Biology Groups Special | క్యాన్సర్ నిరోధక విటమిన్లు ఏవి?
శరీరధర్మ శాస్త్రం
1. కింది వాటిలో సరైనది?
ఎ. సంపూర్ణ ఆహార పదార్థాలన్నీ సంతులిత ఆహార పదర్థాలే. కానీ సంతులిత ఆహార పదార్థాలన్నీ సంపూర్ణ ఆహార పదార్థాలు కాదు
బి. సంతులిత ఆహార పదార్థాలన్నీ సంపూర్ణ ఆహార పదార్థాలే, కానీ సంపూర్ణ ఆహార పదార్థాలన్నీ సంతులిత ఆహార పదార్థాలు కానవసరం లేదు
1) ఎ, బి తప్పు 2) ఎ, బి సరైనవి
3) ఎ తప్పు, బి సరైనది
4) ఎ సరైనది, బి తప్పు
2. కింది వాటిలో విటమిన్-ఎ లోపం వల్ల కలిగే వ్యాధి కానిది?
1) నిక్టోలోపియా
2) జిరాప్తాల్మియా
3) ఆస్టియో మలేషియా
4) కెరటో మలేషియా
3. విటమిన్-డి కి సంబంధించి సరైనది?
ఎ. పారాథార్మోన్ అనే హార్మోన్ వలె పని చేస్తుంది. కాబట్టి దీన్ని హార్మోన్ లాంటి విటమిన్ అంటారు.
బి. పరారుణ కిరణాలు చర్మంపైన పడినప్పుడు చర్మం కింద ఉండే కొలెస్టిరాల్ అనే కొవ్వు విటమిన్-డి గా మారుతుంది.
1) ఎ 2) బి
3) ఎ, బి 4) ఏదీకాదు
4. విటమిన్-ఇ కి సంబంధించి సరైనది?
ఎ. దీన్ని బ్యూటీ విటమిన్ అని కూడా అంటారు
బి. దీని లోపం వల్ల ఎర్ర రక్తకణాల జీవితకాలం తగ్గుతుంది
1) ఎ, బి 2) ఎ
3) బి 4) ఏదీకాదు
5. కింది వాటిలో సరికానిది?
1) అప్పుడే పుట్టిన శిశువులో విటమిన్-కె లోపం ఎక్కువ. కాబట్టి సర్జరీ సమయంలో విటమిన్-కె ఇవ్వాలి
2) ఎక్కువగా పాలిష్ చేసిన బియ్యంలో బి1 విటమిన్ లోపిస్తుంది
3) ఆవుపాలు లేత పసుపు రంగుకు కారణం రైబోఫ్లావిన్ (బి2)
4) బీరులో ఉండేది విటమిన్-సి
6. కిందివాటిని జతపరచండి.
విటమిన్ విధి
1. బి1 ఎ. కార్బోహైడ్రేట్ల జీవక్రియ
2. బి2 బి. ఆక్సీకరణ, క్షయకరణ చర్యలు
3. బి5 సి. కార్బోహైడ్రేట్లు, ప్రొటీన్లు, కొవ్వుల జీర్ణక్రియ
4. బి6 డి. ఎమైనోఆమ్లాల జీవక్రియ
5. బి12 ఇ. ఎర్ర రక్తకణాలు, తెల్ల రక్తకణాల పరిపక్వత
1) 1-ఎ, 2-బి, 3-ఇ, 4-సి, 5-డి 2) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి, 5-ఇ
3) 1-ఎ, 2-బి, 3-సి, 4-ఇ, 5-డి 4) 1-ఎ, 2-బి, 3-డి, 4-సి, 5-ఇ
7. కిందివాటిని జతపరచండి.
వ్యాధి లక్షణం
1. బెరిబెరి ఎ. నాడీ వ్యవస్థ పనిచేయకపోవడం
2. పాలిన్యూరైటిస్ బి. నోరు మూలల్లో పగిలి రక్తస్రావం జరగడం
3. కిలోసిస్ సి. చిగుళ్లు వాచి రక్తస్రావం జరగడం
4. గ్లాసైటిస్ డి. హృదయ స్పందన సక్రమంగా లేకపోవడం
5. స్కర్వీ ఇ. నాలుక ఎర్రగా మారి పుండ్లు ఏర్పడి మెరవడం
1) 1-డి, 2-ఎ, 3-సి, 4-ఇ, 5-బి 2) 1-డి, 2-ఎ, 3-సి, 4-బి, 5-ఇ
3) 1-ఎ, 2-బి, 3-ఇ, 4-సి, 5-డి 4) 1-డి, 2-ఎ, 3-బి, 4-ఇ, 5-సి
8. కిందివాటిలో ఏ విటమిన్‌ను ప్రతిపక్షకాల తయారీ, ప్రొటీన్ల జీవక్రియలో పాల్గొంటూ యాంటీ ఎనిమియా విటమిన్‌గా పిలుస్తారు?
1) బి3 2) బి6 3) బి9 4) బి12
9. ఎనిమియా, మాక్రోసైటిక్ ఎనిమియా, పెర్నీషియస్ ఎనిమియా అనే వ్యాధులు కింది ఏ వరుస విటమిన్ల లోపం వల్ల కలుగుతాయి?
1) బి6, బి9, బి12
2) బి3, బి6, బి9
3) బి3, బి6, బి12
4) బి2, బి6, బి12
10. కింది వాటిని జతపరచండి.
విటమిన్ లోపం వల్ల కలిగే వ్యాధి
1. ఎ ఎ. డెర్మటోసిస్
2. డి బి. పెల్లాగ్రా
3. బి3 సి. స్కర్వీ
4. సి డి. పీజియన్ చెస్ట్
ఇ. వెన్నుపాము క్షీణత, హిమోగ్లోబిన్ శాతం తగ్గడం
1) 1-ఇ, 2-డి, 3-బి, 4-సి
2) 1-ఎ, 2-డి, 3-బి, 4-సి
3) 1-ఇ, 2-సి, 3-బి, 4-డి
4) 1-ఎ, 2-సి, 3-బి, 4-డి
11. కింది వాటిలో క్యాన్సర్ నిరోధక విటమిన్ల సముదాయం ఏది?
1) ఎ, సి, ఇ 2) ఎ, డి, ఇ
3) ఎ, డి, కె 4) ఎ, డి, సి
12. కింది వాటిలో సరైనది?
ఎ. వేడిచేసినప్పుడు విటమిన్-సి, ఫోలిక్ ఆమ్లం నివశిస్తాయి
బి. ఈ-కోలైతో తయారయ్యే విటమిన్లు బి12, కె
1) ఎ 2) ఎ, బి
3) బి 4) ఏదీకాదు
13. విటమిన్-సి కి సంబంధించి సరైనది?
ఎ. దీన్ని స్లిమ్‌నెస్ విటమిన్ అనికూడా అంటారు
బి. ఇది జంతు సంబంధిత ఆహార పదార్థాల్లో లభించదు
సి. ఇది యాంటీ ఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది
1) ఎ, బి 2) ఎ, సి
3) ఎ 4) పైవన్నీ
14. కింది వాటిలో సరైనది?
ఎ. బి3 లోపం వల్ల డిమెన్షియా, డయేరియా, ఇన్సోమ్నియా వంటి వ్యాధులు కలుగుతాయి
బి. పాలిచ్చే తల్లుల్లో బి6 లోపం ఎక్కువగా ఉంటుంది
సి. చురుకైన శుక్రకణాలు, అండాల ఉత్పత్తికి విటమిన్-సి అవసరం
డి. ఫోలిక్ ఆమ్లం లోపం గల స్త్రీలకు స్పైనా బైఫిడా వ్యాధి గల శిశువులు జన్మిస్తారు
1) ఎ, బి, సి 2) ఎ, బి, డి
3) బి, సి, డి 4) ఎ, బి, సి, డి
15. కింది వాటిని జతపరచండి.
చక్కెర సాధారణ నామం
1. గ్లూకోజ్ ఎ. ఫ్రూట్ షుగర్
2. ఫ్రక్టోజ్ బి. గ్రేప్ షుగర్
3. సుక్రోజ్ సి. మాల్ట్ షుగర్
4. మాల్టోజ్ డి. కేన్ షుగర్
5. లాక్టోజ్ ఇ. మిల్క్ షుగర్
1) 1-బి, 2-ఎ, 3-డి, 4-సి, 5-ఇ
2) 1-బి, 2-ఎ, 3-సి, 4-డి, 5-ఇ
3) 1-డి, 2-ఎ, 3-బి, 4-సి, 5-ఇ
4) 1-డి, 2-ఎ, 3-సి, 4-బి, 5-ఇ
16. కింది వాటిలో ఏ డైశాఖరైడ్ జల విశ్లేషణం చెందినప్పుడు గ్లూకోజ్, గాలక్టోజ్ అనే మోనోశాఖరైడ్లు ఏర్పడతాయి?
1) మాల్టోజ్ 2) లాక్టోజ్
3) సుక్రోజ్ 4) ఫ్రక్టోజ్
17. జతపరచండి.
పోషక పదార్థం
1. కొవ్వులు ఎ. ఫ్యాటీ ఆమ్లాలు, గ్లిజరాల్
2. ప్రొటీన్ బి. ఎమైనో ఆమ్లాలు
3. పాలిశాఖరైడ్ సి. గ్లూకోజ్
1) 1-ఎ, 2-బి, 3-సి
2) 1-ఎ, 2-సి, 3-బి
3) 1-బి, 2-ఎ, 3-సి
4) 1-సి, 2-ఎ, 3-బి
జవాబులు
1. 3 2. 3 3. 2 4. 1
5. 4 6. 2 7. 4 8. 2
9. 1 10. 2 11. 1 12. 2
13. 4 14. 2 15. 1 16. 2
17. 1
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు