General Science Chemistry | వర్ణ రహిత హైడ్రోజన్.. కఠినమైన టంగ్స్టన్
మూలకాల వర్గీకరణ
మూలకాలను వర్గీకరించడం ద్వారా వాటి ధర్మాలను అర్థం చేసుకోవచ్చు. అదేవిధంగా మూలకాల వల్ల ఏర్పడ్డ అసంఖ్యాకమైన సమ్మేళనాల ధర్మాలను కూడా అర్థం చేసుకోవచ్చు.
- 1869లో మెండలీఫ్, లూథర్ మేయర్లు ఆవర్తన నియమాన్ని ప్రతిపాదించారు. ఈ ఆవర్తన నియమం ఆధారంగానే నవీన ఆవర్తన పట్టిక ఆవిర్భవించింది.
- ఇప్పటి వరకు భూమిపై 118 మూలకాలను కనుగొన్నారు.
సంయోగ పదార్థం: సంఘటనాంశాలు ఒక నిర్దిష్టమైన నిష్పత్తిని పాటిస్తే వాటిని సంయోగ పదార్థాలు అంటారు.
ఉదా: నీరు, కార్బన్ డై ఆక్సైడ్ మొదలైనవి - కొన్ని మూలకాల లాటిన్ నామాల్లోని అక్షరాలను వాటి సంకేతాలుగా నిర్ణయిస్తారు.
లోహాలు: ఇవి మెరిసే గుణంతో ఉంటాయి. మంచి విద్యుత్ వాహకాలు. లోహాలు రేకులుగా సాగే గుణాన్ని కలిగి ఉంటాయి. ఈ గుణాన్ని అగాధ వర్ధనీయత అంటారు. - అగాధ వర్ధనీయత అత్యధికంగా ఉన్న లోహం బంగారం. ఎందుకంటే రేకులుగా సాగే గుణం ఈ లోహానికి అత్యధికంగా ఉంటుంది.
- లోహాలు సన్నని తీగలుగా సాగే గుణం కలిగి ఉంటాయి. ఈ ధర్మాన్ని తాంతవత అంటారు. అత్యధిక తాంతవత ఉన్న లోహం ప్లాటినం.
- ఆవర్తన పట్టికలోని లోహాల సంఖ్య 91. అత్యధిక లోహ స్వభావం ఉన్న మూలకం సీజియం.
- భూ పటలంలో అత్యధికంగా లభించే లోహం అల్యూమినియం.
- అతి కఠినమైన లోహం టంగ్స్టన్.
- అత్యధిక విద్యుద్వాహకత ఉన్న లోహం వెండి (సిల్వర్).
- రాగి, వెండి, బంగారాలను నోబెల్ లోహాలు అంటారు.
- జెర్మేనియం, క్రోమియం, మాంగనీస్లను స్ట్రాటజిక్ లోహాలు అంటారు.
- గాలియంను వేసవి ద్రవం అంటారు.
అలోహాలు: ఇవి అథమ విద్యుత్ వాహకాలు. రేకులుగా, తీగలుగా సాగవు. వీటికి మెరిసే గుణం ఉండదు. ఆవర్తన పట్టికలో అలోహాల సంఖ్య 11. అవి: బోరాన్, కార్బన్, నైట్రోజన్, ఆక్సిజన్, ఫ్లోరిన్, సిలికాన్, పాస్ఫరస్, సల్ఫర్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్. - అత్యధిక అలోహ స్వభావం ఉన్న మూలకం ఫ్లోరిన్.
అర్ధ లోహాలు: వీటిలో లోహ, అలోహ ధర్మాలు దాదాపు సమానంగా ఉంటాయి. ఆవర్తన పట్టికలో అర్ధ లోహాల సంఖ్య ఆరు. అవి: జెర్మేనియం, టిన్, ఆర్సెనిక్, యాంటిమొని, సెలోనియం, టిలోరియం.
హైడ్రోజన్ - హైడ్రోజన్ అంటే నీటిని ఏర్పరిచేది అని అర్థం.
- దీన్ని హెన్రీ కావెండీష్ అనే శాస్త్రవేత్త కనుగొన్నాడు.
- న్యూట్రాన్ ఉండని ఏకైక మూలకం హైడ్రోజన్.
- హైడ్రోజన్ రంగు లేని వాయువు.
- హైడ్రోజన్ దహనశీలి (ఇది స్వయంగా మండుతుంది). హైడ్రోజన్ దహన సహకారి కాదు (ఇతర వాయువులు మండటానికి ఇది సహకరించదు).
- దీన్ని శాఖీయ నూనెలను వనస్పతి (డాల్డా)గా మార్చడానికి ఉపయోగిస్తారు.
- బెర్జీలియస్ విధానంలో కృత్రిమ పెట్రోల్ తయారీలో హైడ్రోజన్‌ను ముడి పదార్థంగా వాడతారు.
- దీన్ని వాతావరణ బెలూన్లలో నింపుతారు.
- హేబర్ విధానంలో అమ్మోనియా తయారీలో ముడి పదార్థంగా వాడతారు. ద్రవ హైడ్రోజన్‌ను రాకెట్లలో ఇంధనంగా వినియోగిస్తారు.
- వాయువులన్నింటిలోకి అత్యధిక వ్యాపన రేటు ఉన్నది హైడ్రోజన్ మాత్రమే.
- విశ్వంలో అత్యధికంగా (90 శాతం) లభించే మూలకం ఇదే.
హీలియం - హీలియం జడవాయువుల్లో మొదటిది.
- అన్నింటికంటే తేలికైన జడవాయువు ఇదే.
- విశ్వంలో హైడ్రోజన్ తర్వాత అత్యధికంగా ఉండేది హీలియం. దీన్ని వాతావరణ బెలూన్లలో నింపుతారు.
- సముద్రాల్లో ఈతకు వెళ్లేవారు శ్వాసకోసం ఆక్సిజన్, హీలియం మిశ్రమాన్ని ఉపయోగిస్తారు. అస్తమా రోగుల శ్వాస కోసం కూడా ఇదే మిశ్రమాన్ని వినియోగిస్తారు.
- హీలియం గాలి కంటే తేలికైంది. కాబట్టి దీన్ని విమానాల టైర్లలో నింపడానికి ఉపయోగిస్తారు.
లిథియం - ఇది లోహాలన్నింటిలోకి తేలికైంది.
- రసాయనికంగా అత్యంత చర్యాశీలత కలిగింది.
- మండే స్వభావం కలినది.
- అమ్మోనియా ద్రావణంలో కరిగి నీలిరంగు ద్రావణాన్ని ఏర్పరుస్తుంది.
- లోహాలన్నింటిలో కఠినమైంది టంగ్స్టన్. అందుకే టంగ్స్టన్ను విద్యుత్ బల్బుల్లో ఫిలమెంట్‌గా ఉపయోగిస్తారు.
- ఫ్లోరోసెంట్ బల్బుల్లో మెర్క్యూరీ, బాష్పం, ఆర్గాన్ వాయువుల మిశ్రమాన్ని నింపుతారు.
కార్బన్ - మూలకాలన్నింటిలోకి అత్యధిక సమ్మేళనాలను ఏర్పరిచేది కార్బన్. అందుకే కార్బన్‌ను మూలకాల రాజు అంటారు.
- మూలక పరమాణువులు ఒకదానికొకటి కలిసి గొలుసుల్లాంటి సమ్మేళనాలను ఏర్పరిచే స్వభావాన్ని కాటనేషన్ అంటారు.
- మూలకాలన్నింటిలో అత్యధిక కాటనేషన్ స్వభావం ఉన్న మూలకం కార్బన్.
- కార్బన్ రూపాంతమైన డైమండ్ ప్రకృతిలో లభించే పదార్థాలన్నింటిలోకి కఠినమైంది.
- కార్బన్ మరో రూపాంతరం గ్రాఫైట్. ఇది అలోహం అయినా విద్యుద్వాహకత కలిగి ఉంటుంది.
నైట్రోజన్ - నైట్రోజన్ గాలిలో అత్యధికంగా మండే వాయువు.
- గాలిలో అయిదు భాగాల్లో నాలుగు భాగాలు నైట్రోజన్ వాయువు వెలువడి గాలిలో కలిసిపోతుంది.
- మొక్కల పెరుగుదలకు కావలసిన ముఖ్యమైన మూలకం కూడా నైట్రోజన్.
- లెగ్యుమినేసి మొక్కలు గాలి నుంచి
- నైట్రోజన్‌ను గ్రహించి దాన్ని నైట్రేట్ల రూపంలో నిల్వ చేస్తాయి.
ఆక్సిజన్ - ఆక్సిజన్ అంటే ఆమ్లాన్ని ఏర్పరిచేది అని అర్థం.
- దీన్ని షీలే అనే శాస్త్రవేత్త కనుగొన్నాడు.
- భూమి పొరల్లో అత్యధికంగా ఉండే మూలకం ఆక్సిజన్.
- ఇది దహన సహకారి వాయువు. అంటే పదార్థాలు మండటానికి సహకరిస్తుంది.
- గాలిలో 1/5వ వంతు ఆక్సిజన్ ఉంటుంది.
- ఆక్సిజన్, ఎసిటిలిన్ వాయువులు కలిసి ఆక్సీ ఎసిటిలిన్ జ్వాలను ఇస్తాయి. ఇది 3000 డిగ్రీ సెంటిగ్రేడ్ల ఉష్ణోగ్రతను ఇస్తుంది. గాజు బ్లోయింగ్ ప్రక్రియలో ఆక్సీ ఎసిటిలిన్ జ్వాలను ఉపయోగిస్తారు.
- రోగులు, పర్వతారోహకులు, సముద్రంలో లోతుగా వెళ్లే నావికులు శ్వాసకోసం ఆక్సిజన్, హీలియం మిశ్రమాన్ని ఉపయోగిస్తారు.
ఫ్లోరిన్ - దీన్ని సూపర్ హాలోజన్ అంటారు.
- మూలకాలన్నింటిలోకి అత్యధిక రుణ విద్యుద్వాహకత ఉన్నది ఫ్లోరిన్. ఇది దంతాల్లో పింగాణి ఏర్పడటానికి అవసరం.
- అలోహాలన్నింటిలోకి అత్యధిక చర్యాశీలత కలిగినది ఫ్లోరిన్. నీటిలో ఫ్లోరిన్ గాఢత 3 మి.గ్రా/లీటర్ కంటే ఎక్కువైతే ఫ్లోరోసిస్ వ్యాధి వస్తుంది. ఈ వ్యాధి సోకిన వారిలో ఎముకలు బలహీనమై దంతాలపై పసుపు చారలు ఏర్పడతాయి.
నోట్: నీటి నుంచి ఫ్లోరిన్‌ను తొలగించే అతి చవకైన పద్ధతిని నేషనల్ ఎన్విరాన్మెంటల్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్ (NERI) కనుగొన్నది. ఈ పద్ధతిని మొదట నల్లగొండలో ప్రయోగించడం వల్ల దీనికి నల్లగొండ విధానం అనే పేరు వచ్చింది.
నియాన్ - దీన్ని ఎర్రని విద్యుత్ అలంకరణ దీపాల్లో నింపుతారు.
- ఈ కాంతికి తరంగదైర్ఘ్యం ఎక్కువ. ఇది పొగమంచు ద్వారా ప్రయోగించే స్వభావం కలిగి ఉంటుంది.
- విమానాలు, రైల్వే సిగ్నల్ లైట్ల కోసం ఎర్రటి కాంతిని ఉపయోగిస్తారు.
- విమానాల రన్‌వేలో దారి చూపే లైట్లు ఎర్రటి కాంతినిస్తాయి. వీటిలో నియాన్ నింపబడి ఉంటుంది.
సోడియం - దీన్ని కిరోసిన్‌లో నిల్వ చేస్తారు. సోడియం చల్లటి నీటితో చర్య జరిపి హైడ్రోజన్ వాయువును వెలువరుస్తుంది.
- సోడియం లోహాన్ని కృత్రిమ రబ్బరు తయారీలో ఉత్ప్రేరకంగా ఉపయోగిస్తారు.
- ద్రవ సోడియంను అణు రియాక్టర్లలో శీతలీకరణిగా వాడతారు.
మెగ్నీషియం - మొక్కల ఆకుల్లో ఉండే హరితరేణువుల్లో మెగ్నీషియం లోహం ఉంటుంది. దీనివల్ల ఆకులు పచ్చరంగును కలిగి ఉంటాయి.
- మానవ శరీరంలోని రక్తంలో హిమోగ్లోబిన్ ఐరన్ లోహాన్ని కలిగి ఉంటుంది. అందుకే రక్తం ఎర్రగా ఉంటుంది.
- మన శరీరంలో రక్తహీనత వల్ల వచ్చే జబ్బును ఎనిమియా అంటారు.
- విటమిన్ బి12 లో కోబాల్ట్ ఉంటుంది.
అల్యూమినియం - దీన్ని సిల్వర్ పెయింట్ తయారీలో ఉపయోగిస్తారు. సిల్వర్ పెయింట్‌లో సిల్వర్ శాతం సున్నా. అయితే అల్యూమినియం పొడిని లిన్సీడ్ ఆయిల్‌తో కలిపినప్పుడు సిల్వర్ పెయింట్ తయారవుతుంది.
- భూమి పొరల్లో అత్యధికంగా లభించే లోహం.
- అల్యూమినియం ముఖ్య ఖనిజం బాక్సైట్.
- అల్యూమినియం పొడి, అమ్మోనియం నైట్రేట్ల మిశ్రమాన్ని అమ్మోనాల్ అంటారు. దీన్ని పేలుడు పదార్థంగా ఉపయోగిస్తారు.
సిలికాన్ - ఈ మూలకాన్ని ట్రాన్సిస్టర్‌లో అర్ధలోహంగా ఉపయోగిస్తారు.
- కంప్యూటర్ చిప్స్ లేదా మైక్రో ప్రాసెసర్ల తయారీలో దీన్ని ఉపయోగిస్తారు. అంతేకాకుండా సోలార్ సెల్స్ తయారీకి కూడా ఈ మూలకాన్ని ఉపయోగిస్తారు.
- సిలికా అనే సిలికాన్, ఆక్సిజన్ల సమ్మేళనం.
పాస్ఫరస్ - దీనిలో ముఖ్యంగా రెండు రకాలు ఉంటాయి. ఒకటి తెల్ల పాస్ఫరస్, రెండోది ఎర్ర పాస్ఫరస్.
- తెల్ల పాస్ఫరస్‌కు పాస్ఫరస్ రూపాలన్నింటి కంటే అధిక చర్యాశీలత ఉంటుంది. నీటిలో నిల్వ చేసే అలోహం తెల్ల పాస్ఫరస్.
- ఎర్ర పాస్ఫరస్‌ను అగ్గిపెట్టెల పరిశ్రమలో ఉపయోగిస్తారు.
- అగ్గిపుల్ల గీసే ప్రదేశంలో ఎర్ర పాస్ఫరస్, యాంటీమొని సల్ఫైడ్ మొత్తని గాజు ముక్కల పొడి ఉంటాయి.
జీబీకే పబ్లికేషన్స్
హైదరాబాద్, 8187826293
Next article
ECONOMY | పదిరూపాయిల నోటు మీద ఎన్ని భాషలుంటాయి?
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు