Physics | ధనుస్సుతో సంధించిన బాణం ఏ శక్తిని కలిగి ఉంటుంది?
ఉష్ణం
1. సూర్యుడి నుంచి ఉష్ణం భూమిని ఏ రూపంలో చేరుతుంది?
ఎ) ఉష్ణవహనం
బి) ఉష్ణసంవహనం
సి) ఉష్ణవికిరణం
డి) ఉష్ణవినిమయం
2. ఆరోగ్యకరమైన వ్యక్తి శరీర ఉష్ణోగ్రత?
ఎ) 370C బి) 370F
సి) 98.40C డి) 98.40K
3. కింది వాటిలో ఉత్తమ ఉష్ణవాహకం ఏది?
ఎ) పాదరసం బి) నీరు
సి) తోలు డి) బెంజీన్
4. నీరు మరిగేటప్పుడు దాని బాష్పీపీడనం?
ఎ) 1 గ్రాం/సెం.మీ2
బి) వాతావరణ పీడనానికి సమానం
సి) క్రమంగా తగ్గుతుంది
డి) ఏదీకాదు
5. ఒక రోజులోని గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలను కనుగొనడానికి ఉపయోగించే ఉష్ణమాపకం ఏది?
ఎ) క్లినికల్ థర్మామీటర్
బి) సిక్స్ కనిష్ఠ, గరిష్ఠ థర్మామీటర్
సి) ఆల్కహాల్ థర్మామీటర్
డి) హైడ్రోజన్ థర్మామీటర్
6. వేడినీటి కంటే ఆవిరి ఎక్కువగా అపాయకరం. ఎందుకు?
ఎ) ఆవిరి శరీర రంధ్రాల్లోంచి లోనికి వెళ్తుంది
బి) ఆవిరికి గుప్తోష్ణం ఎక్కువ
సి) ఆవిరికి విశిష్టోష్ణం ఎక్కువ
డి) నీటి కంటే ఆవిరి తేలికైంది
7. కింది వాటిలో ఎక్కువ సామర్థ్యం కలిగిన ఇంజన్?
ఎ) ఆవిరి ఇంజిన్ బి) పెట్రోల్ ఇంజిన్
సి) డీజిల్ ఇంజిన్ డి) ఏదైనా
8. నీటిని వేడిచేసినప్పుడు ఉష్ణం ఏ పద్ధతి ద్వారా ప్రసరిస్తుంది?
ఎ) వహనం బి) సంవహనం
సి) వికిరణం డి) వ్యాప్తి
9. పీడనాన్ని పెంచినప్పుడు మైనం ద్రవీభవన స్థానం?
ఎ) తగ్గుతుంది బి) పెరుగుతుంది
సి) మారదు డి) పెరిగి తగ్గుతుంది
10. ఘనరూపంలో ఉన్న కర్పూరం ఆవిరిగా మార్పు చెందడాన్ని ఏమంటారు?
ఎ) బాష్పీభవనం బి) ఘనీభవనం
సి) కరగడం డి) ఉత్పతనం
11. ఫ్రిజ్‌లో ఫ్రీజర్ చాంబర్‌ను పై భాగంలో మాత్రమే ఎందుకు అమరుస్తారు?
ఎ) అడుగున కంప్రెషర్ ఉండటం వల్ల
బి) సులువుగా మంచు ముక్కలను తీయడానికి
సి) చల్లని గాలి బరువుగా ఉండి కిందికి పోవడం వల్ల
డి) ప్రత్యేక కారణం ఏమీ లేదు
12. నీటికి ఏ ఉష్ణోగ్రత వద్ద సాంద్రత గరిష్ఠం?
ఎ) 0 K బి) 273 K
సి) 277 K డి) 269 K
13. ఉన్ని దుస్తులను శీతాకాలంలో ధరించుటకు కారణం?
ఎ) ఉష్ణాన్ని ఉత్పత్తి చేస్తాయి
బి) ఉష్ణాన్ని శోషిస్తాయి
సి) గాలిని ఉష్ణాన్ని బంధిస్తాయి
డి) చల్లని గాలి నుంచి కాపాడతాయి
14. నీటి ఉష్ణోగ్రత 90c నుంచి 30c డిగ్రీల సెల్సియస్‌కి తగ్గితే దాని ఘనపరిమాణం?
ఎ) మారదు
బి) మొదట పెరిగి తరువాత తగ్గుతుంది
సి) మొదట తగ్గి తర్వాత పెరుగుతుంది
డి) నీరు గడ్డకడుతుంది
15. డిగ్రీ సెల్సియస్, డిగ్రీ ఫారన్‌హీట్ ఉష్ణోగ్రతలు సమానమయ్యేది ఎక్కడ?
ఎ) 2730 బి) -2730
సి) -40 0 డి) 400
16. బాటిల్‌ని పూర్తిగా నీటితో నింపి, ఆ నీటిని గడ్డ కట్టిస్తే బాటిల్ పగిలిపోతుంది. కారణం?
ఎ) నీరు ఘనీభవనం చెందినప్పుడు వ్యాకోచిస్తుంది
బి) మంచుబిందువు దగ్గర బాటిల్ సంకోచిస్తుంది
సి) బాటిల్ బయట ఉష్ణోగ్రత లోపలి ఉష్ణోగ్రత కంటే ఎక్కువ
డి) నీరు ఘనీభవనం చెందినప్పుడు సంకోచిస్తుంది
16. కింది వాటిలో సరైన సమీకరణాన్ని గుర్తించండి.
ఎ) C/100 = F-32/180 = R/80
బి) C/80 = F/180 = R/100
సి) C/80 = F+32/180 = R/100
డి) C/180 = F/100 – R/80
17. ఆరోగ్యవంతుడైన మానవ శరీర సాధారణ ఉష్ణోగ్రత ఎంత ఉంటుంది (కెల్విన్స్లో)?
ఎ) 280 k బి) 290 k
సి) 300 k డి) 310 k
జవాబులు
1. సి 2. ఎ 3. ఎ 4. బి
5. బి 6. బి 7. సి 8. బి
9. బి 10. డి 11. సి 12. సి
13. సి 14. సి 15. సి 16. ఎ
17. డి
యాంత్రిక శాస్త్రం
1. మజ్జిగ చిలికినప్పుడు వెన్న వేరుపడటానికి కారణం?
ఎ) అపకేంద్ర బలం బి) గురుత్వ బలం
సి) ఘర్షణ బలం డి) అయస్కాంత బలం
2. గమన నియమాలను ప్రతిపాదించినది ఎవరు?
ఎ) జాన్‌డాల్టన్ బి) న్యూటన్
సి) ఫారడే డి) ఐన్‌స్టీన్
3. ఒక వస్తువును భూమిపై నుంచి చంద్రుడి మీదకి తీసుకెళ్తే?
ఎ) దాని ద్రవ్యరాశి వేరుగా ఉంటుంది. భారం స్థిరం
బి) ద్రవ్యరాశి, భారం రెండూ మార్పు చెందుతాయి
సి) ద్రవ్యరాశి స్థిరం, భారం మార్పు చెందుతుంది
డి) ద్రవ్యరాశి, భారం రెండూ స్థిరంగా ఉంటాయి
4. లిఫ్టులో ఉన్న వ్యక్తిపై పనిచేసే బలం ఏ సందర్భంలో ఎక్కువ?
ఎ) లిఫ్ట్ త్వరణంలో కిందికి వస్తున్నప్పుడు
బి) లిఫ్ట్ త్వరణంలో పైకి వెళ్తున్నప్పుడు
సి) లిఫ్ట్ సమవేగంతో కిందికి వస్తున్నప్పుడు
డి) లిఫ్ట్ సమవేగంతో పైకి వెళ్తున్నప్పుడు
5. లిఫ్ట్‌లలో ఉన్న వ్యక్తి దృశ్య భారం నిజభారం కంటే ఏ సందర్భంలో తక్కువ?
ఎ) లిఫ్ట్ త్వరణంలో పైకి వెళ్తున్నప్పుడు
బి) లిఫ్ట్ త్వరణంలో కిందికి వస్తున్నప్పుడు
సి) లిఫ్ట్ సమవేగంతో పైకి వెళ్తున్నప్పుడు
డి) లిఫ్ట్ సమవేగంతో కిందికి వస్తున్నప్పుడు
6. గుర్రపు స్వారీ చేసేవాడు గుర్రం హఠాత్తుగా ముందుకు కదిలితే పడిపోయే అవకాశం ఉంది. దీనికి కారణం?
ఎ) జడత్వభ్రామకం
బి) ద్రవ్యరాశి నిత్యత్వ నియమం
సి) నిశ్చల జడత్వం
డి) న్యూటన్ 3వ గమన నియమం
7. బస్సులో ప్రయాణించే వ్యక్తి మలుపు తిరిగేటప్పుడు ఒక వైపునకు పడతాడు. దీనికి కారణం ఏమిటి?
ఎ) గమన జడత్వం బి) దిశా జడత్వం
సి) వేగ జడత్వం డి) స్థిర జడత్వం
8. మీగడను వేరు చేసే యంత్రంలో ఎటువంటి బలం పనిచేస్తుంది?
ఎ) అపకేంద్ర బలం బి) అభికేంద్ర బలం
సి) కేంద్రక బలం కానిది
డి) బాహ్యబలం
9. ఒక క్రికెట్ ఆటగాడు బంతిని పట్టుకొనే ముందు చేతులు వెనకకు లాగుతాడు ఎందుకంటే ?
ఎ) బంతి నిశ్చలస్థితికి వస్తుంది
బి) బంతి త్వరణం చెందుతుంది
సి) బంతి ఎక్కువ బలాన్ని కలిగిస్తుంది
డి) బంతి తక్కువ బలాన్ని కలిగిస్తుంది
10. ధనస్సుతో సంధించిన బాణం కింది ఏ శక్తిని కలిగి ఉంటుంది?
ఎ) గతిజ శక్తి
బి) ఘర్షణ శక్తి
సి) స్థితిజ శక్తి
డి) గురుత్వ శక్తి
11. ఒక వస్తువు భారం విషయంలో సరైనది?
ఎ) భూతలంపై ఎక్కడైనా సమానం
బి) ధ్రువాల వద్ద గరిష్ఠం
సి) భూమధ్యరేఖ వద్ద గరిష్ఠం
డి) చదునైన భూమిపై కంటే గుట్టలపై ఎక్కువ
12. విరామంలో ఉన్న వస్తువు కింది వాటిలో దేన్ని కలిగి ఉంటుంది?
ఎ) జడత్వం బి) బలం
సి) వేగం డి) ద్రవ్యవేగం
13. పడవమీద నుంచి ఒక వ్యక్తి ఒడ్డు మీదకు దూకినప్పుడు పడవ వెనక్కు జరుగుతుంది. దీన్ని ఏ సూత్రం ఆధారంగా వివరించవచ్చు?
ఎ) న్యూటన్ మొదటి నియమం
బి) న్యూటన్ మూడవ నియమం
సి) న్యూటన్ రెండవ నియమం
డి) న్యూటన్ గురుత్వాకర్షణ నియమం
14. గాలిలో ప్రయాణిస్తున్న విమానంలో ఉండే శక్తి ?
ఎ) స్థితిజ శక్తి బి) గతిజ శక్తి
సి) పై రండూ డి) ఏ శక్తి ఉండదు
15. కింది ఏ సూత్రంపై రాకెట్ ఆధారపడుతుంది?
ఎ) శక్తినిత్యత్వ నియమం
బి) బెర్నౌలీ సిద్ధాంతం
సి) అవగాడ్రో సిద్ధాంతం
డి) ద్రవ్యవేగనిత్యత్వ నియమం
16. అపకేంద్ర బలంపై ఆధారపడి పనిచేసే వస్తువు ఏది?
ఎ) కప్పీ బి) వాషింగ్‌మెషిన్
సి) స్క్రూ డ్రైవర్ డి) సామాన్య లోలకం
17. కింది వాటిలో సరైన ప్రవచనాన్ని గుర్తించండి.
ఎ) చలనం అనేది సాపేక్ష భావన
బి) చలనం అనేది సాపేక్ష భావన కాదు
సి) సమ వేగంతో ప్రయాణించే వస్తువుకు సమవడి ఉంటుంది
డి) సమవడితో ప్రయాణించే వస్తువుకు ఎప్పుడూ సమవేగం ఉంటుంది
ఎ) 1, 2, 3, 4 బి) 2, 4
సి) 1, 3, 4 డి) 1, 3
18. పంపు నుంచి నీటి బిందువులు చుక్కలు చుక్కలుగా కిందికి పడుతున్నాయి. పంపు చివర నుంచి నేలకు మధ్యగాలిలో ఉండే నీటి చుక్కల మధ్య దూరం ఏవిధంగా ఉంటుంది?
ఎ) అన్ని నీటి చుక్కల మధ్య దూరం ఏవిధంగా ఉంటుంది
బి) పంపునకు దగ్గరగా ఉన్న చుక్కలు దగ్గరదగ్గరగా ఉంటాయి
సి) నేలకు దగ్గరలో ఉన్న చుక్కల దగ్గరదగ్గరగా ఉంటాయి
డి) నీటి చుక్కల మధ్య దూరమనేదే ఉండదు
జవాబులు
1.ఎ 2.బి 3.సి 4.బి
5.బి 6.సి 7.బి 8.ఎ
9.సి 10.బి 11.బి 12.ఎ
13.సి 14.సి 15.డి 16.బి
17.డి 18.బి
ద్రవపదార్థాలు
1. నదిలో ప్రయాణిస్తున్న ఓడ సముద్రజలాల్లోకి ప్రవేశించినప్పుడు ఓడ మట్టం పెరుగుతుంది. కారణం?
ఎ) సముద్రనీటి సాంద్రత ఎక్కువగా ఉండటం
బి) నది నీటి సాంద్రత ఎక్కువగా ఉండటం
సి) నది నీటి సాంద్రత తక్కువగా ఉండటం
డి) సముద్ర నీటి సాంద్రత తక్కువగా ఉండటం
2. నీటిలో డిటర్జెంట్స్ కలిపినప్పుడు ఏది తగ్గుతుంది?
ఎ. తలతన్యత
బి. సంసంజనబలాలు
సి. స్పర్శాకోణం డి. కేశనాళికీయత
ఎ) ఎ బి) ఎ, సి
సి) ఎ, బి, సి డి) పైవన్నీ
3. నీటిలో తేలే మంచు కరిగితే, నీటి మట్టం?
ఎ) పెరుగుతుంది బి) తగ్గుతుంది
సి) పెరిగి తగ్గుతుంది డి) మారదు
4. కింది వాటిలో తలతన్యత అనువర్తనం?
ఎ. వేడి ఆహారం నములుతున్నప్పుడు చల్లని ఆహారం కంటే రుచిగా ఉండటం
బి. వర్షపు చినుకులు, సబ్బుబుడగ, పాదరస బిందువులు గోళాకారంలో ఉండటం
సి. రంగులు, లూబ్రికెంట్స్ సులభంగా విస్తరించడానికి అవసరం
డి. నిలకడగా ఉన్న నీటిపై దోమలు స్వేచ్ఛగా చలించడం
ఎ) బి, డి బి) బి
సి) బి, సి, డి డి) పైవన్నీ
5. కింది వాటిలో సరైనది గుర్తించండి.
1. ద్రవాల తలతన్యత ఉష్ణోగ్రతకు విలోమానుపాతంలో ఉంటుంది
2. సందిగ్ధ ఉష్ణోగ్రత ప్రతి ద్రవం తలతన్యత శూన్యం
ఎ) 1 సరైనది, 2 తప్పు
బి) 1 తప్పు, 2 సరైనది
సి) రెండూ సరికావు
డి) రెండూ సరైనవే
6. కింది వాటిలో గరిష్ఠ స్నిగ్ధతను కలిగిన పదార్థాలు?
ఎ. నీరు బి. తేనె
సి. పాదరసం డి. గ్రీజ్
ఎ) బి బి) సి
సి) బి, డి డి) ఎ, సి
7. సమాన ద్రవ్యరాశిగల ఆస్ట్రిచ్ పక్షి ఈకను, 100 గ్రా. రాయిని భూమికి 200 మీ. ఎత్తు నుంచి ఒకేసారి జారవిడిచినప్పుడు, వాతావరణ పొరల్లోని స్నిగ్ధతా బలాల వల్ల?
ఎ) రెండూ ఒకేసారి భూమిని చేరుతాయి
బి) ముందుగా రాయి చేరుతుంది
సి) ముందుగా పక్షి ఈక చేరుతుంది
డి) రెండూ స్నిగ్ధతాబలాల వల్ల భూమిని చేరవు
8. ప్రెషర్ కుక్కర్లో పదార్థాలు త్వరగా ఉడుకుతాయి ఎందుకు?
ఎ) ఉష్ణం బాధించడం వల్ల
బి) ఉష్ణోగ్రత పెరగడం వల్ల
సి) నీటి బాష్పీభవన స్థానం పెరగడం వల్ల
డి) నీటి బాష్పీభవన స్థానం తగ్గడం వల్ల
9. కింది వాటిలో స్నిగ్ధతకు సంబంధించినది?
ఎ) ఇది అసంజస బలాలపై ఆధారపడుతుంది
బి) దీనివల్ల ప్రవాహిణుల ఫలితవేగం తగ్గుతుంది
సి) వాయువుల స్నిగ్ధత ఉష్ణోగ్రత పెరిగితే పెరుగుతుంది
డి) ద్రవాల స్నిగ్ధత ఉష్ణోగ్రత పెరిగితే తగ్గుతుంది
జవాబులు
1. డి 2. సి 3. డి 4. డి
5. డి 6. సి 7. బి 8. సి
9. ఎ
విన్నర్స్ పబ్లికేషన్స్ సౌజన్యంతో
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు