Telangana Movement | తెలంగాణ ఉద్యమ చరిత్ర.. గ్రూప్-IV గ్రాండ్ టెస్ట్
గ్రూప్-IV గ్రాండ్ టెస్ట్
1. తెలంగాణలో ఏ గిరిజన తెగవారు తీజ్ పండుగను జరుపుకొంటారు?
1) బంజారాలు 2) కోయలు
3) గోండులు 4) కోలంలు
2. బూర్గుల రామకృష్ణారావు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ముల్కీ నిబంధనలు అమలు చేయడంలోని నియమాలపై ప్రభుత్వం ఒక న్యాయవిచారణను జరిపించింది. కింది వారిలో ఆ విచారణను జరిపింది ఎవరు?
1) ఓ. చిన్నపురెడ్డి
2) పింగళి జగన్మోహన్ రెడ్డి
3) ఓ. పుల్లారెడ్డి
4) కె.వి. రంగారెడ్డి
3. ప్రతిపాదన(ఎ) : ఆంధ్రప్రాంతంలోని ప్రజలు ముల్కీ నిబంధనలు తమకు వ్యతిరేకమైనవని ‘జై ఆంధ్ర ఉద్యమాన్ని ప్రారంభించారు.
కారణం(ఆర్) : 1972లో సుప్రీంకోర్టు ముల్కీ నిబంధనలు రాజ్యాంగపరంగా సక్రమమేనని ప్రకటించారు.
1) (ఎ) నిజం, కానీ (ఆర్) తప్పు
2) (ఎ) తప్పు, కానీ (ఆర్) నిజం
3) (ఎ),(ఆర్) రెండూ నిజం, (ఆర్)కు (ఎ) సరైన వివరణ
4) (ఎ), (ఆర్) రెండూ నిజం (ఆర్)కు (ఎ)సరైన వివరణ కాదు
4. 1947 సెప్టెంబర్ 2న జరిగిన పరకాల మారణ హోమం జలియన్ వాలాబాగ్ ఉదంతంతో పోల్చదగింది. పరకాల ఉద్యమకారుల ధ్యేయమేమిటి?
1) జాతీయ పతాకాన్ని ఆవిష్కరించడం
2) విదేశీ వస్త్రాలు బహిష్కరించడం
3) నిజాం పాలనకు వ్యతిరేకత తెలపడం
4) బ్రిటిష్‌వారి ఆధిపత్యాన్ని నిరసించడం
5. కిందివారిలో తెలంగాణ తల్లి విగ్రహానికి రూపురేఖలను ఇచ్చిందెవరు?
1) వెంకట రమణాచారి
2) ఎక్కా యాదగిరిరావు
3) గోరటి వెంకన్న
4) కె.వి. రమణాచారి
6. కింది జానపద పాటలను వాటిని రచించిన కవులు- గాయకులను జతపరచండి?
జాబితా -1 జాబితా -2
ఎ) అమ్మ తెలంగాణమా, పొడుస్తున్న పొద్దు మీద 1) అభినయ శ్రీనివాస్
బి) నాగేటి సాళ్లల్ల నా తెలంగాణ 2) నందిని సిధారెడ్డి
సి) జైకొట్టు తెలంగాణ 3) గద్దర్
డి) ఉస్మానియా క్యాంపస్‌లో ఉదయించిన కిరణమా 4) పసునూరి రవీందర్
సరైన సమాధానం గుర్తించండి
1) ఎ-3, బి-2, సి-4, డి-1 2) ఎ-3, బి-4, సి-1, డి-2
3) ఎ-3, బి-4, సి-2, డి-1 4) ఎ-4, బి-2, సి-3, డి-1
7. తెలంగాణ రైతు సాయుధ పోరాటంలో గ్రామీణ ప్రజల్లో రాజకీయ అవగాహనకు, విప్లవం వైపు ఆకర్షించడానికి యువకులను కమ్యూనిస్టులు సంఘటితపరిచారు. ఈ యువశక్తి సంస్థ పేరు ఏమిటి?
1) గొరిల్లా సాయుధ స్కాడ్స్
2) ఫ్రీవిల్ కంటింజెంట్స్
3) వినాశనం చేసే కంటింజెంట్స్
4) స్వీయ రక్షణ స్కాడ్స్
8. తెలంగాణలోని కింది ప్రాంతాలను అక్కడి సంప్రదాయక ఉత్పత్తులతో జతపరచండి?
ఎ) సిద్దిపేట 1) ఖద్దరు
బి) కోరుట్ల 2) ముత్యాలకు రంధ్రాలు వేయడం
సి) చందంపేట 3) గొల్లభామ చీరలు
డి) మెట్పల్లి 4) కాగితం తయారీ
1) ఎ-3, బి-4, సి-1, డి-2
2) ఎ-2, బి-4, సి-3, డి-1
3) ఎ-3, బి-4, సి-2, డి-1
4) ఎ-4, బి-3, సి-1, డి-2
9. సంసద్ యాత్ర ప్రధాన ఉద్దేశమేది?
1) పార్లమెంటు సమావేశాలు జరుగుతున్న సమయంలో సత్యాగ్రహ నిరసనను నిర్వహించడం
2) హైదరాబాద్‌లోని ముఖ్యమంత్రి నివాసానికి యాత్రగా వెళ్లడం
3) ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్దకు వెళ్లడం
4) పబ్లిక్ గార్డెన్స్‌లోని అసెంబ్లీ భవనాన్ని ముట్టడించడం
10. ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాన్ని విభజించడానికి తీర్మానించిన కాంగ్రెస్ కోర్ కమిటీకి అధ్యక్షులు ఎవరు?
1) సోనియా గాంధీ
2) పి. చిదంబరం
3) ప్రణబ్ ముఖర్జీ
4) మన్మోహన్సింగ్
11. ప్రతిపాదన (ఎ): 1948లో హైదరాబాద్ భారతదేశంలో విలీనమైన తర్వాత ముల్కీ నిబంధనలను బహిరంగంగా ఉల్లంఘించడం జరిగింది.
కారణం(ఆర్): సివిల్ పోలీసు శాఖలకు చెందిన అనేక ఉద్యోగులను పక్క రాష్ర్టాల నుంచి ఇక్కడ శాంతి భద్రతలు పెంపొందించే పేరుతో తీసుకొని వచ్చారు.
1) (ఎ) నిజం. కాని (ఆర్) తప్పు
2) (ఎ) తప్పు. కాని (ఆర్) నిజం
3) (ఎ), (ఆర్) రెండూ నిజం, (ఆర్)కు(ఎ) సరైన వివరణ
4) (ఎ), (ఆర్) రెండూ నిజం, (ఆర్) కు (ఎ) సరైన వివరణ కాదు
12. కింది పోరాటాలను అవి జరిగిన క్రమంలో అమర్చండి.
ఎ) మిలియన్ మార్చ్
బి) సంసద్ యాత్ర
సి) పల్లెపల్లె పట్టాల పైకి
డి) సడక్ బంద్
1) సి, ఎ, డి, బి 2) బి, సి, డి, ఎ
3) ఎ, డి, సి, బి 4) డి, సి, బి, ఎ
13. 1968లో విద్యార్థి నాయకుడిగా ఎస్.జైపాల్‌రెడ్డి ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థ్ధులతో అప్పటి ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా వైస్ ఛాన్సలర్ నియామకానికి సంబంధించిన విషయంపై ఉద్యమాన్ని నడిపారు. అప్పటి ఉస్మానియా విశ్వవిద్యాలయం వీసీ ఎవరు?
1) డి. ఎస్. రెడ్డి
2) పి.ఎం. రెడ్డి
3) రావాడ సత్యనారాయణ
4) పిన్నమనేని నరసింహారావు
14. 1953 డిసెంబర్లో భారత ప్రభుత్వం రాష్ర్టాల పునర్విభజన కమిషన్‌ను(ఎస్ఆర్సీ) నియమించింది. కిందివారిలో కమిషన్‌తో సంబంధం లేనివారు ఎవరు?
1) జస్టిస్ భార్గవ 2) సయ్యద్ ఫజల్ అలీ
3) హెచ్.ఎన్. కుంజు
4) కె.ఎం. ఫణిక్కర్
15. 1971 ఎన్నికల్లో తెలంగాణ ప్రజాసమితి (టీపీఎస్) 14 స్థానాలకు 11 స్థానాలు గెలుచుకొంది. టీపీఎస్ ఎవరి
ఆధ్వర్యంలో ఏర్పాటైంది?
1) కె.వి. రంగారెడ్డి
2) మదన్ మోహన్
3) పి.వి. నరసింహారావు
4) మర్రి చెన్నారెడ్డి
16. 1950లో హైదరాబాద్ రాష్ట్ర కాబినెట్ పరి పాలన, ఆర్థిక రంగాల్లో పునర్వ్యవస్థీకరణ కోసం సలహాలను ఇవ్వడానికి ఒక కమిటీని
నియమించింది. ఆ కమిటీకి అధ్యక్షులు ఎవరు?
1) దిగంబర రావు బిందు
2) జె.పి.ఎల్. గ్విన్
3) వి.పి. మీనన్ 4) ఎ.డి. గోర్వాలా
17. కింది వారిలో పార్ల్లమెంటులో ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లు -2013ను ప్రవేశ పెట్టింది ఎవరు?
1) సుశీల్ కుమార్ షిండే
2) ఎ.కె. ఆంటోని
3) మన్మోహన్ సింగ్ 4) పి. చిదంబరం
18. కింది ప్రవచనాల్లో పునర్వ్యవస్థీకరణ చట్టం-2014కు సంబంధించి సరికానిది?
1) ఆంధ్రప్రదేశ్‌కు అమరావతి రాజధానిగా ఉండటం
2) ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు జిల్లా సరిహద్దులు మార్చుకోవడానికి అధికారం ఉండటం
3) రెండు రాష్ర్టాలకు ఒకే గవర్నర్ ఉండటం
4) 3వ అధికరణంలో తెలిపినట్లు ఆంధ్రప్రదేశ్‌లో జిల్లాలు ఉండటం
19. 1952-53లో ‘ఇడ్లీ సాంబార్ గోబ్యాక్’ అనే నినాదంతో జరిగిన ముల్కీ ఉద్యమాన్ని కింద పేర్కొన్న వారిలో ఎవరు నడిపించారు?
1) మేధావులు 2) న్యాయవాదులు
3) రైతులు 4) విద్యార్థులు
20. అప్పటి ముఖ్యమంత్రి ఎన్.టి.రామారావు జయభారత్ రెడ్డిని త్రిసభ్య కమిటీకి కన్వీనర్‌గా నియమించి, తెలంగాణకు సంబంధించి ఏ అంశంపై అధ్యయనం చేయమన్నారు?
1) ప్రభుత్వ ఉద్యోగుల లెక్కలు
2) దేవాలయ భూముల వినియోగం
3) నీటిపారుదల సౌకర్యాలు
4) పారిశ్రామిక అభివృద్ధి
21. కింది వారిలో ఎవరు తెలంగాణ జీవన విధానాన్ని తన చిత్రలేఖనాలలో ప్రతిబింబింప చేశారు?
1) బి.వి.ఆర్. చౌదరి 2) మిద్దె రాములు
3) కాంతారావు 4) కె. లక్ష్మణ్ గౌడ్
22. పోచంపల్లిలో రామచంద్రారెడ్డి భూదాన్ ఉద్యమానికి భూమి ఉచితంగా ఇచ్చిన తర్వాత సేకరించిన భూములను క్రమబద్ధంగా బీదలకు పంచడానికై వినోబాభావే ఒక కమిటీని నియమించాడు. కింది వారిలో ఆ కమిటీ సభ్యులెవరు?
1) ఎస్. యాగంటి 2) డి. లక్ష్మణ రావు
3) వి. వీరభద్రం
4) ఉమ్మెత్తల కేశవరావు
23. ఎవరి పరిపాలన కింద హైదరాబాద్‌లో అంతవరకు అధికార భాషగా కొనసాగిన ఉర్దూ బదులు తెలుగు, ఇంగ్లిష్ భాషలు ప్రవేశ పెట్టారు?
1) కె.ఎం.మున్షి
2) బూర్గుల రామకృష్ణారావు
3) జె.ఎన్. చౌదరి 4) ఎం.కె. వెల్లోడి
24. 1969 తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణ ప్రజాసమితి ఉపాధ్యక్షులు ఎవరు?
1) మదన్మోహన్ 2) సుమిత్రా దేవి
3) కొండా లక్ష్మణ్ బాపూజీ
4) సదాలక్ష్మి
25. కింది వాటిలో పెద్ద మనుషుల ఒప్పందంలో భాగం కానిది?
1) విద్యా సంస్థల్లో, తెలంగాణ విద్యార్థులకు 3:1 నిష్పత్తిలో స్థానాలు కేటాయించాలి
2) తెలంగాణ ప్రాంతంలో వచ్చే అధిక ఆదాయాన్ని ఆ ప్రాంత అభివృద్ధికి వినియోగించాలి
3) ప్రభుత్వ ఉద్యోగాల్లో ముల్కీ నిబంధనల కొనసాగింపు
4) తెలంగాణ ప్రాంతీయ మండలి ఆధీనంలో వ్యవసాయ భూముల అమ్మకం
26. తెలంగాణకు మద్దతు గల రాజకీయ పార్టీలతో ప్రొ. కోదండరామ్ కన్వీనర్‌గా ఏర్పడిన తెలంగాణ రాజకీయ జాయింట్ యాక్షన్ కమిటీలో చేరని రాజకీయ పార్టీ ఏది?
1) సీపీఐ(ఎం) 2) టీఆర్ఎస్
3) కాంగ్రెస్ 4) టీడీపీ
27. 2012 డిసెంబర్ 28న యూపీఏ ప్రభుత్వం తెలంగాణ విషయంగా ఒక అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది. కింద తెలిపిన పార్టీలు, వాటి నాయకులతో జతపరచండి.
పార్టీలు నాయకులు
ఎ) కాంగ్రెస్ 1) కె.నారాయణ & గుండా మల్లేష్
బి) వైసీపీ 2) రాఘవులు & జూలకంటి రంగారెడ్డి
సి) సీపీఐ 3) మైసూరారెడ్డి & కె.కె. మహీంద్ర
డి) సీపీఎం 4) సురేష్ రెడ్డి & గాదె వెంకటరెడ్డి
1) ఎ-3, బి-4, సి-2, డి-1
2) ఎ-1, బి-3, సి-4, డి-2
3) ఎ-2, బి-4, సి-3, డి-1
4) ఎ-4, బి-3, సి-1, డి-2
28. 1969 ఉద్యమంలో అమరులైన వారి జ్ఞాపకార్థం హైదరాబాద్‌లోని గన్‌పార్క్ స్మారక స్తూపాన్ని రూపొందించిన శిల్పి ఎవరు?
1) బి. వెంకట రమణాచారి
2) ఎక్కా యాదగిరిరావు
3) పుష్పా నారాయణ
4) అంబటి సురేంద్ర రాజు
29. ముఖ్యమంత్రి బ్రహ్మానంద రెడ్డి చొరవతో 1969 జనవరిలో కుదిరిన అఖిల పక్ష తీర్మానాల్లో ముల్కీ నిబంధనల గురించి కింది వాటిలో సరైన ప్రవచనం ఏది?
1) తప్పుడు ముల్కీ పత్రాలతో ఉద్యోగాలు పొందిన వారందరినీ బదిలీ చేయాలి
2) జీవో నెం. 36 విడుదల చేసి, తెలంగాణలో ముల్కీకాని వారందరినీ ఆంధ్ర ఉద్యోగులుగా కొనసాగింప చేయాలి
3) తెలంగాణలో ముల్కీ నిబంధనలకు వ్యతిరేకంగా నియమించిన వారందరినీ క్రమబద్ధీకరణ చేయాలి
4) ముల్కీ నిబంధనలను ప్రభుత్వ విభాగాలకు మాత్రమే గాక ఇతర సంస్థలకు అన్వయింప చేయాలి
30. ప్రతిపాదన (ఎ): హైదరాబాద్ నగర హోదాపై సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన వెంటనే తెలంగాణ ప్రజలు గొప్ప ఆనందోత్సాహాలతో పరవశించారు.
కారణం (ఆర్) : 2009 అక్టోబర్‌లో సుప్రీంకోర్టు హైదరాబాద్ “ఫ్రీ జోన్”గా ఉంటుందని తీర్పు నిచ్చింది. సరైన సమాధానం
1) (ఎ) నిజం, కాని (ఆర్) తప్పు
2) (ఎ) తప్పు కాని, (ఆర్) నిజం
3) (ఎ), (ఆర్) రెండూ నిజం,
(ఆర్) (ఎ) కు సరైన వివరణ
4) (ఎ), (ఆర్) రెండూ నిజం కానీ (ఆర్)కు (ఎ) సరైన వివరణ కాదు
31. సరికాని జతను గుర్తించండి?
1) వనపర్తి సంస్థానం-జనుంపల్లి వంశం
2) దోమకొండ సంస్థానం కామినేని వంశం
3) పాల్వంచ సంస్థానం – మాచిరాజు వంశం
4) కొల్లాపూర్ సంస్థానం సురభి వంశం
32. కింది వాటిని జతపరచండి.
జాబితా-1 జాబితా -2
ఎ) బి. నర్సింగరావు 1) చిల్లర దేవుళ్లు
బి) బి.ఎస్.నారాయణ 2) కుబుసం
సి) శ్రీనాథ్ 3) నిమజ్జనం
డి) టి. మాధవరావు 4) మాభూమి
1) ఎ-3, బి-2, సి-4, డి-1
2) ఎ-2, బి-1, సి-4, డి-3
3) ఎ-1, బి-4, సి-2, డి-3
4) ఎ-4, బి-3, సి-2, డి-1
33. సరైన జతను గుర్తించండి.
1) నిఖిలేశ్వర్ మరో రామాయణం
2) గడియారం రామకృష్ణ శర్మ శతపత్రం
3) అల్లం రాజయ్య గాయపడ్డ రాత్రి
4) ఆవుల పిచ్చయ్య సగటు జీవి
34. కింది వాటిని జతపరచండి.
జాబితా-1 జాబితా-2
ఎ) వేద్ కుమార్ 1) తెలంగాణ న్యాయ సంగ్రామం
బి) గోపిరెడ్డి 2) తెలంగాణ చంద్రశేఖర్ రెడ్డి హిస్టరీ సొసైటీ
సి) తడకమల్ల వివేక్ 3) ప్రాణహిత
డి) అల్లం నారాయణ 4) దక్కన్ ల్యాండ్
1) ఎ-3, బి-1, సి-2, డి-4
2) ఎ-4, బి-1, సి-2, డి-3
3) ఎ-2, బి-3, సి-4, డి-1
4) ఎ-1, బి-4, సి-3, డి-2
35. జూలై 1954లో కరీంనగర్ వచ్చిన ఫజల్ అలీ కమిషన్‌కు విశాలాంధ్ర ఏర్పాటు చేయమని కోరుతూ విజ్ఞాపన పత్రాన్ని సమర్పించిందెవరు?
1) ఆనందరావు తోట
2) నూకల రామచంద్రారెడ్డి
3) కె. జయశంకర్
4) కాళోజీ నారాయణరావు
36. పెద్ద మనుషుల ఒప్పందానికి సంబంధించి కింది ప్రవచనాల్లో సరికానిది ఏది?
1) తెలంగాణలో ఉద్యోగాల కోసం ముల్కీరూల్ను అనుసరించాలి
2) తెలంగాణలో భూములు అమ్మడం, కొనడం రాష్ట్ర హోంమంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో జరగాలి
3) ఈ ప్రాంత సమగ్ర అభివృద్ధి పర్యవేక్షణకు తెలంగాణ ప్రాంతీయ కమిటీని నియమించాలి
4) మంత్రుల్లో 60 శాతం ఆంధ్ర నుంచి, 40 శాతం తెలంగాణ నుంచి ఉండాలి.
37. 1968, జూలై 10న ఏ రోజుగా పాటిస్తారు?
1) తెలంగాణ హక్కుల దినం
2) తెలంగాణ పోరాట దినం
3) తెలంగాణ హామీల దినం
4) తెలంగాణ కోరికల దినం
38. కింది వాటిలో ఏ ప్రాంతంలో తెలంగాణ ప్రాంతీయ సమితి ఏర్పాటు చేశారు?
1) హైదరాబాద్ 2) పాల్వంచ
3) వరంగల్ 4) ఇల్లందు
39. 1969లో ఏ తేదీన పాల్వంచలో కృష్ణమూర్తి అనే వ్యక్తి ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించారు?
1) జనవరి 8 2) జనవరి 9
3) జనవరి 10 4) జనవరి 11
40. ప్రతిపాదన (ఎ): పెద్దమనుషుల ఒప్పందంలో తెలంగాణ ప్రజలకు ఇచ్చిన రక్షణలను అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైంది.
కారణం(ఆర్): 1969లో విద్యార్థులు, యువకులు ప్రత్యేక రాష్ర్టాన్ని సాధించుకోవడమే తమ సమస్యలన్నింటికి పరిష్కారం అని భావించారు.
సరైన సమాధానం ఏది?
1) (ఎ), (ఆర్) రెండూ వ్యక్తిగతంగా సరైనవి, (ఆర్)కు (ఎ) సరైన వివరణ
2) (ఎ), (ఆర్) రెండూ వ్యక్తి గతంగా సరైనవి, (ఆర్)కు (ఎ) సరైన వివరణ కాదు
3) (ఎ) నిజం, కాని (ఆర్) తప్పు
2) (ఎ) తప్పు కాని, (ఆర్) నిజం
41. సరైన జతను గుర్తించండి.
1) జె. ఈశ్వరీ బాయి- కాంగ్రెస్ శాసన సభ్యులు
2) టి.ఎన్. సదాలక్ష్మి డిప్యూటీ స్పీకర్
3) సుమిత్రాదేవి జనసంఘ్ శాసన సభ్యులు
4) శాంతాబాయి రిపబ్లికన్ పార్టీ శాసనసభ్యులు
42. 1969లో జీవో నెంబర్ 36ను కొట్టివేసిన సుప్రీంకోర్టు ఫుల్ బెంచ్ అధిపతి ఎవరు?
1) జస్టిస్ డి.పి. థార్
2) జస్టిస్ ఆర్. ఎస్. సర్కారియా
3) జస్టిస్ ఎమ్.సి. చాగ్లా
4) జస్టిస్ ఎం. హిదయతుల్లా
43. 1969లో ఏ రాజకీయ పార్టీ తెలంగాణ రాష్ర్టాన్ని ఏర్పాటు చేయమని భారత ప్రభుత్వాన్ని కోరుతూ తీర్మానం చేసింది?
1) భారత కమ్యూనిస్ట్ పార్టీ
2) స్వతంత్ర పార్టీ
3) ప్రజా సోషలిస్ట్ పార్టీ
4) జనసంఘ్ పార్టీ
44. తెలంగాణ ఉద్యోగస్థుల సమస్యలను అధ్యయనం చేసి పరిష్కారాలను సూచించేందుకు 1969 ఏప్రిల్‌లో కేంద్ర ప్రభుత్వం జస్టిస్ వాంఛూ అధ్యక్షుడిగా ఇద్దరు ఇతర సభ్యులతో కమిటీని నియమించింది. ఆ ఇద్దరు సభ్యులెవరు?
1) ఎం.సి. సెతల్వాడ్, నెరెండె
2) ఆర్.ఎస్. ఖన్నా, హెచ్.ఎన్. మిశ్రా
3) ఎం.బి. దేశాయి, ఎం.సి. సెతల్వాడ్
4) నెరెం, అజయ్మాధూర్
45. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో భాగంగా 1969 జూన్ 17న ఏ దినంగా జరుపుకొన్నారు?
1) యువత దినం
2) వయోవృద్ధుల దినం
3) మహిళల దినం 4) రైతుల దినం
46. 1975, అక్టోబర్‌లో ఏ జీవో ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆర్టికల్ 371-డి విడుదల చేసింది?
1) జీవో నెం. -671
2) జీవో నెం.- 672
3) జీవో నెం. -673
4) జీవో నెం. -674
47. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏ సంవత్సరంలో జగిత్యాల, సిరిసిల్లలను కల్లోలిత ప్రాంతాలుగా ప్రకటించింది?
1) 1977 2) 1978
3) 1979 4) 1980
48. 2004లో రాష్ట్ర ప్రభుత్వం పీపుల్స్ వార్ గ్రూపుపై నిషేధం ఎత్తివేసింది?
1) నక్సలైట్లు జనజీవన స్రవంతిలో కలవడానికి
2) ప్రభుత్వంతో చర్చల కోసం
3) నక్సలైట్లకు సంబంధించి సమాచారనిధి తయారు చేసేందుకు
4) నక్సలైట్లకు పునరావాసం కల్పించేందుకు
49. తెలంగాణ ప్రాంతీయ అభివృద్ధి బోర్డును రద్దు చేసిన ముఖ్యమంత్రి ఎవరు?
1) కె. విజయభాస్కర రెడ్డి
2) ఎన్.టి. రామారావు
3) ఎన్. చంద్రబాబు నాయుడు
4) వై.ఎస్ రాజశేఖర్ రెడ్డి
50. సరికాని జతను గుర్తించండి.
1) తెలంగాణ ఇన్ఫర్మేషన్ ట్రస్టు టి. ప్రభాకర్
2) తెలంగాణ సంఘర్షణ సమితి ఆనందరావు తోట
3) తెలంగాణ లెజిస్లేటర్స్ ఫోరమ్ వి. జగపతిరావు
4) ఉస్మానియా యూనివర్సిటీ ఫోరం ఫర్ తెలంగాణ- డా. జి. లక్ష్మణ్
51. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ప్రకారం?
ఎ. రాష్ర్టాల విస్తీర్ణం పెంచవచ్చు
బి. రాష్ర్టాల విస్తీర్ణం తగ్గించవచ్చు
సి. రాష్ర్టాల సరిహద్దులను మార్చవచ్చు
డి. రాష్ర్టాల పేర్లు మార్చవచ్చు
1) ఎ, బి, డి 2) ఎ, బి, సి, డి
3) బి, సి, డి 4) ఎ, బి, సి
52. కింది వారిలో ‘తెలంగాణ రాష్ర్టోద్యమాలు’ గ్రంథాన్ని రచించినది ఎవరు?
1) చెన్నమనేని హనుమంతరావు
2) దేవులపల్లి వెంకటేశ్వరరావు
3) ఆదిరాజు వెంకటేశ్వరరావు 4) మాదాల వీరభద్రరావు
సమాధానాలు
1-1 2-2 3-3 4-1 5-1 6-1 7-1 8-3 9-1 10-1 11-3 12-1
13-1 14-1 15-2 16-4 17-1 18-1 19-4 20-1 21-4 22-4 23-4 24-4 25-1 26-1 27-4 28-2 29-4 30-2 31-3 32-4
33-2 34-2 35-4 36-2
37-3 38-4 39-3 40-1
41-2 42-4 43-2 44-1
45-3 46-4 47-2 48-2 49-2 50-2 51-2 52-3
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు