PHYSICS | దేశంలో భూ అయస్కాంత భూ మధ్యరేఖ ఏ ప్రాంతం నుంచి వెళ్తుంది?
భౌతిక శాస్త్రం
1. ఫెర్రైట్స్ అనే పదార్థాలు?
1) పారా అయస్కాంత పదార్థాలు
2) ఫెర్రో అయస్కాంత పదార్థాలు
3) డయా అయస్కాంత పదార్థాలు
4) 1, 3
2. భూ అయస్కాంత తత్వానికి సంబంధించి సరికాని వ్యాఖ్య?
1) అయస్కాంత ఉత్తరద్రువం భౌగోళిక దక్షిణమును సూచిస్తుంది
2) ఉత్తరద్రువం దక్షిణద్రువం కంటే బలమైనది
3) అయస్కాంత ద్రువాలు స్థిరంగా తమ స్థానాలను మార్చుకొంటుంది
4) పైవేవీ కావు
3. అయస్కాంత ఆవరణ గల గ్రహాలు ?
ఎ. భూమి బి. బుధుడు
సి. బృహస్పతి డి. శని
1) ఎ 2) ఎ, సి
3) ఎ, డి 4) పైవన్నీ
4. పరమశూన్య ఉష్ణోగ్రత (లేదా) కెల్విన్‌ను కొలవడానికి ఉపయోగించే అయస్కాంత ఉష్ణోగ్రతా మాపకంలో దేన్ని ఉపయోగిస్తారు?
1) జడవాయువైన నియాన్‌ను
2) ద్రవస్థితిలోని హీలియంను
3) ద్రవస్థితిలోని పాదరసాన్ని
4) ఆల్కహాల్‌ను
5. భూ అయస్కాంత క్షేత్రం వల్ల వికర్షించబడి ఆవేశపూరిత కణాలచే భూమి చుట్టూ వృత్తాకార మార్గంలో ఏర్పడిన 2 వలయాలు?
1) చాప్మన్-ఫెరారో వలయాలు
2) వాన్-డీ గ్రాఫ్ వలయాలు
3) వాన్ హాలెన్ వలయాలు
4) గిల్బర్ట్ వలయాలు
6. భూ అయస్కాంత క్షేత్రంలో అత్యధిక ఒడి-దొడుకులు పరిశీలించేది?
1) జూన్ 2) జూలై
3) ఆగస్టు 4) సెప్టెంబర్
7. Indian Institute of Geomagnetism అనే సంస్థ గల ప్రదేశం?
1) చెన్నై 2) బెంగళూరు
3) ముంబై 4) ఢిల్లీ
8. ఎక్కువ భౌమ అయస్కాంత తీవ్రత గల ప్రదేశాలు?
ఎ. ఉత్తరకెనడా బి. సైబీరియా
సి. దక్షిణ ఆస్ట్రేలియా
డి. అంటార్కిటికా తీరం
1) ఎ 2) సి
3) ఎ, సి 4) పైవన్నీ
9. జతపరచండి.
ఎ. ఫెర్రో అయస్కాంత పదార్థాలు 1. నికెల్, కోబాల్ట్
బి. డయా అయస్కాంత పదార్థాలు 2. పాదరసం, నీరు
సి. పారా అయస్కాంత పదార్థాలు 3. అల్యూమినియం, ఆక్సిజన్
1) ఎ-2, బి-1, సి-3
2) ఎ-3, బి-2, సి-1
3) ఎ-1, బి-3, సి-2
4) ఎ-1, బి-2, సి-3
10. ఒక అనయస్కాంతాన్ని అయస్కాంత పదార్థంగా మార్చుకోడానికి తోడ్పడే అయస్కాంతీకరణ పద్ధతి ఏది?
ఎ. ఏకస్పర్శాపద్ధతి
బి. ద్విస్పర్శాపద్ధతి
సి. అయస్కాంత ప్రేరణ
డి. విద్యుదీకరణ పద్ధతి
1) ఎ, బి 2) ఎ, డి
3) ఎ, బి, డి 4) పైవన్నీ
11. సరైన వ్యాఖ్యను గుర్తించండి.
ఎ. విద్యుదయస్కాంతాలు మృదువైన ఇనుముతో తయారవుతాయి
బి. విద్యుదయస్కాంతాలను ఎలక్ట్రిక్ సర్క్యూట్స్, మోటార్స్, జనరేటర్స్లో ఉపయోగిస్తారు
సి. శాశ్వత అయస్కాంతం గట్టి అయస్కాంత పదార్థాలైన ఉక్కు, ఆల్నికో, టింకోనల్చే తయారవుతాయి
డి. శాశ్వత అయస్కాంతాన్ని గాల్వనోమీటర్, మైక్రోఫోన్, లౌడ్‌స్పీకర్, కంపాస్‌లో
ఉపయోగిస్తారు
1) ఎ, బి 2) బి, డి
3) ఎ, బి, సి 4) పైవన్నీ
12. కింది వాటిలో సరికాని వ్యాఖ్య గుర్తించండి.
ఎ. భూ అయస్కాంత క్షేత్ర తీవ్రత ద్రువాల వద్ద చాలా ఎక్కువగా భూమధ్య రేఖ వద్ద తక్కువ
బి. జియోమాగ్నెటిక్ ఈక్వేటర్ భారత ఉత్తరాగ్రం దగ్గర నుంచి వెళ్తుంది
సి. అయస్కాంత క్షేత్ర తీవ్రలను కలిపే రేఖాచిత్రం ఐసోడైనమిక్ చార్ట్
డి. తక్కువ అయస్కాంత క్షేత్రతీవ్రత గల ఖండం – దక్షిణ అమెరికా
1) ఎ 2) బి
3) బి, సి 4) ఎ, సి
13. అయస్కాంతత్వానికి కచ్చితమైన పరీక్ష?
1) ఆకర్షణ 2) వికర్షణ
3) ఎ, బి 4) పైవేవీ కావు
14. కింది వాటిలో సరైనవి గుర్తించండి.
1. అయస్కాంత ఉత్తరద్రువాన్ని జాన్రాస్ అనే శాస్త్రవేత్త ‘బూతియాఫెలిక్స్’ అనే ప్రదేశంలో కనుగొన్నాడు
2. అయస్కాంత దక్షిణద్రువాన్ని శెకల్టన్ అనే శాస్త్రవేత్త సౌత్విక్టోరియా అనే ప్రదేశంలో కనుగొన్నాడు
1) 1 సరైనది, 2 తప్పు
2) 1 తప్పు, 2 సరైనది
3) రెండూ సరైనవే
4) రెండూ తప్పు
15. ఇనుప కడ్డీని అయస్కాంతంగా మారిస్తే దాని పొడవు?
1) కొద్దిగా పెరుగుతుంది
2) కొద్దిగా తగ్గుతుంది
3) పెరిగి తగ్గుతుంది 4) మారదు
16. దిక్సూచి ఎప్పుడు ఉత్తర దక్షిణాలను సూచించడానికి కారణం?
1) భూమిపై ఉండే వాతావరణం
2) భూమి ఒక అయస్కాంతం వలే పనిచేయడం
3) భూమి సూర్యుని చుట్టూ తిరగడం
4) భూమి భ్రమణం చెందడం
17. ఒక దండ అయస్కాంతాన్ని అక్షియరేఖ వెంబడి రెండు సమాన భాగాలుగా చీలిస్తే ఈ భాగాల ద్రువ సత్వం ఏమవుతుంది?
1) సగం 2) రెట్టింపు
3) నాలుగింతలు 4) మారదు
18. భూ అయస్కాంత క్షేత్రం భూమి ఉపరితలం నుంచి ఎంత ఎత్తు వరకు విస్తరించి ఉంటుంది?
1) 8,20,000 కి.మీ
2) 2,58,000 కి.మీ
3) 5,28,000 కి.మీ
4) 2,85,000 కి.మీ
19. దండాయస్కాంతం వల్ల ఎన్ని తటస్థ బిందువులు ఏర్పడతాయి?
1) 1 2) 2 3) 3 4) 4
20. ఒకే అవపాతం గల ప్రాంతాలను కలుపుతూ గీసిన రేఖలను ఏమంటారు?
1) ఐసోబార్లు 2) ఐసోటోనులు
3) ఐసోక్లీనిక్లు 4) ఐసోగోనిక్లు
21. భూ అయస్కాంత భూమధ్య రేఖ దేశంలో కింది ఏ ప్రాంతం నుంచి వెళుతుంది?
1) తుంబ 2) హైదరాబాద్
3) శ్రీహరికోట 4) డెహ్రాడూన్
22. భూమి భౌగోళిక అక్షానికి, అయస్కాంత అక్షానికి మధ్య గల కోణం?
1) దిక్పాతం 2) అవపాతం
3) అనుపాతం 4) ప్రతిపాతం
జవాబులు
1.2 2.3 3.4 4.2
5.3 6.1 7.3 8.4
9.4 10.4 11.4 12.2
13.2 14.3 15.1 16.2
17.1 18.3 19.2 20.3
21.1 22.1
బయో ఫార్మాటిక్స్
జీవ సాంకేతికత ద్వారా సూక్ష్మ జీవుల సహాయంతో కర్బన పదార్థాలైన బీరు, పాల ఉత్పత్తులను తయారుచేయడం ఉదాహరణగా చెప్పవచ్చు. వ్యర్థాల సమర్థ నిర్వహణకు, జీవ ఆయుధాల తయారీలోనూ జీవసాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నారు. దినదినాభివృద్ధి చెందుతున్న మానవాళికి అవసరమైన వాటిని పారిశ్రామికంగా పెద్ద మొత్తంలో తయారు చేయడానికి జీవసాంకేతిక పరిజ్ఞానం ఇతోధికంగా తోడ్పడుతుంది. జీవసాంకేతిక పరిజ్ఞానం పలు నూతన శాఖల ఆవిర్భవానికి బీజం వేసింది.
1. బయో ఫార్మాటిక్స్- దీన్నే కంప్యూటేషనల్ బయాలజీ అని కూడా పేర్కొంటారు. దీంట్లో కంప్యూటేషనల్ విధానాల ద్వారా జీవసంబంధ సమస్యలకు పరిష్కారాలు సాధ్యమవుతాయి. ఫలితంగా పెద్ద పెద్ద సంస్థలకు పెద్ద మొత్తంలో సేకరించుకొనే జీవ సంబంధ డేటాను స్వల్ప కాలంలోనే విశ్లేషించడం సాధ్యపడుతుంది.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు