POLITY | మానవ హక్కుల కమిషన్‌లో హోదారీత్యా సభ్యులు?
పాలిటీ
1. కిందివాటిలో కేంద్రానికి మాత్రమే వర్తించే సంస్థలు?
1) షెడ్యూల్డ్ తెగల జాతీయ కమిషన్
2) కేంద్ర ఎన్నికల సంఘం
3) మెట్రోపాలిటన్ ప్రణాళిక కమిటీ
4) జాతీయ న్యాయ నియామకాల కమిషన్
2. కింది వాటిలో రాష్ర్టానికి వర్తించే సంస్థలు?
1) సహకార సంఘాలు
2) షెడ్యూల్డ్ కులాల జాతీయ కమిషన్
3) రాష్ట్ర ఆర్థిక సంఘం
4) రాష్ట్ర ప్రణాళిక కమిటీలు
3. కిందివాటిలో బహుళ సభ్య సంస్థకానిది ఏది?
1) అటార్ని జనరల్ 2) ఆర్థిక సంఘం
3) ఎన్నికల సంఘం
4) ఎస్సీ, ఎస్టీ, జాతీయ కమిషన్
4. కేంద్ర ఎన్నికల సంఘం గురించి సరికానిది ఏది?
1) దీన్ని రాజ్యాంగంలో 15వ భాగంలో ప్రకరణలు 324 -329 వరకు పేర్కొన్నారు.
2) ఇది 1950లో ఏర్పడింది (జనవరి 25)
3) ఎన్నికల సంఘం సభ్యుల జీత భత్యాలను పార్లమెంట్ నిర్ణయిస్తుంది
4) వీరి జీతభత్యాలను ఆగంతుక నిధి నుంచి చెల్లిస్తారు
5. రాష్ట్ర ఎన్నికల సంఘం గురించి సరికానిది?
1) రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని 1992లో ఏర్పాటు చేశారు.
2) రాష్ట్ర ఎన్నికల సంఘం 73వ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చారు
3) రాష్ట్ర ఎన్నికల సంఘం షరతులు, అర్హతలను నిర్ణయించేది ముఖ్యమంత్రి
4) ఇది చట్టబద్ధమైన సంస్థ
6. కింది వాటిలో సరికాని దాన్ని గుర్తించండి?
1) రాష్ట్ర ఎన్నికల సంఘం షరతులు, అర్హతలను గవర్నర్ నిర్ణయిస్తాడు.
2) వీరి పదవీకాలం 5 సం.లు
3) ప్రస్తుతం వీరి జీత భత్యం రూ. 2,25,000
4) వీరి జీతం సుప్రీంకోర్టు న్యాయమూర్తితో సమానం.
7. ఈవీఎంల గురించి సరికాని వాక్యాన్ని రాయండి?
1) 2004లో ఈవీఎంలను ఉపయోగించారు
2) ఒక ఈవీఎంలో 3,760 ఓట్లను మాత్రమే రికార్డు చేయడానికి వీలుంటుంది.
3) ఒక్కో ఈవీఎం లో 80 మంది అభ్యర్థుల వివరాలను పొందు పరచవచ్చు
4) ఈవీఎంలో నిక్షిప్తమైన సమాచారం 10 సం..ల వరకు మెమరీలో ఉంటుంది.
8. కింది వాటిలో సరికానిది రాయండి
1) ఒక లోక్‌సభ స్వతంత్ర అభ్యర్థి పోటీ చేయుటకు 10 మంది ఓటర్ల మద్దతు కావాలి.
2) ఒక లోక్‌సభ రాజకీయ పార్టీ అభ్యర్థి పోటీ చేయడానికి ఒక్క ఓటరు మద్ధతు చాలు.
3) ఎస్సీ, ఎస్టీ అభ్యర్థి లోక్‌సభ అభ్యర్థిగా పోటీ చేయడానికి రూ. 25,000 దరావత్తు చెల్లించాలి.
4) ఒక బీసీ లోక్‌సభ అభ్యర్థిగా పోటీ చేయడానికి రూ.25,000 దరావత్తు చెల్లించాలి.
9. కింది వాటిలో సరికాని వాక్యాన్ని గుర్తించండి?
1) పోలై చెల్లిన ఓట్లలో 1/6వ వంతు వస్తే డిపాజిట్ దక్కినట్లు ప్రకటిస్తారు.
2) 2014లో ఎన్నికల పరిమితులను విధిస్తూ ఎన్నికల సంఘం మార్గదర్శకాలను జారీ చేసింది.
3) పెద్ద రాష్ర్టాల్లో లోక్‌సభకు పోటీచేసే అభ్యర్థి రూ. 77 లక్షలకు మించి ఖర్చు చేయరాదు.
4) చిన్న రాష్ట్రాల్లో లోక్‌సభకు పోటీ చేసే అభ్యర్థి రూ.70 లక్షలకు మించి ఖర్చు చేయరాదు
10. కింది చట్టాల్లో సరికాని దాన్ని గుర్తించండి.
1) ప్రజా ప్రాతినిద్య చట్టం 1950
2) ఎన్నికల నిర్వహణ, నిబంధనల చట్టం 1961
3) ఎన్నికల గుర్తు, ఆదేశాల చట్టం 2008
4) రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల చట్టం 1952
11. కేంద్ర ఆర్థిక సంఘం గురించి సరికానిది
1) దీన్ని రాజ్యాంగంలో 12వ భాగంలో పేర్కొన్నారు
2) దీన్ని రాజ్యాంగంలో ప్రకరణ 280-281 మధ్య పేర్కొన్నారు
3) ఆర్థిక సంఘాన్ని రాష్ట్రపతి నియమిస్తాడు
4) వీరి పదవీకాలం 8 సంవత్సరాలు
12. కేంద్ర ఆర్థిక సంఘం గురించి సరికానిది
1) ఆర్థిక సంఘం కేంద్ర రాష్ర్టాల మధ్య నిధుల పంపిణీ గురించి తెలియజేస్తుంది.
2) మొదటి ఆర్థిక సంఘం చైర్మన్ కె.సి. నియోగి
3) 14వ ఆర్థిక సంఘం చైర్మన్ విజయ్ కేల్కర్
4) ప్రస్తుత ఆర్థిక సంఘం చైర్మన్ నంద కిషోర్ సింగ్
13. 15వ ఆర్థిక సంఘం గురించి సరికానిది
1)15వ ఆర్థిక సంఘం కాలం 2020-2025
2)15వ ఆర్థిక సంఘం చైర్మన్ ఎన్.కె.సింగ్
3) 41% నిధులు రాష్ర్టానికి అందాలని సిఫారసు చేసింది.
4) దక్షిణాది రాష్ర్టాలకు పన్నులను తగ్గించకూడదని నిర్ణయించింది.
14. కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ గురించి సరికానిది గుర్తించండి?
1) దీన్ని రాజ్యాంగంలోని 5వ భాగంలో పేర్కొన్నారు.
2) దీన్ని148-151 నిబంధనల వరకు పేర్కొన్నారు
3) దీన్ని రాష్ట్రపతి నియమిస్తారు
4) దీనిలో రాజకీయ నాయకులకు కూడా అవకాశం ఇస్తారు.
15. రాజ్యాంగ పదవుల్లో పదవీ ప్రమాణ స్వీకారం చేసే ఏకైక పదవి ఏది?
1) ఎన్నికల సంఘం
2) కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్
3) నీతి ఆయోగ్
4) కేంద్ర మానవ హక్కుల సంఘం
16. కింది వాటిలో కంట్రోల్ అండ్ ఆడిటర్ జనరల్ గురించి సరికానిది?
1) డా. బి.ఆర్. అంబేద్కర్ ఈ పదవిని అత్యంత ముఖ్యమైనదిగా, భారత ఖజానా సంరక్షుడిగా అభివర్ణించాడు.
2) కాగ్ పదవీ కాలం 6 సంవత్సరాలు
3) కాగ్ పదవీ విరమణ తర్వాత ప్రభుత్వ నియామకాలకు అర్హుడు
4) కాగ్‌ను 148 నిబంధన ప్రకారం రాష్ట్రపతి తొలగిస్తాడు
17. కాగ్‌కు సంబంధించి సరికానిది?
1) కాగ్ ప్రభుత్వానికి విధేయుడుకాదు, బాధ్యుడు కాదు అన్నది నెహ్రూ
2) ప్రస్తుత కాగ్ జనరల్ రాజీవ్ మహర్షి
3) కాగ్ నివేదిక ప్రభుత్వానికి రుచించకపోవచ్చు పాల్ అపెల్బీ
4) మొదటి కాగ్ అటార్ని జనరల్ నరహరిరావ్
18. అటార్ని జనరల్ గురించి సరికానిది?
1) కేంద్రంలో అత్యున్నత న్యాయాధికారి
2) ఈ పదవిని అమెరికా నుంచి గ్రహించారు
3) 76వ నిబంధన ప్రకారం అటార్ని జనరల్‌ను రాష్ట్రపతి నియమిస్తాడు.
4) వీరి పదవీకాలం రాష్ట్రపతి విశ్వాసంపై ఆధారపడి ఉంటుంది.
19. అటార్ని జనరల్ గురించి సరికానిది?
1) మొదటి అటార్ని జనరల్ ఆఫ్ ఇండియా సీతల్ వాడ్
2) అటార్ని జనరల్‌ను రాష్ట్రపతి ఎప్పుడైనా తొలగించవచ్చు
3) ప్రస్తుత అటార్ని జనరల్ వేణుగోపాల్
4) వీరి జీతభత్యం రూ. 3,00,000
20. అడ్వకేట్ జనరల్ గురించి సరికానిది?
1) రాష్ట్రంలో అత్యున్నత న్యాయాధికారి అడ్వకేట్ జనరల్
2) 165(1)ఆర్టికల్ ప్రకారం గవర్నర్ అడ్వకేట్ జనరల్‌ను నియమిస్తారు.
3) వీరు రాష్ట్రపతి విశ్వాసం ఉన్నంత వరకు పదవిలో ఉంటారు.
4) వీరు హైకోర్టు న్యాయమూర్తికి ఉన్న అర్హతలు కలిగి ఉండాలి.
21. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గురించి సరికానిది?
1) దీన్ని రాజ్యాంగంలో14వ భాగంలో పేర్కొన్నారు
2) దీన్ని రాజ్యాంగంలో 315-320 అధికరణల మధ్య పేర్కొన్నారు
3) దీన్ని కమిషన్ సిఫారసుల మేరకు ఏర్పాటు చేశారు.
4) వీరందరి పదవీకాలం 5సంవత్సరాలు
22. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గురించి సరికానిది?
1) మొదటి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ కృపలాని
2) ప్రస్తుత యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ మనోజ్ సోని
3) 319 ప్రకరణ ప్రకారం పదవీ విరమణ తర్వాత ప్రభుత్వ పదవులకు అర్హులు
4) 320 అధికరణం ప్రకారం ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్లను అఖిల భారత సర్వీసులంటారు
23. సివిల్ సర్వీస్ కమిషన్లకు సంబంధించి సరికానిది
1)మెకాలే కమిటీ 1854
2) కొఠారి కమిటీ 1980
3) సతీష్ చంద్ర కమిటీ 1988
4) నిగమేఖర్ కమిటీ 2012
24. జాతీయ షెడ్యూల్డ్ కులాల కమిషన్ గురించి సరికానిది గుర్తించండి?
1) రాజ్యాంగంలో 338 అధికరణం ప్రకారం జాతీయ కమిషన్‌ను ఏర్పాటు చేశారు.
2) దీనిలో ఒక చైర్మన్, ఒక వైస్ చైర్మన్ ముగ్గురు సభ్యులు ఉంటారు.
3) ఒక మహిళా సభ్యురాలు తప్పనిసరిగా ఉండాలి.
4) ఈ కమిషన్‌ను ప్రధానమంత్రి నియమిస్తారు.
25. జాతీయ ఎస్సీ కమిషన్ గురించి సరికానిది ఏది?
1) వీరికి కేంద్ర క్యాబినేట్ హోదా ఉండాలి.
2) మొదటి ఎస్సీ కమిషన్ చైర్మన్ సూరజ్‌బాన్
3) ఇది అన్ని కులాల వారి సంరక్షణను కోరుతుంది
4) ప్రస్తుత ఎస్సీ కమిషన్ చైర్మన్ రామ్‌శంకర్ కఠారియా
26. జాతీయ షెడ్యూల్డ్ తెగల కమిషన్ గురించి సరికానిది
1) దీన్ని రాజ్యాంగంలో 16వ భాగంలో 338ఎ నిబంధనలో పేర్కొన్నారు
2) మొదటి ఎస్టీ కమిషన్ చైర్మన్ కుణ్వర్సింగ్
3) ప్రస్తుత ఎస్టీ కమిషన్ చైర్మన్ నంద కుమార్ సాయి
4) షెడ్యూల్డ్ కమిషన్ 3వ చైర్మన్ భూటాసింగ్
27. జాతీయ షెడ్యూల్డ్ తెగల కమిషన్ గురించి సరికానిదేది?
1) ఇది రాజ్యాంగ పరమైన సంస్థ
2) దీనిలో 1 చైర్మన్ ,1 వైస్ చైర్మన్, ముగ్గురు సభ్యులు ఉంటారు.
3) వీరి పదవీకాలం 10 సంవత్సరాలు
4) వీరు తమ రాజీనామా పత్రాన్ని రాష్ట్రపతికి ఇవ్వాలి.
28. జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్ గురించి సరికానిదేది?
1) దీన్ని 338 అధికరణం ద్వారా రాజ్యాంగంలో చేర్చారు.
2) దీన్ని రాజ్యాంగంలో 340 అధికరణం ద్వారా రాష్ట్రపతి నియమిస్తారు.
3) దీనిలో 1 చైర్మన్ ,1 వైస్ చైర్మన్ ముగ్గురు సభ్యులు ఉంటారు.
4) 338(86) ప్రకారం ఇది రాష్ట్రపతికి నివేదికను సమర్పించాలి.
29. జాతీయ బీసీ కమిషన్‌ను గురించి సరికానిది
1) జాతీయ బీసీ కమిషన్ మొదటి చైర్మన్ శ్యామ్‌సుందర్
2) జాతీయ బీసీ కమిషన్ ప్రస్తుత చైర్మన్ భగవాన్ లాల్ సహాని
3) వీరి పదవీకాలం 8 సంవత్సరాలు
4) వీరిని రాష్ట్రపతి తొలగిస్తారు.
30. కింది వాటిలో అతి ప్రాచీనమైన చట్టబద్ధ సంస్థ ఏది?
1) జాతీయ మానవ హక్కుల కమిషన్
2) మైనారిటీ హక్కుల కమిషన్
3) బాలల హక్కుల కమిషన్
4) మహిళా హక్కుల కమిషన్
31. మానవ హక్కుల కమిషన్‌లో హోదారీత్యా సభ్యులు?
1) జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్లు
2) జాతీయ మహిళా కమిషన్ చైర్పర్సన్
3) జాతీయ మైనారిటీ హక్కుల కమిషన్ చైర్మన్
4) పై అందరూ
32. మానవ హక్కుల కమిషన్ చైర్మన్ నియామకానికి అర్హత
1) సుప్రీం కోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి
2) హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి
3) సుప్రీంకోర్టు సాధారణ న్యాయమూర్తి
4) పైవేవీ కావు.
33. జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు సంబంధించి సరికానిదేది?
1) ఇవి రాజ్యాంగపరమైన సంస్థలు
2) 2003లో జాతీయ ఎస్సీ,ఎస్టీ కమిషన్లను వేరు చేశారు.
3) ప్రకరణ 338,338(ఎ) లో వీటి ప్రస్తావన ఉంది
4) పైవన్నీ సరైనవే
34. కింది వాటిలో సరైనది?
1) జాతీయ ఎస్టీ, కమిషన్ మొదటి చైర్మన్-సూరజ్‌బాన్
2) జాతీయ ఎస్సీ కమిషన్ మొదటి చైర్మన్-ఎస్.రామ్ధన్
3) జాతీయ ఎస్సీ కమిషన్ ప్రస్తుత చైర్మన్- పూనియా
4) పైవన్నీ సరైనవే
35. ఈ కింది ఏ కమిషన్‌లో ఒక మహిళా సభ్యురాలు తప్పక ఉండాలి.
1) జాతీయ ఎస్సీ కమిషన్
2) జాతీయ ఎస్టీ కమిషన్
3) జాతీయ బాలల హక్కుల కమిషన్
4) పైవన్నీ
36 .ఈ కింది వానిలో సరైనది ఏది?
1) ఆంధ్రప్రదేశ్‌లో ఎస్సీ, ఎస్టీ కమిషన్ 2003లో ఏర్పాటు అయినది
2) ఇందులో 5 మంది సభ్యులు ఉంటారు.
3) మొట్టమొదటి చైర్మన్ జస్టిస్ కె. పున్నయ్య
4) పైవన్నీ
37. ఈ కింది వారిలో సరిగా జతపరచింది.
ఎ. జయంత్ పట్నాయక్-జాతీయ మహిళా కమిషన్ మొదటి చైర్పర్సన్
బి. జస్టిస్ రంగనాథ్ మిశ్రా-జాతీయ మానవ హక్కుల కమిషన్ మొదటి చైర్మన్
సి. జస్టిస్.ఆర్.ఎస్.ప్రసాద్-జాతీయ వెనుక బడిన తరగతుల మొదటి చైర్మన్
డి. పైవన్నీ
38. జస్టిస్ రాజేంద్ర సింగ్ సచార్ కమిటీ ఏ అంశాలను పరిశీలించింది?
1) మైనారిటీల స్థితిగతులను
2) మహిళల స్థితిగతులను
3) వెనుకబడిన తరగతుల స్థితిగతులను
4) పైవేవీకావు
39. జాతీయ సఫాయి కర్మచారీ కమిషన్‌కు సంబంధించి సరైనది?
1) 1993లో ఏర్పాటైంది
2) ఒక చైర్మన్, వైస్ చైర్మన్, ఐదుగురు సభ్యులుంటారు
3) వీరిని కేంద్ర ప్రభుత్వం నియమిస్తుంది.
4) పైవన్నీ
40. మానవ హక్కుల రక్షణ చట్టం 1993 ప్రకారం జాతీయ మానవ హక్కుల కమిషన్‌ను ఏర్పాటు చేసే అధికారం ఎవరికి ఉంటుంది?
1) కేంద్ర ప్రభుత్వం 2) భారత రాష్ట్రపతి
3) భారత పార్లమెంట్ 4) ప్రధానమంత్రి
జవాబులు
1- 3 2- 2 3-1 4-4
5-3 6-4 7-3 8-3
9-4 10-3 11-4 12-3
13-4 14-4 15-2 16-3
17-3 18-2 19-4 20-3
21-4 22-3 23-2 24-4
25-3 26-4 27-3 28-3
29-2 30-4 31-2 32-4
33-4 34-4 35-4 36-4
37-1 38-4 39-1 40-3
ఆంజనేయులు
ఫ్యాకల్టీ
ఏకేఆర్ స్టడీ సర్కిల్
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు