TS 10th Class Biology | పదో తరగతి జీవశాస్త్రం మోడల్ పేపర్
మోడల్ పేపర్-I
తెలుగు మీడియం గరిష్ఠ మార్కులు:40
సమయం: 1.30 గంటలు
భాగం-ఎ (మార్కులు:30)
విభాగం-I 3×2=6
1. స్థూలకాయత్వంతో బాధపడుతున్న నీ తోటి విద్యార్థికి ఎలాంటి ఆహారం తినమని సూచిస్తావు?
2. క్షీరదాల గుండె అంతర్నిర్మాణాన్ని పరిశీలించే ప్రయోగానికి అవసరమయ్యే సామగ్రిని సూచించండి?
3. భ్రూణ హత్యలను నివారించడానికి రెండు నినాదాలు రాయండి?
విభాగం-II 3×4=12
4. కిరణజన్య సంయోగక్రియకు, శ్వాసక్రియకు మధ్యగల భేదాలేవి?
5. దిగువ పట్టికను పరిశీలించి కింద ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి?
6. శిలాజ ఇంధనాల సంరక్షణకు పాటించే ఏవైనా నాలుగు పద్ధతులు రాయండి?
విభాగం-III 2X6=12
7. మూత్రపిండాలు పనిచేయని వ్యక్తి పాటించవలసిన తాత్కాలిక, శాశ్వత పరిష్కార పద్ధతులను వివరించండి?
8. జీర్ణాశయం స్రవించే బలమైన ఆమ్లాల నుంచి తనను తాను కాపాడుకుంటుంది. ఈ వాక్యాన్ని నిరూపించడానికి మీ ప్రయోగశాలలో నిర్వహించిన ప్రయోగానికి వాడిన పరికరాలు, అనుసరించిన పద్ధతి, తీసుకున్న జాగ్రత్తలేవి?
9. మానవుడి పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థ పటం గీచి భాగాలు గుర్తించండి?
భాగం-బి
(గరిష్ఠ మార్కులు:10) సమయం: 15 ని
10. మానవుడి జీర్ణాశయంలో సూక్ష్మచూషకాలు ఏ ప్రాంతంలో ఉంటాయి ( )
ఎ) జీర్ణాశయం బి) పెద్దపేగు
సి) పురీషనాళం డి) చిన్నపేగు
11. వాయు సహిత శ్వాసక్రియలో అంత్య పదార్థాలు ( )
ఎ) లాక్టికామ్లం+శక్తి
బి) ఇథనాల్+ కార్బన్ డై ఆక్సైడ్
సి) లాక్టికామ్లం+ కార్బన్ డై ఆక్సైడ్
డి) కార్బన్ డై ఆక్సైడ్+ నీరు+ శక్తి
12. కింది వాటిని జతపరచండి. ( )
1. పుపుస సిర ఎ. ఆమ్లజని రహిత రక్తం
2. పుపుస ధమని బి. కుడి కర్ణిక-కుడి జఠరిక
3. కరోనరీ రక్తనాళాలు సి. ఆమ్లజని రహిత రక్తం
4. అగ్రత్రయ కవాటం డి. గుండెకు రక్తం అందించడం
ఎ) 1-సి, 2-ఎ, 3-డి, 4-బి బి) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
సి) 1-సి, 2-బి, 3-సి, 4-డి డి) 1-సి, 2-బి, 3-డి, 4-ఎ
13. సరైన జతను గుర్తించండి.
ఎ) ప్రొటోజొవా-జ్వాలా కణాలు
బి) అనెలిడా- మూత్రపిండాలు
సి) ఇఖైనోడర్మెటా- నెఫ్రీడియా
డి) ఆర్థ్రోపొడా- హరిత గ్రంథులు
14. యవ్వన దశలో ముష్కాలు నిర్వహించే పని? ( )
ఎ) ప్రొజెస్టిరాన్ స్రవించడం
బి) టెస్టోస్టిరాన్ స్రవించడం
సి) అలిందం ఏర్పరచడం
డి) శుక్రకణాల ఉత్పత్తి
15. కార్బన్ డేటింగ్ పద్ధతి ద్వారా వేటి వయస్సును నిర్ధారిస్తారు? ( )
ఎ) సంధాన సేతువులు
బి) అవశేష అవయవాలు
సి) అవక్షేపాలు డి) శిలాజాలు
16. జైవిక వృద్ధీకరణ అంటే? ( )
ఎ) ఆహారపు గొలుసులోకి కాలుష్యాలు చేరడం
బి) పోషకస్థాయిలోని కాలుష్యాలు సాంద్రీకృతమవడం
సి) ఆహారపు వలలోని జంతువుల ప్రత్యేక స్థానం
డి) శక్తిగా మార్చడానికి వీలైన వృక్ష, జంతు సంబంధ పదార్థం
17. ప్రొటీన్లు, క్యాలరీలు రెండింటి లోపం వల్ల కలిగే వ్యాధి? ( )
ఎ) క్వాషియార్కర్ బి) స్థూలకాయత్వం
సి) మరాస్మస్ డి) పెల్లాగ్రా
18. పిండి పదార్థ ఆవశ్యకతను నిరూపించే ప్రయోగంలో ఉపయోగించే రసాయనం? ( )
ఎ) మిథిలేటెడ్ స్పిరిట్
బి) డయాజిన్ గ్రీన్
సి) జానస్ బిగ్రీస్
డి) పెట్రోలియం జెల్లి
19. పటంలోని కణ విభజన దశను గుర్తించండి? ( )
ఎ) ప్రథమ దశ బి) మధ్యస్థ దశ
సి) చలన దశ డి) అంత్య దశ
మోడల్ పేపర్-II
భాగం-ఎ (గరిష్ఠ మార్కులు:30)
విభాగం-I 3X2=6
1. శీతాకాలంలో ఎక్కువసార్లు మూత్ర విసర్జన చేయవలసి వస్తుంది. ఎందుకు?
2. మోల్స్ అర్ధపత్ర ప్రయోగానికి కావలసిన రెండు పరికరాలు రాయండి?
3. అవయవ దానం ప్రచారానికి అవసరమయ్యే నాలుగు నినాదాలు రాయండి?
విభాగం-II 3×4=12
4. పర్యావరణ పరిరక్షణకు తోడ్పడే 4Rs గురించి వివరించండి?
5. దిగువ పట్టికను పరిశీలించి కింది ప్రశ్నలకు సమాధానాలు రాయండి?
6. జీవ వైవిధ్య పరిరక్షణకు తీసుకోవాల్సిన 4 పద్ధతులను రాయండి?
విభాగం-III 2X6=12
7. నిర్మాణసామ్య, క్రియాసామ్య అవయవాల గురించి వివరించండి?
8. కిరణజన్య సంయోగక్రియలో ఆక్సిజన్ వెలువడుతుందని నిరూపించే ప్రయోగాన్ని జాగ్రత్తలను వివరించండి?
9. నాడీ కణం పటం గీచి భాగాలు గుర్తించండి?
భాగం-బి
(గరిష్ఠ మార్కులు:10) సమయం: 15 ని
10. జతపరచండి.
1. థయమిన్ ఎ. హానికర రక్తహీనత
2. ఆస్కార్బికామ్లం బి. రేచీకటి
3. రెటినాల్ సి. బెరిబెరి
4. సయనోకోబాలమిన్ డి. స్కర్వీ
ఎ) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
బి) 1-సి, 2-డి, 3-బి, 4-ఎ
సి) 1-డి, 2-సి, 3-బి, 4-ఎ
డి) 1-సి, 2-బి, 3-డి, 4-ఎ
11. మాట్లాడటానికి, పాటలు పాడటానికి కారణమయ్యే వాయు ప్రసార మార్గంలోని నిర్మాణం? ( )
ఎ) గ్రసని బి) వాయునాళం
సి) స్వరపేటిక డి) వాయుగోణులు
12. కుడి కర్ణిక, జఠరిక మధ్య జఠరికాంతర విభాజకంపై గల కవాటం? ( )
ఎ) అగ్రత్రయ కవాటం
బి) మిట్రల్ కవాటం
సి) పుపుస ధమని కవాటం
డి) మహా ధమని కవాటం
13. కింది వాటిలో బెరడులో నిల్వ ఉండే ఆల్కలాయిడ్? ( )
ఎ) క్వినైన్+నింబిన్ బి) క్వినైన్+మార్ఫిన్
సి) నింబిన్+రిసర్పిన్
డి) నింబిన్+ స్కోపొలమైన్
14. కింది వాటిలో సరైన జతను గుర్తించండి. ( )
ఎ) పీయూష గ్రంథి-థైరాక్సిన్
బి) అడ్రినలిన్-టెస్టోస్టిరాన్
సి) స్త్రీబీజకోశం-ఈస్ట్రోజన్
డి) క్లోమం-సొమాటోట్రోపిన్
15. వేర్ల ద్వారా శాఖీయ ప్రత్యుత్పత్తి జరిపే మొక్కను గుర్తించండి. ( )
ఎ) బంగాళదుంప బి) ఉల్లి
సి) మల్లె డి) కరివేపాకు
16. ఏక సంకరణ జన్యురూప నిష్పత్తి? ( )
ఎ) 3:1 బి) 1:2:1
సి) 1:3 డి) 2:1:1
17. జీర్ణాశయంలో ఆకలి, కోరికలు కలగడానికి కారణమయ్యే హార్మోన్? ( )
ఎ) లెఫ్టీన్ బి) ఎమైలేజ్
సి) గ్రీలిన్ డి) లైపేజ్
18. గ్లూకోజ్ ద్రావణంలో ఇంకా ఆక్సిజన్ ఉన్నదో లేదో తెలుసుకోవడానికి కలిపే ద్రావణం? ( )
ఎ) మిథిలేటెడ్ స్పిరిట్
బి) పెట్రోలియం జెల్లి
సి) అయోడిన్ డి) డయాజిన్ గ్రీన్
19. కింది పటం ఏప్రక్రియను సూచిస్తుంది? ( )
ఎ) వేరు పీడనం బి) బాష్పోత్సేకం
సి) ద్రవాభిసరణం డి) విసరణం
ఏవీ సుధాకర్
స్కూల్ అసిస్టెంట్
జడ్పీహెచ్ఎస్
లింగంపల్లి(మంచాల)
రంగారెడ్డి జిల్లా
డాక్టర్ పోటు నరసింహారావు
డాక్టర్ పోటు నరసింహారావు దేశం గర్వించదగ్గ ప్రముఖ కణశాస్త్రవేత్త. ఈయన ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా ముప్పాళ్ల గ్రామానికి చెందిన నిరుపేద కుటుంబంలో జన్మించారు. ఆయనకు వ్యవసాయం అంటే ఎంతో మక్కువ. ఢిల్లీలోని ఐఏఆర్ఐ నుంచి వ్యవసాయంలో ఎంఎస్ పట్టా పొందారు. తర్వాత పరిశోధనల కోసం అమెరికా వెళ్లారు. అక్కడ పొగాకు మొక్కలపై కణజీవశాస్త్రంలో ప్రయోగాలు చేశారు.
తన ప్రయోగాల్లో భాగంగా 1952లో మానవ శరీరంలో ఏర్పడిన కణితి నుంచి హీలా కణాల శ్రేణిని వేరుచేశారు. 1963లో పీహెచ్డీ పొందారు. అనంతరం ఆయన పరిశోధనలను సైటోజెనిక్స్ నుంచి క్యాన్సర్ కణాలపై ప్రయోగాల వైపు మళ్లించాడు. కణ కదలికలపై విస్తృతమైన ప్రయోగాలు చేశారు. సమవిభజనకు కారణమయ్యే కారకాన్ని గుర్తించడంలో కృషి చేశారు. మానవ కణం పెరుగుదల మాధ్యమంలో ఉంచినప్పుడు 20 నుంచి 24 గంటల్లోపు విభజన చెందుతుందని గుర్తించాడు. కణచక్రంలోని వివిధ దశలను తెలుసుకోవడానికి పోటు నరసింహారావు, జాన్సన్లు కణ సంలీన ప్రక్రియలను ఉపయోగించి రెండు కణ విభజనల మధ్య విరామాన్ని, అంతర్దశా ప్రావస్థలను పరిశీలించారు. కణచక్రంలో జరిగే ఈ కణ విభజనలు రసాయన శ్రేణి సంకేతాల ఆధీనంలో క్రమానుగతంగా, ఒకే దిశలో జరుగుతాయని గుర్తించారు.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?