Biology March 20 | మొక్కల పెరుగుదలకు ఉపయోగపడే కణజాలం ఏది?
1. అతి తక్కువ ఖర్చుతో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌ను గుర్తించే ప్రాథమిక పరీక్ష?
1) పాప్‌స్మియర్ పరీక్ష
2) బయాప్సీ పరీక్ష
3) VIA (Visual Inspection with Acetic acid) 4) LIFs
2. గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌ను కలిగించే వైరస్ ఏది?
1) హ్యూమన్ సిపలోమా వైరస్
2) హ్యూమన్ పాపిలోమా వైరస్
3) హ్యూమన్ సర్విక్సోమా వైరస్
4) హ్యూమన్ ఆంకోమా వైరస్
3. క్యాన్సర్ చికిత్సలో ఒకటైన కీమోథెరపీలో వాడే రసాయనాలు ఏవి?
1) విన్క్రిప్టిన్ 2) విన్ బాస్టిన్
3) టాక్సాల్ 4) పైవన్నీ
4. ఫాదర్ ఆఫ్ కీమోథెరపీ అని ఎవరిని పిలుస్తారు?
1) మిరాక్సులస్ 2) పాల్ ఎర్లిచ్
3) నోవాసిక్ 4) వీకే సింగ్
5. బిళ్ల గన్నేరు నుంచి లభించే ఏ ఆల్కలాయిడ్లను ల్యుకేమియా చిక్సితకు వాడతారు?
1) విన్‌క్రిస్టిన్ 2) విన్‌బ్లాస్టిన్
3) 1, 2 4) మిరియం
6. ఇండియాలో స్త్రీలకు ఎక్కువగా వచ్చే క్యాన్సర్ ఏది?
1) నోటి, గొంతు క్యాన్సర్
2) గర్భాశయ క్యాన్సర్
3) గర్భాశయ ముఖద్వార క్యాన్సర్
4) బ్లడ్ క్యాన్సర్
7. ఇండియాలో పురుషులకు ఎక్కువగా వచ్చే క్యాన్సర్ ఏది?
1) నోటి, గొంతు క్యాన్సర్
2) బ్లడ్ క్యాన్సర్
3) లంగ్ క్యాన్సర్
4) పురీషనాళ క్యాన్సర్
8. క్యాన్సర్ కణాలు రక్తం, శోషరసం ద్వారా ఇతర భాగాలకు వ్యాప్తి చెందడాన్ని ఏమంటారు?
1) గామా స్టాసిస్ 2) మెటాస్టాసిస్
3) ఆంకో స్టాసిస్
4) క్యాన్సర్ ఎపిస్టాసిస్
9. కణ విభజన అదుపు తప్పి కణాల రాశి/గడ్డ ఏర్పడటాన్ని ఏమంటారు?
1) టీబీ 2) ఎయిడ్స్
3) క్షయకరణ విభజన
4) క్యాన్సర్
10. క్యాన్సర్ గురించిన అధ్యయనాన్ని ఏమంటారు?
1) కార్సినాలజీ 2) ఆంకాలజీ
3) జెరంటాలజీ 4) యుఫెనిక్స్
11. CCMB ని విపులీకరించండి.
1) Centre for Cellular and Metabolic Biology
2) Central Council of Molecular Biology
3) Council of Cell and Molecular Biology
4) Centre for Cellular and Molecular Biology
12. CCMB ఎక్కడ ఉంది? ఏ సంస్థ కింద పనిచేస్తుంది?
1) హైదరాబాద్, CSIR
2) పుణె, IISC
3) బెంగళూర్, IISC
4) ఢిల్లీ, CSIR
13. కణచక్రంలోని ప్రధానమైన దశల సంఖ్య ఎంత?
1) 4 2) 5 3) 2 4) 8
14. కింది దశల్లోని వేటిలో వరుసగా DNA ప్రతికృతి ప్రారంభమై అంతమవుతుంది?
1) S, G2 2) G1, G2
3) G0, G1 4) G1, S
15. సమ విభజనలోని కణచక్రం వరుస క్రమం ఏది?
1) ప్రథమ దశ, మధ్యస్థ దశ, చలన దశ
2) G1, S, G2, M
3) G2, S, G, M
4) S, M, G2, G1, G0, P, M, T, కణద్రవ్య విభజన
16. ప్రథమ దశ-1లోని వివిధ దశలను వరుస క్రమంలో పేర్కొనండి.
1) లెప్టోటిన్, జైగోటిన్, పాకిటిన్, డిప్లోటిన్, డయాకైనెసిస్
2) లెప్టోటిన్, జైగోటిన్, పాకిటిన్, డయాకైనసిస్, డిప్లోటిన్
3) లెప్టోటిన్, పాకిటిన్, జైగోటిన్, డయాకైనసిస్, డిప్లోటిన్
4) లెప్టోటిన్, పాకిటిన్, జైగోటిన్, డిప్లోటిన్, డయాకైనసిస్
17. క్రోమోసోమ్‌ల స్వరూపాన్ని అధ్యయనం చేయడానికి, కణచక్రంలోని ఏ దశను ఎన్నుకొంటారు?
1) అంతర్దశ 2) మధ్యస్థ దశ
3) చలన దశ 4) S-దశ
18. సాధారణంగా పారగతి వేటి మధ్యలో జరుగుతుంది?
1) సమజాతీయ క్రోమోసోమ్ల్లోని సోదరేతర క్రొమాటిడ్ల మధ్య
2) సమజాతీయ క్రోమోసోమ్ల్లోని సోదర క్రొమాటిడ్ల మధ్య
3) సోదర క్రొమాటిడ్లలోని రెండు DNA పోచల మధ్య
4) సోదర క్రొమాటిడ్లలోని 4 DNA పోచల మధ్య
19. అంతర్దశలో అతి తక్కువ సమయం పట్టే ఉపదశ ఏది?
1) G0 2) G1 3) G2 4) S
20. సమ విభజన, క్షయకరణ విభజనల్లో ఎల్లప్పుడు అదృశ్యం అయి తిరిగి ఏర్పాటయ్యే నిర్మాణాలు ఏవి?
1) ప్లాస్టిడ్లు, కేంద్రకాంశం
2) క్రోమోసోమ్లు, ప్లాస్మాసోమ్లు
3) కేంద్రకాంశం, న్యూక్లియాయిడ్
4) కేంద్రకాంశం, కేంద్రక త్వచం
21. క్షయకరణ విభజనలోని వివిధ దశలను కింది ఏ భాగాల్లో క్షుణ్నంగా పరిశీలించవచ్చు?
1) వేరుకొన 2) కాండాగ్రం
3) పరాగకోశం
4) ఫలదీకరణం చెందిన అండాశయం
22. ప్రథమ దశ-1కు, మధ్యస్థ దశ-1కు మధ్య గల దశ ఏది?
1) చలన దశ-1 2) పాకిటిన్
3) డిప్లోటిన్ 4) డయాకైనసిస్
23. ఒక కణం నుంచి కణాల ఉత్పత్తికి అవసరమయ్యే సమవిభజనల సంఖ్య? (కొత్తగా ఏర్పడిన ప్రతి పిల్ల కణం విభజన చెందుతుందనుకొంటే)
1) 4 2) 8 3) 9 4) 3
24. RNA సంశ్లేషణ అధికంగా జరిగే దశ ఏది?
1) S- దశ 2) G1- దశ
3) G2- దశ 4) M- దశ
25. సమ విభజనలోని వివిధ దశలను పరిశీలించడానికి మొక్కల్లోని అనుకూలమైన భాగాలు ఏవి?
1) కాండాగ్రం 2) వేరు అగ్రం
3) శాఖాగ్రం 4) పరాగకోశం
26. సమ విభజన మొక్కల్లోని ఏ భాగాల్లో జరుగుతుంది?
1) శాఖీయ భాగాలు (వేరు, కాండం, పత్రం మొదలైనవి)
2) లైంగిక కణాలు
3) శాఖీయ భాగాలు, లైంగిక కణాలు
4) ఏదీకాదు
27. సమ విభజన ఫలితంగా ఏర్పడిన పిల్ల కణాల్లో క్రోమోసోమ్‌ల సంఖ్య తల్లి కణం కన్నా ఏవిధంగా ఉంటుంది?
1) రెట్టింపు అవుతుంది
2) సగం తగ్గుతుంది
3) మూడు రెట్లు ఎక్కువ అవుతుంది
4) తల్లి కణంలోని సంఖ్య ఎంత ఉంటుందో అంతే ఉంటుంది
28. సమ విభజనలోని ఏ దశలో సెంట్రోమియర్ విభజన జరుగుతుంది?
1) ప్రథమ దశ 2) మధ్యస్థ దశ
3) చలన దశ 4) అంత్య దశ
29. క్షయకరణ విభజన ఎక్కడ జరుగుతుంది?
1) మొక్కల శాఖీయ భాగాలు
2) జంతువుల శరీర భాగాలు
3) జీవుల బీజకణాల్లో
4) పైవన్నీ
30. క్షయకరణ విభజనలో తల్లి కణంలోని క్రోమోజోమ్‌ల సంఖ్య కంటే పిల్లకణాల్లో ఏ విధంగా ఉంటుంది?
1) రెట్టింపు అవుతుంది 2) మారదు
3) సగం అవుతుంది
4) నాలుగు రెట్లు అవుతుంది
31. ఒక కణం సమ విభజన జరిగి ఎన్ని కణాలు ఏర్పడతాయి?
1) 2 2) 4 3) 8 4) 16
32. ఒక కణం నుంచి 32 కణాలు ఏర్పడాలంటే ఎన్ని సమవిభజనలు జరగాలి?
1) 2 2) 32 3) 16 4) 5
33. ఒక కణం క్షయకరణ విభజన చెంది ఎన్ని పిల్ల కణాలు ఏర్పడతాయి?
1) 2 2) 4 3) 8 4) 16
34. ఏ కణాలకు పునరుత్పత్తి శక్తి ఉండదు?
1) నాడీ కణాలు 2) కాలేయ కణాలు
3) కండర కణాలు 4) చర్మ కణాలు
35. నాడీ కణజాలం పిండాభివృద్ధిలో ఏ త్వచం నుంచి ఏర్పడుతుంది?
1) బహిస్తచం 2) మధ్యస్తచం
3) అంతఃస్తచం 4) పైవన్నీ
36. కండర కణజాలం పిండాభివృద్ధిలో ఏ త్వచం నుంచి ఏర్పడుతుంది?
1) బహిస్తచం 2) మధ్యస్తచం
3) అంతఃస్తచం 4) పైవన్నీ
37. సంయోజక కణజాలం పిండాభివృద్ధిలో ఏ త్వచం నుంచి ఏర్పడుతుంది?
1) బహిస్తచం 2) మధ్యస్తచం
3) అంతఃస్తచం 4) పైవన్నీ
38. గోర్లు, రోమాలు, గిట్టలు, కొమ్ములు, పొలుసులు, ఈకలు మొదలైనవి ఏ కణజాలం నుంచి ఏర్పడతాయి?
1) ఉపకళా కణజాలం
2) సంయోజక కణజాలం
3) కండర కణజాలం
4) నాడీ కణజాలం
39. రక్తం అనేది ఏ కణజాలం?
1) ఉపకళా కణజాలం
2) కండర కణజాలం
3) నాడీ కణజాలం
4) ద్రవరూప సంయోజక కణజాలం
40. నాళికా పుంజాలు అని వేటినంటారు?
1) దారువు
2) పోషక కణజాలం
3) దారువు, పోషక కణజాలం
4) త్వచ కణజాలం
41. మొక్క వివిధ భాగాలకు నీరు, ఖనిజ లవణాల సరఫరాలో తోడ్పడే కణజాలం ఏది?
1) దారువు
2) పోషక కణజాలం
3) దారువు, పోషక కణజాలం
4) సంధాయక కణజాలం
42. మొక్కకు యాంత్రిక ఆధారాన్ని ఇవ్వడం, ఆహార పదార్థాలను నిల్వ చేయడానికి తోడ్పడే కణజాలం ఏది?
1) త్వచ కణజాలం
2) సంధాయక కణజాలం
3) ప్రసరణ కణజాలం
4) విభాజ్య కణజాలం
43. మొక్కల పెరుగుదలకు ఉపయోగపడే కణజాలం ఏది?
1) త్వచ కణజాలం
2) సంధాయక కణజాలం
3) ప్రసరణ కణజాలం
4) విభాజ్య కణజాలం
44. కేంద్రకామ్లాలను కనుగొన్నది ఎవరు?
1) ఆల్డ్మన్ 2) వాట్సన్, క్రిక్
3) ఫ్రెడరిక్ మిషర్ 4) మెండల్
45. కేంద్రకామ్లాలు అని నామకరణం చేసింది ఎవరు?
1) ఆల్డ్మన్ 2) ఫ్రెడరిక్ మిషర్
3) వాట్సన్, క్రిక్ 4) మెండల్
46. DNA జన్యు పదార్థం అని నిరూపించినవారు?
1) హార్షీ, చేస్ 2) వాట్సన్, క్రిక్
3) విల్కిన్స్, ఫ్రాంక్లిన్ 4) పైవన్నీ
47. DNA నిర్మాణాన్ని ప్రతిపాదించింది?
1) వాట్సన్, క్రిక్ 2) హార్షీ, చేస్
3) హ్యూగో డివ్రీస్
4) విల్కిన్స్, ఫ్రాంక్లిన్
48. DNAలోని పాలి న్యూక్లియోటైడ్ల సంఖ్య ఎంత?
1) 2 2) 4 3) 3 4) 5
49. DNA లోని రెండు పాలి న్యూక్లియోటైడ్ల మధ్య వ్యాసం ఎంత?
1) 34 ఆంగ్స్ట్రామ్స్ 2) 20 ఆంగ్స్ట్రామ్స్
3) 36 ఆంగ్స్ట్రామ్స్ 4) 10 ఆంగ్స్ట్రామ్స్
50. DNAలోని ఒక మెలిక పూర్తి పొడవు ఎంత?
1) 34 ఆంగ్స్ట్రామ్స్
2) 36 ఆంగ్స్ట్రామ్స్
3) 3.4 ఆంగ్స్ట్రామ్స్
4) 20 ఆంగ్స్ట్రామ్స్
51. సాధారణంగా DNAలోని ప్రతి మెలికలో ఎన్ని జతల నత్రజని క్షారాలుంటాయి?
1) 10 2) 2 3) 5 4) 20
52. న్యూక్లియోటైడ్‌లో ఉండే అనుఘటకాలు ఏవి?
1) నత్రజని క్షారాలు+పెంటోస్ చక్కెర
2) నత్రజని క్షారం+ పాస్ఫేట్
3) నత్రజని క్షారం+పెంటోస్ చక్కెర+పాస్ఫేట్
4) నత్రజని క్షారాలు మాత్రమే
53. న్యూక్లియోసైడ్లో ఉండే అనుఘటకాలు ఏవి?
1) నత్రజని క్షారాలు+పెంటోస్ చక్కెర
2) నత్రజని క్షారం+ పాస్ఫేట్
3) నత్రజని క్షారం+పెంటోస్ చక్కెర+పాస్ఫేట్
4) నత్రజని క్షారాలు మాత్రమే
54. DNAలో ఉండే ప్యూరిన్, పిరమిడిన్ల నిష్పత్తి ఎంత?
1) 1:4 2) 4:1
3) 2:1 4) 1:1
55. అడినిన్ అనే ప్యూరిన్ ఏ పిరమిడిన్తో జతకడుతుంది?
1) సైటోసిన్ 2) థైమిన్
3) యురాసిల్ 4) థైమిన్, యురాసిల్
56. గ్వానిన్ అనే ప్యూరిన్ ఏ పిరమిడిన్తో జత కడుతుంది?
1) సైటోసిన్ 2) యురాసిల్
3) థైమిన్ 4) పైవన్నీ
57. అడినిన్, థైమిన్ నత్రజని క్షారాల మధ్య ఉండే హైడ్రోజన్ బంధాల సంఖ్య?
1) 3 2) 4 3) 1 4) 2
58. గ్వానిన్, సైటోసిన్ నత్రజని క్షారాల మధ్య ఉండే హైడ్రోజన్ బంధాల సంఖ్య?
1) 1 2) 2 3) 3 4) 4
59. న్యూక్లియోటైడ్లోని నత్రజని క్షారం, పెంటోస్ చక్కెరల మధ్య ఉండే బంధం?
1) పప్టైడ్ బంధం 2) ైగ్లెకోసైడిక్ బంధం
3) ఎస్టర్ బంధం 4) ఏదీకాదు
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు