తెలంగాణలో అక్షరాస్యత రేటు అధికంగా ఉన్న జిల్లా?
తెలంగాణ
1. తెలంగాణ రాష్ట్ర వైశాల్యం ఎంత? (చ.కి.మీ. లలో)
1) 1,12,840 2) 1,12,077
3) 1,10,088 4) 1,15,352
2. దేశ జనాభాలో తెలంగాణ రాష్ట్ర స్థానం?
1) 10 2) 11
3) 12 4) 13
3. దేశ జనాభాలో తెలంగాణ రాష్ట్ర జనాభా శాతం?
1) 1.38 శాతం 2) 2.89 శాతం
3) 3.89 శాతం 4) 3.41 శాతం
4. దేశ భౌగోళిక విస్తీర్ణంలో తెలంగాణ రాష్ట్ర స్థానం?
1) 10 2) 11
3) 12 4) 13
5. దేశ భౌగోళిక విస్తీర్ణంలో తెలంగాణ రాష్ట్ర శాతం ఎంత?
1) 1.38 శాతం 2) 2.89 శాతం
3) 3.89 శాతం 4) 3.41 శాతం
6. రాష్ట్రంలో కొత్త జిల్లాలను ఏ చట్టం ప్రకారం ఏర్పాటు చేశారు?
1) జిల్లాల పునర్వ్యవస్థీకరణ చట్టం-1970
2) జిల్లాల పునర్వ్యవస్థీకరణ చట్టం-1972
3) జిల్లాల పునర్వ్యవస్థీకరణ చట్టం-1974
4) జిల్లాల పునర్వ్యవస్థీకరణ చట్టం-1976
7. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏ రోజున జిల్లాలను పునర్వ్యవస్థీకరించింది?
1) 2016 అక్టోబర్ 11
2) 2016 అక్టోబర్ 15
3) 2016 అక్టోబర్ 19
4) 2016 అక్టోబర్ 12
8. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలోని జిల్లా సంఖ్య?
1) 21 2) 10
3) 33 4) 27
9. దేశంలో ఏ రాష్ట్రం ఎక్కువ జిల్లాలను కలిగి ఉంది?
1) అసోం 2) తెలంగాణ
3) ఉత్తరాఖండ్ 4) ఉత్తర ప్రదేశ్
10. దేశంలో అత్యధిక జిల్లా కలిగిన రాష్ర్టాలలో తెలంగాణ స్థానం?
1) 8 2) 9
3) 10 4) 11
11. తెలంగాణలోని ఎక్కువ జిల్లాలతో సరిహద్దును కలిగి ఉన్న రాష్ట్రం?
1) మహారాష్ట్ర 2) కర్ణాటక
3) ఛత్తీస్‌గఢ్ 4) పైవేవీ కాదు
12. తెలంగాణలో కొత్తగా ఎన్ని మండలాలను ఏర్పాటు చేశారు?
1) 121 2) 123
3) 135 4) 127
13. ప్రస్తుతం తెలంగాణలోని మండలాల సంఖ్య ఎంత?
1) 582 2) 594
3) 586 4) 588
14. రాష్ట్రంలో అత్యధిక మండలాలు కలిగిన జిల్లా?
1) నల్లగొండ 2) సిద్దిపేట
3) భువనగిరి
4) జయశంకర్ భూపాలపల్లి
15. రాష్ట్రంలో అత్యల్ప మండలాలు కలిగిన జిల్లా?
1) జోగులాంబ గద్వాల
2) మహబూబ్ నగర్
3) ములుగు 4) కరీంనగర్
16. రాష్ట్రంలో అత్యధిక రెవెన్యూ డివిజన్లు ఉన్న జిల్లా?
1) మహబూబ్‌నగర్ 2) కరీంనగర్
3) రంగారెడ్డి 4) హైదరాబాద్
17. తెలంగాణలో అత్యధిక విస్తీర్ణం ఉన్న జిల్లా?
1) జయశంకర్ భూపాలపల్లి
2) భద్రాద్రి కొత్తగూడెం
3) నాగర్ కర్నూల్
4) నల్లగొండ
18. తెలంగాణలో అత్యల్ప విస్తీర్ణం ఉన్న జిల్లా?
1) హైదరాబాద్
2) హనుమకొండ
3) రాజన్న సిరిసిల్ల
4) మేడ్చల్ మల్కాజిగిరి
19. తెలంగాణలో అత్యధిక అటవీ విస్తీర్ణం ఉన్న జిల్లా?
1) జయశంకర్ భూపాల్పల్లి
2) మహబూబాబాద్
3) భద్రాద్రి కొత్తగూడెం
4) ఆదిలాబాద్
20. రాష్ట్రంలో అత్యధిక జనాభా ఉన్న జిల్లా?
1) హనుమకొండ 2) సిద్దిపేట
3) హైదరాబాద్ 4) రంగారెడ్డి
21. రాష్ట్రంలో అత్యల్ప జనాభా ఉన్న జిల్లా?
1) రాజన్న సిరిసిల్ల
2) జోగులాంబ గద్వాల
3) సిద్దిపేట 4) ములుగు
22. తెలంగాణలో షెడ్యూల్డ్ కులాల జనాభా శాతం ఎంత?
1) 16.45% 2) 15.45%
3) 17.45% 4) 18.45%
23. తెలంగాణలో షెడ్యూల్డ్ కులాల జనాభా అధికంగా ఉన్న జిల్లా?
1) రంగారెడ్డి 2) కరీంనగర్
3) మహబూబ్‌నగర్
4) నాగర్ కర్నూల్
24. తెలంగాణలో షెడ్యూల్డ్ కులాల జనాభా తక్కువగా ఉన్న జిల్లా?
1) ఆదిలాబాద్ 2) వనపర్తి
3) కుమ్రం భీం ఆసిఫాబాద్
4) మంచిర్యాల
25. రాష్ట్రంలో షెడ్యూల్డ్ తెగల జనాభా శాతం ఎంత?
1) 8.08 శాతం 2) 9.08 శాతం
3) 10.08 శాతం 4) 11.08 శాతం
26. రాష్ట్రంలో షెడ్యూల్డ్ తెగల జనాభా అధికంగా గల జిల్లా?
1) భద్రాద్రి కొత్తగూడెం
2) మహబూబాబాద్
3) ఆదిలాబాద్ 4) నాగర్ కర్నూల్
27. రాష్ట్రంలో షెడ్యూల్డ్ తెగల జనాభా శాతం అధికంగా ఉన్న జిల్లా?
1) భద్రాద్రి కొత్తగూడెం
2) మహబూబాబాద్
3) ఆదిలాబాద్ 4) ములుగు
28. రాష్ట్రంలో షెడ్యూల్డ్ తెగల జనాభా తక్కువగా ఉన్న జిల్లా?
1) పెద్దపల్లి 2) వనపర్తి
3) జోగులాంబ గద్వాల
4) మేడ్చల్ మల్కాజిగిరి
29. తెలంగాణలో అత్యధిక జన సాంద్రత కలిగిన జిల్లా?
1) హనుమకొండ 2) హైదరాబాద్
3) మేడ్చల్ మల్కాజిగిరి
4) మెదక్
30. తెలంగాణలో అత్యల్ప జన సాంద్రత ఉన్న జిల్లా?
1) ములుగు
2) జోగులాంబ గద్వాల
3) భద్రాద్రి కొత్తగూడెం
4) జయశంకర్ భూపాలపల్లి
31. తెలంగాణలో స్త్రీ, పురుష నిష్పత్తి అధికంగా ఉన్న జిల్లా?
1) నిజామాబాద్ 2) సంగారెడ్డి
3) నిర్మల్ 4) సిద్దిపేట
32. తెలంగాణలో స్త్రీ పురుష నిష్పత్తి తక్కువగా ఉన్న జిల్లా?
1) హైదరాబాద్ 2) రంగారెడ్డి
3) మేడ్చల్ మల్కాజిగిరి
4) వనపర్తి
33. తెలంగాణలో అక్షరాస్యత రేటు అధికంగా ఉన్న జిల్లా?
1) హైదరాబాద్ 2) రంగారెడ్డి
3) మేడ్చల్ మల్కాజిగిరి
4) హనుమకొండ
34. తెలంగాణలో అక్షరాస్యత రేటు తక్కువగా ఉన్న జిల్లా?
1) నాగర్ కర్నూల్
2) జోగులాంబ గద్వాల
3) ఖమ్మం 4) వనపర్తి
35. జిల్లా పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఎక్కువ జిల్లాలుగా విభజించిన జిలా?
1) వరంగల్ 2) మెదక్
3) మహబూబ్‌నగర్
4) ఆదిలాబాద్
సమాధానాలు
1.2 2.3 3.2 4.3
5.4 6.3 7.1 8.3
9.4 10.2 11.1 12.3
13.2 14.1 15.3 16.3
17.2 18.1 19.3 20.3
21.4 22.2 23.1 24.3
25.2 26.1 27.2 28.3
29.2 30.1 31.3 32.2
33.1 34.2 35.1
1. కింది వాటిలో గోదావరి ఉపనది కానిది?
1) ప్రవర 2) మంజీర
3) మూసీ 4) ప్రాణహిత
2. నిజాం సాగర్ ఏ నదిపై నిర్మించారు?
1) గోదావరి 2) కృష్ణా
3) ప్రాణహిత 4) మంజీర
3. నదుల అధ్యయనాన్ని ఏమని పిలుస్తారు?
1) పొటమాలజీ 2) లిమ్నాలజీ
3) పెడాలజీ 4) ఓరాలజీ
4. గోదావరి నది తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని జిల్లాల నుంచి ప్రవహిస్తుంది?
1) 4 2) 5
3) 6 4) 8
5. గోదావరి నదికి రాష్ట్రంలో మొదట కలిసే ఉపనది?
1) మంజీర 2) ప్రాణహిత
3) పెన్‌గంగా 4) హరిద్ర
6. కుంతాల జలపాతం ఎక్కడ ఉంది?
1) ఆదిలాబాద్ 2) నిర్మల్
3) మంచిర్యాల 4) నిజామాబాద్
7. కింది ఏ నదుల వల్ల కందుకుర్తి (నిజామాబాద్) వద్ద త్రివేణి సంగమం ఏర్పడుతుంది?
1) మంజీర, హరిద్ర, కృష్ణా
2) ప్రాణహిత, వార్ధా, మంజీర
3) మంజీర, గోదావరి, పెన్‌గంగా
4) గోదావరి, మంజీర, హరిద్ర
8. తెలంగాణ రాష్ట్రంలో గోదావరి నదికి చివరన కలిసే ఉపనది ?
1) ప్రాణహిత 2) మంజీర
3) శబరి 4) కిన్నెరసాని
9. చిత్రకూట్ జలపాతం ఏ నదిపై ఉంది?
1) ఇంద్రావతి 2) శబరి
3) ప్రాణహిత 4) మంజీర
10. గోదావరి నది ఉపనదులలో పొడవైనది?
1) ప్రాణహిత 2) ఇంద్రావతి
3) మంజీర 4) శబరి
11. డిండి నదికి గల మరో పేరు?
1) కొలాబ్ 2) మీనాంబరం
3) ఏకాంబరం 4) ముచుకుంద
12. బోదర జలపాతం ఏ జిల్లాలో ఉంది?
1) ఆదిలాబాద్ 2) నిర్మల్
3) మంచిర్యాల
4) కుమ్రంభీం ఆసిఫాబాద్
13. కింది ఏ ప్రదేశం వద్ద గోదావరి నది తెలంగాణలోకి ప్రవేశిస్తుంది?
1) బోధన్ 2) పోచంపాడు
3) కందకుర్తి 4) కాళేశ్వరం
14. హైదరాబాద్‌లో పెద్ద సరస్సు?
1) నాగోల్ సరస్సు
2) హిమాయత్ సాగర్
3) హుస్సేన్ సాగర్
4) ఫాక్స్ సరస్సు
15. తెలంగాణ సరస్సుల నగరం అని ఏ నగరాన్ని అంటారు?
1) వరంగల్ 2) హైదరాబాద్
3) రంగారెడ్డి 4) ఆదిలాబాద్
సమాధానాలు
1.3 2.4 3.1 4.4
5.1 6.1 7.4 8.3
9.1 10.3 11.2 12.4
13.3 14.3 15.2
నేషనల్ సెక్యూరిటీ గార్డ్
NSG అత్యున్నత ఉగ్రవాద వ్యతిరేక, శీఘ్ర ప్రతిస్పందన దళంగా వెలుగొందుతుంది. విద్రోహ చర్యలు నిలువరించడానికి అవసరమైన తనిఖీలు చేపట్టడం, విదేశీ యాత్రికులను ఉగ్రవాదుల బారి నుంచి కాపాడటం, ఉగ్రవాద కార్యకలాపాలను అణచివేయడం, ఉగ్రవాదుల చొరబాట్లను నిలువరించడానికి, హైజాక్ సమయాల్లో తగిన విధంగా స్పందించి బందీలను విడిపించి వారిని క్షేమంగా ఉండేలా చేయడం, అత్యున్నత స్థాయిలో ఉన్న వ్యక్తులను కాపాడటం ఈ బలగాల ప్రత్యేక విధులు. దీనిలో 8636 మంది సిబ్బంది విధులను నిర్వహిస్తున్నారు. వీరిలో1086 మంది ప్రాంతీయ కార్యకలాపాలు నిర్వర్తిస్తున్నారు. భారతదేశంలో ముఖ్యమైన వ్యక్తులను కాపాడటానికి 3000 మంది సిబ్బందితో కూడిన Special Ranger Group (SRG) బాధ్యత వహిస్తుంది.
– జీబీకే పబ్లికేషన్స్ సౌజన్యంతో
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు