Economy | చిరుధాన్యాల ఎగుమతిలో రెండో అతిపెద్ద దేశం?
ఎకానమీ
1. 2023-24 బడ్జెట్లో ఉపయోగించిన ‘ముని’ అనే పదం దేన్ని సూచిస్తుంది? జవాబు: బి
ఎ) మున్సిపాలిటీల కోసం కొత్త పథకాలు
బి) మున్సిపాలిటీ జారీ చేసిన రుణ భద్రత
సి) లైంగిక వేధింపుల ద్వారా దోపిడీకి గురైన పిల్లలకు ఇచ్చిన రుణాలు
డి) అనాథల కోసం నగదు సబ్సిడీ పథకం
వివరణ: మున్సిపల్ బాండ్(ముని): అంటే హైవేలు, వంతెనలు లేదా పాఠశాలల నిర్మాణం వంటి మూలధన వ్యయాలకు ఆర్థిక సాయం చేయడానికి రాష్ట్రం, మున్సిపాలిటీ లేదా దేశం జారీ చేసిన రుణ భద్రత.
2. కింది వాటిని పరిశీలించండి. జవాబు: సి
1. సమ్మిళిత అభివృద్ధి
2. మౌలిక వసతులు, మూలధనం
3. సౌరవృద్ధి
4. ఆర్థిక రంగం
5. చిట్టచివరి వ్యక్తికి కూడా లబ్ధి చేకూరడం
6. సమర్థతను వెలికి తీయడం
7. ఆర్థిక స్వాతంత్య్రం
పై అంశాల్లో బడ్జెట్లో చర్చించిన సప్తర్షిలో భాగాలు ఏవి?
ఎ) 1, 2, 3, 4, 6
బి) 1, 2, 3, 4, 5, 6, 7
సి) 1, 2, 4, 5, 6
డి) 2, 3, 4, 6, 7
వివరణ: బడ్జెట్ ఏడు ప్రాధాన్యాలను అనుసరించింది.
1. సమ్మిళిత అభివృద్ధి,
2. చిట్టచివరి వ్యక్తికి కూడా లబ్ధి చేకూరడం, 3. మౌలిక సదుపాయాలు, పెట్టుబడి,
4. సామర్థ్యాలను వెలికితీయడం,
5. హరిత వృద్ధి,
6. యువశక్తి,
7. ఆర్థిక రంగం
3. కింది వాక్యాలను పరిశీలించండి. జవాబు: బి
1. 2021-22 నుంచి 2023-24 వరకు జీడీపీలో ద్రవ్యలోటు శాతం క్రమంగా పెరుగుతుంది.
2. 2022-23తో పోల్చినప్పుడు జీడీపీలో ప్రభావవంతమైన రెవెన్యూ లోటు శాతం వేగంగా తగ్గింది.
3. 2021-22 నుంచి జీడీపీలో ప్రాథమిక లోటు శాతం వేగంగా పెరిగింది.
4. 2021-22 నుంచి జీడీపీలో రెవెన్యూ లోటు శాతం వేగంగా తగ్గింది. పై అంశాల్లో ఏవి సరైనవి కావు?
ఎ) 1, 2, 3
బి) 1, 3, 4
సి) 2 డి) 3, 4
4. బడ్జెట్లో పేర్కొన్న దురంతో, హమ్‌సఫర్, తేజస్ వేటిని సూచిస్తాయి? జవాబు: ఎ
ఎ) రైళ్లలో రకాలు బి) క్షిపణుల్లో రకాలు
సి) గన్లలో రకాలు డి) హైడ్రోజన్ రకాలు
వివరణ: కేంద్ర బడ్జెట్ భారతీయ రైల్వేలకు రికార్డు స్థాయిలో 2.40లక్షల కోట్ల కేటాయింపులు ప్రతిపాదించింది. ప్రయాణికుల సంఖ్యలో పెరుగుదల అంచనాలతో రాజధాని, శతాబ్ది, దురంతో, హమ్‌సఫర్, తేజస్ వంటి ప్రీమియం రైళ్లలో 1,000 కన్నా ఎక్కువ కోచ్‌లను పునరుద్ధరించాలని రైల్వే శాఖ యోచిస్తోంది.
5. కింది వాక్యాలను పరిశీలించండి. జవాబు: సి
1. భారతీయ ప్రకృతి వ్యవసాయ జైవిక వనరుల కేంద్రాలు వ్యవసాయ రంగంలో రసాయన ఎరువుల విస్తృత వినియోగంతో తలెత్తే పర్యావరణ, ఆరోగ్య సమస్యలు పరిష్కరించే లక్ష్యంతో ఉన్నాయి.
2. కేంద్ర బడ్జెట్ 2023-24 సహజ వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికి 1000 జైవిక ఉత్పాదక వనరుల కేంద్రాలు ఏర్పాటు చేయాలని ప్రతిపాదించింది.
3. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో సూక్ష్మ ఎరువులు, క్రిమి సంహారకాల ఉత్పత్తి వ్యవస్థను అభివృద్ధి చేయడంలో కూడా ఇవి కీలక పాత్ర పోషిస్తాయి. పై వాక్యాల్లో ఏవి తప్పు?
ఎ) 1, 3 బి) 2, 3
సి) 2 డి) 1, 2, 3
వివరణ: కేంద్ర బడ్జెట్ 2023-24 భారతదేశంలో సహజ వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికి సంబంధించి ఒక ప్రధాన ప్రకటన చేసింది. సహజ వ్యవసాయ అభివృద్ధికి తోడ్పడేలా 10,000 జైవిక ఉత్పాదక వనరుల కేంద్రాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. వ్యవసాయ రంగంలో రసాయన ఎరువుల విస్తృత వినియోగంతో తలెత్తే పర్యావరణ, ఆరోగ్య సమస్యలను పరిష్కరించడం ఈ చర్య లక్ష్యం.
6. కింది వాక్యాలను పరిశీలించండి. జవాబు: బి
1.ప్రధానమంత్రి వ్యవసాయ నిర్వహణ యోజన కోసం ప్రత్యామ్నాయ పోషకాల ప్రచారం లక్ష్యం ఎరువుల వాడకం లేకుండా చూసేలా రాష్ర్టాలను ప్రోత్సహించడం.
2. PM-PRANAM గోబర్ధన్ పథకంలోని భాగం పై వాక్యాల్లో సరైనవి?
ఎ) 1 బి) 2 సి) 1, 2 డి) ఏదీ కాదు
వివరణ: 2023-24 ఆర్థిక సంవత్సరానికి హరిత వృద్ధిని ప్రధాన ప్రాధాన్యాల్లో ఒకటిగా ప్రభుత్వం ప్రకటించింది. రసాయనిక ఎరువుల వాడకాన్ని తగ్గించి ఎరువులకు ప్రత్యామ్నాయాలను ప్రోత్సహించే లక్ష్యంతో ప్రభుత్వం PM-PRANAM పథకాన్ని కూడా ప్రారంభించింది. ఈ పథకాన్ని గోబర్ ధన్ (సేంద్రియ జీవ వ్యవసాయ విధానంలో ప్రోత్సహించడం)భాగంగా ప్రారంభించారు.
7. కింది వాటిని పరిశీలించండి. జవాబు:డి
1. 2025 నాటికి క్షయ
2. 2023 నాటికి కాలా అజార్
3. 2027 నాటికి శోషరస బోదకాలు
4. 2047 నాటికి సికిల్ సెల్ రక్తహీనత
పైన పేర్కొన్న మిషన్లలో దేన్ని తొలగించడానికి భారత్ కృషి చేస్తోంది?
ఎ) 1, 2, 3 బి) 2, 3, 4
సి) 2, 3 డి) 1, 2, 3, 4
వివరణ: 2047 నాటికి సికిల్ సెల్ రక్తహీనతను తొలగించేలా ఒక కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో ప్రభావిత గిరిజన ప్రాంతాల్లో 40 సంవత్సరాల లోపు వయస్సున్న ఏడు కోట్ల మంది వ్యక్తులందరికీ స్క్రీనింగ్ ఉంటుంది. 2025 నాటికి క్షయ, 2023 నాటికి కాలా అజార్, 2027 నాటికి బోదకాలు వంటి అంటువ్యాధుల నిర్మూలన దిశగా భారత్ వెళ్తున్న నేపథ్యంలో
ఈ ప్రకటన వెలువడింది.
8. కింది వాక్యాలను పరిశీలించండి. జవాబు:బి
1. జాతీయ సమాచార పాలన విధాన ముసాయిదా లక్ష్యం- పరిశోధన, ఆవిష్కరణ విధానాల కోసం వ్యక్తిగతేతర, అనామక సమాచారాన్ని ప్రభుత్వ సంస్థల నుంచి సురక్షితంగా అందుబాటులో ఉండేలా చూడటం.
2. గోప్యత, భద్రత, నమ్మకానికి హామీ ఇచ్చేలా వ్యక్తిగతేతర సమాచార విభాగాలను అందుబాటులోకి తేవడానికి నియమాలు, ప్రమాణాలు, మార్గదర్శకాలు, ప్రొటోకాల్‌ల కోసం సంస్థాగత ఏర్పాట్లను అందించడం ఈ విధానం లక్ష్యం.
పై వాక్యాల్లో ఏది/ఏవి సరైనది/సరైనవి?
ఎ) 1 బి) 2 సి) 1, 2 డి) ఏదీ కాదు
9. కింది వాటిని పరిశీలించండి. జవాబు:సి
1. జాతీయ హరిత హైడ్రోజన్ కార్యక్రమం
2. హరిత రుణ కార్యక్రమం
3. PM-PRANAM
4. వ్యర్థం నుంచి సంపద
5. MISTHI 6. అమృత్ ధరోహర్
పైన పేర్కొన్న కార్యక్రమాల్లో ఏవి దేశం హరిత వృద్ధిని సాధించడానికి ఉద్దేశించినవి?
ఎ) 1, 2, 3, 4 బి) 2, 3, 4, 5
సి) 1, 2, 3, 4, 5, 6 డి) 1, 3, 4, 6
10. కింది వాటిని పరిశీలించండి. జవాబు:ఎ
1. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని యువ పారిశ్రామికవేత్తల ద్వారా వ్యవసాయ అంకుర సంస్థలను ప్రోత్సహించేందుకు వ్యవసాయక వేగకారి నిధి ఏర్పాటు చేస్తారు.
2. రైతులు ఎదుర్కొంటున్న సవాళ్లకు వినూత్నమైన, అందుబాటు వ్యయంలో పరిష్కారాలను అందించడం ఈ నిధి లక్ష్యంగా ఉంది. వ్యవసాయ పద్ధతులను మార్చడానికి, ఉత్పాదకత, లాభదాయకతను పెంచడానికి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా తీసుకువస్తుంది.
పై వాక్యాల్లో ఏది సరైనది కాదు?
ఎ) 1 బి) 2 సి) 1, 2 డి) ఏదీ కాదు
11. కింది వాటిని పరిశీలించండి. జవాబు:ఎ
1. భారత్ ప్రపంచంలోనే శ్రీఅన్న (చిరుధాన్యాలు) అతిపెద్ద ఉత్పత్తిదారు, రెండో అతిపెద్ద ఎగుమతిదారు
2. భారతదేశాన్ని చిరుధాన్యాలకు అంతర్జాతీయ కేంద్రంగా మార్చడానికి 2023-24 బడ్జెట్లో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్ రీసెర్చ్, హైదరాబాద్‌ను ప్రతిపాదించారు.
పై వాక్యాల్లో సరైనవి ఏవి?
ఎ) 1 బి) 2 సి) 1, 2
డి) ఏదీ కాదు
వివరణ: చిరుధాన్యాలను బడ్జెట్ ప్రసంగంలో ‘శ్రీ అన్న’గా పేర్కొన్నారు. భారత్ ప్రపంచంలోనే చిరుధాన్యాల అతిపెద్ద ఉత్పత్తిదారు, రెండో అతిపెద్ద ఎగుమతిదారుగా ఉంది. దేశంలో జొన్న, రాగి, బజ్రా, కుట్టు, రాందాన, చీనా, సామ వంటి చిరుధాన్యాలు పండిస్తారు.
12. కింది వాటిని పరిశీలించండి. జవాబు: డి
1. యజమాని ఆక్రమిత నివాసాలు
2. పరిపాలనాపరమైనవి
3. జీవిత బీమా ఖర్చులు
4. పింఛను నిధులు
5. అన్ని వ్యాపార వ్యయాలు
6. విదేశాలకు బదిలీలు
పైన పేర్కొన్న వాటిలో వేటిని గృహ ప్రైవేట్ వినియోగంలో చేర్చారు?
ఎ) 1, 2, 5 బి) 1, 2, 3, 6
సి) 1, 4, 5, 6 డి) 1, 2, 3, 4
వివరణ: దీన్ని వ్యక్తిగత వినియోగం లేదా వినియోగదారు వ్యయం అని కూడా అంటారు. వినియోగదారు వ్యయం అనేది వస్తువులు, సేవలపై వ్యక్తిగత వ్యయం. ఇందులో యాజమాన్య గృహాల అద్దెలు, జీవిత బీమా, పింఛను నిధుల పరిపాలనా వ్యయాలు ఉంటాయి.
13. పెంట్ ఆఫ్ డిమాండ్ అనే పదం దేన్ని సూచిస్తుంది? జవాబు:ఎ
ఎ) సాధారణంగా మాంద్యం కారణంగా ఆర్థిక వ్యవస్థలో వస్తువులు, సేవలకు వినియోగదారు డిమాండ్ కాలక్రమేణా వృద్ధి చెందుతున్నప్పుడు
బి) సాధారణంగా డిప్రెషన్ కారణంగా ఆర్థిక వ్యవస్థలో వస్తువులు, సేవలకు వినియోగదారు డిమాండ్ కాలక్రమేణా వృద్ధి చెందుతున్నప్పుడు
సి) సాధారణంగా మాంద్యం కారణంగా ఆర్థిక వ్యవస్థలో వస్తువులకు మాత్రమే వినియోగదారుల డిమాండ్ కాలక్రమేణా వృద్ధి చెందుతున్నప్పుడు
డి) సాధారణంగా మాంద్యం కారణంగా ఆర్థిక వ్యవస్థలో సేవలకు మాత్రమే వినియోగదారుల డిమాండ్
కాలక్రమేణా వృద్ధి చెందుతున్నప్పుడు
14. కింది అంశాలను పరిశీలించండి. జవాబు:ఎ
1. గతిశక్తి ఎన్ఎంపీ అంతర్గత అనుసంధిత బహువిధ రవాణా వ్యవస్థలను ఏర్పాటు చేయడానికి ఉద్దేశించినది.
2.అది వాణిజ్య పోటీతత్వాన్ని మెరుగుపరచడంలో, ఎగుమతులను ప్రోత్సహించడంలో, ఉపాధి కల్పనలో
దోహదపడుతుంది.
3. వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ, రోడ్డు, రవాణా, హైవేల మంత్రిత్వశాఖ గతిశక్తి ఎన్ఎంపీ అమలుకు నోడల్ ఏజెన్సీలుగా ఉన్నాయి. పై వాక్యాల్లో సరైనవి?
ఎ) 1, 2 బి) 2, 3
సి) 1, 3 డి) 1, 2, 3
వివరణ: పీఎం గతిశక్తి జాతీయ కార్యాచరణ ప్రణాళికను 2021 అక్టోబరులో ప్రారంభించారు. సమన్వయంతో కూడిన ప్రణాళికతో పాటు సమగ్ర, సంపూర్ణ అభివృద్ధి కోసం అన్ని మంత్రిత్వ శాఖల్లో ప్రణాళికాబద్ధమైన అభివృద్ధిని సమీక్షించడం దీని ఉద్దేశం. జాతీయ రహదారులు, రైల్వేలు, జలమార్గాలు, టెలికాం మొదలైన విభిన్న మౌలిక సదుపాయాల రంగ ప్రాజెక్టుల మధ్య ఏకీకరణ, సహకారాన్ని నెలకొల్పడం, వివిధ రంగాలు, పరిశ్రమల అభివృద్ధి ఆవశ్యకాలను సమకూర్చడం దీని లక్ష్యం.
15. కింది వాక్యాలను పరిశీలించండి. జవాబు:డి
1. డిజిటల్ గుర్తింపు ఆధార్
2. పీఎం జన్‌ధన్ యోజనతో బ్యాంకు ఖాతాలను అనుసంధానించడం
3. జేఏఎం త్రయం
4. ఇ-స్కూళ్లు
5. డిజియాత్ర
పైవాటిలో ఏవి ప్రజా సాంకేతిక మౌలిక సదుపాయాల్లో భాగం?
ఎ) 1, 2, 5 బి) 2, 4, 5
సి) 1, 2, 3, 4, 5 డి) 1, 2, 3, 5
వివరణ: సాంకేతిక గుర్తింపు, చెల్లింపు విధానాలు, సమాచార బదిలీ పరిష్కారాలు వంటి విభాగాలు లేదా వేదికలను సాంకేతిక ప్రజా మౌలిక సదుపాయాలు సూచిస్తుంది. ఇవి దేశాలు తమ ప్రజలకు అవసరమైన సేవలను అందించడంలో, సాంకేతిక సమ్మిళితత్వం ద్వారా పౌరుల జీవనాన్ని మెరుగుపరచడంలో దోహదపడుతాయి.
నరేశ్‌కుమార్
ఫ్యాకల్టీ
విష్ణు ఐఏఎస్
అకాడమీ
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు