గ్రూప్ -1 కొట్టడం సులువే!
- గ్రూప్-1 మెయిన్స్
- ప్రిపరేషన్ప్లాన్
గ్రూప్-1 ప్రిలిమ్స్ పాసై, మెయిన్‌కు అర్హత సాధించినవారు ప్రిపరేషన్ మొదలు పెట్టారు. కొంతమంది సందిగ్ధంలో ఉంటారు. ఈ నేపథ్యంలో సులువుగా గ్రూప్1 ఉద్యోగం సాధించడంపై ట్వంటీఫస్ట్ సెంచరీ ఐఏఎస్ అకాడమీ చైర్మన్ పీ కృష్ణప్రదీప్ సలహాలు, సూచనలు మీ కోసం..
రోజుకు 15 ప్రశ్నలు
మెయిన్‌కు120 రోజుల వ్యవధి ఉన్నది. రోజుకు మూడు గంటలు 15 ప్రశ్నల చొప్పున రైటింగ్ ప్రాక్టీస్ చేయాలి. ఉమ్మడి రాష్ట్రంలోని గ్రూప్ -1, ఏపీపీపీస్సీ గ్రూప్-1, 2014 నుంచి ఇప్పటివరకు యూపీఎస్సీ మెయిన్ ప్రశ్నపత్రాలకు సమాధానాలు రాయడం అలవాటు చేసుకోవాలి. సెల్‌ఫోన్ వినియోగాన్ని తగ్గించాలి.
‘సీ’ ఫార్ములాను పాటించాలి
వ్యాసాలు జాగ్రత్తగా రాయాలి. తప్పుల్లేకుండా పదాలు, వాక్యనిర్మాణం సరిగ్గా ఉండేలా చూసుకోవాలి. కామా, పుల్‌స్టాప్ ఎక్కడ అవసరమో అక్కడే వినియోగించాలి. ఎందుకంటే ఎలా పడితే అలా వాడితే అర్థాలు మారుతాయి కాబట్టి. పదాలు తగ్గకుండా చూసుకోవాలి. వ్యాసాలను ఒక పద్ధతి ప్రకారం రాయాలి. కాన్సెప్ట్, కాన్సీక్వెన్సెస్, కాంటెంపరరీ, కన్‌క్లూజన్ అనే సీ ఫార్ములాను అనుసరించాలి. ఎట్టి పరిస్థితుల్లో ఇతర అంశాల జోలికి వెళ్లరాదు. ప్రశ్నలో ఏం అడిగారో వాటికే పరిమితం కావాలి.
ప్రిపరేషన్ ప్లాన్
ఇప్పుడున్న పరిస్థితుల్లో కోచింగ్ తీసుకోకపోవడం ఉత్తమం. టెస్ట్ సిరీస్‌ను ఎంచుకోవడం మంచిది. రోజుకు 15 గంటలు కష్టపడేలా ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి. రోజుకు మూడు గంటలు రైటింగ్ ప్రాక్టీస్ చేయాలి. మిగిలిన 12 గంటల్లో 2 గంటల చొప్పున గంట సేపు చదవాలి, మరో గంటలో 30 నిమిషాలు పునశ్చరణ, 30 నిమిషాలు చదివింది సొంత పదాల్లో రాసుకోవాలి. కనీసం 6 నుంచి 7 గంటలు నిద్ర అవసరం. ప్రభుత్వ ఉద్యోగులు సెలవు పెట్టి, ప్రైవేట్ వాళ్లు అవసరమైతే రాజీనామా చేసి సన్నద్ధం కావడం మంచిది.
ప్యాట్రన్ మారినా నో టెన్షన్
మెయిన్ పేపర్ ప్యాట్రన్ కాస్త మారినా.. ఇదేం అంత ప్రభావం చూపదని అనుకోవడానికి లేదు. కంపల్సరీ ప్రశ్నలివ్వడం, చాయిస్ లేకపోవడం సవాల్‌తో కూడుకొన్న అంశమే. అయినా, అందుకు తగ్గట్టు ఎక్కువ అంశాలను చదవాలి. 6 కంపల్సరీ ప్రశ్నలిచ్చినా.. వాటన్నింటికీ జవాబులు రాసేలా సన్నద్ధం కావాలి. సివిల్స్ స్థాయిలో మెయిన్స్‌కు ప్రిపేర్ కావాలి.
పుస్తకాల్లో ఉన్నవే రాస్తే..
తెలుగు అకాడమీ సహా ఇతర పోటీ పరీక్షల మెటీరియల్‌ను నమ్ముకొంటే మార్కులు సాధించలేరు. సమకాలీన అంశాలను సమాధానాల్లో జోడించాలి. ఇటీవల చాట్ జీపీటీ, జీ-20, ఉమ్మడి పౌరస్మృతి, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీలతో అనేక అంశాలు వార్తల్లో ఉన్నాయి. మెయిన్‌లో అడిగిన ప్రశ్నలకు సరితూగే సమకాలీన అంశాలను ప్రస్తావించాలి.
బోల్తా కొట్టించగలమని అనుకోవద్దు
మెయిన్ పేపర్ల రూపకల్పన, మూల్యాంకనం ప్రక్రియ అంతా ప్రొఫెసర్లే చేస్తారు. ఆన్సర్లుగా ఏదో రాసి బోల్తా కొట్టిస్తామనుకొంటే కుదరదు. వర్సిటీ ప్రొఫెసర్లను ఆకట్టుకొనేలా, మేధస్సును ఉపయోగించి జవాబులు రాయాలి. ప్రొఫెసర్లు నా పేపర్‌ను మూల్యాంకనం చేస్తారని మనసులో అనుకొని.. విచక్షణ ఉపయోగించి రాయాలి.
మరికొన్ని సూచనలు
ప్రిపరేషన్ సమయంలో స్పల్పకాలిక విరామం తీసుకోవాలి. ఒకేచోట కూర్చోకుండా కొంచెం నడవటం ద్వారా ఒత్తిడిని దూరం చేసుకోవచ్చు.
చదివిన అంశాలను కాన్సెప్ట్స్ రూపంలో ఒక బొమ్మలాగా మనసులో వేసుకోవాలి.
ఏ పాయింట్ తర్వాత ఏ పాయింట్ వస్తుందో గుర్తుపెట్టుకొనేందుకు ఇది బాగా ఉపయోగపడుతుంది.
ఏకాగ్రతను పెంచడానికి, మనస్సును ప్రశాంతంగా ఉంచడానికి ధ్యానం, వ్యాయామం చేయాలి.
బిర్యానీల జోలికి వెళ్లకుండా సాత్విక ఆహారం తీసుకోవడం మంచిది.
ఆన్లైన్లో శిక్షణ పొందేవారు ట్యాబ్, ల్యాప్‌టాప్‌లను వినియోగించాలి. – సెల్‌ఫోన్ వల్ల అనర్థాలు, కంటిచూపు సమస్యలు తలెత్తుతాయి.
– మల్లేశం కొంటు
- Tags
- Group 1
- Group 1 Mains
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు