CSIR UGC NET 2023 | సత్తా ఉంటే.. సైంటిస్టులు మీరే!
CSIR UGC NET సీఎస్ఐఆర్ యూజీసీ నెట్ | దేశంలో అత్యంత ప్రతిష్ఠాత్మక సంస్థల్లో పరిశోధనలు
చేయాలనుకుంటున్నారా? ఐఐటీ, ఎన్ఐటీ వంటి జాతీయ స్థాయి విద్యా సంస్థల్లో పీహెచ్డీ చేయాలనుకుంటున్నారా? డిగ్రీ కాలేజీలు, యూనివర్సిటీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పని చేయాలనుకుంటున్నారా? అయితే కింది సమాచారం మీ కోసమే. సైన్స్ సబ్జెక్టుల్లో జాతీయ స్థాయిలో ఏటా నిర్వ హించే కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రిసెర్చ్ (సీఐఎస్ఆర్) – యూజీసీ నెట్-డిసెంబర్ 2022/జూన్ 2023 ప్రకటనను ఎన్టీఏ విడుదల చేసింది. ఆ వివరాలు సంక్షిప్తంగా నిపుణ పాఠకుల కోసం….
సీఎస్ఐఆర్-యూజీసీ ఫెలోషిప్
- సీఎస్ఐఆర్, యూజీసీలు పరిశోధనలు ప్రోత్సహించడంలో భాగంగా రిసెర్చ్ ఫెలోషిప్స్‌ను అందిస్తున్నాయి. దీనికోసం ఏటా నేషనల్ ఎలిజిబులిటీ టెస్ట్ (నెట్)ను నిర్వహిస్తాయి. ఈ పరీక్ష నిర్వహణ బాధ్యతలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) చేపడుతుంది.
- నెట్లో అర్హత సాధించిన అభ్యర్థులు దేశంలోని ప్రతిష్ఠాత్మక యూనివర్సిటీలు, ఐఐటీలు, ప్రభుత్వ పరిశోధనాలయాలు, ల్యాబొరేటరీల్లో రిసెర్చ్ ఫెలోగా పనిచేయవచ్చు. అంతేకాకుండా ఈ సమయంలో స్టయిఫండ్‌ను కూడా సీఎస్ఐఆర్-యూజీసీలు అందిస్తాయి. జేఆర్ఎఫ్ సాధించినవారికి మొదటి రెండేండ్లు నెలకు రూ.31 వేలు ఇస్తారు. దీనికి అదనంగా గ్రాంట్ కింద ఏడాదికి రూ.20 వేలు ఇస్తారు.
పరీక్ష పేరు: సీఎస్ఐఆర్-యూజీసీ నెట్ (డిసెంబర్-2022/జూన్ -2023)
ఎవరు రాయవచ్చు ?
- ఎమ్మెస్సీ లేదా తత్సమాన కోర్సు. ఇంటిగ్రేటెడ్ బీఎస్-ఎంఎస్, బీఈ/బీటెక్ లేదా బీఫార్మసీ, ఎంబీబీఎస్ ఉత్తీర్ణులు. జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ అభ్యర్థులకు కనీసం 55 శాతం మార్కులతో ఉత్తీర్ణత. ఎస్సీ, ఎస్టీ, పీహెచ్సీ అభ్యర్థులు అయితే కనీసం 50 శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి.
నోట్: ప్రస్తుతం ఫైనల్ ఇయర్ చదువుతున్నవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. నెట్ ఫలితాలు విడుదలైన రెండేండ్లలోపు పై అర్హతలను సాధించాలి.
వయస్సు: జేఆర్ఎఫ్కు 2022, జూలై 1 నాటికి 28 ఏండ్లు మించరాదు. ఎస్సీ, ఎస్టీ పీహెచ్సీ, థర్డ్ జెండర్ అభ్యర్థులకు ఐదేండ్లు, ఓబీసీ (ఎన్సీఎల్) అభ్యర్థులకు మూడేండ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. ఈ వయస్సు పరిమితి కేవలం ఈ పరీక్ష వరకు మాత్రమే వర్తిస్తుంది. - లెక్చరర్‌షిప్/ అసిస్టెంట్ ప్రొఫెసర్‌కు ఎటువంటి గరిష్ఠ వయో పరిమితి లేదు.
పరీక్ష విధానం
- కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ) పద్ధతిలో నిర్వహిస్తారు
- పరీక్ష కాలవ్యవధి 180 నిమిషాలు
- పరీక్షలో మూడు భాగాలు ఉంటాయి. ప్రశ్నలు ఆబ్జెక్టివ్, మల్టిపుల్ చాయిస్ విధానంలో ఇస్తారు.
- పార్ట్ ఏ అన్ని సబ్జెక్టుల వారికి కామన్‌గా ఉంటుంది. దీనిలో జనరల్ ఆప్టిట్యూడ్ (లాజికల్ రీజనింగ్, గ్రాఫికల్ అనాలసిస్, అనలిటికల్ అండ్ న్యూమరికల్ ఎబిలిటీ, క్వాంటిటేటివ్ కంపారిజన్, సిరీస్ ఫార్మేషన్, పజిల్స్ తదితర అంశాల నుంచి ఇస్తారు.
నోట్: ఆయా సబ్జెక్టులను బట్టి నెగెటివ్ మార్కింగ్ విధానం, ప్రశ్నలు ఇవ్వడంలో తేడాలు ఉంటాయి. వివరాలు వెబ్సైట్లో చూడవచ్చు. - రాష్ట్రంలో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్‌నగర్, నల్లగొండ, వరంగల్
పరీక్ష నిర్వహించే సబ్జెక్టులు
- కెమికల్ సైన్సెస్
- ఎర్త్, అట్మాస్ఫియరిక్, ఓషన్ అండ్ ప్లానెటరీ సైన్సెస్
- లైఫ్ సైన్సెస్
- మ్యాథమెటికల్ సైన్సెస్
- ఫిజికల్ సైన్సెస్
ముఖ్యతేదీలు
- దరఖాస్తు: ఆన్లైన్లో
- చివరితేదీ: ఏప్రిల్ 10
- పరీక్ష తేదీలు: జూన్ 6,7,8
- వెబ్సైట్: https://csirnet.nta.nic.in
Previous article
TS 10th Class Biology | పదో తరగతి జీవశాస్త్రం మోడల్ పేపర్
Next article
Career guidance | What Next for Law aspirants?
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?