General Science| నానో టెక్నాలజీలో ఉపయోగించే పదార్థాలు?
1. నానో టెక్నాలజీ అనే పదాన్ని ప్రతిపాదించిన శాస్త్రవేత్త?
ఎ) ఫెన్‌మన్ బి) ఎరిక్ డ్రెక్స్లర్
సి) నోరియా డి) రాబర్ట్ కర్ల్
2. స్కానింగ్ టన్నెలింగ్ మైక్రోస్కోప్ అనేది?
ఎ) పరమాణు ద్రవ్యరాశి తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది
బి) అణువుల ఉపరితలాన్ని చిత్రీకరిస్తుంది
సి) న్యూట్రాన్ల పరిమాణం తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది
డి) ప్రోటాన్ల పరిమాణం తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది
3. కార్బన్ నానోట్యూబ్స్ అనేవి?
ఎ) సహజ నానో పదార్థాలు
బి) కర్బన పరమాణువులతో ఏర్పడిన నానో పరిమాణంలో ఉండే స్థూపాకారపు నిర్మాణాలు
సి) 100 నానో మీటర్ల పరిమాణాన్ని కలిగి ఉంటాయి
డి) శైవలాల ద్వారా ఉత్పత్తి చేయబడతాయి
4. నానో టెక్నాలజీలో ఉపయోగించే పదార్థాలు?
ఎ) NO2 Th (థోరియం)
బి) టైటానియం ఆక్సైడ్, అల్యూమినియం సిలికేట్
సి) సిలికా, అల్యూమినియం ఆక్సైడ్లు
డి) పైవన్నీ
5. సిల్వర్ నానో అణువులను ఉపయోగించి బ్యాక్టీరియాను చంపే బ్యాండేజ్‌ను తయారుచేసిన శాస్త్రవేత్త?
ఎ) ఎరిక్ డ్రెక్స్లర్ బి) హారీక్రోటో
సి) రిచర్డ్ స్మాలీ డి) రాబర్ట్ బర్రెల్
6. భారతదేశంలో మొదటిసారి అందుబాటులోకి వచ్చిన నానోడ్రగ్?
ఎ) పాల్సిటాక్సెల్ బి) నానోక్సెల్
సి) ఇన్సులిన్ (2nm)
డి) హిమోగ్లోబిన్ (4nm)
7. దేశంలో నానోటెక్నాలజీ మిషన్ ఆవిర్భావ సంవత్సరం?
ఎ) 2012
బి) 2007
సి) 2008 డి) 2014
8. దేశంలో నానో టెక్నాలజీ అభివృద్ధి కోసం ఏర్పాటు చేయబడ్డ నేషనల్ ఫిజికల్
ల్యాబొరేటరీ ఎక్కడ ఉంది?
ఎ) డెహ్రాడూన్ బి) బెంగళూరు
సి) ఢిల్లీ డి) ముంబై
9. కింది వాటిలో ‘డయోడ్’లుగా పనిచేసే నానో పదార్థాలు?
ఎ) కార్బన్ నానోట్యూబ్స్
బి) Y- జంక్షన్ నానోట్యూబ్స్
సి) నానో మెటీరియల్స్
డి) పైవేవీ కావు
10. అల్జీమర్స్ (Loss of Memory) వ్యాధి నిర్ధారణలో ఉపయోగించే నానో పదార్థాలు?
ఎ) బంగారు నానో రేణువులు
బి) సిల్వర్ నానో రేణువులు
సి) క్వాంటం డాట్స్ అనే నానో స్ఫటికాలు
డి) అల్యూమినియం సిలికేట్లు
11. LEDలలో కాంతిని వెదజల్లే లక్షణం
ఏ స్ఫటికాల వల్ల కలుగుతుంది?
ఎ) క్వాంటమ్ డాట్స్ అనే నానో స్ఫటికాలు
బి) క్రిస్టల్ డాట్స్ నానో స్ఫటికాలు
సి) మాగ్నటిక్ డాట్స్
డి) ఇమేజింగ్ డాట్స్
12. దేశంలో సహజంగా పని చేసే నానో నిర్మాణాలు?
ఎ) ఇన్సులిన్ (2nm), హిమోగ్లోబిన్ (4nm)
బి) ఇన్సులిన్ (6nm), హిమోగ్లోబిన్ (8nm)
సి) ఇన్సులిన్ (8nm), హిమోగ్లోబిన్ (10nm)
డి) ఇన్సులిన్ (10nm), హిమోగ్లోబిన్ (12nm)
1. రోబోటిక్ చలనంలో ఉపయోగించే మోటార్‌ను ఏమంటారు?
ఎ) సింగిల్ ఫేజ్ మోటార్
బి) యూనివర్సల్ మోటార్
సి) 3 ఫేజ్ మోటార్ డి) స్టెప్పర్ మోటార్
2. రోబోటిక్స్ అనే పదాన్ని ఉపయోగించేది?
ఎ) విలియం కాంప్‌బెల్
బి) ఇసాక్ అసిమోవ్
సి) మైకిల్ లినార్డో డి) జార్జి డివోత్
3. ప్రపంచ రోబోటిక్ రాజధాని?
ఎ) బ్రిటన్ బి) అమెరికా
సి) జపాన్ డి) జర్మనీ
4. రోబోటా అనే పదానికి అర్థం?
ఎ) దళాధిపతి బి) వీరుడు
సి) బానిస కార్మికుడు డి) పనిమనిషి
5. రోబోట్‌లో మానవ కండరాలను పోలినవి ?
ఎ) మానిప్యులేటర్ బి) ఎండ్ ఎఫెక్టార్
సి) కదిలే యంత్రం డి) నియంత్రకం
6. ఉపయోగకర పనిలోపెట్టిన మొదటి రోబోట్?
ఎ) టామా బి) యానిమేట్
సి) టెలివోక్స్ డి) మురాటా
7. రష్యావారు చంద్రునిపైకి పంపిన రోబో పేరు?
ఎ) టొయోటా బి) లున్యకోడ్
సి) మొబిరో డి) WL-16 III
8. SCARAB అనే రోబోట్ ఉపయోగం?
ఎ) సముద్రగర్భంలో మునిగిన ఓడలను వెలికితీయడం
బి) విమానంలోని బ్లాక్‌బాక్స్‌ను వెలికితీయడం
సి) విపత్తు నిర్వహణలో
డి) రక్షణ రంగంలో బాంబుల నిర్వీర్యం
9. జపాన్ మొదటి ఆస్ట్రోనాట్ రోబో?
ఎ) AIBO బి) PARO
సి) ఆండ్రోస్ డి) కిరోబో
10. 2020వ సంవత్సరం నాటికి ప్రతి ఇంటిలో రోబో ఉండాలని లక్ష్యం పెట్టుకున్న దేశం?
ఎ) జపాన్ బి) అమెరికా
సి) చైనా డి) దక్షిణ కొరియా
11. డీఆర్డీవో అభివృద్ధి చేసిన రోబోటిక్ వాహనం?
ఎ) స్కైవాష్ బి) దక్ష్
సి) పుమా డి) రాప్టర్
12. ప్రపంచ అత్యాధునిక రోబో?
ఎ) పాలటైజర్ బి) కొడామొరాయిడ్
సి) పియానిస్ట్ డి) ట్రైలోబైట్
13. కింది వాటిలో ISDN గురించి సరైనది?
1. దీని విస్తృత రూపం Integrated Service Digitak Network
2. దీన్ని ఉపయోగించి ఇంటర్నట్ ద్వారా మిశ్రమ సమాచారాన్ని పంపవచ్చు
3. బ్రాడ్‌బ్యాండ్ ISDN ద్వారా సమాచారం వేగం (లేదా) ఇంటర్నెట్ వేగం – 100 kbps
ఎ) 1, 2 బి) 2, 3
సి) 1, 3 డి) పైవన్నీ
14. కింది వాటిలో దృశ్యాతంతువు గురించి సరికానిది?
1. ఇది సిలికాగ్లాసులో తయారు చేసిన
పారదర్శకం
2. దీని మందం వెంట్రుక కంటే కొంచెం ఎక్కువగా ఉంటుంది
3. దీన్ని ఉపయోగించి అధిక పట్టీ వెడల్పు వద్ద అధిక దూరాలకు సమాచారాన్ని పంపవచ్చు
4. ఇది సంపూర్ణాంతర పరావర్తనం మీద ఆధారపడి పని చేస్తుంది
ఎ) 1, 2 బి) 2, 3
సి) పైవన్నీ డి) పైవేవీ కాదు
15. కిందివాటిలో వాట్సప్ గురించి సరైనది గుర్తించండి.
1. దీన్ని స్మార్ట్ ఫోన్లలో మాత్రమే ఉపయోగించవచ్చు
2. సమాచారాన్ని అక్షరాలు, చిత్రాలు, వీడియోలు, ఆడియోల రూపంలో పంపవచ్చు
3. ఇంటర్నెట్ ఉన్నప్పుడు మాత్రమే పనిచేసే సామాజిక అనుసంధానం
ఎ) 1, 2 బి) 2, 3
సి) 1, 3 డి) పైవన్నీ
16. కింది వాటిలో GSM గురించి సరైనది గుర్తించండి
1. దీని విస్తృత రూపం – Geosynchro nous Mobile Technology
2. దీని ద్వారా ఏకకాలంలో ఇరువైపుల నుంచి సమాచారం ప్రసారం జరుగుతుంది
3. జీఎస్ఎం సమాచార వ్యవస్థ పనితీరు మూడవ జనరేషన్ (3జీ)లో గణనీయంగా మెరుగుపడింది
ఎ) 1, 2 బి) 2, 3
సి) 1, 3 డి) పైవన్నీ
పాలిమరీకరణం
పాలిమరీకరణం మూడు రకాలు –
1. సంకలన పాలిమరీకరణం – దీన్ని ఒకే రకమైన మోనోమర్లు అనేక సంఖ్యలో ఒకదానికొకటి కలుస్తాయి. అప్పుడు శృంఖల పాలిమరీకరణం అని కూడా పిలుస్తారు. ఈ రకం పాలిమర్లు ఏర్పడేటప్పుడు ఎలాంటి ఉత్పన్నాలు ఏర్పడవు.
ఉదా. ఇథిలిన్ సంకలన పాలిమరీకరణ చెందినప్పుడు పాలిఇథిలిన్ ఏర్పడుతుంది
2. సంఘనన పాలిమరీకరణం – దీనిలో భిన్న మోనోమర్లు ఒకదానితో ఒకటి కలిసి పెద్ద అణువులు ఏర్పడతాయి. ఈ ప్రక్రియలో H2O, NH3, HCL వంటి అణువులు వాటి నుంచి తొలగిపోతాయి.
ఉదా. ఫినాల్ను ఫార్మాల్డిహైడ్ జలద్రావణంతో వేడి చేసినప్పుడు నీరు తొలగి జిగురు వంటి బేకలైట్ అనే సంఘనన పాలిమర్ ఏర్పడుతుంది
3. కోపాలిమరీకరణం – దీనిలో భిన్న మోనోమర్లు అనేక సంఖ్యలో ఒకదానికొకటి సంకలనం చెంది పెద్ద అణువులు ఏర్పడతాయి. దీని భిన్న అణువుల మధ్య జరిగే సంకలన పాలిమరీకరణంగా భావించవచ్చు.
విన్నర్ పబ్లికేషన్స్ సౌజన్యంతో
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు