ECONOMY | ఆర్థికాభివృద్ధి జరుగుతున్నప్పుడు ప్రాథమిక ఎగుమతులు?
1. నూతన అర్థశాస్త్రం ఏ రచయిత వల్ల వచ్చింది?
ఎ) ఆడమ్‌స్మిత్ బి) మార్షల్
సి) ఏసీ పిగూ డి) కీన్స్
2. ఉత్పత్తికి తగిన డిమాండ్ ఉంటుందని చెప్పడం జేబీసే విశ్లేషణ?
ఎ) ఉత్పత్తితోపాటు ఉత్పత్తి కారకాల ఆదాయం పెరుగుతుంది
బి) ఉత్పత్తి కారకాల వేతనం పెరుగుతుంది
సి) ఉత్పత్తి పెరుగుదలతోపాటు ఉత్పత్తి కారకాల ఉపాధి ఆదాయం పెరుగుతుంది
డి) వస్తు లభ్యత వల్ల డిమాండ్ పెరుగుతుంది
3. సంతులిత బడ్జెట్ గుణకం దేనికి సమానం
ఎ) ఒకటి బి) రెండు
సి) మూడు డి) నాలుగు
4. ప్రైవేట్ వ్యవస్థాపకుల పెట్టుబడి?
ఎ) స్వయం ప్రేరిత బి) ప్రేరిత
సి) స్థూల డి) నికర
5. కింది వాటిని జతపరచండి.
ఎ) సంప్రదాయ ఆర్థిక వేత్తలు 1) స్థూల విశ్లేషణ
బి) కీన్స్ 2. సూక్ష్మ విశ్లేషణ
సి) పిగూ ప్రభావం 3) మార్కెట్ సూత్రం
డి) జేబీసే 4) వేతన తగ్గింపు నిరుద్యోగ పరిష్కారం
ఎ) ఎ-2, బి-1, సి-4, డి-3
బి) ఎ-4, బి-3, సి-2, డి-1
సి) ఎ-1, బి-2, సి-3, డి-4
డి) ఎ-3, బి-1, సి-2, డి-4
6. కింది వాటిని జతపరచండి.
ఎ) ద్రవ్యత్వ వలయం 1) కనిష్ఠ వడ్డీరేటు
బి) పూర్ణోద్యోగిత 2) వనరుల పూర్తి వినియోగం
సి) పెట్టుబడి సమతుల్యం 3) ఉపాంత మూలధన సామర్థ్యం=వడ్డీరేటు
డి) వస్తు ద్రవ్య మార్కెట్ 4) IS-LM
ఎ) ఎ-2, బి-3, సి-1, డి-4
బి) ఎ-1, బి-2, సి-3, డి-4
సి) ఎ-4, బి-3, సి-1, డి-4
డి) ఎ-1, బి-2, సి-4, డి-3
7. మూలధనం ఒక?
ఎ) రాశి బి) ప్రవాహం
సి) పెట్టుబడి డి) ఆదాయం
8. ఎప్పడు రుణాత్మకంగా ఉండే గుణకం?
ఎ) ఆదాయ గుణకం
బి) పన్ను గుణకం
సి) పెట్టుబడి గుణకం
డి) పైవన్నీ
9. ద్రవ్యోల్బణ కాలంలో బ్యాంకురేటును?
ఎ) పెంచాలి బి) తగ్గించాలి
సి) స్థిరంగా ఉండాలి డి) ఏదీకాదు
10. కింది వాటిని జతపరచండి.
ఎ) హర్షమన్ 1) బిగ్‌పుష్ సిద్ధాంతం
బి) రోస్టా 2) సమవృద్ధి
సి) రాగ్నార్ నర్క్స్ 3) ఆర్థిక వృద్ధి దశలు
డి) రొసెన్ స్టిన్ రోడాన్ 4. అసమవృద్ధి
ఎ) ఎ-1, బి-2, సి-3, డి-4
బి) ఎ-4, బి-3, సి-2, డి-1
సి) ఎ-4, బి-3, సి-1, డి-2
డి) ఎ-1, బి-3, సి-4, డి-2
11. కింది వాటిలో సరి కానిది ఏది?
ఎ) భారత పారిశ్రామిక విత్త సంస్థ 1948
బి) హరిత విప్లవం ప్రారంభం -1965
సి) నిరంతర ప్రణాళిక – 1978
డి) పరిశ్రమల అభివృద్ధి అదుపు చట్టం -1961
12. పంటల బీమా ఎప్పుడు ప్రవేశ పెట్టారు?
ఎ) 1980 బి) 1982
సి) 1985 డి) 1990
13. కింది వాటిలో తప్పును గుర్తించండి?
ఎ) రెండవ ప్రణాళిక ప్రాధాన్యం, చిన్న పరిశ్రమలు
బి) నాల్గవ ప్రణాళిక ప్రాధాన్యం ఆర్థిక స్థిరత్వం- స్వావలంబన
సి) ఆరో ప్రణాళిక ప్రాధాన్యం నిరుద్యోగ నిర్మూలన
డి) ఎనిమిదో ప్రణాళిక ప్రాధాన్యం- సమానత్వం- సాంఘిక న్యాయం
14. కనీస అవసరాల కార్యక్రమం ఏ ప్రణాళికలో ప్రారంభమైంది?
ఎ) 2 డి) 3 సి) 4 డి) 5
15. కింది వాటిని జతపరచండి.
ఎ) మొదటి ప్రణాళిక వార్షిక సగటు వృద్ధిరేటు 1) 5.2
బి) మూడో ప్రణాళిక 2) 3.3 వార్షిక సగటు వృద్ధిరేటు
సి) నాలుగో ప్రణాళిక 3) 2.2 వార్షిక సగటు వృద్ధిరేటు
డి) ఆరో ప్రణాళిక వార్షిక 4) 3.6 సగటు వృద్ధిరేటు
ఎ) ఎ-1, బి-2, సి-3, డి-4
బి) ఎ-4, బి-3, సి-2, డి-1
సి) ఎ-4, బి-1, సి-2, డి-3
డి) ఎ-3, బి-2, సి-1, డి-4
16. కమతాల విఘటనకు పరిష్కారం?
ఎ) లాభసాటి కమతం
బి) ఆర్థిక కమతం ఏర్పాటు
సి) కమతాల సమీకరణ
డి) భూ సంస్కరణలు
17. కింది వాటిలో తప్పును గుర్తించండి?
ఎ) స్వాతంత్య్రానికి పూర్వం జాతీయాదాయాన్ని మొదట లెక్కించింది దాదాభాయ్ నౌరోజీ
బి) స్వాతంత్య్రం తరువాత జాతీయాదాయాన్ని మొదట లెక్కించింది జాతీయాదాయ అంచనాల సంఘం
సి) ప్రస్తుతం ఎన్ఎస్వో
డి) పైవన్నీ సరైనవి
18. బల్వంతరాయ్ కమిటీ దేనికి సంబంధించినది?
ఎ) గ్రామీణ పేదరికం
బి) గ్రామీణ నిరుద్యోగం
సి) పంచాయతీరాజ్ వ్యవస్థ
డి) సమాజాభివృద్ధి
19. భారతదేశంలో గ్రామీణ బ్యాంకుల స్థాపన?
ఎ) 1969 బి) 1975
సి) 1980 డి) 1985
20. అగ్మార్క్ గుర్తు ఏ వస్తువులకు ఇస్తారు?
ఎ) వినియోగ వస్తువులు
బి) మూలధన వస్తువు
సి) వ్యవసాయ వస్తువు
డి) పారిశ్రామిక వస్తువు
21. కింది వాటిలో సరి కానిది?
ఎ) గ్రామదాన ఉద్యమం -1952
బి) అధిక దిగుబడి వంగడాల పథకం 1965
సి) గిరిజన ప్రాంతాల అభివృద్ధి పథకం -1962
డి) అంత్యోదయ -1988
22. కింది వాటిలో తప్పును గుర్తించండి.
ఎ) ఎన్ఈపీ 1991- ఎల్పీజీ నమూనా
బి) ఎన్ఈపీ 1991 రావు-మన్మోహన్ నమూనా
సి) ఎన్ఈపీ 1991 నూతన ఆర్థిక సంస్కరణల ప్రవేశం
డి) ఎన్ఈపీ-1991- సామ్యవాదరీతి సమాజ స్థాపన
23. అభివృద్ధి చెందని ఆర్థిక విధానం అంటే?
ఎ) పూర్తిగా అల్పాదాయం, పెట్టుబడి సాయం
బి) వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యం తద్వారా ప్రచ్ఛన్న నిరుద్యోగం
సి) ముడి పదార్థాల ఎగుమతి, వినియోగ వస్తువుల దిగుమతి
డి) పైన చెప్పిన అన్ని అంశాలు
24. ఆర్థికాభివృద్ధి జరుగుతున్నప్పుడు ప్రాథమిక ఎగుమతులు?
ఎ) తగ్గును బి) పెరుగును
సి) స్థిరంగా ఉండును డి) పైవన్నీ
25. కింది వాటిలో తప్పును గుర్తించండి?
ఎ) హరిత విప్లవానికి మరొక పేరు వరి విప్లవం
బి) హరిత విప్లవానికి మరొక పేరు గోధుమ విప్లవం
సి) హరిత విప్లవానికి మరొక పేరు పత్తి విప్లవం
డి) ఎ, సి
26. కింది వాటిలో తప్పును గుర్తించండి?
ఎ) ఎల్ఐసీ 1956
బి) జీఐసీ 1972
సి) నాబార్డ్ 1982
డి) ఎన్‌హెచ్‌బీ -1999
27. లీడ్ బ్యాంక్ పథకాన్ని సిఫారసు చేసిన కమిటీ ఏది?
ఎ) నారీమన్ కమిటీ బి) వాంఛూ కమిటీ
సి) కాల్థార్ కమిటీ డి) ఏదీకాదు
28. స్వాతంత్య్రానికి పూర్వం గ్రామీణ రుణ భారాన్ని అంచనా వేసింది?
ఎ) దాదాభాయ్ నౌరోజీ బి) థర్
సి) మెక్లగన్ డి) పైవన్నీ
29. కాలిక నిరుద్యోగం ఏ రంగంలో కనిపిస్తుంది?
ఎ) వ్యవసాయ రంగం
బి) పారిశ్రామిక రంగం
సి) సేవా రంగం డి) రవాణా రంగం
30. ఫలన కాలం
ఎ) చిన్న పరిశ్రమలకు తక్కువ
బి) పెద్ద పరిశ్రమలకు ఎక్కువ
సి) ఎ, బి
డి) దీర్ఘకాలికమైంది
31. కింది వాటిలో సరైనది ఏది?
ఎ) బొగ్గును నల్లబంగారం అంటారు
బి) బొగ్గు- బ్రెడ్ ఆఫ్ ద ఇండస్ట్రీస్
సి) బొగ్గు- మదర్ ఆఫ్ ద ఇండస్ట్రీ
డి) పైవన్నీ సరైనవే
32. బెయిలీ అనేది దేనికి ప్రసిద్ధి?
ఎ) బొగ్గు బి) కాగితం
సి) జనుము డి) ఆయిల్
సమాధానాలు
1-డి 2-సి 3-ఎ 4-బి
5-ఎ 6-బి 7-ఎ 8-బి
9-ఎ 10-బి 11-డి 12-సి
13-డి 14-డి 15-బి 16-సి
17-డి 18-సి 19-బి 20-సి
21-డి 22-డి 23-డి 24-బి
25-డి 26-డి 27-ఎ 28-సి
29-ఎ 30-సి 31-డి 32-బి
33. దేశాభివృద్ధిలో కారుచీకటిలో కాంతి కిరణం వలే సహకరించేవి ఏవి?
ఎ) మేధావులు బి) శ్రామికులు
సి) ప్రణాళికలు డి) సంపద
34. ప్రణాళిక లక్ష్యంలో కింది వాటిలో సరైనవి తెలపండి?
ఎ) జాతీయాదాయ వృద్ధి
బి) ప్రాంతీయ నమూనాభివృద్ధి
సి) సామ్యవాద రీతి సమాజ స్థాపన
డి) పైవన్నీ సరైనవే
35. మోడ్రన్ ఎకనామిక్ గ్రోత్ గ్రంథరచయిత ఎవరు?
ఎ) జేఎం కీన్స్ బి) సైమన్ కుజ్నైట్
సి) ఏసీ పిగూ డి) జేబీసే
36. కింది వాటిలో ఆర్థిక కారకాలు కానివి ఏవి?
ఎ) సహజ వనరులు బి) మూలధనం
సి) వ్యవస్థాపన డి) పరిపాలన
37. కింది వాటిలో సరైనవి గుర్తించండి?
ఎ) డబ్ల్యూపీ హోల్ సేల్ ప్రైస్ ఇండెక్స్
బి) సీపీఐ- కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్
సి) ఎఫ్‌పీఐ ఫుడ్ ప్రైస్ ఇండెక్స్
డి) పైవన్నీ సరైనవే
38. జనాభా ఏ శ్రేణిలో పెరుగుతుందని మాల్థస్ సూచించారు?
ఎ) అంకశ్రేణి బి) గుణ శ్రేణి
సి) ఎ, బి డి) స్థిరం
39. 1921లో జనాభా వృద్ధిరేటు తగ్గడానికి కాణం
ఎ) కలరా బి) మశూచి
సి) ఇన్ప్లూయంజా డి) పైవన్నీ
40. 2011 ప్రకారం భారత జనాభా వృద్ధి?
ఎ) 1 శాతం బి) 1.2 శాతం
సి) 1.8 శాతం డి) 1.64 శాతం
41. స్వాతంత్య్రం తర్వాత ఇప్పటి వరకు ఎన్ని సార్లు జనన సూచీ జరిగింది?
ఎ) 5 బి) 6 సి) 7 డి) 8
42. అధిక జనాభా గల రాష్ర్టాలు?
ఎ) యూపీ, మహారాష్ట్ర, బీహార్, పశ్చిమ బెంగాల్
బి) యూపీ, బీహార్, పశ్చిమబెంగాల్, మహారాష్ట్ర
సి) యూపీ పశ్చిమబెంగాల్, బీహార్, మహారాష్ట్ర
బి) యూపీ, మహారాష్ట్ర, బీహార్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్
43. అధిక ఎస్టీ జనాభా గల రాష్ట్రం ఏది?
ఎ) మధ్య ప్రదేశ్ బి) మహారాష్ట్ర
సి) ఒడిశా డి) రాజస్థాన్
44. చిన్న కమతాల వల్ల కలిగే నష్టాలు ఏవి?
ఎ) వ్యవసాయ భూమి వృథా అవుతుంది
బి) పురాతన పద్ధతులు అవలంబించడం
సి) ప్రచ్ఛన్న నిరుద్యోగం
డి) పైవన్నీ సరైనవే
45. ‘ఒకే దేశం ఒకే రేషన్ కార్డ్’ పథకాన్ని ఎప్పుడు ప్రారంభించారు?
ఎ) 2020 జూన్ 1 బి) 2019 జూన్ 1
సి) 2018 జూలై 1 డి) 2021 జూన్ 1
46. కింది వాటిలో సరైనది ఏది?
ఎ) యూటీఐ 1964
బి) ఐడీబీఐ 1964
సి) ఎస్ఇబీఐ-1988
డి) పైవన్నీ సరైనవే
47. కింది వాటిలో తప్పును గుర్తించండి?
ఎ) ఎన్ఎస్వో నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్
2) సీఎస్‌వో- సెంట్రల్ స్టాటిస్టికల్ ఆఫీస్
సి) యూటీఐ- యూనిట్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా
డి) ఎఫ్ఐఐ-ఫారెన్ ఇన్‌కం ఇన్వెస్టిమెంట్
48. జాతీయీకరణ వల్ల?
ఎ) ప్రైవేటు పెట్టుబడి దారుల్లో నిరుత్సాహం
బి) ప్రభుత్వ బాధ్యత మరింత పెరగడం
సి) ఎ, బి రెండు సరైనవే
డి) ఏదీకాదు
49. సబ్సిడీ ఆహార ధాన్యాలకు బదులుగా నగదు బదిలీ అందించే రాష్ర్టాలు?
ఎ) చండీఘర్, పుదుచ్చేరీ
బి) చండీఘర్, లక్షద్వీప్
సి) పుదుచ్చేరీ, ఎంపీ
డి) లక్షద్వీప్, యూపీ
50. కింది వాటిని జతపరచండి.
ఎ) నిరంతర ప్రణాళిక 1) ప్రజాస్వామ్య దేశాలు
బి) సూచనాత్మక ప్రణాళిక 2) నియంతృత్వ దేశాలు
సి) ఆదేశిక ప్రణాళిక 3) సరళీకృత ఆర్థిక విధానం
డి) ప్రోత్సాహక ప్రణాళిక 4) జనతా ప్రభుత్వం
ఎ) ఎ-4, బి-2, సి-1, డి-3
బి) ఎ-4, బి-3, సి-2, డి-1
సి) ఎ-1, బి-2, సి-3, డి-4
డి) ఎ-1, బి-2, సి-4, డి-3
51. పూర్తిగా విఫలమైన ప్రణాళిక ఏది?
ఎ) 2 బి) 3 సి) 5 డి) 9
52. కింది వాటిలో ప్రణాళికలు వైఫల్యం చెందడానికి కారణం ఏది?
ఎ) అధిక నిరుద్యోగం
బి) నల్లధనం
సి) ఆర్థిక శక్తి కేంద్రీకరణ
డి) పైవన్నీ
సమాధానాలు
33-సి 34-డి 35-బి 36-డి
37-డి 38-బి 39-సి 40-డి
41-సి 42-ఎ 43-ఎ 44-డి
45-ఎ 46-డి 47-డి 48-సి
49-ఎ 50-బి 51-బి 52-డి
పానుగంటి కేశవ రెడ్డి
రచయిత
వైష్ణవి పబ్లికేషన్స్
గోదావరిఖని
9949562008
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు