General Studies | వడదెబ్బ తగిలినప్పుడు సాధారణంగా శరీరం నుంచి కోల్పోయేది?
రసాయనిక బంధం
1. వజ్రం రసాయనిక రూపం?
1) లోహ కార్బోనేట్ల మిశ్రమం
2) శుద్ధ కార్బన్
3) శుద్ధమైన ఇసుక
4) కాల్షియం, మెగ్నీషియం పాస్ఫేట్ మిశ్రమం
2. కార్బన్ డై ఆక్సైడ్ విడుదల కాని ప్రక్రియ?
1) దహనం 2) శ్వాసక్రియ
3) పులియపెట్టుట
4) కిరణజన్య సంయోగ ప్రక్రియ
3. వాతావరణంలో సాధారణంగా ఉండని వాయువు?
1) నియాన్ 2) క్లోరిన్
3) కార్బన్ డై ఆక్సైడ్ 4) హీలియం
4. ఉత్ప్రేరకం అనేది?
1) రసాయన చర్యను ఆపుతుంది
2) రసాయన చర్యను ప్రారంభించడానికి సహాయపడుతుంది
3) చర్యారేటును పెంచుతుంది
4) చర్యారేటును తగ్గిస్తుంది
5. ఉష్ణాన్ని విడుదల చేసే రసాయన చర్యలను ఏమంటారు?
1) ఉత్క్రమనియ చర్యలు
2) ఉష్ణగ్రాహక చర్యలు
3) ఉష్ణ చర్యలు
4) ఉష్ణమోచక చర్యలు
6. ఘన పదార్థాన్ని వేడి చేసినప్పుడు వాయువుగా మారే ప్రక్రియ?
1) విచ్ఛిత్తి 2) కరిగిపోవడం
3) ఉత్పతనం 4) ఆవిరవడం
7. రసాయన సమ్మేళనంలో అతి చిన్న భాగం?
1) పరమాణువు 2) ఎలక్ట్రాన్లు
3) ప్రోటాన్లు 4) ఊర్థం
8. పేలుడు, మండటానికి మధ్య తేడా?
1) మండటం అనేది ఒక రసాయన చర్య, కానీ పేలుడు భౌతిక కారకాలతో ఏర్పడుతుంది
2) మండుట అనేది గాలి సమక్షంలోనే జరుగుతుంది. కానీ పేలుడు గాలి లేకుండా జరుగుతుంది
3) పేలుడు జరిగినప్పుడు పీడనం అధికంగా పెరుగుతుంది. కానీ, అలాంటి మార్పులు మండటంలో ఏర్పడవు
4)మండటం అంటే ఉష్ణాన్ని కోల్పోవడం వల్ల జరుగుతుంది. కానీ పేలుడు ఉష్ణాన్ని గ్రహించడం ద్వారా జరుగుతుంది
9. వడదెబ్బ తగిలినప్పుడు సాధారణంగా శరీరం నుంచి కోల్పోయేది?
1) షుగర్ 2) సోడియం క్లోరైడ్
3) కాల్షియం పాస్ఫేట్
4) పొటాషియం క్లోరైడ్
10. పెన్సిల్లో ఉండే ‘లెడ్’ దేనిలో తయారు చేస్తారు?
1) గ్రాఫైట్ 2) చార్కోల్
3) లెడ్ ఆక్సైడ్ 4) ల్యాంప్బ్యాక్
11. ఐసోబారిక్ విధానం ఎక్కడ జరుగుతుంది?
1) స్థిర ఉష్ణోగ్రత వద్ద
2) స్థిర పీడనం వద్ద
3) స్థిర ఘనపరిమాణం
4) పీడనాల్లో మార్పుల వద్ద
12. ఐసోఎన్థాలపిక్ పద్ధతి ఎక్కడ జరుగుతుంది?
1) స్థిర ఉష్ణోగ్రత వద్ద 2) స్థిర పీడనం వద్ద
3) స్థిర ఘనపరిమాణం 4) స్థిర ఎంథాల్పి వద్ద
13. ఉష్ణగతిక శాస్త్రం 2వ నియమం దేని గురించి తెలియజేస్తుంది?
1) ఉష్ణోగ్రత 2) పీడనం
3) ఎంట్రోపి 4) ఎంథాల్పి
జవాబులు
1.2 2.4 3.2 4.3
5.4 6.3 7.4 8.3
9.2 10.1 11.2 12.1
13.3
జడవాయువులు, ఆమ్లాలు-క్షారాలు
1. వాతావరణంలో అధిక మొత్తంలో ఉండే వాయువు?
1) బొగ్గు పులుసు వాయువు
2) హీలియం 3) నైట్రోజన్
4) ఆక్సిజన్
2. అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు ఉపయోగించే వాయువు?
1) నైట్రోజన్
2) సల్ఫర్ డై ఆక్సైడ్
3) కార్బన్ డై ఆక్సైడ్
4) హైడ్రోజన్
3. హాస్పిటల్లో శ్వాసక్రియలో ఉపయోగించే ఆక్సిజన్ ట్యూబ్లలో ఆక్సిజన్‌తో పాటు ఉండే వాయువు?
1) నైట్రోజన్ 2) హీలియం
3) ఆర్గాన్
4) కార్బన్ డై ఆక్సైడ్
4. ఫ్లోరోసెంట్ ట్యూబ్లలో సాధారణంగా ఉపయోగించే పదార్థం?
1) సోడియం ఆక్సైడ్, ఆర్గాన్
2) సోడియం ఆవిరి, నియాన్
3) మెర్క్యూరి ఆవిరి, ఆర్గాన్
4) పాదరసం, ఆక్సైడ్, నియాన్
5. బెలూన్లను పైకి పంపడానికి ఉపయోగించే వాయువు?
1) నైట్రోజన్ 2) హైడ్రోజన్
3) హీలియం 4) స్వచ్ఛమైన నీరు
6. జడవాయువులకు ఉండే లక్షణాలను గుర్తించండి.
1) నీటిలో కరుగును
2) చెప్పలేము
3) రసాయనిక జడత్వం
4) రసాయనికంగా ఉత్తేజితమైనది
7. ఎసిటిక్ ఆమ్లం pH =2 కింది దేన్ని కలపడం ద్వారా ఎసిటిక్ యాసిడ్ pH పెరుగుతుంది?
1) హైడ్రోక్లోరిక్ ఆమ్లం
2) సాధారణ ఉప్పు
3) అమ్మోనియా జల ద్రావణం
4) చక్కెర నీరు
8. ఆక్సీకరణ చర్యలో జరిగే ప్రక్రియ?
1) ఎలక్ట్రాన్ని కోల్పోవడం
2) హైడ్రోజన్‌ను గ్రహించడం
3) ఎలక్ట్రాన్‌ను గ్రహించడం
4) ఎలక్ట్రాన్లలో మార్పు ఉంటుంది
9. మానవుని రక్తం pH విలువ సుమారుగా?
1) 3 2) 7.5
3) 12 4) 6
10. ఉమ్మినీరు గుణం?
1) తటస్థం 2) ఆమ్లత్వం
3) క్షారత్వం 4) అన్ని రకాలుగా
జవాబులు
1.3 2.3 3.1 4.3
5.3 6.3 7.1 8.1
9.2 10.2
విన్నర్స్ పబ్లికేషన్స్ సౌజన్యంతో
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు