Natural Hazards & Disasters | ఏ రకం భూకంపాల వల్ల ఎక్కువ నష్టం జరుగుతుంది?
విపత్తు నిర్వహణ
1. మాన చిత్రం(మ్యాప్)పై భూకంప తీవ్రతగల ప్రాంతాలను కలిపే రేఖలను ఏమంటారు?
1) ఐసోలైన్స్ 2) ఐసో క్వేక్స్
3) ఐసో నేసిమల్స్ 4) ఐసో హెల్స్
2. బంగాళాఖాతంలో తుఫానులు సాధారణంగా ఏ దిశలో పయనిస్తాయి?
1) పడమర, వాయవ్యం లేదా ఉత్తరం
2) పడమర, వాయవ్యం లేదా దక్షిణం
3) వాయవ్యం, ఉత్తరం లేదా ఆగ్నేయం
4) వాయవ్యం, నైరుతి లేదా ఉత్తరం
3. కిందివాటిలో ఏ విపత్తు తరచుగా సంభవిస్తుంటుంది?
1) కరువు 2) వరదలు
3) భూకంపాలు 4) అంటు వ్యాధులు
4. కిందివాటిలో ఏది అతి త్వరితంగా సంభవించే విపత్తు?
1) కరువు 2) పర్యావరణ క్షీణత
3) తుఫాను 4) చీడపీడలు
5. విపత్తు ప్రభావాన్ని ఇలా తగ్గించవచ్చు?
1) తీసుకోవలసిన చర్యలపై ప్రజలకు తగిన శిక్షణ ఇవ్వడం ద్వారా
2) అగ్ని ప్రమాదం అలారం వ్యవస్థను ఏర్పాటు చేయడం ద్వారా
3) విపత్తు గురించి ముందస్తుగా హెచ్చరించేట్లు పెంపుడు జంతువులకు శిక్షణ ఇవ్వటం
4) ప్రార్థనలు చేయడం
6. రాలేగావ్‌సిద్ధిలో నిరంతర కరువు తీవ్రతను ఏ విధంగా తగ్గించగలిగారు?
1) రాజకీయ ప్రయత్నాల ద్వారా
2) ప్రజా సమూహ ప్రయత్నాల ద్వారా
3) ఉద్యమాల ద్వారా
4) బోర్వెల్ల తవ్వకం ద్వారా
7. తీవ్రత తగ్గించే వ్యూహం ఎప్పుడు పనిచేయదు?
1) అన్ని విపత్తులకు ఒకే వ్యూహాన్ని రూపొందించినప్పుడు
2) త్వరితంగా కోలుకోవడానికి
3) ప్రాణనష్టం జరిగినప్పుడు
4) ఆర్థిక ప్రభావాన్ని తగ్గించుకోవడానికి
8. కరువు నిర్వహణకు సంబంధించిన నోడల్ మంత్రిత్వశాఖ ఏది?
1) హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ
2) ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
3) వ్యవసాయ మంత్రిత్వ శాఖ
4) విపత్తు నిర్వహణ మంత్రిత్వశాఖ
9. ఒక అంటువ్యాధి ప్రబలి ప్రజారోగ్యాన్ని బాగా దెబ్బతీసి ఆర్థిక సేవలు, వ్యాపారాలను అస్తవ్యస్తం చేసి, అధిక ఆర్థిక ప్రమాణిక నష్టాన్ని తెస్తే ఆ విపత్తును, విపత్తు పరిభాషలో ఏరకమైనదిగా పరిగణిస్తారు?
1) ప్రకృతి వైపరీత్యం
2) పర్యావరణ అత్యవసర స్థితి
3) సంక్లిష్ట అత్యవసర స్థితి
4) అంటువ్యాధి అత్యవసర స్థితి
10. భూతాపం వల్ల భారత్‌లో రుతుపవనాలు?
1) విధ్వంసం సృష్టిస్తాయి, ముందస్తు సూచనకు అందవు
2) బాగుంటాయి, ముందస్తు సూచన ప్రకారమే ఉంటాయి
3) ఏ మార్పు ఉండదు
4) ఊహించడం అప్పుడే సాధ్యంకాదు
11. విపత్తు నిర్వహణలో ప్రజలు అమలు చేయగలిగే ఒక ఆదర్శ ,ఆకస్మిక ప్రణాళికలో ఏముండాలి?
1) సాంకేతిక వివరణతో కూడిన ఒక శాస్త్రీయ పద్ధతి
2) ఫ్లో పటంతో కూడిన ఒక కంప్యూటర్ నమూనా
3) సరళమైన భాషలో ఉండి ప్రాథమిక సమాచారం, దళాలవారీగా చేయాల్సిన పనులుండాలి
4) మెడికల్ క్యాంపులు, తాత్కాలిక నివాసాలు ఏర్పాటు చేయడం
12. పిడుగుపాటు సంభవిస్తుందని అనుమానంగా ఉన్నప్పుడు ఏమి చేయాలి?
1) వీలైనంత దూరంగా పరుగెత్తాలి
2) ఎక్కడ ఉంటే అక్కడే ఉండాలి
3) చెట్ల కింద రక్షణ తీసుకోవాలి
4) చెట్ల కింద నిలబడొద్దు
13. అంటువ్యాధుల నిర్వహణకు సంబంధించి కేంద్ర నోడల్ మంత్రిత్వశాఖ ఏది?
1) ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ
2) నీటివనరుల శాఖ
3) జీవ సాంకేతిక విభాగం
4) శాస్త్ర సాంకేతిక విభాగం
14. మట్టి పెళ్లలు, కొండచరియలు విరిగి పడటానికి మానవ కారకం ఏది?
1) సాంకేతికంగా చేసిన నిర్మాణం
2) భూ వినియోగ విధానం
3) నిటారైన వాలు 4) భూకంప సర్వే
15. భూకంపం సంభవించినప్పుడు ఏ విధమైన కట్టడాలకు హాని కలిగే అవకాశం తక్కువగా ఉంటుంది?
1) పెద్ద పెద్ద హాళ్లు, తక్కువ స్తంభాలున్న కట్టడాలు
2) పొడవైన / పెద్ద కిటికీలు, గోడలో ఖాళీలు స్తంభాలకు దగ్గరగా ఉన్న ఆర్.సి.సి.కట్టడాలు
3) చిన్న కిటికీలు, గోడలో ఖాళీలు స్తంభాలకు దూరంగా ఉన్న ఆర్సీసీ కట్టడాలు
4) నిర్మాణాకృతితో సంబంధం లేదు
16. 1999లో ఒడిశాను అతలాకుతలం చేసిన తీవ్ర తుఫాను సుమారు ఎంతవేగంతో వచ్చింది?
1) గంటకు 60 నుంచి 100 కి.మీ.
2) గంటకు 110 నుంచి 170 కి.మీ.
3) గంటకు 180 నుంచి 250 కి.మీ.
4) గంటకు 270 నుంచి 300 కి.మీ.
17. కిందివాటిలో ఏది సునామీ నుంచి రక్షించగలదు?
1) ఎత్తైన భవనం
2) బలమైన ప్రహరీ ఉన్న భవనం
3) మడ అడవి 4) లోయలు
18. తీరంపై నివసించే ప్రజలను తుఫానుల నుంచి ఏ విధంగా కాపాడవచ్చు?
1) వేగవంతమైన రవాణా సదుపాయాల ద్వారా
2) తుఫాను రక్షణ కేంద్రాల నిర్మాణం ద్వారా
3) స్పీడు బోటుల ద్వారా
4) పైవన్నీ సరైనవి
19. కొండచరియలు విరిగిపడటం ఎక్కడ సర్వసాధారణం?
1) దక్కన్ ప్రాంతం
2) పశ్చిమ కనుమలు
3) చంబల్ లోయ
4) హిమాలయ ప్రాంతం
20. భారత్‌లో సాధారణంగా అన్ని ప్రాంతాలను ప్రభావితం చేసే విపత్తు ఏది?
1) వరదలు 2) భూకంపాలు
3) క్షామం 4) తుఫానులు
21. విపత్తు నిర్వహణలో సాధారణంగా దేన్ని అనుసరిస్తారు?
1) భగవంతుని దయ
2) ధర్మం
3) సమయానుసారంగా వ్యవహరించడం
4) విపత్తు నిర్వహణ పద్ధతి
22. ఏ ప్రాంతాలు కొండచరియలు విరిగిపడి ప్రమాదాలకు ఎక్కువ గురయ్యే అవకాశం ఉంది?
1) పర్వతసానువులు
2) మట్టిలోయలు
3) సముద్ర తీరం 4) పీఠభూమి
23. కిందివాటిలో ఏది ఎక్కువ ప్రాణ నష్టం చేస్తుంది?
1) అవకతవకగా కట్టిన విశాల భవనం
2) ఎడారి మధ్యలో భూకంపం
3) సముద్ర గర్భంలో తుఫాను
4) దట్టమైన అడవిలో కొండచరియలు విరిగిపడటం
24. ఎన్డీఎంఏ అంటే?
1) నేచురల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ
2) నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ
3) నేషనల్ డిఫెన్స్ మేనేజ్మెంట్ ఏజెన్సీ
4) నేచురల్ డీప్ మౌంటెయిన్ అథారిటీ
25. జాతీయ విపత్తు నిర్వహణ ప్రణాళికను ఎప్పుడు విడుదల చేశారు?
1) మార్చి 2009 2) మే 2009
3) మే 2016 4) మార్చి 2016
26. సెండాయి ఫ్రేమ్‌వర్క్ అంటే ఏమిటి?
1) తుఫాను నిర్వహణ ఫ్రేమ్‌వర్క్
2) సునామీ సూచన నెట్వర్క్
3) వరద నిర్వహణ నెట్వర్క్
4) విపత్తు ప్రమాద తగ్గింపు ఫ్రేమ్‌వర్క్
27. సునామీ దేనివల్ల సంభవిస్తుంది?
1) చంద్రుని ఆకర్షణ వల్ల
2) జెట్ శబ్దం వల్ల
3) భూ పటలంలో కదలికల వల్ల
4) సూర్యునిలో మచ్చలవల్ల
28. కిందివాటిలో ఏది భూతాపం పెరగకుండా నిరోధించగలదు?
1) పబ్లిక్ రవాణా వ్యవస్థను వినియోగించడం
2) ఫ్రిజ్ వాడకపోవడం
3) అడవుల వృద్ధి
4) పైవన్నీ
29. భూకంప పరిమాణాన్ని కొలవడానికి ఏ మాపకం వాడతారు?
1) మెర్కాలి కొలబద్ద
2) రోస్పి -ఫెర్రెల్ కాలబద్ద
3) రిక్టర్ కొలబద్ద
4) మెర్కాటర్ కొలబద్ద
30. శబ్ద తరంగాలు ఏవి?
1) పి-తరంగాలు
2) ఎస్-తరంగాలు
3) ఎల్ -తరంగాలు 4) ఏవీకాదు
31. కేంద్ర వ్యవసాయ మంత్రిత్వశాఖ ప్రచురించిన కరువు నిర్వహణ కరదీపిక (మాన్యువల్)-2016 ప్రకారం ఎంత తక్కువ వార్షిక వర్షపాతం ఉంటే ఒక ప్రదేశాన్ని దీర్ఘకాలిక కరువుప్రాంతంగా పరిగణిస్తారు?
1) 450 మి.మీ 2) 500 మి.మీ
3) 750 మి.మీ 4) 900 మి.మీ
32. భారత ప్రభుత్వం దేశంలో కరువు పరిస్థితిని పరిశీలించడానికి ఏర్పాటు చేసిన ‘పంటవాతావరణ పరిశీలన బృందం’ ఉపయోగించే పరిమాణాల్లో (కొలబద్దల్లో) లేనిది ఏది?
1) వాతావరణ పరిమాణాలు
2) జలసంబంధ పరిమాణాలు
3) వ్యవసాయ పరిమాణాలు
4) భూగర్భ పరిమాణాలు
33. హిమాలయాల నుంచి ఆరాకాన్ యోమా వరకు గల ప్రాంతంలో భూకంపాలు రావడానికి కారణం?
ఎ) పసిఫిక్ భూపటలం, ఇండియన్ భూపటలం, టిబెటన్ భూపటలం ఢీ కొనడం
2) ఇండియన్ భూపటలం, టిబెటన్ భూపటలం ఢీ కొనడం
3) యూరేషియన్ భూపటలం, టిబెటన్ భూపటలం ఢీ కొనడం
4) గంగ, బ్రహ్మపుత్ర నదులపై ఆనకట్టలు నిర్మించడం
34. సునామీకి ప్రధాన కారణమైంది ఏది?
1) సముద్ర గర్భంలో భూ పగుళ్లు (ఫాల్డు) కదలికలు
2) సముద్ర గర్భంలో కొండచరియలు విరిగిపడటం
3) సముద్ర గర్భంలో అగ్నిపర్వత విస్ఫోటనం
4) సముద్ర గర్భంలో గనుల తవ్వకపు విస్ఫోటనం
35. తుఫాను సమయంలో ఇంటి పైకప్పుపై గాలి ఒత్తిడిని తగ్గించడానికి ఎలా నిర్మించాలి?
1) కురుమాడు పైకప్పు (గేబల్ ఎండెడ్)
2) హిప్ ఆకారపు పైకప్పు
3) పిరమిడ్ ఆకారపు పైకప్పు
4) చదునైన పైకప్పు
36. కరువు పరిస్థితి పరిశీలన, నిర్వహణను భారత ప్రభుత్వంలో ఏ నోడల్ మంత్రిత్వశాఖ నిర్వహిస్తుంది?
1) నీటివనరుల మంత్రిత్వశాఖ
2) వ్యవసాయ మంత్రిత్వశాఖ
3) పర్యావరణ, అటవీశాఖ
4) శాస్త్ర, సాంకేతిక శాఖ
37. భారతదేశంలో కరువు దేనితో ముడిపడి ఉంది?
1) రుతుపవనాలు 2) వరదలు
3) ఎడారి 4) జనాభా
38. సునామీ నుంచి రక్షణకు ఏది ఉత్తమ నిరోధకం కాదు?
1) జలాశయాలు 2) మడ అడవులు
3) ఇసుక తిన్నెలు
4) తీరప్రాంతపు కొండ శిఖరం
39. తీరంపై ఉన్న యాత్రికునికి రాబోయే సునామీ గురించి ఉపయోగపడే హెచ్చరిక ఏది?
1) దూరం నుంచి కనబడే పోటు (ముందుకు చొచ్చుకువచ్చే సముద్రం)
2) నీరు బాగా లోపలికి లాగబడి, సముద్రంలోని అంతర్భాగపు నేల బయటపడేట్లు వెనుకకు వెళ్లిన సముద్రం
3) సముద్రపు నీటి మట్టాల్లో తీవ్ర హెచ్చుతగ్గులు
4) ముందుకు దూసుకొని వస్తున్న సముద్రం పోటు గురించి అరిచి చెప్పే పడవవాడు
40. భూకంపం నుంచి రక్షణాత్మక నిర్మాణంలో నిర్మించిన భవనం ఆకృతి ఏ విధంగా ఉంటే మంచిది?
ఎ) నక్షత్ర ఆకృతి
బి) సాదా వృత్తపు ఆకృతి
సి) సాదా దీర్ఘచతురస్రపు ఆకృతి
డి) అండాకార ఆకృతి
41. 1977వ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా, గుంటూరు జిల్లాల్లో సంభవించిన తుఫానులో సుమారు ఎంతమంది చనిపోయారు?
1) 1000 2) 2000
3) 5000 4) 10,000
42. కొండచరియలు విరిగిపడకుండా ఉండటానికి చవకైన ప్రతిభావంతమైన చర్య ఏది?
1) నిలుపుదల గోడలు కట్టడం
2) చెట్లసంఖ్యను పెంచడం
3) ఇంజినీరింగ్ నిర్మాణాలు
4) ఉపరితల డ్రైనేజ్ నియంత్రక నిర్మాణాలు
43. విపత్తుల వల్ల ప్రమాదం జరగడానికి కారణం కానిది ఏది?
1) ప్రమాదానికి ఎదురుగా ఉన్న నిర్మాణాలు
2) విపత్తు నుంచి దూరం
3) సామాజిక స్థితి
4) దాడికి చేరువ
44. విపత్తు నిర్వహణ కోసం ఐక్యరాజ్యసమితి ఆమోదించిన ప్రస్తుత విపత్తు నిర్వహణ ఫ్రేమ్‌వర్క్ ఏది?
1) సెండాయి ఫ్రేమ్ వర్క్
2) హ్యూగో ఫ్రేమ్‌వర్క్
3) క్యోటో ఫ్రేమ్‌వర్క్
4) షాంఘై ఫ్రేమ్‌వర్క్
45. ఏ రకం భూకంపాల వల్ల ఎక్కువ నష్టం జరుగుతుంది?
1) లోతైన కేంద్రం గల భూకంపాలు
2) మధ్యస్థ కేంద్రం గల భూకంపాలు
3) ఉపరితల కేంద్రం గల భూకంపాలు
4) కేంద్రస్థానంలో నష్టానికి సంబంధం ఉండదు
46. భూకంప పరిమాణాన్ని దేనితో కొలుస్తారు?
1) సిస్మోగ్రాఫ్ 2) మానోగ్రాఫ్
3) బారోగ్రాఫ్ 4) సైటోగ్రాఫ్
సమాధానాలు
1-3 2-1 3-2 4-3
5-1 6-2 7-2 8-3
9-1 10-1 11-3 12-4
13-1 14-2 15-3 16-4
17-3 18-2 19-4 20-3
21-4 22-2 23-1 24-2
25-3 26-4 27-3 28-4
29-3 30-4 31-3 32-4
33-3 34-3 35-3 36-2
37-1 38-1 39-2 40-3
41-4 42-2 43-3 44-1
45-3 46-1
తెలుగు అకాడమీ సౌజన్యంతో
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు