JEE (Advanced) 2023 | జూన్ 4న జేఈఈ అడ్వాన్స్డ్.. అడ్మిట్ కార్డులు విడుదల
JEE (Advanced) 2023 | న్యూఢిల్లీ: దేశంలోని ప్రతిష్ఠాత్మకమైన ఐఐటీల్లో (IIT) ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలు కల్పించేందుకు నిర్వహించే జేఈఈ అడ్వాన్స్డ్ (JEE Advanced) పరీక్ష వచ్చే నెల 4న జరుగనుంది. ఈ ప్రవేశపరీక్షకు సంబంధించిన అడ్మిట్ కార్డులను (Admit cards) ఐఐటీ గువాహటి (IIT Guwahati) విడుదల చేసింది. అధికార వెబ్సైట్ www.jeeadv.ac.in.లో అడ్మిట్ కార్డులను డౌన్లోడ్ చేసుకోవచ్చని తెలిపింది. జూన్ 4 వరకు (June 4) అవి అందుబాటులో ఉంటాయని పేర్కొంది.
ఈ ప్రవేశ పరీక్షను (Examination) జూన్ 4న రెండు సెషన్లలో నిర్వహిస్తారు. మొదటి సెషన్ ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, రెండో షిఫ్ట్ మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు ఉంటుంది. ఈ పరీక్షకోసం దేశవ్యాప్తంగా దాదాపు 1.9 లక్షల మంది విద్యార్థులు రిజిస్టర్ చేసుకున్నారు. వారిలో 1.46 లక్షల మంది అబ్బాయిలు ఉండగా, 44 వేల మంది బాలికలు ఉన్నారు.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు