Disaster Management | మనకు మాత్రమే కాదు.. భావి తరాలకు సొంతమే
సుస్థిరాభివృద్ధి
- సుస్థిరాభివృద్ధి అంటే భవిష్యత్తు తరాలు తమ అవసరాలను తీర్చుకొనే సామర్థ్యాన్ని దెబ్బతీయకుండా ప్రస్తుత తరాల
అవసరాలను తీర్చుకోవడం.
సుస్థిరాభివృద్ధి అందరికీ
- ప్రస్తుత, భవిష్యత్ తరాలకు నాణ్యమైన జీవనాన్ని అందించాలి.
- ప్రస్తుత తరం వారు ప్రకృతిని అతిగా వినియోగించడం వల్ల రాబోయే తరాల వారి జీవన విధానం ప్రశ్నార్థకంగా మారుతుంది.
- ప్రారిశ్రామిక విప్లవం, హరిత విప్లవం, నీలి విప్లవం వంటివి అటవీ విస్తీర్ణం తరుగుదలకు, అధిక ప్రకృతి వినియోగానికి, కాలుష్యానికి కారణమని చెప్పవచ్చు.
- 19వ శతాబ్దం నుంచి భూమి చాలా వేగంగా వేడెక్కుతుంది. ఇది వినాశకర మార్పులకు దారి తీయవచ్చు.
- టండ్రా ప్రాంతాల నుంచి వాతావరణంలోకి విడుదలవుతున్న మీథేన్ వాయువు భూమిపై ఉష్ణోగ్రతలు పెరగడానికి కారణమవుతుంది.
- హరితగృహ వాయువు, కార్బన్ డై ఆక్సైడ్ కంటే మీథేన్ వాయువు భూమిపై ప్రమాదకరమైన వాయువు.
పర్యావరణ వనరుల సరఫరా విధి (Environment Source Function)
- ఆర్థిక వ్యవస్థలోని వివిధ రంగాలు వివిధ స్థాయుల్లో సహజవనరుల మీద ఆధారపడి ఉన్నాయి. ఈ వనరులను అందించడంలో పర్యావరణ సామర్థ్యాన్ని ‘పర్యావరణ వనరుల సరఫరా విధి’ అంటారు.
- వనరులను వినియోగిస్తూ ఉండటం వల్ల, లేదా అవి కాలుష్యానికి గురికావడం వల్ల పర్యావరణ వనరుల సరఫరా విధి సామర్థ్యం తగ్గుతుంది.
- పర్యావరణం నిర్వహించే మరొక విధి కార్యక్రమాల ద్వారా వాతావరణంలోకి లేదా భూమిపై విడుదలయ్యే వ్యర్థాలను శుద్ధి చేసి ప్రమాద రహితంగా చేయడం.
- ఉత్పత్తి, వినియోగాల్లో నిరుపయోగమైన ఉత్పత్తులు ఉదా. ఇంజన్ల నుంచి వెలువడే పొగ, శుభ్రం చేయడానికి ఉపయోగించిన నీళ్లు, పనికిరాని అట్టపెట్టెలు, వస్తువులు వంటి వాటిని పర్యావరణం శుభ్రం చేస్తుంది.
- కాలుష్యాన్ని పర్యావరణం గ్రహించి ప్రమాద రహితంగా మార్చే శక్తిని ‘ఎన్విరాన్మెంట్ సింక్ ఫంక్షన్’ లేదా ‘శుద్ధి చేసే విధి’ అంటారు.
పర్యావరణం విధులు
1. పర్యావరణ వనరుల సరఫరా
2. శుద్ధి చేయడం - గత 50 సంవత్సరాల అభివృద్ధిలో పర్యావరణం రెండు విధులను పరిమితికి మించి ఉపయోగించారు. దీని కారణంగా భవిష్యత్తులో ఆర్థిక ఉత్పత్తి, వినియోగాలకు మద్దతు ఇవ్వగల సామర్థ్యాన్ని పర్యావరణం కోల్పోయింది.
హరిత విప్లవం – పర్యావరణంపై ప్రభావం - వ్యవసాయరంగం అనేక మార్పులకు కారణమైన విప్లవం హరిత విప్లవం
- హరిత విప్లవాన్ని మొదట ప్రవేశపెట్టిన ఉత్తరాది రాష్ర్టాలైన పంజాబ్, హర్యానా, పశ్చిమ ఉత్తర ప్రదేశాల్లో నీటి సమస్యలు
ఉత్పన్నమయ్యాయి. - ఎక్కువ మోతాదులో బోరుబావులు తవ్వడం వల్ల భూగర్భ జలమట్టం వేగంగా పడిపోయింది.
- పంజాబ్‌లోని 12 జిల్లాల్లో 9 జిల్లాలు, హర్యానాలోని 10 జిల్లాలు భూగర్భ జల సమస్యను ఎదుర్కొంటున్నాయి.
- భారతదేశంలోని 59 శాతం జిల్లాల్లో చేతిపంపుల్లోని నీళ్లు తాగడానికి పనికిరావు.
- ఆధునిక వ్యవసాయ పద్ధతుల్లో మితిమీరిన రసాయన ఎరువులు వినియోగించడం వల్ల పర్యావరణంతో పాటు పక్షులు, జంతువులు కూడా అనారోగ్యంతో చనిపోతాయి.
ఎండోసల్ఫాన్(Endosulfan) వాడకం నిషేధం
- కేరళలోని ఉత్తర ప్రాంతమైన ‘కాసర్ గోడ్’ జిల్లాలో ఎండోసల్ఫాన్ అనే రసాయనిక పురుగుమందు వాడకాన్ని న్యాయస్థానం నిషేధించింది.
- 1976లో జీడిమామిడి తోటలను పురుగు నుంచి రక్షించడానికి కేరళ రాష్ట్ర ప్రభుత్వం హెలికాప్టర్లలో 1500 ఎకరాల్లో ఈ పురుగు మందును పిచికారీ చేయించింది.
- 25 సంవత్సరాల పాటు ఈ కార్యక్రమం కొనసాగింది. దీని వల్ల గాలి, నీరు,
పర్యావరణం కలుషితమయ్యాయి. - ఎండోసల్ఫాన్ ఉపయోగం వల్ల వ్యవసాయ కూలీలకు అవయవాలు దెబ్బతినడం, క్యాన్సర్ వంటి రోగాలు సోకాయి.
- దీని కారణంగా ఎండోసల్ఫాన్ ఉపయోగాన్ని కేరళ న్యాయస్థానం నిషేధించింది.
- ఎండోసల్ఫాన్ వినియోగం వల్ల రాజ్యాంగంలోని 21వ అధికరణానికి అంటే జీవించే హక్కుకు భంగం కలిగిందని న్యాయస్థానం పేర్కొంది.
రాబందులు అంతరించడానికి కారణం
- పశువుల చికిత్సలో డైక్లోఫినాక్ అనే మందును ఉపయోగిస్తున్నారు. పశువుల మరణానంతరం కూడా ఈ రసాయనం వాటి శరీరంలో ఉండిపోతుంది.
- ఈ చనిపోయిన పశువుల మాంసాన్ని రాబందులు తిన్నప్పుడు వాటి మూత్రపిండాలు పనిచేయకుండా పోయి వారం, పది రోజుల్లో మరణిస్తాయి.
- చుట్టు పక్కల గ్రామాలు, పట్టణాల నుంచి కొల్లేరు సరస్సులోకి ప్రతిరోజూ 13-15 టన్నుల పారిశ్రామిక వ్యర్థాలు, మురుగు నీరు చేరి సరస్సును కలుషితం చేస్తున్నాయి.
- సెల్ టవర్స్ విడుదల చేసే రేడియేషన్ వల్ల తేనెటీగల సంఖ్య తగ్గిపోతుంది. దీనివల్ల తేనె దిగుబడి మాత్రమే కాకుండా పరపరాగ సంపర్కం తగ్గి, పంటల దిగుబడి కూడా తగ్గిపోతుంది.
సమానతతో కూడిన సుస్థిరాభివృద్ధి
- భారతదేశం వంటి అభివృద్ధి చెందుతున్న దేశాలు పేదరికం కారణంగా తమ ఆర్థికాభివృద్ధి తరువాత వనరులను పునరుద్ధరించడమో లేదా పర్యావరణాన్ని శుద్ధి చేయవచ్చునని భావించి ఉంటాయి.
- రోడ్ల నిర్మాణం, పరిశ్రమల ఏర్పాటు, గనుల తవ్వకం, వ్యవసాయ భూముల కోసం అడవుల విస్తీర్ణాన్ని తగ్గించడం జరిగింది.
- ఎక్కువ మోతాదులో నీటి వినియోగం, వాహనాల నుంచి వెలువడే కార్బన్ డై ఆక్సైడ్, పరిశ్రమల నుంచి విడుదలయ్యే వ్యర్థాల కారణంగా పర్యావరణం క్షీణించింది.
పర్యావరణాన్ని కాపాడడానికి చేపడుతున్న చర్యలు
- 1991లో రాజ్యాంగంలోని జీవించే హక్కుతో జీవితాన్ని పూర్తిగా ఆనందించడానికి కాలుష్యరహిత నీటిని, గాలిని పొందే హక్కు అందరికి ఉంటుందని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది.
- ప్రజారవాణా వాహనాలన్నీ డీజిల్ నుంచి సీఎన్జీకి మారాలని 1998లో సుప్రీంకోర్డు తీర్పునిచ్చింది.
1. సీఎన్జీ – కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్
2. సీఎన్జీ ఉపయోగం వల్ల ఢిల్లీలో కాలుష్యం బాగా తగ్గింది. - కాలుష్యాన్ని అరికట్టడానికి అనువైన చట్టాలు, విధానాలను రూపొందించే బాధ్యత ప్రభుత్వాలది.
3. వాతావరణంలో మార్పు వంటి అంశాలను ఉమ్మడిగా పరిష్కరించడానికి వివిధ దేశాలు ప్రయత్నిస్తున్నాయి.
IPCC – Inter-Governmental Panel on Climate Change - 1988లో ప్రారంభమైంది. దీని ప్రధాన కార్యాలయం జెనీవాలో ఉంది.
- మానవుల కారణంగా భూమి వేడెక్కడాన్ని తగ్గించడానికి, వాతావరణ మార్పు వేగాన్ని తగ్గించడానికి ఐపీసీసీ ప్రయత్నిస్తుంది.
- సేంద్రీయ వ్యవసాయం ద్వారా కాలుష్యాన్ని తగ్గించవచ్చు.
- సేంద్రీయ వ్యవసాయ ముఖ్య లక్షణం స్థానిక వనరులను వినియోగించడం, రసాయనిక ఎరువులను, పురుగు మందులను ఉపయోగించక పోవడం
- 2015 నాటికి సేంద్రీయ వ్యవసాయానికి మారాలని నిర్ణయించుకున్న మొదటి రాష్ట్ర ప్రభుత్వం సిక్కిం.
- 100 శాతం సేంద్రీయ రాష్ట్రంగా మారే పంథాని ఉత్తరాఖండ్ అనుసరిస్తుంది.
- పర్యావరణ కాలుష్యం వల్ల పక్షులు, జంతువులు, అటవీ క్షీణత వల్ల కొన్ని ఆటవిక జాతులు, వారి ఆచారాలు కనుమరుగవుతున్నాయి.
- 2013లో ప్రచురించిన ‘వాళ్లు అంతరించిపోయే ముందు’ (బిఫోర్ దే పాస్ అవే) అనే బొమ్మల పుస్తకంలో అంతరించిపోయే ప్రమాదమున్న సంచార జాతులను రచయిత గుర్తించారు.
- ‘బిఫోర్ దే పాస్ అవే’ పుస్తక రచయిత జిమ్మీ నీల్సన్
- జిమ్మీ నీల్సన్ గుర్తించిన అంతరించిపోతున్న కొన్ని ఆటవిక తెగలు
1. కెన్యాలోని ముస్సాయి యోధులు
2. దక్షిణ అమెరికాలోని గౌచో తెగ
3. కజకిస్థాన్‌కు చెందిన యుర్తా తెగ
4. టిబెట్‌లోని కిమాంగ్ గిరిజనులు
పర్యావరణ ఉద్యమాలు - పర్యావరణాన్ని సహజ పెట్టుబడి అని కూడా అంటారు. కావున దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిది.
- పర్యావరణాన్ని కాపాడటానికి జరిగిన ఉద్యమాల్లో చిప్కో ఉద్యమం, నర్మదా బచావో ఉద్యమం, గ్రీన్ పీస్ ఉద్యమం, సైలెంట్ వ్యాలీలో ఉద్యమం ముఖ్యమైనవి.
చిప్కో ఉద్యమం - 1973లో సుందర్‌లాల్ బహుగుణ ప్రారంభించారు
- ‘చిప్కో’ అంటే హత్తుకోవడం అని అర్థం
- పారిశ్రామికవేత్తల బారి నుంచి అడవులను కాపాడటానికి ‘రేనీ’ గ్రామ మహిళలు అధిక సంఖ్యలో ఈ ఉద్యమంలో పాల్గొన్నారు.
- ఈ ఉద్యమం ఉత్తరాఖండ్ గఢ్వాల్ కొండల్లో ప్రారంభమైంది.
చిప్కో ఉద్యమ నినాదం - Food, Fodder, Fuel, Fiber, Fertilizer
నర్మదా బచావో ఆందోళన్ - నర్మద నదిపై నిర్మించాలనుకున్న ప్రాజెక్టులకు వ్యతిరేకంగా ప్రారంభమైన ఉద్యమం.
- ఈ ఆందోళనను చేపట్టినది మేథా పాట్కర్
నర్మదా బచావో ఉద్యమ ధోరణులు - మూలవాస్ ప్రజల ఉద్యమం
- నయా-ఉదారవాద విధానాలకు వ్యతిరేక ఉద్యమం
- పట్టణీకరణకు ఆనకట్టలు, పరిశ్రమలు, గనులు వంటి వాటి కోసం భూములు లాక్కోబడుతున్న నేపథ్యంలో తేమ భూములను కాపాడుకోవటానికి రైతులు చేపట్టిన ఉద్యమాల వంటివి.
ఈ ఆందోళన – డిమాండ్లు - ప్రాజెక్టు నిర్మాణం వల్ల నిర్వాసితులయ్యే ప్రజలు కేవలం భూములున్న వారికే కాకుండా, అక్కడ నివసిస్తున్న వారందరికి న్యాయమైన నష్టపరిహారం చెల్లించాలి.
- ఆనకట్ట వల్ల ముంపునకు గురైన అడవులకు బదులుగా అటవీ పెంపకాన్ని చేపట్టాలి.
- భూమిని కోల్పోయిన వారికి వేరొకచోట యోగ్యమైన భూములివ్వాలి.
- సరైన పునరావాసం కల్పించాలి.
ఫలితాలు - ఈ ప్రాజెక్టు నిర్మాణానికి అవసరమైన డబ్బును ప్రపంచ బ్యాంకు నుంచి అప్పుగా సమకూర్చుకోవాలనుకున్నారు.
- అయితే ఈ ఉద్యమాలు, నిరాహారదీక్షల తర్వాత ప్రపంచబ్యాంకు నిధులు సమకూర్చవద్దని నిర్ణయించుకుంది.
- అభివృద్ధి కార్యకలాపాల వల్ల నిర్వాసితులైన ప్రజలకు తగినంత, గౌరవప్రదమైన నష్టపరిహారం చెల్లించే దిశగా ప్రభుత్వం ఆలోచించేలా చేసింది.
గ్రీన్‌పీస్ ఉద్యమం - అలస్కా దగ్గర సముద్ర గర్భంలో అమెరికా 1971లో చేపట్టిన అణుపరీక్షలకు వ్యతిరేకంగా ఈ ఉద్యమం మొదలయ్యింది.
- అణుపరీక్షలకు వ్యతిరేకంగా నిరసన తెలియజేయడానికి స్వచ్ఛంద కార్యకర్తలు ప్రయోగ ప్రదేశానికి బయల్దేరిన పడవ పేరు ‘గ్రీన్‌పీస్’.
- సుస్థిరాభివృద్ధి భావనను వెలుగులోకి తెచ్చిన ఉద్యమం గ్రీన్‌పీస్ ఉద్యమం
- ప్రస్తుతం ఇది 40 దేశాల్లో విస్తరించి ఉంది. దీని ప్రధాన కార్యాలయం ‘ఆమ్స్టర్ డ్యాం’
నిశ్శబ్ద వసంతం
- దోమల నియంత్రణ కోసం డీడీటీ పిచికారీ చేయడం వల్ల మనుషులపై, పక్షులపై పడే ప్రభావం గురించి ‘రాచెల్ కార్సన్’ అనే మహిళ 1962లో ‘సైలెంట్ స్ప్రింగ్’ అనే పుస్తకం రచించారు.
- దోమల వంటి పురుగులు డి.డి.టి.కి త్వరగా నిరోధక శక్తిని పెంచుకుంటాయని కార్సన్ వివరించారు. డీడీటీ అంటే Dichloro Diphenyl Trichloroethane
వెంకట్
విషయ నిపుణులు,
ఏకేఆర్ స్టడీ సర్కిల్
Previous article
TSPSC JL & DL Special | Inspiration – Expiration – Respiration
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు