BIOLOGY | కణానికి మేధస్సు.. జన్యువులకు స్థావరం
క్రోమోసోమ్లు (Chromosomes)
- హాఫ్ మిక్చర్ అనే శాస్త్రవేత్త ట్రడెష్కాన్షియా అనే మొక్కల్లో క్రోమోసోమ్లను కనుగొన్నాడు. వాల్డేయర్ అనే శాస్త్రవేత్త క్రోమోసోమ్ అనే పేరును ప్రతిపాదించాడు.
- వీటిని అనువంశిక భౌతికాధారాలు (Physical basis of Heredity) అంటారు.
- సట్టన్, బవేరీలు క్రోమోసోమ్ల సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు.
- క్రోమోసోమ్ మధ్యలో సెంట్రోమియర్ ఉంటుంది. దీనికి ఇరువైపులా క్రొమాటిడ్లు ఉంటాయి.
- క్రోమోసోమ్లోని సెంట్రోమియర్ల సంఖ్య ఆధారంగా వీటిని ఏసెంట్రిక్, మోనో సెంట్రిక్, డై సెంట్రిక్, పాలి సెంట్రిక్, హాలో సెంట్రిక్ అని వర్గీకరించవచ్చు.
- మోనోసెంట్రిక్ క్రోమోసోమ్లో ఉండే సెంట్రోమియర్ స్థానాన్ని బట్టి క్రోమోసోమ్లను మెటా సెంట్రిక్ (V- ఆకారం), సబ్ మెటా సెంట్రిక్ (L- ఆకారం), ఎక్రోసెంట్రిక్ (J- ఆకారం), టీలోసెంట్రిక్ (i- ఆకారం) అని వివిధ రకాలుగా వర్గీకరించారు.
- క్రోమోసోమ్ల ఆకారాన్ని కణ విభజనలోని చలన దశలో చూడవచ్చు.
- క్రోమోసోమ్ల సంఖ్య ఆయా జాతులను బట్టి మారుతూ ఉంటుంది.
- వృక్ష, జంతు కణాల్లో సాధారణంగా రెండు క్రోమోసోమ్ సమితులు ఉంటాయి. దీన్నే ద్వయస్థితి (2n) అంటారు. ఈ స్థితి శాఖీయ కణాల్లోనూ కనిపిస్తుంది. సంయోగబీజాల్లో/ బీజకణాల్లో ఒకే సమితి క్రోమోసోమ్లు ఉంటాయి. దీన్ని ఏకస్థితి (n) అంటారు.
- విధిని బట్టి క్రోమోసోమ్లు రెండు రకాలు అవి.. శారీరక క్రోమోసోమ్లు (ఆటోసోమ్లు), లైంగిక క్రోమోసోమ్లు (అల్లోసోమ్లు).
- కణం పెరుగుదల, అభివృద్ధి వంటి లక్షణాలను నియంత్రించే క్రోమోసోమ్లను శారీరక క్రోమోసోమ్లు అంటారు. ఇవి శాఖీయ/శారీరక కణాల్లో ఎక్కువ సంఖ్యలో ఉంటాయి.
- జీవుల్లో లింగ విభేదనాన్ని కలిగించి స్త్రీ, పురుష లక్షణాలను నియంత్రించే క్రోమోసోమ్లను లైంగిక క్రోమోసోమ్లు అంటారు. ఇవి లైంగిక కణాల్లో/బీజకణాల్లో ఉంటాయి. ఇవి తక్కువ సంఖ్యలో ఉంటాయి. మానవుల్లో వీటిని X, Y క్రోమోసోమ్లుగా పిలుస్తారు.
కేంద్రకామ్లాలు (Nucleic Acids)
- ఫ్రెడరిక్ మిషర్ అనే శాస్త్రవేత్త చీము కణాల్లో ప్రప్రథమంగా కేంద్రకామ్లాలను కనుగొన్నారు. ఆల్డ్మన్ అనే శాస్త్రవేత్త కేంద్రకామ్లాలు (న్యూక్లిక్ యాసిడ్స్) అని నామకరణం చేశాడు.
- కేంద్రకామ్లాలు నత్రజని క్షారాలు, పెంటోస్ చక్కెర, పాస్ఫేట్ గ్రూపు మొదలైన వాటితో నిర్మితమై ఉంటాయి.
- కేంద్రకామ్లాల్లోని నత్రజని క్షారాలు రెండు రకాలు అవి.. ప్యూరిన్లు, పిరమిడిన్లు.
- ప్యూరిన్లు: అడినిన్, గ్వానిన్.
- పిరమిడిన్లు: సైటోసిన్, థైమిన్, యురాసిల్.
- DNAలో ఉండి RNAలో లోపించే నత్రజని క్షారం థైమిన్.
- RNAలో ఉండి DNAలో లోపించే నత్రజని క్షారం యురాసిల్.
- పెంటోస్ చక్కెర ఐదు కార్బన్లతో నిర్మితమైన అణువు. దీనిలో రైబోస్ చక్కెర, డీ ఆక్సీరైబోస్ చక్కెరలు రెండూ ఉంటాయి.
- రైబోస్ చక్కెర RNAలో ఉండగా, డీ ఆక్సీరైబోస్ చక్కెర DNAలో ఉంటుంది.
- కేంద్రకామ్లాల నిర్మాణంలో నత్రజని క్షారాలు, పెంటోజ్ చక్కెరతో పాటు పాస్ఫేట్ కూడా ఉంటుంది.
- కేంద్రకామ్లాల నిర్మాణంలో ప్యూరిన్లు ఎల్లప్పుడు పిరమిడిన్లతో హైడ్రోజన్ బంధాల ద్వారా కలుపబడి ఉంటాయి. (A=T, G లేదా A=U, G
న్యూక్లియోటైడ్:
నత్రజని క్షారం+ పెంటోజ్ చక్కెర+పాస్ఫేట్
న్యూక్లియోసైడ్: నత్రజని క్షారం+ పెంటోజ్ చక్కెర - కేంద్రకామ్లంలోని నత్రజని క్షారం, పెంటోజ్ చక్కెరల మధ్య ైగ్లెకోసైడిక్ బంధం, పెంటోజ్ చక్కెర, పాస్ఫేట్ గ్రూపుల మధ్య పాస్ఫో డై ఎస్టర్ బంధం ఉంటుంది.
- కేంద్రకామ్లాలు రెండు రకాలు. అవి.. DNA (డీ ఆక్సీ రైబోన్యూక్లిక్ ఆమ్లం), RNA (రైబో న్యూక్లిక్ ఆమ్లం).
DNA - దీనిలో డీ ఆక్సీ రైబోస్ చక్కెర ఉంటుంది
- ఇది రెండు న్యూక్లియోటైడ్ పోచలను కలిగి ద్విసర్పిలంగా ఉంటుంది
- అధిక స్థిరత్వాన్ని కలిగి ఉంటుంది
- అధిక అణుభారాన్ని కలిగి ఉంటుంది
- దీనిలో థయమిన్ అనే పిరమిడిన్ ఉంటుంది
- ఎంజైమ్గా పనిచేయదు
- ఇది జన్యు పదార్థం
- ఇది కేంద్రకంలో ఉంటుంది
RNA - దీనిలో రైబోస్ చక్కెర ఉంటుంది
- ఇది ఒకే న్యూక్లియోటైడ్ పోచను కలిగి ఏక సర్పిలంగా ఉంటుంది
- తక్కువ స్థిరత్వాన్ని కలిగి ఉంటుంది
- తక్కువ అణుభారాన్ని కలిగి ఉంటుంది
- దీనిలో థయమిన్కు బదులుగా యురాసిల్ అనే పిరమిడిన్ ఉంటుంది
- ఇది రైబోజోమ్ అనే ఎంజైమ్గా పనిచేస్తుంది
- ఇది జన్యు పదార్థం కాదు (కొన్ని వైరస్లలో మాత్రమే జన్యు పదార్థం
- ఇది ఎక్కువగా కణద్రవ్యంలో ఉండి ప్రొటీన్ల సంశ్లేషణలో తోడ్పడుతుంది
- DNA డబుల్ హెలిక్స్ (ద్వంద్వ కుండలి/ ద్విసర్పిల) ఆకారంలో ఉంటుందని వాట్సన్, క్రిక్లు 1953లో ప్రతిపాదించారు. దీనికి వీరికి 1962లో నోబెల్ బహుమతి లభించింది.
- DNA జన్యు పదార్థంగా పనిచేస్తుందని హర్షీ, చేస్లు 1952లో తెలియజేశారు.
కణవిభజన (Cell Division)
- రుడాల్ప్ విర్షా అనే శాస్త్రవేత్త మొదటిసారిగా కణవిభజనను గురించి వివరించాడు.
- కణం విభజన చెంది కొత్త కణాలను ఏర్పరచడాన్ని కణ విభజన అంటారు.
కణ చక్రం - కణ చక్రంలో రెండు దశలు ఉంటాయి. అవి అంతర్దశ, విభజన దశ.
- అంతర్దశను విరామ దశ అంటారు. ఈదశలో కణ
విభజనకు కావల్సిన అన్ని పరిస్థితులు కల్పించబడుతాయి. దీనిలోG1, Sa, G2 అనే మూడు దశలు ఉంటాయి. - విభజన దశలో కణం విభజన చెందుతుంది. ఇది రెండు రకాలు అవి. సమ విభజన, క్షయకరణ విభజన.
సమ విభజన (Mitosis)
- జీవి పెరుగుదలకు ఈ విభజన తోడ్పడుతుంది. అందువల్ల దీన్ని పెరుగుదల విభజన అంటారు.
- ఇది మొక్కల్లోని శాఖీయ భాగాలు (వేరు, కాండం, పత్రం)లో జరుగుతుంది. కాబట్టి దీన్ని శాఖీయ
విభజన అని కూడా అంటారు. - ఇది జంతువుల దేహ కణాల్లో (గుండె, మూత్రపిండాలు, కాలేయం, చర్మం మొదలైనవి) జరుగుతుంది. కాబట్టి దీన్ని శారీరక, దేహకణ విభజన అంటారు.
- దీనిలో ఒక తల్లికణం/మాతృకణం (ద్వయస్థితి) విభజితమై రెండు పిల్ల కణాలు (ద్వయస్థితి)
ఏర్పడతాయి. అంటే తల్లి కణంలోని క్రోమోసోమ్ల సంఖ్య పిల్ల కణాల్లోని క్రోమోసోమ్ల సంఖ్య సమానంగా ఉంటుంది. - తల్లి కణంలో, పిల్ల కణాల్లో క్రోమోసోమ్ల సంఖ్య సమానంగా ఉండటం వల్ల దీన్ని సమ విభజన అంటారు.
- ఈ విభజన ఫలితంగా ఏర్పడిన పిల్ల కణాలు పూర్తిగా తల్లి కణాన్ని పోలి ఉంటాయి.
- సమ విభజన జరిగేటప్పుడు కేంద్రకంలో జరిగే మార్పులను కేంద్రక విభజన అంటారు. దీనిలో నాలుగు దశలుంటాయి. అవి ప్రథమ దశ, మధ్యస్థ దశ, చలన దశ, అంత్య దశ.
- చలన దశలో సెంట్రోమియర్ విభజన జరగడం వల్ల తల్లి, పిల్ల కణాల్లో క్రోమోసోమ్ల సంఖ్య సమానంగా ఉంటుంది.
క్షయకరణ విభజన
- జీవి ప్రత్యుత్పత్తి/బీజకణాల్లో ఈ విభజన జరుగుతుంది.
- ఇది కేవలం ద్వయస్థితిక కణాల్లో మాత్రమే జరుగుతుంది.
- ఈ విభజనలో తల్లి కణం/మాతృకణం (ద్వయస్థితి) విడిపోయి నాలుగు పిల్ల కణాలు (ఏకస్థితికం) ఏర్పడతాయి. అంటే తల్లి కణంలోని క్రోమోసోమ్ల సంఖ్య పిల్ల కణాల్లో సగానికి తగ్గుతుంది.
- ఈ విభజన ఫలితంగా ఏర్పడిన పిల్ల కణాలు తల్లి కణాలకు భిన్నంగా ఉంటాయి.
- క్షయకరణ విభజన రెండుసార్లు జరుగుతుంది. అవి క్షయకరణ విభజన-1, క్షయకరణ విభజన-2.
- క్షయకరణ విభజన-1లో నాలుగు దశలుంటాయి. అవి.. ప్రథమ దశ-1, మధ్యస్థ దశ-1,
చలన దశ-1, అంత్యదశ-1. - ప్రథమ దశ-1లో 5 ఉపదశలుంటాయి. అవి వరుసగా లెప్టోటీన్, జైగోటీన్, పాకిటీన్, డిప్లోటీన్, డయాకైనసిస్.
- క్షయకరణ విభజన-2 సమ విభజనను పోలి ఉంటుంది.
- క్షయకరణ విభజన-1లోని చలన దశ-1 లో సెంట్రోమియర్ విభజన జరగదు. కాని క్షయకరణ
విభజన-2లోని చలన దశ-2లో మాత్రం సెంట్రోమియర్ విభజన జరుగుతుంది. - క్షయకరణ విభజన వల్ల క్రోమోసోమ్ల సంఖ్య జాతి నిర్దిష్ట క్రోమోసోమ్ల సంఖ్య తరతరాలకు
మారకుండా ఉంటుంది. - క్షయకరణ విభజన జీవ పరిణామానికి తోడ్పడుతుంది.
కేంద్రకం (Nucleas)
- కేంద్రకం కణంలో ముఖ్యమైన భాగం. ఇది కణ విభజనలో ప్రముఖ పాత్ర పోషిస్తుంది. ఇది కణాంగాలన్నింటిలో పెద్దగా స్పష్టంగా కనిపిస్తుంది.
- కేంద్రకాన్ని రాబర్ట్ బ్రౌన్ అనే శాస్త్రవేత్త ఆర్కిడ్ పత్రాల బాహ్యచర్మ కణాల్లో కనుగొన్నాడు.
- ఎర్ర రక్తకణాలు, చాలనీ నాళాల్లో కేంద్రకం ఉండదు.
- కేంద్రకంలోని వివిధ భాగాల గురించి కణవిభజన అంతర్దశలో సులభంగా తెలుసుకోవచ్చు.
- ఇది కణంలోని అన్ని జీవక్రియలను నియంత్రించడం వల్ల దీన్ని కణ మేధస్సు/ కణ నియంత్రణ గది/కణం మాస్టర్ కంట్రోలర్ అంటారు.
- కేంద్రకంలో నాలుగు ప్రధాన భాగాలుంటాయి. అవి కేంద్రక త్వచం, కేంద్రక ద్రవ్యం, క్రొమాటిన్ పదార్థం, కేంద్రకాంశం.
- కేంద్రకంలో గాఢ వర్ణం కలిగి, చిక్కుపడి ఉన్న దారాల వంటి నిర్మాణాలను క్రొమాటిన్ పదార్థం అంటారు. దీనిలో DNA, హిస్టోన్ ప్రొటీన్లు ఉంటాయి.
- ఫాంటానా అనే శాస్త్రవేత్త కేంద్రకాంశంను కనుగొన్నాడు.
- కేంద్రకాంశం రసాయనికంగా RNA, ప్రొటీన్లు, తక్కువ DNAతో నిర్మితమై ఉంటుంది. ఇది రైబోజోమ్ల ఉత్పత్తిలో పాల్గొనటం వల్ల కేంద్రకాంశాన్ని రైబోజోమ్ల ఉత్పత్తి కర్మాగారం అంటారు.
డాక్టర్ మోదాల మల్లేష్
విషయ నిపుణులు
పాలెం, నకిరేకల్, నల్లగొండ
9989535675
Previous article
REASONING | A-B=Aకు చెంది B కి చెందని మూలకాల సంఖ్య?
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు