TSPSC JL & DL Mathematics | జేఎల్, డీఎల్, గురుకుల లెక్చరర్ ప్రిపరేషన్
ప్రభుత్వం జేఎల్, డీఎల్, గురుకుల టీచర్స్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. వీటికి అర్హత ఉన్న
ప్రతిఒక్కరూ పోటీపడుతుంటారు. ఉద్యోగం సాధించాలని పట్టుదలతో ఉంటారు. కానీ ఎలా చదవాలో తికమకపడే వారు చాలామంది ఉంటారు. వారి కోసమే ‘నిపుణ’ అందిస్తున్న ఈ వ్యాసం. దీనిలో సబ్జెక్టులవారీగా ఎలా చదవాలో తెలుసుకుందాం..
ప్రభుత్వం ఇటీవల జూనియర్ కళాశాల అధ్యాపకుల నియామకాల కోసం టీఎస్పీఎస్సీ విడుదల చేసిన నోటిఫికేషన్లో 154 పోస్టులు గణితానికి ఉన్నాయి. గురుకుల సొసైటీ నోటిఫికేషన్లో జేఎల్-324, డీఎల్-62 కేటాయించారు. గురుకుల బోర్డు ద్వారా జరిగే నియామక పరీక్షల్లో నెగెటివ్ మార్క్స్ ఉన్నాయి. టీఎస్పీఎస్సీ పరీక్షల్లో నెగెటివ్ మార్కింగ్ లేదు.
గణితం
- అర్హతలు కలిగిన అభ్యర్థులు ఒకటికి మించిన నోటిఫికేషన్లకు స్పందించే అవకాశం ఉంటుంది. వారి వారి సామర్థ్యాలను బట్టి ఎన్ని అవకాశాలుంటే అన్ని అవకాశాలను సద్వినియోగపరుచుకునే విధంగా కృషి చేయాలి. గురుకుల జేఎల్, డీఎల్, టీఎస్పీఎస్సీ జేఎల్ సిలబస్ దాదాపు ఒకటే.
రెండు అంశాలపై దృష్టి సారించాలి
- గణిత శాస్త్రం అభ్యర్థులు ముఖ్యంగా రెండు అంశాలను దృష్టిలో పెట్టుకొని ప్రిపరేషన్ కొనసాగించాలి. సబ్జెక్టు కంటెంట్‌పై పట్టు సాధించడం, పరీక్ష సమయంలో టైమ్ మేనేజ్మెంట్ చేసుకోవడం.
- జూనియర్ లెక్చరర్ జాబు సాధించాలంటే కంటెంట్‌పై పట్టు సాధించడమే ముఖ్యం.
- టీఎస్పీఎస్సీ జేఎల్‌లో 150 ప్రశ్నలకు 300 మార్కులు ఉంటాయి. కేవలం 150 నిమిషాల్లోనే పరీక్ష పూర్తి చేయాలి. అంటే ప్రతి ప్రశ్నకు ఒక నిమిషంలో సమాధానం కనుగొనాలి. ఎక్కువ టైం తీసుకునే ప్రాబ్లం వస్తే దాన్ని లాస్ట్‌లో చూడటం మంచిది. గురుకుల బోర్డు ద్వారా జరిగే నియామకాల్లో 100 ప్రశ్నలు 120 నిమిషాల టైం కేటాయించి ప్రతి ప్రశ్నకు ఒక మార్కు కేటాయించారు. టీఎస్పీఎస్సీ జేఎల్‌తో పోలిస్తే టైం కొంచెం ఎక్కువ ఇచ్చారు.
- జేఎల్ సిలబస్‌లో మొత్తం 11 టాపిక్స్ మీద ప్రశ్నలు అడుగుతారు. ప్రతి చాప్టర్ నుంచి 13 – 15 ప్రశ్నలు అడుగుతారు. లీనియర్ ఆల్జీబ్రాలో రెండు చాప్టర్స్, మోడ్రన్ ఆల్జీబ్రాలో రెండు చాప్టర్స్, రియల్ అనాలసిస్‌ను రెండు చాప్టర్స్‌గా విడగొట్టారు. ఈ మూడు అంశాలతో పాటు నంబర్ థియరీ కూడా కలిపితే దాదాపు 90 -100 ప్రశ్నలు అడగటానికి అవకాశం ఉంది.
- అంటే గరిష్ఠంగా వీటి నుంచే 200 మార్కులు రావడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ టాపిక్స్ కు ఎక్కువ ప్రియారిటీ ఇస్తూ కఠినమైన అంశాలను క్షుణ్ణంగా లోతుగా చదివి నోట్స్ రాసుకొని ప్రిపేర్ కావాలి. సాధ్యమైనంత వరకు ప్రతి బిట్‌ని వన్ మినిట్ లోపే సాధించే విధంగా సాధన చేయాలి.
- కాంప్లెక్స్ అనాలసిస్, ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్, పార్సల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ సాలిడ్ జామెట్రీ అనే నాలుగు అంశాల నుంచి దాదాపు 50 నుంచి 60 ప్రశ్నలు అడగవచ్చు. ఏ అంశంలో ఎక్కువ పట్టు ఉంటుందో ఆ అంశాల పై ఎక్కువగా ప్రాక్టీస్ చేసి లోతుగా విశ్లేషణ చేయడం వల్ల ఎక్కువ స్కోర్ చేయవచ్చు. అలా అని ఏ అంశాన్ని కూడా తక్కువ అంచనా వేయకుండా ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా చదవాలి.
కంటెంట్ తక్కువ స్కోరు ఎక్కువ
- ఎలిమెంటరీ నంబర్ థియరీలో కంటెంట్ తక్కువగా ఉంటుంది. తక్కువ టైంలో ఎక్కువ స్కోర్ చేయొచ్చు. కాబట్టి ఆ టాపిక్‌ను క్షుణ్ణంగా చదవాలి. అందులో ఎక్కువగా డివిజబిలిటీ సిద్ధాంతాలు, చైనీస్ రిమైండర్ తీరం,యులర్స్పై ఫంక్షన్, ఫార్మాట్ సిద్ధాంతం, విల్సన్స్ సిద్ధాంతం అప్లికేషన్స్ బాగా ప్రాక్టీస్ చేయాలి.
- మోడ్రన్ ఆల్జీబ్రా విషయానికి వస్తే గ్రూప్స్, నార్మల్ సబ్ గ్రూప్స్, సైక్లిక్ సబ్ గ్రూప్స్, ఐసోమార్ఫిజం, సైలోస్ మూడు సిద్ధాంతాలు వాటి అప్లికేషన్స్, రింగ్ థియరీలో సబ్ రింగ్స్ ఐడియల్స్, యూనిట్స్, నిల్పోటెంట్ ఎలిమెంట్స్, ప్రైమ్ ఐడియల్స్, గరిష్ఠ ఆదర్శం, పీఐడీ, యూఎఫ్డీ, బహుపదుల వలయాలు అంశాలపై ప్రశ్నలు అడుగుతారు. కోషెంట్ గ్రూప్, ఉత్పన్న వలయాల పై ఎక్కువ ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేస్తే మంచిది. గత కొంతకాలంగా వీటి మీద ఎక్కువ ప్రశ్నలు అడుగుతున్నారు.
- రియల్ అనాలసిస్, మెట్రిక్ స్పేస్ రెండు కలిపి డిగ్రీ నుంచి పీజీ వరకు దాదాపు 25 నుంచి 30 ప్రశ్నలు వస్తాయి. రియల్ అనాలసిస్‌లో ప్రాథమిక అంశాలపై పట్టు సాధించడం అనేది చాలా ముఖ్యం.
- ప్రమేయాలు, ప్రమేయాల అవధులు, అవకలనాలు, సీక్వెన్స్, సిరిసిల్ల అభిసరణ, అవసరన, రీమాన్ సమకలనం అంశాలను క్షుణ్ణంగా అధ్యయనం చేస్తే గణితం పై పట్టు సాధించవచ్చు. కాంప్లెక్స్ అనాలసిస్‌లో సింగలారిటీస్, అనలిటికల్ ఫంక్షన్స్, హార్మోనిక్ ఫంక్షన్స్, రెసిడ్యూస్ అంశాలపై వచ్చే ప్రశ్నలను తేలికగా సమాధానం పెట్టే విధంగా ఫార్ములాలను ప్రాక్టీస్ చేయాలి.
- జేఎల్ సాధించడంలో లీనియర్ ఆల్జీబ్రా, మోడ్రన్ ఆల్జీబ్రా, రియల్ అనాలసిస్, కాంప్లెక్స్ అనాలసిస్ కీలక పాత్ర పోషిస్తాయి. ఎక్కువ పుస్తకాలను దగ్గర వేసుకొని చదివే దాని కంటే ఒక్క పుస్తకమే పర్ఫెక్ట్ గా చదివి, ఆ అంశాల ఆబ్జెక్టివ్ బిట్స్ ప్రాక్టీస్ చేయడం, ఎక్కువ ఎగ్జామ్స్ అటెంప్ట్ చేయడం ద్వారా టైం మేనేజ్మెంట్తో పాటు కాన్ఫిడెన్స్ లెవల్స్ కూడా పెంచుకోవడం ఎంతో అవసరం. పేపర్-1ను అశ్రద్ధ చేయకుండా మొదటి నుంచి కొంత టైం కేటాయించి ప్రిపేర్ కావడం, పేపర్ పఠనం ద్వారా లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ ప్రిపేర్ చేసుకోవడం వల్ల ఎక్కువ స్కోర్ చేసుకోవచ్చు.
చదవాల్సిన పుస్తకాలు
- అబ్స్ట్రాక్ట్ ఆల్జీబ్రా- జోసఫ్ ఏ గ్యాలిన్
- లీనియర్ ఆల్జీబ్రా- కెనీత్ అఫ్ మెన్రే కుంజ్, ఏఆర్ వశిష్ట & జేఎన్ శర్మ
- కాంప్లెక్స్ అనాలసిస్- పొన్ను స్వామి
- రియల్ అనాలసిస్- రుడిన్, ఎన్పీ బాలి
- ఎలిమెంటరీ నంబర్ థియరీ-డేవిడ్ బర్టన్, జూకర్మన్ & నివన్
- ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్- ఎండీ రైసింఘానియా
- పార్సెల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్- ఎండీ రైసింఘానియా (ఎస్ చాంద్ పబ్లికేషన్స్)
- అనలిటికల్ సాలిడ్ జామెట్రీ- శాంతి నారాయణ, పీకే మిట్టల్
డా. తండు నాగయ్య
అసిస్టెంట్ ప్రొఫెసర్
గణిత విభాగం
కాకతీయ విశ్వవిద్యాలయం
9701275354
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు