Basara IIIT Admission 2023 | బాసర ఐఐఐటీలో ఇంటిగ్రేటెడ్ బీటెక్
IIIT Basara | బాసరలోని రాజీవ్‌గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ (ఆర్జీయూకేటీ) పరిధిలోని ఐఐఐటీలో ఆరేండ్ల ఇంటిగ్రేటెడ్ బీటెక్ ప్రవేశాల కోసం ప్రకటన విడుదలైంది.
కోర్సు: ఇంటిగ్రేటెడ్ బీటెక్
కోర్సు కాలవ్యవధి: ఆరేండ్లు. దీనిలో రెండేండ్లు ఇంటర్, తర్వాత నాలుగేండ్లు బీటెక్ కోర్సు ఇంటర్ (ప్రి యూనివర్సిటీ కోర్సు)-ఎంపీసీని సంస్థ ఆఫర్ చేస్తుంది. దీనిలో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇంగ్లిష్, తెలుగు/సంస్కృతం, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎన్విరాన్మెంటల్ సైన్స్
బీటెక్: నాలుగేండ్ల బీటెక్‌లో కింది బ్రాంచీలున్నాయి.
1. కెమికల్ ఇంజినీరింగ్
2. సివిల్ ఇంజినీరింగ్
3. కంప్యూటర్ సైన్స్ & ఇంజినీరింగ్
4. ఎలక్ట్రానిక్స్& కమ్యూనికేషన్స్ ఇంజినీరింగ్
5. ఎలక్ట్రికల్&ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్
6. మెకానికల్ ఇంజినీరింగ్
7. మెటలర్జికల్ & మెటీరియల్ ఇంజినీరింగ్
- మొత్తం సీట్ల సంఖ్య: 1650 (యూనివర్సిటీలోని 1500 సీట్లకు అదనంగా ఈడబ్ల్యూఎస్ కోటాలో 150 భర్తీ చేస్తారు)
- అర్హతలు: ఈ ఏడాది పదోతరగతి ఉత్తీర్ణులైన వారు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.
- వయస్సు: ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు అయితే 21 ఏండ్ల లోపు, మిగిలినవారు అయితే 18 ఏండ్ల లోపు ఉండాలి.
- ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన వారికి పదోతరగతి గ్రేడ్‌కు 0.40 మార్కులు అదనంగా కలుపుతారు.
ముఖ్యతేదీలు - దరఖాస్తు: ఆన్లైన్లో
- చివరితేదీ: జూన్ 19
- ఎంపికైన వారి జాబితా వెల్లడి: జూన్ 26
- వెబ్సైట్: https://www.rgukt.ac.in/ admissions2023.html
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు






