శాసనాల చరిత.. కాకతీయుల ఘనత
తెలంగాణ చరిత్ర
మాగల్లు శాసనం ప్రకారం కాకతీయుల మూలపురుషుడు కాకర్త్య గుండ్యన/దుర్జయ. మొదటి బేతరాజు కాకతీయ రాజ్య స్థాపకుడిగా గుర్తింపు పొందగా మొదటి రుద్రదేవుడు స్వతంత్ర రాజ్యాన్ని స్థాపించాడు. వీరి రాజ చిహ్నం వరాహం (పంది). కాకతీమాతను వీరు పూజించేవారు. హనుమకొండ, ఓరుగల్లును రాజధానులుగా చేసుకొని పాలించారు. మొదటి రుద్రదేవుడు హనుమకొండ నుంచి ఓరుగల్లుకు రాజధానిని మార్చాడు. వీరి భాష సంస్కృతం అయినప్పటికి తెలుగును పోషించారు. వీరి కాలంలో శూద్రులకు ప్రాధాన్యం పెరిగింది. మొదటి మతం జైన మతం కాగా శైవ మతాన్ని అధికంగా పాటించేవారు. శైవమతంలోని పాశుపతిశాఖను పోషించారు. కాకతీయులకు ఆంధ్రరాజులు, ఆంధ్రీశ్వరులు అనే బిరుదులున్నాయి. ఇటలీకి చెందిన విదేశీ యాత్రికుడు మార్కొపోలో రుద్రమదేవి కాలంలో సందర్శించాడు.
కాకతీయులు
శైవమతం
కాలముశాఖను శేషాచార్యుడు స్థాపించగా పాశుపత శాఖను విశ్వేశ్వర శంబుడు స్థాపించాడు. శేషాచార్యుడు, విశ్వేశ్వర శంభుడు, చివరివాడైన లవహిలుడు శైవమత గురువులుగా కీర్తింపబడ్డారు. వీరిలో విశ్వేశ్వర శంభుడు గొప్పవాడు. వీరి కాలంలో మంచాలదేవి గొప్ప నాట్యగత్తెగా గుర్తింపు పొం దింది. ఈమె 2వ ప్రతాపరుద్రుడికి ఉంపుడుగత్తెగా ఉండేది. పేరణి నృత్యం ప్రసిద్ధి గాంచింది. ఈ నృత్యం గురించి నృత్యరత్నావళి అనే గ్రంథం తెలుపుతుంది.
క్రీ.శ.1000వ సంవత్సరం నుంచి 1350 మధ్య 3 కథలు వచ్చాయి.
1. పల్నాటి వీరుల కథ
పల్నాటి వీరుల కథ అనే గ్రంథాన్ని 1350 సంవత్సరంలో శ్రీనాథుడు రచించాడు. వీరు మొత్తం 66 మంది ఉండేవారు. బ్రహ్మనాయుడు, బాలచంద్రుడు గొప్పవాళ్లుగా కీర్తించబడ్డారు. వీరికి కమ్మరి, చాకలి, వడ్రంగి, మంగళి మొదలైనవారు అనుచరులుగా ఉన్నారు. బాలచంద్రుడి తండ్రి యుద్ధానికి వెళ్లే ముందు అన్నం వండి కులాల ప్రాతిపదికన వడ్డించాడు. దీన్ని బాలచంద్రుడు తిరస్కరించి అందరూ ఒకే పాత్రలో భుజించే విధానాన్ని ప్రవేశపెట్టాడు. దీన్నే ‘చాప కింది కూడు’ అంటారు.
2. సమ్మక్క, సారక్క కథ
సమ్మక్క, సారక్కలు గిరిజన హక్కుల కోసం కాకతీయ రాజైన రెండో ప్రతాపరుద్రుడితో పోరాడారు.
3. కాటమరాజు కథ
పశువుల కాపరుల హక్కుల కోసం నెల్లూరు రాజులతో పోరాడాడు.
కాకతీయులకు ‘కాకతీయ’ అనే పేరు రావటానికి కారణాలు:
కాకతీయులు ‘కాకతీ’ అనే దేవతను పూజించడం వల్ల ఆ పేరు వచ్చిందని వినుకొండ వల్లభరాయుడు క్రీడాభిరామంలోని (128) పద్యంలో వివరించాడు.
కాకతీయ అనే దుర్గాన్ని వీరు పూజించడం వల్ల ఆ పేరు వచ్చిందని విద్యానాథుడు ‘ప్రతాపరుద్రుని యశోభూషణంలో తెలిపాడు.
కాకతీయ అంటే గుమ్మడికాయ, కుష్మాండం, జ్వర దేవత అని అర్థం.
హనుమకొండను పాలిస్తున్న పద్మశేషుడు అనే రాజు తన కుమార్తె పద్మావతిని గుండ్యనకు ఇచ్చి వివాహం చేశాడు. గుమ్మడిపండు లాంటి కుమారుడికి జన్మనివ్వమని దీవించాడు. ఈ పద్మశేషుడు శివుడికి గుమ్మడి పువ్వులతో పూజ చేసేవాడు.
ఆధారాలు
1. నాణేలు
కాకతీయుల కాలంలో వాడిన అతిపెద్ద నాణెం గద్వాణం లేదా మడ (బంగారు నాణెం). ఈ నాణెంపై వరాహం బొమ్మను ముద్రించారు. కాకతీయుల కాలంలో అతి చిన్న నాణెం రూక. 1 గద్వాణం 10 రూక నాణేలకు సమానం. ప్రాచీన కాలంలో భారతదేశంలో శతమానం, కర్షాపణ (ఆర్యుల కాలంలో) అనే నాణేలు ఉపయోగించారు. మధ్యయుగంలో దేశంలో జిఠల్, టంకా (హిల్టూట్మిష్) నాణేలు ఉపయోగించారు.
రోమన్లు బిషంత్ అనే బంగారు నాణెం భారతదేశానికి పరిచయం చేశారు.
మౌర్యుల కాలంలో వచ్చిన వెండి నాణెం ‘పాన’.
షేర్షా ప్రవేశపెట్టిన నాణెం ‘థాం’.
ఇటీవల లభించిన కాకతీయుల నాణెం ‘శ్రీ అహిత గజకేసరి’ (బంగారు నాణెం). కాగా భారతదేశానికి మొదటి బంగారు నాణేలను ఇండో-గ్రీకులు పరిచయం చేశారు.
2. క్రీడాభిరామం
క్రీడాభిరామం తెలుగులో వచ్చిన తొలి వీధి నాటకం కావడం విశేషం. త్రిపురాంతక కవి-‘ప్రేమాభిరామం’ అనే గ్రంథాన్ని వినుగొండ వల్లభరాయుడు క్రీడాభిరామంగా తెలుగులోకి అనువాదం చేశాడు. ఈ గ్రంథం కాకతీయుల పరిపాలనను తెలుపుతుంది. రెండో ప్రతాప రుద్రుడి ప్రియురాలైన మంచాలదేవి గురించి వివరించాడు.
3. నీతిసారం
నీతిసారాన్ని మొదటి రుద్రదేవుడు సంస్కృతంలో రచించాడు. నీతిశాస్త్ర ముక్తావత్, సుమతీ శతకాన్ని బద్దెన రాశాడు.
శివకవులు/శివత్రయం
కుమార సంభవం, మల్లికార్జునుడు శివతత్వసారం గ్రంథాలను నన్నె చోళుడు రచించారు. బసవపురాణం, బసవరగడ, చెన్నమల్లు సీసలు, వృషాదీప శతకం, బసవోధరణం, పండితారాధ్య చరిత్ర అనే గ్రంథాలను పాల్కూరికి సోమనాథుడు రాశాడు. ఇతడు శివత్రయంలో గొప్పవాడు. 13వ శతాబ్దానికి చెందిన శివకవి.
జాయాపసేనాని: ఇతడు కాకతీయుల సేనాని, గణపతి దేవుని బావమరిది. నృత్యరత్నావళి, వాయిద్య రత్నావళి, గీత రత్నావళి అనే గ్రంథాలు సంస్కృతంలో రచించాడు. నృత్యరత్నావళిలో పేరణి నృత్యం గురించి వర్ణించారు. ఈ నృత్యం తెలంగాణ శాస్త్రీయ నృత్యంగా ప్రసిద్ధి చెందింది. తెలంగాణలో విత్తనాలు విత్తినప్పుడు, కలుపు తీసినప్పుడు, పంటలు కోసేటప్పుడు చుట్టూ కాముడు అనే నృత్యం చేస్తారు.
శాసనాలు
1. మాగల్లు శాసనం: దీనిని 956 సంవత్సరంలో దానార్ణవుడు వేయించాడు. ఈ శాసనం కాకతీయులు రాష్ట్రకూటులకు సామంతులు అని తెలుపుతుంది. కాకతీయుల గురించి మొదట ప్రస్తావించిన శాసనం ఇదే. ఈ శాసనం నలుగురు కాకతీయ రాజుల గురించి పేర్కొన్నది. వారు: ఎ) గుండన, బి) ఏరియా, సి) 1వ బేతరాజు, డి) 1వ
ప్రోలరాజు
2. ఖాజీపేట శాసనం/శనిగర శాసనం: దీన్ని రెండో బేతరాజు వేయించాడు. ఈ శాసనం తొలి కాకతీయుల చరిత్రను, రెండో బేతరాజు విజయాలను తెలుపుతుంది.
3. హనుమకొండ, గణపవర శాసనాలు: మొదటి రుద్రదేవుడు 1162లో ఈ శాసనాలు వేయించాడు. ఇది కాకతీయులు స్వతంత్ర రాజులు అని తెలుపుతుంది.
4. మోటుపల్లి అభయహస్త్ర శాసనం: గణపతి దేవుడు వేయించాడు. చైనా కర్పూరాన్ని కాకతీయులు చైనా నుంచి దిగుమతి చేసుకున్నారు. ఈ శాసనం గణపతి దేవుడు, విదేశీ వర్తకుల కోసం వేయించాడు. ఈ రేవు పట్టణానికి ఇటలీ, చైనా వారు తమ వస్తువులతో వచ్చి నష్టపోయేవారు. ఈ సమయంలో వారికి నష్టపరిహారాన్ని చెల్లిస్తానని, ఓడరేవు బాగు చేయిస్తానని హామీ ఇస్తూ వేయించిన శాసనాలు.
1. మోటుపల్లి,
2.మచిలీపట్నం,
3. కృష్ణపట్నం, 4.హంసలదీవి
5. మల్కాపురం, బీదర్ కోట శాసనం: రుద్రమదేవి వేయించింది. రుద్రమదేవి గురువైన విశ్వేశ్వరశంబు గురించి, అతడు నిర్మించిన విద్యా కేంద్రాలు, గోళికాల గురించి తెలుపుతుంది. రుద్రమదేవి మందా అనే గ్రామాన్ని విశ్వేశ్వరశంభుకు దానంగా ఇచ్చింది. గణపతి దేవుడు కాడ్రో ప్రాంతాన్ని దానం చేశాడు.
6. చందుపట్ల శాసనం: దీన్ని పువ్వుల ముమ్మడు వేయించాడు. ఇది రుద్రమదేవి మరణాన్ని తెలుపుతుంది. యాదవ రాజైన కాయాస్త అంబదేవుడు నల్లగొండ జిల్లాలోని చందుపట్ల అనే గ్రామంలో రుద్రమదేవిని హత్య చేసినట్లు తెలుపుతుంది.
7. విలాసతామ్ర శాసనం : దీన్ని కాపయ్యప్రోలయ నాయకుడు వేయించాడు. 2వ ప్రతాపరుద్రుడు తన ఉంపుడుగత్తె అయిన మంచాలదేవితో కలిసి నర్మదా నదిలోకి దూకి మరణించినట్లు తెలుపుతుంది. ఈ శాసనం కాకతీయులపై ముస్లింల దాడిని గురించి తెలుపుతుంది.
8. కలువచేరు శాసనం: దీన్ని రెడ్డి రాజు తల్లి అయిన అసితల్లి వేయించింది. ఈ శాసనం ఓరుగల్లుపై ముస్లింల దాడిని తెలుపుతుంది. ముస్లింలు 5 సార్లు దాడి చేశారు.
9. బయ్యారం చెరువు శాసనం: గణపతిదేవుడి సోదరి మైలాంబ ఈ శాసనం వేయించింది. ఇది కాకతీయుల వంశవృక్షం గురించి తెలుపుతుంది. కాకతీయుల మూలపురుషుడు దుర్జయ/గుండన గురించి తెలియజేస్తుంది.
కాకతీయుల రాజకీయ చరిత్ర
కాకతీయులు 2 రకాలు.
1. సామంత కాకతీయులు (తొలిదశ, 10-12 శతాబ్దం)
2. స్వతంత్ర కాకతీయులు (మలిదశ, 12-14 శతాబ్దం)
గుండ్యన రాష్ట్రకూటులకు సామంతులు. కానీ పశ్చిమ చాళుక్యులతో వారసత్వ యుద్ధంలో పాల్గొని మరణించాడు. ఇతడు రాష్ట్రకూట రాజైన 3వ కృష్ణుడికి సామంతుడు. ఇతడి గురించి మాగల్లు శాసనం తెలియజేస్తుంది. ఈ శాసనాన్ని దానార్ణవుడు వేయించాడు.
ఏరియా
ఇతడు గుండ్యన తర్వాత రాష్ట్రకూటులకు సామంతుడిగా ఉన్నాడు. తన తండ్రి గుండ్యన సేవకు మెచ్చి చాళుక్యులు ఇతనికి కురవి (వరంగల్, ఖమ్మం) ప్రాంతాన్ని ఇచ్చారు.
మొదటి బేతరాజు
గుండ్యన పుత్రుడు. కాకతీయ పురాణాధీన (కాజీపేట శాసనం) ప్రకారం బిరుదు. ఇతడు విర్యాల కుటుంబ సాయంతో రాజ్యానికి వచ్చాడు. ఇతని సేనాని నారాయణ. యుద్ధమల్ల జినాలయం అనే దేవాలయం కట్టించాడు. గూడూరు శాసనాన్ని నారాయణ వేయించారు. మొదటి బేతరాజు మేనత్త కాసరమ్మ, భర్త ఎర్రభూపతి. ఇతడి గురించి గూడూరు శాసనం తెలుపుతుంది.
మొదటి ప్రోలరాజు
ఇతనికి కాకతీయ వల్లభ, అరిగజకేసరి అనే బిరుదులున్నాయి. 6వ విక్రమార్కుడు ఇచ్చిన బిరుదు సమాధిగత పంచ మహాశబ్ద. హనుమకొండ, పాలంపేట, పిల్లలమర్రి శాసనాలు ఈ ప్రోలరాజు గురించి తెలుపుతున్నాయి. ఇతడు జగత్కేసరి, కేసముద్రం చెరువులు తవ్వించాడు. ఇతనికి ఆగమపండిత రామేశ్వరుడు గురువుగా ఉండేవారు. గురువు కోసం శివపురం దేవాలయాన్ని నిర్మించాడు. సప్తసంతాన వ్యవస్థను ప్రవేశపెట్టాడు. ఈ వ్యవస్థలో చెరువులు ముఖ్యమైనవి.
2వ బేతరాజు
విక్రమచక్ర, చాదస్థమండ, త్రిభువనమండ, మహిమండలేశ్వర అనే బిరుదులున్నాయి. ఇతడు ఖాజీపేట శాసనం వేయించాడు. ఇతడు హనుమకొండను రాజధానిగా చేసుకొని పాలించాడు. బేతేశ్వరాలయం నిర్మించాడు. ఇతని గురువు రామేశ్వర పండితుడు.
దుర్గరాజు
బేతేశ్వర ఆల యాన్ని రామేశ్వర పండితునికి దానం చేశాడు.
2వ ప్రోలరాజు
ఇతడు తొలి కాకతీయుల్లో సుప్రసిద్ధుడు. ఇతని గురించి హనుమకొండ శాసనం తెలుపుతుంది. పాలకొల్లు వరకు రాజ్యాన్ని విస్తరించి శ్రీశైలంలో విజయస్థూపం ఏర్పాటు చేశాడు. వ్యవసాయ అభివృద్ధి కోసం అనేక చెరువులు తవ్వించాడు. సిద్ధేశ్వరాలయం, పద్మాక్షి ఆలయం కట్టించాడు. ఇతని భార్య మైలమ్మ నడుంబసతి అనే ఆలయాన్ని నిర్మించింది.
స్వతంత్ర కాకతీయులు (12-14 శతాబ్దం)
1. మొదటి రుద్రదేవుడు (1158-1195)
ఇతడికి విద్యా వినయ భూషణుడు, విద్యా భూషణుడు, కవి గజకేసరి, కవి భాష పోషకుడు అని బిరుదులున్నాయి. ఇతన్ని 1వ ప్రతాపరుద్రుడు (లేదా) కాకతీయ రుద్రుడు అని కూడా పిలుస్తారు. స్వతంత్ర కాకతీయ రాజ్య స్థాపకుడు 1162లో స్వాతంత్య్రాన్ని ప్రకటించుకున్నాడు. కందుకూరును పాలిస్తున్న చోళరాజైన చోడ భీముడిని ఓడించి అతని కుమార్తెపైనా ఉదయ చోళుడితో సంధీ చేసుకొని ఉదయచోళుడి కూతురు పద్మావతిని వివాహం చేసుకున్నాడు. కళ్యాణి చాళుక్యుల్లో చివరి రాజైన 3వ తైలపుడిని ఓడించి తెలంగాణ, కోస్తాంధ్ర, రాయలసీమలను కలిపి స్వతంత్ర రాజ్యాలను స్థాపించాడు. కర్ణాటక రాజైన కాలాచూరి బిజ్జలుడిని ఓడించాడు. హనుమకొండ, గణపవర శాసనాలు వేయించాడు. అచితేంద్రుడు హనుమకొండ శాసనాన్ని లిఖించాడు. రుద్రదేవుడు 1162లో హనుమకొండలో వేయిస్థంభాల ఆలయాన్ని (రుద్రేశ్వరాలయం) కట్టించాడు. ఈ ఆలయంలో శివుడు, విష్ణువు, అదిత్యుడు/సూర్యుడు ఉంటారు.
పల్నాటి యుద్ధం (లేదా) ఆంధ్రకురుక్షేత్రం (లేదా) కారంపూడి యుద్ధం 1182
నలగమరాజు కూటమి: 1. నాగమ్మ, 2. మొదటి రుద్రదేవుడు, 3. వీర బల్లాలుడు, 4. కోటరాజు
మలిదేవరాజు కూటమి: 1. బ్రహ్మనాయుడు, 2. బాల చంద్రుడు, 3. వొజ్జనాయుడు, 4. బిజ్జలుడు
బ్రహ్మనాయుడు: ఇతడు వెలమల కుల మూలపురుషుడు. వైష్ణవ మతాన్ని పోషించాడు. కన్నమదాసు అనే దళితుడిని దత్తత తీసుకున్నాడు.
ఆంజనేయులు, సీనియర్ ఫ్యాకల్టీ, ఏకేఆర్ పబ్లికేషన్స్ వికారాబాద్, 9441022571
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు