General Studies | ఏ రకమైన ప్రకృతి వైపరీత్యాలకు బీమా వర్తించదు?
1. విపత్తుల నిర్వహణలో రిమోట్ సెన్సింగ్ పాత్రకు సంబంధించి కింది ప్రవచనాలను పరిశీలించండి.
ఎ. విపత్తుల ప్రాంతాలను ఒకటి కంటే ఎక్కువసార్లు నియమిత కాలవ్యవధిలో చిత్రీకరిస్తుంది
బి. విపత్తు దుర్బలత్వ ప్రాంతాలను గుర్తించి మ్యాపులు కలిగిన అట్లాస్‌లను రూపొందిస్తుంది
సి. విపత్తు ప్రభావిత ప్రాంత పంటలను అందిస్తుంది
పై వాటిలో నిజమైన వాక్యాలను తెలపండి?
1) ఎ, బి 2) ఎ, సి
3) బి, సి 4) ఎ, బి, సి
2. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రిమోట్ సెన్సింగ్కు సంబంధించి కింది అంశాల్లో వాస్తవం ఏది?
ఎ. సహజ వనరులు, పర్యావరణ, విపత్తు నిర్వహణకు సంబంధించి రిమోట్ సెన్సింగ్, జియో ఇన్ఫర్మాట్, జీపీఎస్ టెక్నాలజీలతో సుశిక్షితులైన నిపుణులను రూపొందించేందుకు ఒక ప్రాథమిక శిక్షణ, విద్యాసంస్థగా వ్యవహరిస్తుంది
బి. ఇది భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ విభాగంగా పనిచేస్తుంది
సి. పూర్వం దీని స్థానంలో ఇండియన్ ఫొటో ఇంటర్‌ప్రిటేషన్ ఇన్స్టిట్యూట్ ఉండేది
1) ఎ, బి 2) బి, సి
3) ఎ, సి 4) ఎ, బి, సి
3. తుఫాన్ ఏర్పడిన తర్వాత అది పయనించే మార్గాన్ని ఇస్రోకు చెందిన స్పేస్ అప్లికేషన్స్ సెంటర్లో అభివృద్ధి చేసిన ఒక గణిత నమూనాను ఉపయోగించి అంచనా వేస్తారు. అయితే స్పేస్ అప్లికేషన్స్ సెంటర్ ఎక్కడ ఉంది?
1) గుజరాత్‌లోని అహ్మదాబాద్
2) తెలంగాణలోని హైదరాబాద్
3) ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోట
4) ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్
4. తుఫాన్ అంటే ఏమిటి?
1) ఉత్తరార్ధ గోళంలో సవ్యగాలులతో కూడిన అల్పపీడన వ్యవస్థ
2) ఉత్తరార్ధ గోళంలో అపసవ్య గాలులతో కూడిన అధిక పీడన వ్యవస్థ
3) ఉత్తరార్ధ గోళంలో అపసవ్య గాలులతో కూడిన అల్పపీడన వ్యవస్థ
4) ఉత్తరార్ధ గోళంలో సవ్యగాలులతో కూడిన అధిక పీడన వ్యవస్థ
5. కింది వాటిలో విపత్తు నిర్వహణలో రక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తున్న సంస్థ?
1) జాతీయ పోలీస్ అకాడమీ
2) అటవీ పరిశోధన సంస్థ
3) జాతీయ పోషకాహార సంస్థ
4) జాతీయ అగ్నిశమన అకాడమీ
6. భారత ఉపఖండం కింది వాటిలో దేనివల్ల ఎక్కువగా హాని కలగడానికి అనుకూలంగా ఉంది?
1) తుఫానులు 2) కరువులు
3) భూకంపాలు 4) అన్నీ
7. అన్మోల్ ప్రచురణ సంస్థ ప్రచురించిన ‘డిజాస్టర్ మేనేజ్మెంట్ రీసెంట్ అప్రోచెస్’ గ్రంథకర్త ఎవరు?
1) అరవిందకుమార్ 2) బీ నారాయణ
3) బీసీ బోస్ 4) జగ్బీర్ సింగ్
8. ఏ ప్రాంతంలో భూపాతాలు ఎక్కువగా సంభవించే నైసర్గిక ఆపదలు ప్రాణ, ఆస్తి నష్టం కలిగిస్తాయి?
1) హిమాలయ పర్వతాలతో సహా భారత పర్వత ప్రాంతాలు
2) తూర్పు ఇండియా పర్వత ప్రాంతాలు
3) పశ్చిమ ఇండియా పర్వత ప్రాంతాలు
4) దక్షిణ ఇండియా పర్వత ప్రాంతాలు
9. పసిఫిక్ ప్రాంతంలో సునామీ హెచ్చరికల సమన్వయ గ్రూప్ ఎక్కడ ఉంది?
1) పారిస్ 2) జకార్తా
3) టోక్యో 4) విశాఖపట్నం
10. విపత్తుల నిర్వహణపై అంతర్జాతీయంగా ‘ఆన్లైన్ కోర్స్’ నిర్వహిస్తున్న యూనివర్సిటీ?
1) గ్రాండ్ కాన్యన్ యూనివర్సిటీ
2) వాల్డెన్ యూనివర్సిటీ
3) వాషింగ్టన్ యూనివర్సిటీ 4) 1, 2
11. 1980 నుంచి ఇండియాలో భూపాతాలకు గురయ్యే ప్రాంతాలను గుర్తించడానికి వాడుతున్న పద్ధతి?
1) ల్యాండ్ైస్లెడ్ జొనేషన్ మ్యాపింగ్
2) ల్యాండ్ డిజాస్టర్ మ్యాపింగ్
3) ల్యాండ్ రిక్లమేషన్ జోమింగ్
4) ల్యాండ్ డెవలప్మెంట్ జోమింగ్
12. ఇండియాలోని 35 రాష్ర్టాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఎన్ని విపత్తులకు గురయ్యే అవకాశం ఉంది?
1) 22 2) 23 3) 24 4) 25
13. ఏ రిపోర్టుల నుంచి ఇండియన్ సునామీ గురించి పాత రికార్డులు లభించాయి?
1) 1941 భూకంపం
2) క్రీ.పూ 286 భూకంపం
3) క్రీ.పూ. 316 భూకంపం
4) క్రీ.పూ. 326 భూకంపం
14. ప్రపంచ విపత్తు నిర్వహణ సమావేశం 2005లో ఎక్కడ జరిగింది?
1) మలేషియా 2) జపాన్
3) ఇండోనేషియా 4) థాయిలాండ్
15. సునామీలు అధికంగా కలిగే సముద్రం?
1) హిందూ మహాసముద్రం
2) అట్లాంటిక్ మహాసముద్రం
3) పసిఫిక్ మహాసముద్రం
4) మధ్యధరా సముద్రం
16. ఇండియాలో తూర్పు తీర ప్రాంతాల్లో ఏ భాగంలో పెను తుఫానుల వల్ల అత్యధికంగా హాని సంభవిస్తుంది?
1) ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరం
2) ఆంధ్రప్రదేశ్ ఒంగోలు-మచిలీపట్నం మధ్య ఉన్న తీరం
3) తమిళనాడులో నాగపట్నానికి దక్షిణంలో ఉండే తీర ప్రాంతం
4) పైవన్నీ
17. విపత్తు నిర్వహణ సర్టిఫికెట్ కోర్సును కింది ఏ యూనివర్సిటీ నిర్వహిస్తుంది?
1) ఇందిరాగాంధీ జాతీయ సార్వత్రిక విశ్వవిద్యాలయం
2) బీఆర్ అంబేద్కర్ జాతీయ సార్వత్రిక విశ్వవిద్యాలయం
3) నలంద జాతీయ సార్వత్రిక విశ్వవిద్యాలయం
4) వర్ధమాన్ మహావీర్ జాతీయ సార్వత్రిక విశ్వవిద్యాలయం
18. కరువు ప్రధానంగా దేనివల్ల ఏర్పడుతుంది?
1) ఎక్కువగా ఆవిరి కావడం
2) దీర్ఘకాలంగా వర్షాలు లేకపోవడం
3) భూమిలో నీరు కారిపోవడం
4) సముద్ర నీటి ప్రభావం
19. కింది వాటిలో ఏది ఇరాక్‌పై దాడి (2003) సందర్భంగా ప్రచారంలోకి వచ్చింది?
1) సమూహ విధ్వంసక ఆయుధాలు
2) అణు ఆయుధాలు
3) తాపాధారిత అణుబాంబులు
4) వాతావరణ విధ్వంసక ఆయుధాలు
20. కేంద్ర ప్రభుత్వంలో విపత్తు నిర్వహణకు నోడల్ ఏజెన్సీ?
1) గ్రామీణ అభివృద్ధి మంత్రిత్వ శాఖ
2) గృహ మంత్రిత్వ శాఖ
3) వ్యవసాయ మంత్రిత్వ శాఖ
4) ప్రసారాల మంత్రిత్వ శాఖ
21. ప్రపంచ విపత్తుల్లో భూకంపాలు, సునామీలు ఎంత శాతం?
1) 8 2) 9 3) 10 4) 11
22. విపత్తుకు ముందు జరిగే సమయం, తర్వాత కార్యకలాపాలు విపత్తు నిర్వహణలో ఉంటాయి. అవి ఏవి?
1) పునర్నిర్మాణం, పునర్నివాసం
2) నివారణ (ఉపశమనం)
3) అత్యవసర ప్రతిస్పందన
4) పైవన్నీ
23. విపత్తుల తీవ్రతను సాధారణంగా దేని పరంగా లెక్కిస్తారు?
1) ప్రాణ నష్టం 2) ఆస్తి నష్టం
3) జంతు నష్టం 4) గృహ నష్టం
24. ఇండియాలో ఏ నది వల్ల ఎక్కువగా వరదలు వస్తాయి?
1) గోదావరి 2) కృష్ణా
3) గోమతి 4) బ్రహ్మపుత్ర
25. సునామీ ఒక..
1) జపనీస్ మాట 2) ఫ్రెంచ్ మాట
3) గ్రీకు మాట 4) రష్యన్ మాట
26. సార్క్ విపత్తు నిర్వహణ కేంద్రం ఎక్కడ ఉంది?
1) కటక్ 2) న్యూఢిల్లీ
3) విశాఖపట్నం 4) మధురై
27. సాధారణంగా ఏ రకమైన ప్రకృతి వైపరీత్యాలకు బీమా వర్తించదు?
1) భూకంపాలు
2) అగ్నిపర్వత విస్ఫోటనాలు
3) కొండచరియలు విరిగిపడటం
4) వరదలు
28. తెలంగాణ రాష్ట్రంలో తరచూ వరదలకు గురయ్యే ప్రాంతాలు?
1) గోదావరి పరీవాహక ప్రాంతం
2) కృష్ణా పరీవాహక ప్రాంతం
3) మూసీ నది పరీవాహక ప్రాంతం
4) ప్రాణహిత పరీవాహక ప్రాంతం
29. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెరిట్ సెన్సింగ్ (ఐటీఆర్సీ) ఎక్కడ ఉంది?
1) హైదరాబాద్ 2) నైనిటాల్
3) అహ్మదాబాద్ 4) డెహ్రాడూన్
30. ఇస్రో ఏ రాష్ర్టాలకు వరదలకు సంబంధించిన జిల్లా స్థాయి వైపరీత్య అట్లాస్‌లను రూపొందించింది?
ఎ. అసోం బి. బీహార్
సి. ఆంధ్రప్రదేశ్ డి. తెలంగాణ
1) ఎ, సి 2) బి, డి
3) ఎ, బి 4) ఎ, బి, సి, డి
31. నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ (ఎన్ఐసీ) ఏ రాష్ట్రంలోని జిల్లా కలెక్టర్ల కోసం అలర్ట్ సిస్టమ్‌ను
అభివృద్ధి పరిచింది?
1) ఆంధ్రప్రదేశ్ 2) తమిళనాడు
3) పశ్చిమ బెంగాల్ 4) బీహార్
32. జీఐఎస్ అనే ప్రాదేశిక డేటాను విశ్లేషించడం కింది ఏ అంశాల కలయిక?
ఎ. జాగ్రఫీ బి. కంప్యూటింగ్
సి. కార్టోగ్రఫీ డి. రిమోట్ సెన్సింగ్
1) ఎ, బి, సి 2) బి, సి, డి
3) ఎ, సి, డి 4) ఎ, బి, సి, డి
33. దేశంలోని హిమాలయాలు తీవ్రమైన భూకంప ప్రభావిత ప్రాంతంలో ఉండటానికి కారణం?
1) భారత ద్వీపకల్ప, యురేషియా అపసరణంలో ఉండటం వల్ల
2) భారత ద్వీపకల్ప, యురేషియా అభిసరణలో ఉండటం వల్ల
3) భారత ద్వీపకల్ప, ఆస్ట్రేలియా అభిసరణలో ఉండటం వల్ల
4) పైవేవీ కాదు
34. భూకంపం సంభవించినప్పుడు విడుదలయ్యే శక్తి ఏ రూపంలో విస్తరిస్తుంది?
1) కంపనాలు 2) ప్రకంపనలు
3) కంపనాలు, ప్రకంపనలు
4) ఏదీకాదు
35. కింది వాటిని పరిశీలించండి.
ప్రతిపాదన (ఏ): రెండు శిలావరణ ఫలకాలు అభిసరణం చెందే ప్రదేశాల్లో భూకంపాలు ఏర్పడతాయి
కారణం (ఆర్): ఏస్థనోస్ఫియర్ ప్రాంతం నుంచే ఉష్ణజనిత సంవహన ప్రవాహాల కారణంగా శిలావరణ ఫలకాలు కదులుతూ ఉంటాయి
1) ఏ, ఆర్ నిజమైనవి. ఏ కు ఆర్ సరైన వివరణ
2) ఏ, ఆర్ నిజమైనవి. ఏ కు ఆర్ సరైన వివరణ కాదు
3) ఏ నిజమైనది, ఆర్ నిజమైనది కాదు
4) ఏ నిజమైనది కాదు, ఆర్ నిజమైనది
36. సునామీలకు సంబంధించి కింది ప్రవచనాలను పరిశీలించండి.
ఎ. సముద్రాంతర్గత భూకంపాలు అత్యంత తీవ్రమైన సునామీలకు కారణం
బి. రెండు ఖండఫలకాలు అభిసరణం చెందడం వల్ల సునామీలు ఏర్పడుతాయి
సి. రెండు సముద్ర ఫలకాలు లేదా ఒక ఖండ, సముద్ర ఫలకం అభిసరణం చెందడం వల్ల సునామీలు ఏర్పడుతాయి
డి. సముద్రాంతర్గత అగ్నిపర్వతం విస్ఫోటనాలు, సునామీలు ఏర్పడటానికి కారణమవుతాయి పై వాటిలో నిజమైనది కానిది?
1) ఎ, సి, డి 2) బి, సి
3) బి 4) ఎ, డి
37. ఆంధ్రప్రదేశ్‌లో తరచూ వరదలకు లోనయ్యే ప్రాంతాలు?
1) ఉత్తర కోస్తా
2) పెన్నా డెల్టా
3) సువర్ణముఖి నదీలోయ
4) కృష్ణా, గోదావరి డెల్టా
38. ఏ రోజు పెద్ద భూకంపం సునామీగా మారి జపాన్ ఈశాన్య రాష్ట్రంలోని తీరంలో 19,000 మంది మరణించడానికి కారణమైంది?
1) 2011, జనవరి 11
2) 2010, మార్చి 11
3) 2011, అక్టోబర్ 11
4) 2010, ఏప్రిల్ 11
39. ప్రపంచ బ్యాంక్ అంచనా ప్రకారం ప్రకృతి విపత్తు నుంచి ప్రత్యక్షంగా కలిగిన నష్టాలు స్థూల జాతీయోత్పత్తిలో ఎంత శాతం?
1) 4 2) 3
3) 2 4) 1
40. స్టేట్ క్రైసిస్ మేనేజ్మెంట్ కమిటీ అధ్యక్షుడు?
1) ముఖ్యమంత్రి 2) ఆర్థిక కార్యదర్శి
3) ఆర్థిక మంత్రి 4) ముఖ్య కార్యదర్శి
సమాధానాలు
1-4, 2-4, 3-1, 4-3, 5-4, 6-4, 7-1, 8-1, 9-3, 10-4, 11-1, 12-4, 13-4, 14-2, 15-3, 16-4, 17-1, 18-2, 19-2, 20-2, 21-4, 22-4, 23-1, 24-4, 25-1, 26-2, 27-1, 28-1, 29-4, 30-3, 31-2, 32-4, 33-2, 34-3, 35-1, 36-3, 37-4, 38-2, 39-3, 40-4.
జీ గిరిధర్
సివిల్స్ ఫ్యాకల్టీ
బీసీ స్టడీ సర్కిల్
హైదరాబాద్
9966330068
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు