ASRB NET | వ్యవసాయ పరిశోధన కేంద్రాల్లో 195 పోస్టులు
Agricultural Scientists Recruitment Board | దేశంలో ఉన్న కృషి విజ్ఞాన కేంద్రాలు, వివిధ వ్యవసాయ, పశు, మత్య్స పరిశోధనా కేంద్రాల్లో నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్-2023, సబ్జెక్ట్ మ్యాటర్ స్పెషలిస్ట్, సీనియర్ టెక్నికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీక న్యూఢిల్లీలోని అగ్రికల్చరల్ సైంటిస్ట్స్ రిక్రూట్మెంట్ బోర్డు (ఏఎస్ఆర్బీ) కంబైన్డ్ నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఈ ప్రకటన ద్వారా ఎకనామిక్ బోటనీ అండ్ ప్లాంట్ జెనెటిక్ రిసోర్సెస్, జెనెటిక్స్ అండ్ ప్లాంట్ బ్రీడింగ్, నెమటాలజీ, ప్లాంట్ బయోకెమిస్ట్రీ, ప్లాంట్ పాథాలజీ, ప్లాంట్ ఫిజియాలజీ, సీడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, అనిమల్ బయోటెక్నాలజీ, పౌల్ట్రీ సైన్స్, వెటర్నరీ సైన్స్, అగ్రికల్చరల్ బయోటెక్నాలజీ, అగ్రికల్చరల్ ఎంటమాలజీ, అగ్రికల్చరల్ మైక్రోబయాలజీ, తదితర విభాగాలలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయనున్నది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత రంగంలో పీజీ ఉత్తీర్ణులై ఉండాలి. రిజిస్ట్రేషన్ ప్రక్రియ మార్చి 22 ప్రారంభంకానుండగా.. ఏప్రిల్ 10 తేదీ వరకు అప్లై చేసుకోవచ్చు. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్-2023
- మొత్తం ఖాళీలు: 195
- పోస్టులు: సబ్జెక్ట్ మ్యాటర్ స్పెషలిస్ట్- 163, సీనియర్ టెక్నికల్ ఆఫీసర్-32
- విభాగాలు : ఎకనామిక్ బోటనీ అండ్ ప్లాంట్ జెనెటిక్ రిసోర్సెస్, జెనెటిక్స్ అండ్ ప్లాంట్ బ్రీడింగ్, నెమటాలజీ, ప్లాంట్ బయోకెమిస్ట్రీ, ప్లాంట్ పాథాలజీ, ప్లాంట్ ఫిజియాలజీ, సీడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, అనిమల్ బయోటెక్నాలజీ, పౌల్ట్రీ సైన్స్, వెటర్నరీ సైన్స్, అగ్రికల్చరల్ బయోటెక్నాలజీ, అగ్రికల్చరల్ ఎంటమాలజీ, అగ్రికల్చరల్ మైక్రోబయాలజీ తదితరాలు.
- అర్హతలు : సంబంధిత రంగంలో పీజీ ఉత్తీర్ణులై ఉండాలి.
ఎంపిక : కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా - దరఖాస్తు: ఆన్లైన్లో
- చివరితేదీ: ఏప్రిల్ 10
- పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్
- వెబ్సైట్: http://www.asrb.org.in
RELATED ARTICLES
Latest Updates
Peut-on gagner dans les casinos en ligne ?
Quel casino en ligne est légitime ?
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?






