Biology | సింకోనా మొక్కలోని ఏ భాగం నుంచి ఔషధం లభిస్తుంది?
వృక్ష శాస్త్రం
1. ఒక విద్యార్థి గమనించిన మొక్కలో ప్రధాన వేరు లావుగా ఉండి ఇరువైపులా అనేక సన్న వేర్లున్నాయి. అయితే అది ఏ వేరు వ్యవస్థ ?
1) తల్లివేరు 2) అబ్బురపు
3) పీచువేరు 4) గుబురువేరు
2. కింది వాటిలో వేరు దుంపకానిది?
1) క్యారెట్ 2) బీట్రూట్
3) ముల్లంగి 4) బంగాళదుంప
3. రెసిన్స్ లభించే మొక్క?
1) సపోటా 2) జట్రోప
3) రబ్బరు 4) చూయింగ్ గమ్
4. పత్రరంధ్రాల ద్వారా నీరు ఆవిరి రూపంలో కోల్పోవడాన్ని ఏమంటారు?
1) బాష్పీభవనం 2) శ్వాసక్రియ
3) విస్తరణ 4) బాష్పోత్సేకం
5. అల్లం, పసుపు, వెల్లుల్లిలో ఆహారం నిల్వ ఉండే భాగం?
1) వేరు 2) పత్రం
3) కాండం 4) దుంపవేరు
6. మానవ అస్థిపంజరం ఎముకలు అయితే, పత్రపు అస్థిపంజరం?
1) ఈనెలు 2) పత్రవృంతం
3) పత్రపుచ్ఛం 4) పత్రపీఠం
7. మానవునికి ఫలాలనిచ్చే మొక్కలు?
1) వివృతబీజాలు 2) ఆవృత బీజాలు
3) బ్రయోఫైటా 4) టెరిడోఫైటా
8. కింది వాటిలో ప్రసరణ కణజాలాలు ఉన్న మొక్కలు?
1) థాలోఫైటా 2) బ్రయోఫైటా
3) టెరిడోఫైటా 4) పైవేవీకావు
9. వృక్షాయుర్వేదం అనే గ్రంథం రచించిన వ్యక్తి?
1) పరాశరుడు 2) చరకుడు
3) శుశ్రూతుడు 4) థియోప్రాస్టస్
10. కృషి పరాశరం రచించిన వ్యక్తి?
1) చరకుడు 2) పరాశరుడు
3) శుశ్రూతుడు 4) అరిస్టాటిల్
11. జీవులను కేంద్రక పూర్వ జీవులు, నిజ కేంద్రక జీవులుగా వర్గీకరించింది ఎవరు?
1) లిన్నేయస్ 2) హెకెల్
3) చాటన్ 4) విట్టేకర్
12. విట్టేకర్ ఆదిమ జీవులను ఏ రాజ్యంలో చేర్చారు?
1) మొనిరా 2) ప్రొటిస్టా
3) ఫంగి 4) ప్లాంటే
13. తోళ్లకు పదునుపెట్టే టానింగ్ పరిశ్రమలో తోడ్పడే పదార్థాలు?
1) జిగురులు 2) టానిక్స్
3) లేటిక్స్ 4) కొకైన్
14. పెన్సిలిన్కు గాను Alexander Fleming, Ernest Boris Chain and Howard Walter Floreyకు నోబెల్
బహుమతి ఎప్పుడు లభించింది?
1) 1902 2) 1935
3) 1945 4) 1962
15. శిలీంధ్రాల నుంచి వేరు చేసిన మొదటి సూక్ష్మజీవనాశకం ?
1) అరియోమైసిన్ 2) స్ట్రెప్టోమైసిన్
3) పెన్సిల్లియం 4) పెన్సిలిన్
16. రొట్టెలపై ఆవాసం ఉండే శిలీంధ్రం ?
1) మోనీలియా 2) ఈస్ట్
3) రైజోపస్ 4) ఆస్పర్జిల్లస్
17. ఈస్ట్లలో అలైంగికోత్పత్తి ఏ విధంగా జరుగుతుంది?
1) కోరకాలు 2) సిద్ధబీజాలు
3) సంయోగబీజాలు
4) పైవన్నీ
18. జున్ను పరిశ్రమలో తోడ్పడే సూక్ష్మజీవులు?
1) శైవలాలు 2) శిలీంధ్రాలు
3) బ్యాక్టీరియాలు 4) వైరస్
19. మొక్కల్లో అవయవ విచ్ఛేదనం లేని మొక్కలు?
1) శైవలాలు
2) శిలీంధ్రాలు
3) 1, 2 4) బ్రయోఫైటా
20. మొక్కల్లో నాళికా కణజాలాలు గల విత్తనాలు లేని మొక్కలు?
1) బ్రయోఫైటా 2) టెరిడోఫైటా
3) మాస్ 4) వివృతబీజాలు
21. విత్తనాలు లేకుండా, ఫలాలు లేకుండా, నాళికా కణజాలాలు లేకుండా అవయవ విభేదనం కలిగిన మొక్కలు?
1) బ్రయోఫైటా 2) థాలోఫైటా
3) ఫెర్న్ 4) జిమ్నోస్పెర్మ్
22. బ్రయోఫైటా తరగతికి చెందిన మొక్కలను ఏమంటారు?
1) ఫెర్న్ 2) మాస్
3) థాలస్ 4) పైవేవీ కావు
23. ఉద్యానవనంలో అలంకరణ కోసం పెంచే మొక్కలు?
1) మాస్ 2) ఫెర్న్
3) జిమ్నోస్పెర్మ్ 4) 1, 2
24. వెండి పత్రాలపై పౌరాణిక చిత్రాలు గీసే సంప్రదాయ కళగా గల జిల్లా ఏది?
1) వరంగల్ 2) ఖమ్మం
3) నల్లగొండ 4) నెల్లూరు
25. కెవాలియన్ స్మిత్ జీవులను ఎన్ని రాజ్యాలుగా విభజించారు?
1) 2 2) 4
3) 6 4) 3
26. దోస, సొర, బొప్పాయిలో ఏ పుష్పాలుంటాయి?
1) ద్విలింగ పుష్పాలు 2) ఏకలింగ పుష్పాలు
3) 1, 2 4) పైవేవీ కావు
27. పుష్పంలోని రెండో వలయం ఏది?
1) రక్షకపత్రావళి 2) ఆకర్షణ పత్రావళి
3) కేసరావళి 4) అండకోశం
28. పరోక్షంగా ప్రత్యుత్పత్తికి తోడ్పడే పుష్పభాగం ఏది?
1) రక్షకపత్రావళి 2) ఆకర్షణ పత్రావళి
3) కేసరావళి 4) అండకోశం
29. అండకోశంలోని ఉబ్బిన పీఠభాగాన్ని ఏమంటారు?
1) పుష్పాసనం 2) పిండకోశం
3) అండాశయం 4) అండం
30. పిండకోశంలోని కణాల సంఖ్య?
1) 7 2) 8 3) 3 4) 4
31. మొక్కల పరాగ సంపర్కంపై పరిశోధన జరిపిన శాస్త్రవేత్త?
1) సలీం అలీ 2) థియోఫ్రాస్టస్
3) లిన్నేయస్ 4) డార్విన్
32. పుష్పంలో పరాగ రేణువులు అదే పుష్పంలో కీలగ్రాన్ని చేరితే దాన్ని ఏమంటారు?
1) పరపరాగ సంపర్కం
2) క్రాస్పాలినేషన్
3) స్వపరాగ సంపర్కం
4) హెటిరోగమి
33. మొక్క ఏ విసర్జక పదార్థం నుంచి చూయింగ్ గమ్ లభిస్తుంది?
1) జిగురులు 2) లేటెక్స్
3) టానిక్స్ 4) మార్ఫిన్
34. ద్విఫలదీకరణను కనుగొన్న వ్యక్తి?
1) స్ట్రాస్ బర్గర్ 2) డార్విన్
3) నవాషిన్ 4) నవాక్రాన్
35. ఏ పంట పరాగ సంపర్కం జరగక ఫలాల దిగుబడి తగ్గడం వల్ల రైతులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకున్నారు?
1) వరి 2) కందులు
3) మినుములు 4) పొద్దుతిరుగుడు
36. ఐరోపా వర్తకులు వ్యాప్తి చేసిన పంట విత్తనం ?
1) కందులు 2) మినుములు
3) టమాటా 4) గోధుమ
37. తామర, విత్తనాలు ఏ విధంగా వ్యాప్తి చెందుతాయి?
1) గాలి 2) నీరు
3) పక్షులు 4) మానవులు
38. ఆర్కిడ్ మొక్కల విత్తనాలు ఏ విధంగా వ్యాప్తి చెందుతాయి?
1) గాలి 2) నీరు
3) పక్షులు 4) మానవులు
39. ఒక ఆవమొక్క తన జీవితకాలంలో ఎన్ని విత్తనాలు ఏర్పరుస్తుంది?
1) 1000 2) 10000
3) 100000 4) 100
40. బెండ, ఆవ మొక్కల్లో విత్తనాలు ఏ విధంగా వ్యాప్తి చెందుతాయి?
1) గాలి 2) నీరు
3) పక్షులు 4) పేలడం ద్వారా
41. హావియా బ్రెజిలెన్సిస్ నుంచి లభించే ఉపయోగకర పదార్థం?
1) గమ్స్ 2) లేటెక్స్
3) టానిక్స్ 4) మార్ఫిన్
42. సింకోనా మొక్కలోని ఏ భాగం నుంచి ఔషధం లభిస్తుంది?
1) పత్రం 2) పుష్పం
3) వేరు 4) బెరడు
43. మొక్కలలో గాయాలు మానడానికి తోడ్పడే విసర్జక పదార్థాలు?
1) జిగురులు 2) టానిక్స్
3) ఆల్కలాయిడ్స్ 4) లేటెక్స్
44. తుమ్మ, తంగేడు బెరడు నుంచి లభించే, ఉపయోగపడే పదార్థాలు?
1) జిగురులు 2) టానిక్స్
3) లేటెక్స్ 4) ఆల్కలాయిడ్స్
45. మలేరియా నివారణకు తోడ్పడే ఔషధం?
1) సింకోనా 2) మార్ఫిన్
3) క్వినైన్ 4) కొకైన్
జవాబులు
1.1 2.4 3.3 4.4
5.3 6.1 7.2 8.3
9.1 10.2 11.3 12.1
13.2 14.3 15.4 16.3
17.1 18.2 19.3 20.2
21.1 22.2 23.2 24.1
25.3 26.3 27.2 28.2
29.3 30.1 31.4 32.3
33.2 34.3 35.4 36.3
37.2 38.1 39.2 40.4
41.3 42.2 43.1 44.2
45.3
జీవ శాస్త్రం
1. సైన్స్ సరిదిద్దిన తప్పులను చరిత్ర అని అన్న వ్యక్తి?
1) ఐన్స్టీన్ 2) కార్ల్పాపర్
3) హోవర్ట్ ప్లోరి 4) అరిస్టాటిల్
2. ‘సైన్షియా’ అనేది ఏ భాషా పదం?
1) గ్రీకు 2) లాటిన్
3) జర్మన్ 4) ఫ్రెంచ్
3. సైన్స్ ఎప్పటికప్పుడు మార్చిరాసిన చరిత్ర అని తెలిపిన వ్యక్తి?
1) అరిస్టాటిల్ 2) లామార్క్
3) ఐన్స్టీన్ 4) రెనిలెన్నిక్
4. జీవశాస్త్ర పితామహుడు ఎవరు?
1) లామార్క్ 2) లూయీపాశ్చర్
3) అరిస్టాటిల్ 4) డార్విన్
5. ‘బయోస్, లాగోస్’ అనేవి ఏ భాషా పదాలు?
1) జర్మనీ 2) ఫ్రెంచ్
3) గ్రీకు 4) లాటిన్
6. సముద్రం ఒడ్డున పక్షులు ఎగరటాన్ని గమనించి శాటిలైట్ ప్రయోగాలు జరిపిన శాస్త్రవేత్త?
1) ఏపీజే అబ్దుల్ కలాం
2) కార్ల్పాపర్ 3) ఐన్స్టీన్
4) లామార్క్
7. సజీవి నిర్మాణాత్మక క్రియాత్మక ప్రమాణం ఏది?
1) పరమాణువు 2) అణువు
3) కణం 4) పదార్థాలు
8. పదార్థాలు స్ఫటిక రూపంలో ఆగిపోతే ఏర్పడే జీవులు?
1) మొక్కలు 2) జంతువులు
3) సజీవులు 4) నిర్జీవులు
9. పదార్థం మూల ప్రమాణం?
1) అణువు 2) కణం
3) మాలిక్యూల్ 4) పరమాణువు
10. కింది వాటిలో మానవుని నినాదం?
1) జీవించు-చావు
2) జీవించు-జీవించనివ్వు
3) చంపు-చావు
4) నిండు జీవితానికి రెండు చుక్కలు
11. ‘బయాలజీ’ అనే పదాన్ని ప్రతిపాదించిన వ్యక్తి ఎవరు?
1) అరిస్టాటిల్ 2) లామార్క్
3) లీవెన్ హుక్ 4) లిన్నేయస్
12. జీవశాస్త్రంలో శాస్త్రీయ విధానంలో పరిశోధన జరిపిన వ్యక్తి?
1) లామార్క్ 2) అరిస్టాటిల్
3) లిన్నేయస్ 4) కార్ల్పాపర్
13. కింది వాటిలో సరికానిది గుర్తించండి.
ఎ. అరిస్టాటిల్ – శాస్త్రీయ విధానం, పక్షుల పిండాభివృద్ధి వర్ణించారు
బి. విలియం హార్వే – శాస్త్రీయ పద్ధతి, రక్తప్రసరణ వ్యవస్థ
సి. లూయీపాశ్చర్ – ఆంథ్రాక్స్ వ్యాధికి టీకా, యాంటీ రేబిస్, పాశ్చరైజేషన్
డి. సర్ రోనాల్ట్ రాస్ – మలేరియా, ఫైలేరియా, ఎన్సెఫలైటిస్
1) ఎ, సి 2) ఎ, బి
3) డి 4) బి, డి
14. కింది వాటిలో సరికానిది గుర్తించండి.
1) డీఎన్ఏ డబుల్ హెలిక్స్ – వాట్సన్, క్రిక్
2) సర్ టి.ఎస్. వెంకట్రామన్ – కొత్తరకం జొన్న, చెరకు వంగడాన్ని కనుగొన్నాడు
3) పంచానన్ మహేశ్వరి – పరస్థానిక ఫలదీకరణం
4) బీర్బల్ సహాని – ఖండాల కదలిక సిద్ధాంతం
15. కింది వాటిలో సరైనవి గుర్తించండి.
ఎ. ఎం.ఎస్. స్వామినాథన్ – ఐసీఏఆర్ డైరెక్టర్ జనరల్, ఐఆర్ఆర్కు డైరెక్టర్గా, వరి, గోధుమ, బంగాళదుంప, నార మొక్కలకు చెందిన హైబ్రిడ్స్ను కనుగొన్నారు
బి. డాక్టర్ సలీం అలీ – పాల్గెట్టి అవార్డు, ఆర్నిథాలజీ పితామహుడు
సి. హరగోబింద్ ఖురానా – డీఎన్ఏ, జన్యువు
డి. హేబర్ల్యాండ్ – టిష్యూ కల్చర్
1) ఎ, బి 2) ఎ, సి
3) ఎ, బి, డి 4) పైవన్నీ సరైనవే
16. జతపరచండి.
ఎ. హైదరాబాద్ 1. IARI, ICMR
బి. న్యూఢిల్లీ 2. ICRISAT, CCMB, NIN
సి. లక్నో 3. CRRI
డి. కటక్ 4. NBRI, IISR
1) ఎ-1, బి-4, సి-2, డి-3
2) ఎ-1, బి-2, సి-4, డి-3
3) ఎ-2, బి-1, సి-4, డి-3
4) ఎ-2, బి-4, సి-1, డి-3
17. టెట్రాసైక్లిన్, ఫోలిక్ ఆమ్లం, క్యాన్సర్ నిరోధక ఔషధాలను అభివృద్ధి చేసింది, అద్భుత ఔషధ సృష్టికి మంత్రగాడు ఎవరు?
1) డా. సలీం అలీ 2) ఖురోనా
3) డా. వై సుబ్బారావు 4) హుక్
18. ఉష్ణమండల పంట మొక్కలపై పరిశోధన చేసే సంస్థ?
1) NBRI 2) IISR
3) CCMB 4) ICRISAT
19. గతించిన జీవులు వదిలిన ముద్రలు గురించి తెలియజేసే శాస్త్రం?
1) పేలియంటాలజీ 2) పాలినాలజీ
3) జూజియోగ్రాఫీ 4) పైవన్నీ
20. అనువంశికత, జన్యువు గురించి తెలిపేది?
1) సైకాలజీ 2) జెనెటిక్స్
3) ఎకాలజీ 4) botony
జవాబులు
1.2 2.2 3.3 4.3
5.3 6.1 7.3 8.4
9.4 10.2 11.2 12.2
13.3 14.2 15.3 16.3
17.3 18.4 19.1 20.2
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు