Current Affairs | అంతర్జాతీయం
టిప్పు సుల్తాన్ తుపాకీ
మైసూర్ పాలకుడు టిప్పు సుల్తాన్ ఉపయోగించిన తుపాకీ ఎగుమతిపై నిషేధం విధిస్తున్నట్లు యూకే ఆర్ట్స్ అండ్ హెరిటేజ్ మినిస్టర్ లార్డ్ స్టీఫెన్ పార్కిన్సన్ మే 29న ప్రకటించారు. ఫ్లింట్లాక్ స్పోర్టింగ్ గన్ అని పిలిచే ఈ 14 బోర్ గన్ 1793-94 కాలానికి చెందింది. ఈ తుపాకీని తయారు చేసిన అసద్ ఖాన్ మహమ్మద్ సంతకం దీనిపై ఉంది. భారత్-బ్రిటిష్ సంబంధాలను అధ్యయనం చేయడానికి అరుదైన, విలువైన (సుమారు రూ.20 లక్షలు) ఈ తుపాకీ కీలకమని పార్కిన్సన్ పేర్కొన్నారు. దీన్ని జనరల్ లార్డ్ కార్న్ వాలిస్కు బహుమతిగా టిప్పు సుల్తాన్ ఇచ్చాడని తెలిపారు. టిప్పు సుల్తాన్ 1799, మే 4న చంపబడ్డాడు.
షెన్‌జౌ-16
చైనా మే 30న చేపట్టిన షెన్‌జౌ-16 మానవసహిత వ్యోమనౌక ప్రయోగం విజయవంతమయ్యింది. దీన్ని లాంగ్ మార్చ్-2ఎఫ్ రాకెట్ ద్వారా గోబీ ఎడారిలోని జియుక్వాన్ శాటిలైట్ లాంచ్ సెంటర్ నుంచి ప్రయోగించారు. ఈ వ్యోమనౌక ‘తియాంగాంగ్’ అంతరిక్ష కేంద్రంలోని కోర్ మాడ్యూల్ ‘తియాన్హే’తో అనుసంధానమైంది. నలుగురు వ్యోమగాముల్లో తొలిసారి ‘గుయ్ హైచావో’ అనే పౌరుడిని రోదసిలోకి చైనా పంపించింది.
ఎడిన్బర్గ్లో హిందీ
స్కాట్లాండ్కు చెందిన యూనివర్సిటీ ఆఫ్ ఎడిన్బర్గ్ తొలిసారి హిందీలో ఓ ఓపెన్ యాక్సెస్ కోర్సును ప్రారంభించింది. ‘ది ైక్లెమేట్ సొల్యూషన్స్’ కోర్సును ఇంగ్లిష్, అరబిక్‌తో పాటు హిందీలో అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ కోర్సును భారత కాన్సులేట్ కార్యాలయం భాగస్వామ్యంతో రూపొందించినట్లు ఎడిన్బర్గ్ ైక్లెమేట్ చేంజ్ ఇన్స్టిట్యూట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ప్రొఫెసర్ డేవ్ రే మే 30న వెల్లడించారు.
స్పై శాటిలైట్
దక్షిణ కొరియాపై నిరంతరం నిఘా పెట్టేలా ఉత్తర కొరియా మే 31న చేపట్టిన తొలి స్పై (గూఢచర్య) శాటిలైట్ ప్రయోగం విఫలమయ్యింది. తొలి రెండు దశలు కూడా పూర్తి కాకుండానే రాకెట్, శాటిలైట్ వైఫల్యం చెందాయి. దీంతో కొరియా ద్వీపకల్పంలోని సముద్ర జలాల్లో వీటి శకలాలు కూలాయి. ఆ నిఘా శాటిలైట్‌తో అమెరికా, దక్షిణ కొరియా సైనిక కార్యకలాపాలపై దృష్టి పెట్టాలని దేశాధ్యక్షుడు కిమ్ భావించారు.
11వ వర్క్ రిపోర్ట్
ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ (ఐఎల్వో) 11వ వరల్డ్ ఆఫ్ వర్క్ రిపోర్ట్‌ను మే 31న విడుదల చేసింది. ప్రపంచ నిరుద్యోగిత రేటు కరోనా కంటే ముందు ఉన్న స్థాయుల కంటే తక్కువగా పడిపోతుందని అంచనా వేసింది. ఇది 5.3 శాతానికి (191 మిలియన్లకు) పడిపోతుందని, తక్కువ ఆదాయ దేశాలు పునరుద్ధరణ ప్రక్రియలో చాలా వెనుకబడి ఉండవచ్చునని వెల్లడించింది.
బ్రిక్స్ సమావేశం
బ్రిక్స్ (బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌతాఫ్రికా) విదేశాంగ మంత్రుల సమావేశం కేప్‌టౌన్‌లో జూన్ 1, 2 తేదీల్లో నిర్వహించారు. స్థానిక కరెన్సీలో వ్యాపారం, రష్యా-ఉక్రెయిన్ మధ్య కొనసాగుతున్న సంఘర్షణకు శాంతి ప్రణాళికతో సహా పలు అంశాలపై చర్చించారు. బ్రిక్స్ దేశాల జనాభా ప్రపంచ జనాభాలో 42 శాతం ఉంది. ప్రపంచ జీడీపీలో 23 శాతం ఉంది. 2014లో బ్రిక్స్ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్‌ను స్థాపించింది. బ్రిక్స్ దేశాలు కంటింజెంట్ రిజర్వ్ అరేంజ్మెంట్ (సీఆర్ఏ)ను 2014లో ఏర్పాటు చేశాయి. ఇది సంక్షోభ సమయాల్లో ఆర్థిక సాయం కోసం పరస్పర మద్దతు కోసం ఫ్రేమ్‌వర్క్‌గా ఉపయోగపడుతుంది.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు