Current Affairs June 07 | క్రీడలు
ప్రణయ్
భారత స్టార్ షట్లర్ హెచ్ఎస్ ప్రణయ్ మలేషియా బ్యాడ్మింటన్ టోర్నీ విజేతగా నిలిచాడు. కౌలాలంపూర్‌లో మే 28న జరిగిన బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ సూపర్-500 టోర్నీ పురుషుల సింగిల్స్ ఫైనల్లో ప్రణయ్ వెంగ్ హాంగ్ (చైనా)పై గెలిచాడు. ప్రణయ్‌కు ఆరేళ్ల తర్వాత ఇదే తొలి టైటిల్. 2017లో యూఎస్ ఓపెన్ గ్రాండ్ ప్రి టైటిల్‌ను సాధించాడు.
వెర్స్టాపెన్
ఫార్ములా వన్ ప్రపంచ చాంపియన్ మాక్స్ వెర్స్టాపెన్ మొనాకో గ్రాండ్ ప్రి (ఫ్రెంచ్: గ్రాండ్ ప్రిక్స్ డి మొనాకో) రేసులో విజేతగా నిలిచాడు. మే 28న జరిగిన ఈ రేసును గంటా 48 నిమిషాల 51.980 సెకన్లలో ముగించి ట్రోఫీని గెలుచుకున్నాడు. ఫెర్నాండో అలోన్సో , ఎస్తెబాన్ ఒకాన్ తర్వాతి స్థానాల్లో నిలిచారు. ఈ ఏడాది నాలుగు గ్రాండ్ ప్రిల్‌లో గెలిచిన వెర్స్టాపెన్ 144 పాయింట్లతో నంబర్ వన్‌గా కొనసాగుతున్నాడు.
సీఎం కప్ టోర్నీ
దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో తొలిసారి నిర్వహించిన సీఎం కప్-2023 మే 31న విజయవంతంగా ముగిసింది. మొత్తం 33 జిల్లాలకు చెందిన క్రీడాకారులు 18 క్రీడాంశాల్లో పాల్గొన్నారు. రాష్ట్ర క్రీడాకారులు జాతీయ, అంతర్జాతీయ స్థాయికి రాణించాలన్న ఉద్దేశంతో ఈ టోర్నీని నిర్వహించారు. ఈ టోర్నీలో పురుషుల విభాగంలో హైదరాబాద్ 89 పాయింట్లతో మొదటి స్థానంలో నిలువగా.. రంగారెడ్డి (56) 2, మేడ్చల్ మల్కాజిగిరి (41) 3వ స్థానాల్లో నిలిచాయి. మహిళల విభాగంలో రంగారెడ్డి 49 పాయింట్లతో మొదటి స్థానంలో నిలువగా.. హైదరాబాద్ (36) 2, మేడ్చల్ మల్కాజిగిరి (31) 3వ స్థానాల్లో నిలిచాయి. టీమ్ విజేతకు రూ.లక్ష, ద్వితీయ విజేతకు రూ.75 వేలు, తృతీయ విజేతకు రూ.50 వేల నగదు అందజేశారు.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు