General Science BIOLOGY | తియ్యగుంటే టేబుల్ షుగర్.. బాగా తియ్యగుంటే ఫ్రూట్ షుగర్
కార్బోహైడ్రేట్స్
కార్బోహైడ్రేట్స్ నిత్యజీవితంలో తీసుకునే ఆహారంలో తప్పనిసరిగా ఉండాల్సిన పోషక పదార్థాలు. శరీరానికి కావల్సిన శక్తిని ఉత్పత్తి చేయడంలో కార్బోహైడ్రేట్స్ కీలక పాత్ర పోషిస్తాయి. వీటిని వివిధ రూపాల్లో ఆహారంతో కలిపి తీసుకుంటాం. పోటీ పరీక్షల్లో కార్బోహైడ్రేట్స్ అనే అంశం నుంచి తప్పనిసరిగా ప్రశ్నలు అడుగుతున్నారు. ఈ నేపథ్యంలో కార్బోహైడ్రేట్ల నిర్మాణం, మౌలిక అంశాల గురించి నిపుణ పాఠకుల కోసం..
- కార్బోహైడ్రేట్స్ శక్తినిస్తాయి.
- శరీరంలోకి చేరిన ప్రతి కార్బోహైడ్రేట్ గ్లూకోజ్‌గా మార్పు చెందుతుంది.
- కెలోరిఫిక్ విలువ: ఒక గ్రాము పదార్థం వినియోగించినప్పుడు అది అందజేసే శక్తి విలువను కెలోరిఫిక్ విలువ అంటారు. గ్లూకోజ్ కెలోరిఫిక్ విలువ 3.81 కిలో క్యాలరీలు/గ్రాము.
- తియ్యదనం ఆధారంగా కార్బోహైడ్రేట్లు మూడు రకాలు అవి..
ఫ్రక్టోజ్ - ఇది అత్యంత తియ్యని పదార్థం.
- దీన్ని ఫ్రూట్ షుగర్, హనీ షుగర్ అని పిలుస్తారు.
సుక్రోజ్ - ఫ్రక్టోజ్ తర్వాత తియ్యని పదార్థం సుక్రోజ్.
- దీన్ని టేబుల్ షుగర్ అని పిలుస్తారు.
నోట్: సోడియం క్లోరైడ్‌ను టేబుల్ సాల్ట్ అంటారు. - చక్కెరను సుక్రోజ్ అంటారు.
గ్లూకోజ్ - సుక్రోజ్ తర్వాత తియ్యటి పదార్థం గ్లూకోజ్.
- తక్షణ శక్తికోసం క్రీడాకారులు ఉపయోగిస్తారు.
- దీన్ని సింపుల్ షుగర్ అంటారు. దీన్నే బ్లడ్ షుగర్ అని కూడా అంటారు.
- కిరణజన్య సంయోగక్రియలో వెలువడే మొదటి పదార్థం.
- టోలెన్స్ పరీక్ష: అమ్మోనికల్ సిల్వర్ నైట్రేట్ ద్రావణాన్ని గ్లూకోజ్ ద్రావణానికి కలిపి వేడి చేస్తే పరీక్ష నాళిక గోడలపై వెండిపూత లేదా వెండి అద్దం ఏర్పడుతుంది.
బెనెడిక్ట్ పరీక్ష: బెనెడిక్ట్ ద్రావణాన్ని గ్లూకోజ్ ద్రావణానికి కలిపి వేడిచేస్తే ఎర్రని అవక్షేపం ఏర్పడుతుంది.
బెనెడిక్ట్ ద్రావణం: సోడియం నైట్రేట్, సోడియం కార్బోనేట్ల మిశ్రమాన్ని బెనెడిక్ట్ ద్రావణం అంటారు.
నోట్: మధుమేహ రోగుల రక్తంలో గ్లూకోజ్ పరిమాణాన్ని mg/dl ప్రమాణాల్లో కొలుస్తారు.
చక్కెర, అల్కహాల్
- చక్కెరను బీట్రూట్ నుంచి కూడా సంగ్రహిస్తారు.
- చెరుకు నుంచి చక్కెర గ్రహించిన తర్వాత మిగిలిన ద్రావణాన్ని మొలాసిస్ అంటారు.
- చెరుకు గడలు కోసిన తర్వాత 24 గంటల లోపు చక్కెర ఫ్యాక్టరీకి పంపుతారు. ఆలస్యమైతే చక్కెర దిగుబడి తగ్గుతుంది.
- చక్కెర తయారీలో విడుదలయ్యే పదార్థాలు- మొలాసిస్, బగాసే, ప్రెస్‌మడ్.
- చెరుకు గడ నుంచి రసం తీయగా మిగిలిన చెరుకు పిప్పిని బగాసే అంటారు.
బగాసే ఉపయోగాలు - గట్టిదనం గల కాగితం తయారీలో వాడతారు.
- విద్యుత్ ఉత్పత్తిలో వినియోగిస్తారు.
- ప్రెస్‌మడ్: దీన్ని ఫెర్టిలైజర్స్ తయారీలో ఉపయోగిస్తారు.
- మొలాసిస్: దీనిలో చక్కెర 50 శాతం ఉంటుంది. మొలాసిస్‌కు ఈస్ట్ కణాలు కలిపి కిణ్వప్రక్రియ జరుపుతారు.
- కిణ్వప్రక్రియ: పెద్ద అణువులను చిన్న అణువులుగా విడగొట్టే ప్రక్రియను కిణ్వ ప్రక్రియ అంటారు.
- ఈ ప్రక్రియ పూర్తవడానికి 2-3 రోజులు పడుతుంది.
- కిణ్వ ప్రక్రియ జరగడానికి ఈస్ట్ ఉపయోగపడుతుంది.
- ఈస్ట్ రెండు రకాల ఎంజైమ్‌లైన ఇన్వర్టేజ్, జైమేజ్లను ఉత్పత్తి చేస్తుంది.
- సుక్రోజ్‌ను ఇన్వర్టేజ్ అనే ఎంజైమ్ గ్లూకోజ్, ఫ్రక్టోజ్‌లుగా విడగొడుతుంది.
- గ్లూకోజ్, ఫ్రక్టోజ్‌లను జైమేజ్ అనే ఎంజైమ్ ఇథైల్ ఆల్కహాల్‌గా, కార్బన్ డై ఆక్సైడ్‌గా విడగొడుతుంది.
- ఈ ప్రక్రియలో 15-20 శాతం ఆల్కహాల్ ఏర్పడుతుంది. దీన్ని వాష్ అంటారు.
- వాష్‌ను అంశిక స్వేదనం చేయడం ద్వారా 96 శాతం ఆల్కహాల్ లభిస్తుంది. ఈ ఆల్కహాల్‌ను రెక్టిఫైడ్ స్పిరిట్ అని పారిశ్రామిక ఆల్కహాల్ అని అంటారు. అసహజ స్పిరిట్ అని కూడా అంటారు.
- 100 శాతం ఆల్కహాల్‌ను అబ్సల్యూట్ ఆల్కహాల్, శుద్ధ ఆల్కహాల్ అంటారు.
- శుద్ధ ఆల్కహాల్ సేవించకుండా ఉండేందుకు కలిపే రసాయనాలు- పిరిడిన్, మిథైల్ ఆల్కహాల్
అల్కహాల్ అనువర్తనాలు
- నీరు తర్వాత అధికంగా వాడే ద్రావణి.
- ఆల్కహాల్ ఎక్కువగా తీసుకోవడం వల్ల గుండె జబ్బులు, కాలేయం దెబ్బతింటుంది.
- చిన్న పేగులో ఆమ్లత్వం పెరిగి, కురుపులు ఏర్పడి, జీర్ణ వ్యవస్థ దెబ్బతింటుంది.
- కల్తీ కల్లులో క్లోరాల్ హైడ్రేట్‌ను నురగ కోసం, డైజోఫామ్‌ను మత్తు కోసం వాడతారు.
- డెఫకేషన్: చెరుకు రసానికి సున్నం కలపడం. Ca(OH)2
- కార్బోనేషన్: ఎక్కువైన సున్నాన్ని తొలగించడానికి CO2 ను పంపుతారు. సున్నం CaCO3గా అవక్షేపం
చెందుతుంది. - సల్ఫిటేషన్: మిగిలిన సున్నాన్ని తొలగించడానికి SO2ను కలిపే చర్యను సల్ఫిటేషన్ అంటారు.
నోట్: పై మూడు పద్ధతుల్లో ఏర్పడే అవక్షేపం: ప్రెస్ మడ్ (ఎరువుగా ఉపయోగపడుతుంది) - మొలాసిస్ అంటే చక్కెర స్ఫటికాలపైకి పొడిగాలి పంపి నీటిని తొలగించేటప్పుడు ఏర్పడే నల్లని చిక్కని ద్రవం.
- శాకరిన్: సోడియం లేదా కాల్షియం లవణాన్ని తీపి కోసం వాడతారు. ఇది షుగర్ వ్యాధిగ్రస్థులకు వరం వంటిది. సాధారణ షుగర్ కంటే 600 రెట్లు అధిక తీపి కలిగి ఉంటుంది.
అమైనో ఆమ్లాలు
- NH2, COOH సమూహాల సమ్మేళనాలు.
- CO-NH బంధానికి గల మరోపేరు- పప్టైడ్ బంధం
- రెండు అమైనో ఆమ్లాల కలయిక వల్ల ఏర్పడే పదార్థం-డైపప్టైడ్
- అధిక సంఖ్యలో అమైనో ఆమ్లాల కలయిక వల్ల ఏర్పడే పదార్థం- పాలిపప్టైడ్
- మానవుడి శరీరంలోని హిమోగ్లోబిన్లో 574 అమైనో ఆమ్లాలు ఉన్నాయి.
- ఇందులో 26 రకాల అమైనో ఆమ్లాలు మానవుడి శరీరం చేత తయారు చేయబడతాయి. కాబట్టి వీటిని అనావశ్యక అమైనో ఆమ్లాలు అంటారు.
- 9 రకాల అమైనో ఆమ్లాలను మానవుడి శరీరం స్వతహాగా తయారు చేసుకోలేదు. కాబట్టి వీటిని ఆవశ్యక అమైనో ఆమ్లాలు అంటారు.
ప్రొటీన్లు
- ప్రొటీన్లు అమైనో ఆమ్లాల కలయిక వల్ల ఏర్పడుతాయి.
- రక్తంలో O2ను మోసుకునిపోయే బాధ్యత గల ప్రొటీన్.. హిమోగ్లోబిన్లో 574 అమైనో ఆమ్లాలు కలవు. అందులో ఒక్క అమైనో ఆమ్లం మారిస్తే ఏర్పడే ప్రొటీన్‌ను సికిల్ సెల్ హిమోగ్లోబిన్ అంటారు.
- ఇవి జీవ, రసాయన శాస్ర్తాల్లో ఉత్ప్రేరకాలుగా పనిచేస్తాయి.
- కణజాల నిర్మాణంలో తోడ్పడుతాయి.
- జీవ క్రియలను నియంత్రిస్తాయి.
- రోగకారక క్రిముల నుంచి రక్షణనిస్తాయి. కాబట్టి వీటిని యాంటీ బాడీస్ అంటారు.
కండరాల్లో ఉండే ప్రొటీన్- మయోసిన్
ఎముకల్లో ఉండే ప్రొటీన్-అసిన్
పాలల్లో ఉండే ప్రొటీన్- కెసిన్
గుడ్డులో ఉండే ప్రొటీన్- అల్బుమిన్
క్యారెట్, వెంట్రుక, గోళ్లలో గల ప్రొటీన్- కెరోటిన్
టమాటాలో గల ప్రొటీన్- లైపోస్కోన్ - నూనె గది ఉష్ణోగ్రత వద్ద ద్రవరూపంలో గల పదార్థం.
- కొవ్వు గది ఉష్ణోగ్రత వద్ద ఘనరూపంలో ఉండే పదార్థం.
- నూనెలను హైడ్రోజనీకరణం చేస్తే కొవ్వులు లభిస్తాయి. కొవ్వులను ఆహారంగా తీసుకోవచ్చు.
- హైడ్రోజనీకరణం అనేది నూనెల రుచిని, సువాసనను పెంచి ఎక్కువ కాలం నిలువ ఉండేటట్లు చేస్తుంది.
- హైడ్రోజనీకరణంలో Ni అనే ఉత్ప్రేరకం వాడతారు.
- వనస్పతి (డాల్డా) అనేది వృక్ష సంబంధ నూనెలను హైడ్రోజనీకరణం చేయగా లభించిన కొవ్వు పదార్థం.
- వనస్పతిని శాకాహార నెయ్యి అని కూడా పిలుస్తారు.
ఆహార పదార్థాల నిల్వ - ఆహార పదార్థాల నిల్వకు ఫుడ్ అడిటివ్స్ ఉపయోగిస్తారు.
- వాసిల్లిన్ అనే ఆరోమాటిక్ ఆల్డిహైడ్‌ను వెనిల్లా ఫ్లేవర్ కోసం ఐస్‌క్రీమ్‌లలో వాడుతారు.
- ఆక్సీకరణ నిరోధాలు ఆహార పదార్థాలు పాడవకుండా కాపాడుతాయి.
- ఆహార పదార్థాల నిల్వకు సోడియం బెంజోయేట్‌ను వాడతారు.
మందులు- ప్రాముఖ్యం
మందు ప్రాముఖ్యం
అనాల్జిసిక్ మందు శరీర నొప్పిని తగ్గించేవి ఉదా: ఆస్ప్రిన్
నార్కోటిక్స్ అపస్మారక స్థితి నిద్రను కల్గించేవి ఉదా: హెరాయిన్, మార్ఫిన్
సెడిటివ్లు బలహీనత, ఆతృత తగ్గించేవి ఉదా: సోడియం, పొటాషియం బ్రోమైడ్లు
యాంటీ బయాటిక్స్ హానికర సూక్ష్మజీవులను చంపేవి ఉదా: పెన్సిలిన్, ఆంపిలిసిస్
యాంటీ సెప్టిక్ వ్యాపించడాన్ని, క్షీణించడాన్ని తగ్గిస్తాయి
క్లోరోక్విన్ మలేరియాను తగ్గించి, మానసిక రుగ్మతలను నయం చేయడానికి
డీటాక్సోహాల్ ఇది రక్తంలో ఆల్కహాల్ శాతం చాలా వరకు తగ్గిస్తుంది
అజడోథైమిడిన్ ఎయిడ్స్ వ్యాధి నిరోధానికి IICT, Hyd కనుగొన్నది
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు