TS EAMCET | టీఎస్ ఎంసెట్ -2023 కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల
TS EAMCET | హైదరాబాద్ : టీఎస్ ఎంసెట్ -2023 కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదలైంది. ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎంసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను ఖరారు చేశారు. ఈ కౌన్సెలింగ్ ద్వారా ఇంజినీరింగ్, అగ్రికల్చర్, మెడికల్ కోర్సుల్లో ప్రవేశాలు చేపట్టనున్నారు. ఇప్పటికే ఎంసెట్ ఫలితాలు విడుదలైన సంగతి తెలిసిందే. ఫస్ట్ ఫేజ్ కౌన్సెలింగ్ జూన్ 26 నుంచి జులై 19వ తేదీ వరకు కొనసాగనుంది.
ఫస్ట్ ఫేజ్ కౌన్సెలింగ్ షెడ్యూల్
- జూన్ 26 – ఆన్లైన్లో బేసిక్ ఇన్ఫర్మేషన్ నింపాలి. ప్రాసెసింగ్ ఫీజు చెల్లించి, స్లాట్ బుక్ చేసుకోవాలి. సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు సంబంధించి తేదీ, సమయం ఎంచుకోవాల్సి ఉంటుంది.
- జూన్ 28 – జులై 7 – స్లాట్ బుక్ చేసుకున్న విద్యార్థులు ఈ తేదీల మధ్యలో సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు హాజరు కావాల్సి ఉంటుంది.
- జూన్ 28 – జులై 8 – సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తయిన విద్యార్థులు కోర్సులు, కాలేజీల ఆప్షన్స్ ఎంచుకోవాల్సి ఉంటుంది.
- జులై 8 – ఆప్షన్స్‌ను ఫ్రీజింగ్ చేసుకోవాలి.
- జులై 12 – సీట్ల కేటాయింపు.
- జులై 12 – 19 – సీట్లు పొందిన విద్యార్థులు ఈ తేదీల మధ్యలో ట్యూషన్ ఫీజు చెల్లించి, వెబ్ సైట్ ద్వారా సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది.
సెకండ్ ఫేజ్ కౌన్సెలింగ్ షెడ్యూల్
- జులై 21 – 27 – ఆన్లైన్లో బేసిక్ ఇన్ఫర్మేషన్ నింపాలి. ప్రాసెసింగ్ ఫీజు చెల్లించి, స్లాట్ బుక్ చేసుకోవాలి. సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు సంబంధించి తేదీ, సమయం ఎంచుకోవాల్సి ఉంటుంది(ఫస్ట్ ఫేజ్‌లో ఈ వివరాలు నింపని విద్యార్థులు మాత్రమే).
- జులై 23 – స్లాట్ బుక్ చేసుకున్న విద్యార్థులు ఈ తేదీల మధ్యలో సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు హాజరు కావాల్సి ఉంటుంది.
- జులై 21 – జులై 24 – సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తయిన విద్యార్థులు కోర్సులు, కాలేజీల ఆప్షన్స్ ఎంచుకోవాల్సి ఉంటుంది.
- జులై 24 – ఆప్షన్స్‌ను ఫ్రీజింగ్ చేసుకోవాలి.
- జులై 28 – సీట్ల కేటాయింపు
- జులై 28 – 31 – సీట్లు పొందిన విద్యార్థులు ఈ తేదీల మధ్యలో ట్యూషన్ ఫీజు చెల్లించి, వెబ్ సైట్ ద్వారా సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది.
ఫైనల్ ఫేజ్ కౌన్సెలింగ్ షెడ్యూల్
- ఆగస్టు 2- ఆన్లైన్లో బేసిక్ ఇన్ఫర్మేషన్ నింపాలి. ప్రాసెసింగ్ ఫీజు చెల్లించి, స్లాట్ బుక్ చేసుకోవాలి. సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు సంబంధించి తేదీ, సమయం ఎంచుకోవాల్సి ఉంటుంది(ఫస్ట్, సెకండ్ ఫేజ్‌లో ఈ వివరాలు నింపని విద్యార్థులు మాత్రమే).
- ఆగస్టు 3 – స్లాట్ బుక్ చేసుకున్న విద్యార్థులు ఈ తేదీల మధ్యలో సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు హాజరు కావాల్సి ఉంటుంది.
- ఆగస్టు 2 – ఆగస్టు 4 – సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తయిన విద్యార్థులు కోర్సులు, కాలేజీల ఆప్షన్స్ ఎంచుకోవాల్సి ఉంటుంది.
- ఆగస్టు 4 – ఆప్షన్స్‌ను ఫ్రీజింగ్ చేసుకోవాలి.
- ఆగస్టు 7 – సీట్ల కేటాయింపు.
- ఆగస్టు 7 – ఆగస్టు 9 – సీట్లు పొందిన విద్యార్థులు ఈ తేదీల మధ్యలో ట్యూషన్ ఫీజు చెల్లించి, వెబ్ సైట్ ద్వారా సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది.
Previous article
Current Affairs | దేశంలో అతిపెద్ద అక్వేరియం ఏ నగరంలో రానుంది?
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు