాహక వర్గానికి అధిపతి?
ఎ) ప్రధానమంత్రి బి) సెక్రటరీ
సి) అధ్యక్షుడు డి) గవర్నర్
24. కింది వాటిలో అధ్యక్ష తరహా ప్రభుత్వానికి వర్తించనిది?
ఎ) అధ్యక్షుడు కార్యనిర్వాహక అధిపతి
బి) వివిధ శాఖల సెక్రటరీ సూచనలను అధ్యక్షుడు పాటించాలి
సి) అధ్యక్షుడు వివిధ శాఖాధిపతులను తొలగించగలడు
డి) పైవేవీకావు
25. భారత అధ్యక్షుడు ఎవరి సలహాలను పాటించేలా రాజ్యాంగ సభ ఏర్పాట్లు చేసింది?
ఎ) గవర్నర్ బి) స్పీకర్
సి) కేంద్ర మంత్రులు డి) రాయబారులు
26. కింది వారిలో ఏకీకృత రాజ్యాంగ లక్షణం కానిది ?
ఎ) కేంద్ర రాజ్యతంత్రం
బి) ఏక పౌరసత్వం
సి) ఉప సర్వసత్తాక రాజ్యతంత్రాలు లేకపోవుట
డి) ద్వంద్వ రాజ్యతంత్రం
27. ఉప రాజ్యతంత్రాలు ఏ వ్యవస్థలో ఉంటాయి?
ఎ) ఏకకేంద్ర బి) సమాఖ్య
సి) అధ్యక్ష తరహా
డి) పార్లమెంటరీ తరహా
28. భారత ద్వంద్వ రాజ్యతంత్రం ఏ దేశ రాజ్యాంగాన్ని పోలి ఉంది?
ఎ) ఐర్లాండ్ బి) రష్యా
సి) అమెరికా డి) ఇంగ్లండ్
29. కింది వారిలో ఉభయ జాబితాకి చెందింది?
ఎ) వివాహం బి) వారసత్వ చట్టాలు
సి) పౌర విచారణ స్మృతి
డి) జల రవాణా
30. భారతదేశ న్యాయ వ్యవస్థ నిర్మాణం ఏ దేశ విధానంతో సమీప పోలిక ఉంది?
ఎ) అమెరికా బి) ఇంగ్లండ్
సి) కెనడా డి) రష్యా
31. కింది వాటిలో సరికానిది గుర్తించండి.
ఎ) భారత సమాఖ్యలో ద్వంద్వ రాజ్యతంత్రాలు ఉన్నాయి
బి) భారతదేశంలో ద్వంద్వ న్యాయవ్యవస్థలు ఉన్నాయి
సి) అమెరికాలో సమాఖ్య న్యాయవ్యవస్థ, రాష్ట్ర న్యాయవ్యవస్థలు వేర్వేరుగా ఉంటాయి
డి) పౌర విచారణ స్మృతి, శిక్షాస్మృతి, పౌరనేర చట్టాల స్మృతులు ఉభయ జాబితాలో ఉంటాయి.
32. కింది వాటిలో సరైనవి గుర్తించండి.
ఎ) చట్టాలు చేసే అంశాలను కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా, ఉభయ జాబితాగా విభజించారు
బి) ఉభయ జాబితాలోని అంశాలపై రాష్ర్టాలు, కేంద్రాలు చట్టాలు చేయవచ్చు
సి) ఉభయ జాబితాపై కేంద్రానిదే ఆధిక్యత
డి) పైవన్నీ సరైనవే
33. ‘1935 చట్టానికి నకలు భారత రాజ్యాంగం’ అని విమర్శించింది?
ఎ) దామోదర్ స్వరూప్ సేథ్
బి) మౌలానా హస్రత్ మెహనీ
సి) శ్రీసోమనాథ రంజన్ ఠాకూర్
డి) ఎస్ సీ బెనర్జీ
34. గ్రామాలకు స్వయం ప్రతిపత్తి కల్పించటానికి ఉద్దేశించిన రాజ్యాంగ సవరణ?
ఎ) 56వ రాజ్యాంగ సవరణ
బి) 66వ రాజ్యాంగ సవరణ
సి) 73వ రాజ్యాంగ సవరణ
డి) 77వ రాజ్యాంగ సవరణ
జవాబులు
1.సి 2.డి 3.బి 4.బి
5.డి 6.సి 7.సి 8.డి
9.డి 10.సి 11.సి 12.సి
13.డి 14.ఎ 15.డి 16.డి
17.ఎ 18.బి 19.ఎ 20.సి
21.సి 22.ఎ 23.సి 24.బి
25.సి 26.డి 27.బి 28.సి
29.డి 30.సి 31.బి 32.డి
33.బి 34.సి
రక్షణ చర్యలు
1. గుజరాత్‌లోని భుజ్‌లో తీవ్ర భూకంపం సంభవించిన సంవత్సరం?
ఎ) 1999 బి) 2001
సి) 2004 డి) 2009
2. రిక్టర్ స్కేల్‌పై ఏ ప్రకృతి వైపరిత్యాన్ని కొలుస్తారు?
ఎ) తుఫాన్లు బి) వరదలు
సి) భూకంపాలు డి) సునామీలు
3. భూకంపం సంభవించినప్పుడు ఏ చర్య చేయకూడదు?
ఎ) టేబుల్ వంటి వాటి కింద తలపై చేతులు పెట్టుకొని కూర్చోవాలి
బి) లిఫ్ట్‌లు ఉపయోగించాలి
సి) భవనాలు, బ్రిడ్జ్‌లకు దూరంగా వెళ్లాలి
డి) విద్యుత్ సరఫరా ఆపివేయాలి
4. దివిసీమ ఉప్పెన సంభవించిన సంవత్సరం?
ఎ) 1966 బి) 1977
సి) 1988 డి) 1999
5. ఆరోగ్య సేవలు అందించే ఉచిత ఫోన్ నంబర్?
ఎ) 100 బి) 104
సి) 108 డి) 1098
6. ప్రమాదాలు జరిగినప్పుడు గోల్డెన్ అవర్ అంటే?
ఎ) ప్రమాదానికి ముందుగల గంట వ్యవధి
బి) ప్రమాదానికి తర్వాత గల గంట వ్యవధి
సి) ఆస్పత్రికి వెళ్లిన తొలి గంట వ్యవధి
డి) ప్రథమ చికిత్స చేయక ముందు గల గంట వ్యవధి
7. గుండెపోటు వచ్చినప్పుడు చేయవలసిన పని?
ఎ) పడుకోబెట్టడం బి) నిల్చోబెట్టడం
సి) నడిపించడం డి) కూర్చోబెట్టడం
8. జతపరచండి.
1. ఎస్డీఆర్ నియమం ఎ. గుండె ఆగడం
2. సీపీఆర్ ప్రక్రియ బి. వడదెబ్బ
3. ఓఆర్ఎస్ ద్రావణం సి. అగ్నిప్రమాదం
ఎ) 1-బి, 2-సి, 3-ఎ
బి) 1-సి, 2-ఎ, 3-బి
సి) 1-సి, 2-బి, 3-ఎ
డి) 1-బి, 2-ఎ, 3-సి
9. సరికాని వాక్యాన్ని గుర్తించండి.
ఎ) విషం తీసుకున్న వారితో వాంతి చేయించొద్దు
బి) వడదెబ్బ తగిలిన వారితో నీటిని తాగించే ప్రయత్నం చేయొద్దు
సి) ప్రపంచ ఆరోగ్యసంస్థ ప్రకారం పాము కరిచినప్పుడు తాడు కట్టడం, గాటు పెట్టడం వంటివి చేయాలి
డి) బెణికిన గాయంపై గట్టిగా ఆయింట్మెంట్తో రుద్దకూడదు
10. కాలిన గాయాలకు ఎటువంటి చర్యలు చేపట్టాలి?
1. కాలిన బొబ్బలను చిదపొద్దు
2. బ్యాండేజ్‌తో కట్టు కట్టొద్దు
3. గాయాల్ని నీటితో కడగాలి
4. గాయాలపై ఐస్ పెట్టొద్దు
ఎ) 1, 2, 3, 4 బి) 1, 3, 4
సి) 1, 2, 3 డి) 2, 3, 4
11. పక్షవాతం ఎవరికి వచ్చే అవకాశం ఉంది?
ఎ) వడదెబ్బ తగిలినవారికి
బి) బీపీ ఉన్నవారికి
సి) పాముకాటుకు గురైనవారికి
డి) కరెంటు షాక్ కొట్టినవారికి
12. ఎలక్ట్రోల్, ఓఆర్ఎస్ ద్రావణం ఎవరికి ఇస్తారు?
ఎ) కుక్కకాటుకు గురైనవారికి
బి) ముక్కులో నుంచి రక్తస్రావమయ్యేవారికి
సి) విషపదార్థాలు తీసుకున్నవారికి
డి) వడదెబ్బ తగిలిన వారికి
13. సీపీఆర్ ప్రక్రియ దేని పనితీరును నిలబెడుతుంది?
ఎ) గుండె బి) కళ్లు
సి) మూత్రపిండం డి) మెదడు
14. ఉచిత అంబులెన్స్ సర్వీస్ ఫోన్ నంబర్?
ఎ) 100 బి) 101 సి) 104 డి) 108
15. అగ్నిమాపక దళం అత్యవసర ఫోన్ నంబర్?
ఎ) 100 బి) 101
సి) 102 డి) 103
జవాబులు
1.బి 2.సి 3.బి 4.బి
5.బి 6.బి 7.డి 8.బి
9.సి 10.ఎ 11.బి 12.డి
13.ఎ 14.డి 15.బి
ఎస్ అండ్ ఎస్ పబ్లికేషన్స్ సౌజన్యంతో
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు