Telangana DOST 2023 | ఇక యాప్‌లోనూ దోస్త్
హైదరాబాద్, మే 11 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలోని డిగ్రీ కాలేజీల్లో ఆన్లైన్ ప్రవేశాల ప్రక్రియ మొదలైంది. ఇందుకు వీలుగా డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ (దోస్త్)2023 నోటిఫికేషన్‌ను గురువారం ఉన్నత విద్యామండలి చైర్మన్ ఆర్ లింబాద్రి, కళాశాల విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిట్టల్ విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు హైదరాబాద్‌లోని ఉన్నత విద్యామండలి కార్యాలయంలో మాట్లాడుతూ, మూడు విడతల్లో డిగ్రీ సీట్లను భర్తీ చేస్తామని స్పష్టంచేశారు. ఈ నెల 16 నుంచి జూన్ 10 వరకు మొదటి విడత, జూన్ 16 నుంచి 26 వరకు రెండో విడత, జూలై 1 నుంచి 5 వరకు మూడో విడత రిజిస్ట్రేషన్లను నిర్వహించనున్నట్టు వెల్లడించారు. జూలై 11 నుంచి 15 వరకు విద్యార్థులకు ఓరియెంటేషన్ తరగతులు ఉంటాయని పేర్కొన్నారు. జూలై 17 నుంచి డిగ్రీ మొదటి సెమిస్టర్ తరగతులను ప్రారంభిస్తామని తెలిపారు. సమావేశంలో ఉన్నత విద్యామండలి కార్యదర్శి డాక్టర్ ఎన్ శ్రీనివాస్‌రావు, కళాశాల విద్య ఆర్జేడీ యాదగిరి, ప్రొఫెసర్ రాజేందర్‌సింగ్, తిరువెంగళాచారి, యమునారాణి, వసుంధర పాల్గొన్నారు.
డిగ్రీ సీట్లు 3.86 లక్షలే !
డిగ్రీ కోర్సుల్లో భర్తీకాకుండా మిగిలిన 86,670 సీట్లను అధికారులు ఫ్రీజ్ చేశారు. ఈ సీట్లను వచ్చే విద్యాసంవత్సరంలో భర్తీ చేయకుండా నిలిపివేశారు. దీంతో ఈసారి దోస్త్ ద్వారా 3,86,544 సీట్లను మాత్రమే భర్తీ చేస్తారు. రాష్ట్రంలో మొత్తం 1,054 డిగ్రీ కాలేజీలున్నాయి. వీటిల్లో 136 ప్రభుత్వ కాలేజీలు కాగా, 67 రెసిడెన్షియల్, 851 ప్రైవేట్ కళాశాలలున్నాయి. వీటిల్లో నిరుడు వరకు మొత్తం 4.73 లక్షలు సీట్లున్నాయి. అయితే, ఇంటర్లో ఏటా 2.9 లక్షల మంది విద్యార్థులు మాత్రమే ఉత్తీర్ణులవుతున్నారు. వీరిలో కొందరు ఇంజినీరింగ్, మెడికల్, ఫార్మసీ వంటి కోర్సుల్లో చేరుతున్నారు. వీరిని మినహాయిస్తే 2 లక్షల మంది విద్యార్థులు డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలు పొందుతున్నారు. ఫలితంగా డిగ్రీ కోర్సుల్లో 2.73 లక్షల సీట్లు మిగులుతున్నాయి. కొన్ని కాలేజీల్లో ఒక్కో కోర్సులో ఐదుగురులోపే విద్యార్థులు ప్రవేశాలు పొందుతున్నారు.
కొత్తగా దోస్త్ యాప్
ఈసారి రిజిస్ట్రేషన్ ప్రక్రియను సులభతరం చేసేందుకు కొత్తగా DOST అనే యాప్‌ను తీసుకొచ్చారు. ఆండ్రాయిడ్ ఫోన్లో దీనిని డౌన్లోడ్ చేసుకొని ఫేషియల్ రికగ్నిషన్ సర్వీస్ ద్వారా దోస్త్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఇదివరకు ఆధార్‌తో అనుసంధానించిన మొబైల్ నంబర్, టీ యాప్ ఫోలియో, మీ సేవా కేంద్రాల ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకొన్నారు. కాగా, ఈ ఏడాది గిరిజన విద్యార్థులకు సీట్ల భర్తీలో 10శాతం రిజర్వేషన్లను అమలు చేస్తారు.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు