ప్లేగు లక్షణాలు వ్యాధి సోకిన ఎన్ని రోజులకు బయటపడతాయి?
ఆరోగ్యం
1. కింది వాటిలో పుట్టుకతో సంక్రమించే వ్యాధి కానిది?
ఎ) సికిల్ సెల్ ఎనిమియా (Sickle cell Anaemia)
బి) హీమోఫీలియా
సి) ఎన్సెఫలైటిస్ (Encephalitis)
డి) డౌన్ సిండ్రోమ్
2. కింది వాటిలో సంక్రమించే వ్యాధి (అంటు వ్యాధి) కానిది?
ఎ) సర్వైకల్ క్యాన్సర్
బి) స్కిజోఫ్రినియా
సి) ఇన్‌ఫ్లూయెంజా డి) గనేరియా
3. కింది వాటిలో బ్యాక్టీరియా ద్వారా సంక్రమించే వ్యాధి?
ఎ) క్షయ బి) మశూచి
సి) గవదబిళ్లలు డి) డెంగీ
4. ట్రిపోనిమా పాలిడం ద్వారా సంక్రమించే వ్యాధి?
ఎ) సెప్సిస్ బి) సిఫిలిస్
సి) డిఫ్తీరియా డి) మెనింజైటిస్
5. డిఫ్తీరియా సోకిన ఎన్ని రోజులకు వ్యాధి లక్షణాలు బయటపడతాయి?
ఎ) 7 రోజులు బి) 10 రోజులు
సి) 2-5 వారాలు డి) 15 రోజులు
6. ప్లేగు లక్షణాలు వ్యాధి సోకిన ఎన్ని రోజులకు బయటపడతాయి?
ఎ) 17 రోజులు బి) 2-10 రోజులు
సి) 15 రోజులు డి) నెల
7. కింది వాటిలో ఆర్సెనిక్ వల్ల సంభవించే వ్యాధి?
ఎ) సిలికోసిస్ బి) మెలనోసిస్
సి) ఫ్లోరోసిస్ డి) వేరికోసిస్
8. ట్రైకోఫైటాన్ వల్ల సంభవించే వ్యాధి?
ఎ) అథ్లెట్స్ ఫుట్ బి) ధోబీ ఇచ్
సి) యూమైసిటోమా
డి) మైసిటోమా
9. కింది వాటిలో శరీరావయవాలకు సంక్రమించే వ్యాధి?
ఎ) మైసిటోమాపెడిస్
బి) టినియా క్రురిస్
సి) యూమైసిటోమా డి) టినియా పెడిస్
10. లీసా వైరస్ (Lyssa Virus) ద్వారా సంక్రమించే వ్యాధి?
ఎ) ఇన్‌ఫ్లూయెంజా-A
బి) రేబిస్ సి) మశూచి
డి) గవదబిళ్లలు
11. ఎబోలా వైరస్‌ను నిరోధించే టీకా VSB-EBOV ను ఎప్పుడు కనుగొన్నారు?
ఎ) 2015, డిసెంబర్
బి) 2015, నవంబర్
సి) 2016, డిసెంబర్
డి) 2016, నవంబర్
12. 1880లో వ్యాధి నిరోధకత విధానాలను అభివృద్ధి చేసింది?
ఎ) ఎడ్వర్డ్ జెన్నర్ బి) రాబర్ట్ హుక్
సి) లూయీ పాశ్చర్
డి) రొనాల్డ్ రాస్
13. శరీరంలోకి సూక్ష్మజీవులను గానీ, వాటి భాగాలను గానీ ప్రవేశపెట్టడం ద్వారా సంక్రమించే అసంక్రామ్యత ?
ఎ) నిష్క్రియాత్మక అసంక్రామ్యత
బి) క్రియాత్మక అసంక్రామ్యత
సి) కృత్రిమ క్రియాత్మక అసంక్రామ్యత
డి) ఎ, బి
14. టీకాల ద్వారా నిర్మూలించడాన్ని లక్ష్యంగా పెట్టుకొన్న మొదటి వ్యాధిని గుర్తించండి.
ఎ) రేబిస్ బి) మశూచి
సి) ఎబోలా డి) ఆంథ్రాక్స్
15. చివరిసారి మశూచి వ్యాధి ఉనికి ఎక్కడ బయటపడింది?
ఎ) దక్షిణాఫ్రికా బి) పశ్చిమ ఆఫ్రికా
సి) సోమాలియా డి) నైజీరియా
16. ప్రపంచ ఆరోగ్య సంస్థ ద్వారా 1988 వరకు పూర్తిగా నిర్మూలించాలని లక్ష్యంగా పెట్టుకున్న వ్యాధి?
ఎ) మశూచి బి) ఆటలమ్మ
సి) పోలియో డి) తట్టు
17. ఎంత తలసరి ఆదాయం (GDP- అమెరికా డాలర్లలో) ఉన్న దేశాల్లో Global Alliance for Vaccines and Immunization ను ఏర్పాటు చేస్తున్నారు?
ఎ) 1000 డాలర్లు
బి) 1000 డాలర్ల కంటే తక్కువ
సి) 1000-5000 డాలర్లు
డి) 5000-10000 డాలర్లు
18. National Rural Health Missionను ఎప్పుడు ప్రారంభించారు?
ఎ) 2005 బి) 2013
సి) 2004 డి) 2014
19. మిషన్ ఇంద్రధనుష్‌ను ఎప్పుడు ప్రారంభించారు?
ఎ) 2014 డిసెంబర్ 24
బి) 2015 డిసెంబర్ 24
సి) 2014 డిసెంబర్ 25
డి) 2015 డిసెంబర్ 25
20. మిషన్ ఇంద్రధనుష్‌లో అందించే 7 వ్యాధుల టీకాలకు అదనంగా ఏ వ్యాధులకు టీకాలను అందించనున్నారు?
ఎ) Japanese Encephalitis
బి) HIB సి) ఎ, బి
డి) రోటా, రూబెల్లా వైరస్లు
21. 2005 నుంచి సార్వత్రిక వ్యాధి నిరోధక కార్యక్రమంలో ప్రధానంగా దేన్ని అమలుచేస్తారు?
ఎ) మిషన్ ఇంద్రధనుష్
బి) Child Survival and Safe
Motherhood Programme
సి) National Rural Health Mission
డి) ఎ, బి
22. జాతీయ ఆరోగ్య మిషన్‌లో భాగమైనది?
ఎ) జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్
బి) జాతీయ పట్టణ ఆరోగ్య కార్యక్రమం
సి) ఎ, బి
డి) మిషన్ ఇంద్రధనుష్
23. జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్ (NHRM)ను ఆరోగ్య అవసరాల కోసం ఎన్ని రాష్ర్టాల్లో అమలు చేస్తున్నారు?
ఎ) 18 బి) 25 సి) 12 డి) 10
24. మిషన్ ఇంద్రధనుష్ మొదటి దశలో భాగంగా ఎన్ని జిల్లాల్లో కార్యక్రమాలను అమలు చేస్తున్నారు?
ఎ) 82 బి) 18
సి) 100 డి) 201
25. Universal Immunization Programmeలో భాగంగా అందించని టీకా?
ఎ) ధనుర్వాతం టీకా బి) హెపటైటిస్-బి
సి) డయేరియా డి) తట్టు టీకా
26. పోషకాహార లోపం వల్ల సంభవించే వ్యాధులను జతపరచండి.
ఎ. క్వాషియోర్కర్ (Kwashiorkor)
1. విటమిన్-డి
బి. రికెట్స్ 2. ప్రొటీన్స్
సి. స్కర్వీ 3. నియాసిన్
డి. పెల్లాగ్రా 4. విటమిన్-సి
ఎ) ఎ-2, బి-4, సి-1, డి-3
బి) ఎ-2, బి-1, సి-4, డి-3
సి) ఎ-4, బి-2, సి-1, డి-3
డి) ఎ-2, బి-1, సి-3, డి-4
27. జతపరచండి.
ఎ. జన్మతః సంక్రమించే వ్యాధి 1. ఇన్‌ఫ్లూయెంజా
బి. అంటు వ్యాధి 2. సికిల్ సెల్ ఎనిమియా
సి. పోషకాహార లోపం 3. స్కిజోఫెరియా
(Schizopheria)
డి. మానసిక అసమతౌల్యం 4. స్కర్వీ
ఎ) ఎ-2, బి-1, సి-4, డి-3
బి) ఎ-2, బి-4, సి-1, డి-3
సి) ఎ-3, బి-4, సి-2, డి-1
డి) ఎ-2, బి-4, సి-3, డి-1
28. జతపరచండి.
ఎ. బ్యాక్టీరియా 1. ఎబోలా
బి. వైరస్ 2. మలేరియా
సి. ప్రొటోజోవా 3. డీసెంట్రీ
డి. ఫంగి 4. ధోబి ఇచ్
ఎ) ఎ-3, బి-1, సి-2, డి-4
బి) ఎ-3, బి-2, సి-4, డి-1
సి) ఎ-3, బి-2, సి-1, డి-4
డి) ఎ-3, బి-4, సి-2, డి-1
29. జతపరచండి.
ఎ. మశూచి 1. 1-4 రోజులు
బి. గవదబిళ్లలు 2. 1-2 రోజులు
సి. డీసెంట్రీ 3. 16-18 రోజులు
డి. కలరా 4. 12 రోజులు
ఎ) ఎ-4, బి-2, సి-3, డి-1
బి) ఎ-4, బి-3, సి-2, డి-1
సి) ఎ-4, బి-2, సి-1, డి-3
డి) ఎ-4, బి-3, సి-1, డి-2
30. జతపరచండి.
ఎ. డీసెంట్రీ 1. రిమాంటడిన్
బి. మధురా ఫుట్ 2. ఆంపిసిలిన్
సి. ఇన్‌ఫ్లూయెంజా 3. కెటో కోనజోల్
డి. గనేరియా 4. పెన్సిలిన్
ఎ) ఎ-2, బి-3, సి-4, డి-1
బి) ఎ-3, బి-2, సి-1, డి-4
సి) ఎ-2, బి-3, సి-1, డి-4
డి) ఎ-3, బి-1, సి-2, డి-4
31. జతపరచండి.
ఎ. కార్సినోమా 1. కండర కణాలు
బి. సార్కోమా 2. చర్మ కణాలు
సి. లింఫోమా 3. వివిధ గంథ్రులకు
సంబంధించిన కణాలు
డి. అడినోమాస్ 4. రోగనిరోధక
వ్యవస్థలోని కణాలు
ఎ) ఎ-2, బి-1, సి-3, డి-4
బి) ఎ-4, బి-3, సి-1, డి-2
సి) ఎ-2, బి-3, సి-1, డి-4
డి) ఎ-4, బి-1, సి-3, డి-2
32. జతపరచండి.
ఎ. Universal Immunization Programme 1. 2002
బి. National Health Policy 2. 1985
సి. National Rural Health Mission 3. 2013
డి. National Urban Health Mission 4. 2005
ఎ) ఎ-1, బి-2, సి-4, డి-3
బి) ఎ-2, బి-1, సి-4, డి-3
సి) ఎ-3, బి-1, సి-2, డి-4
డి) ఎ-2, బి-1, సి-3, డి-4
33. డిఫ్తీరియాకు సంబంధించి సరైన వాక్యాలను గుర్తించండి.
1- ఇది కార్ని బ్యాక్టీరియం డిఫ్తీరియే వల్ల సంభవిస్తుంది
2- గొంతు నొప్పి, జ్వరం వంటి లక్షణాలు కనిపిస్తాయి
3- లింఫ్ నోడ్స్ వల్ల మెడలో వాపు
సంభవిస్తుంది
ఎ) 1, 2 బి) 2, 3
సి) 1, 3 డి) 1, 2, 3
34. కింది వాటిలో ఎబోలా వైరస్‌కు సంబంధించి సరైనవి గుర్తించండి.
1- దక్షిణాఫ్రికాలో అధిక మరణాలు
సంభవించడానికి కారణమయ్యే వ్యాధి
2- డిసెంబర్ 2016లో VSV- EBOVను ఈ వ్యాధి నిరోధక టీకాగా గుర్తించారు
ఎ) 1 బి) 2
సి) 1, 2 డి) పైవేవీ కావు
35. గనేరియాకు సంబంధించి కింది వాటిలో సరికానివి గుర్తించండి.
1- ఇది లైంగిక సంభోగం వల్ల వ్యాప్తి చెందుతుంది
2- ఈ వ్యాధి లక్షణాలు 15 రోజుల్లో బయటపడతాయి
3- పెన్సిలిన్, సల్ఫా డ్రగ్స్ ఉపశమనం కలిగిస్తాయి
ఎ) 1, 2 బి) 2, 3
సి) 1, 3 డి) 1, 2, 3
36. ఆంథ్రాక్స్కు సంబంధించి సరైన వాక్యాలను గుర్తించండి.
1- ఆంథ్రాక్స్ అనేది వైరస్ ద్వారా
సంభవించే వ్యాధి
2- ఇది బాసిల్లస్ ఆంథ్రాసిస్ ద్వారా
వ్యాపిస్తుంది
3- పశువులు, గుర్రాల ద్వారా వ్యాప్తి
చెందుతుంది
4- పెన్సిలిన్, టెట్రాసైక్లిన్లు ఉపశమనం కలిగిస్తాయి
ఎ) 1, 2, 3, 4 బి) 2, 3, 4
సి) 1, 3, 4 డి) 1, 2, 4
37. గొంతు వాపునకు సంబంధించి సరైన వాక్యాలను గుర్తించండి.
1- ఇది స్ట్రెప్టోకోకస్ బ్యాక్టీరియా వల్ల సంభవిస్తుంది
2- జ్వరం, దగ్గు, గొంతులో మంట వంటి లక్షణాలు కనిపిస్తాయి
3- వ్యాధి లక్షణాలు 12 రోజుల్లో కనిపిస్తాయి
ఎ) 1, 2 బి) 2, 3
సి) 1, 3 డి) 1, 2, 3
38. కింది వాటిలో సరైనవి గుర్తించండి.
1- మశూచి వ్యాధి Variola బ్యాక్టీరియా వల్ల సంభవిస్తుంది
2- రోగ లక్షనాలు వ్యాధి సోకిన 12 రోజుల్లో బయటపడుతుంది
ఎ) 1 బి) 2
సి) 1, 2 డి) పైవేవీ కావు
39. కింది వాటిలో సరైన వాక్యాలను గుర్తించండి.
1- కాళ్ల చర్మానికి సోకే సాధారణ ఇన్ఫెక్షన్ టినియా పిడిస్
2- ట్రైకోఫైటాన్, మైక్రోస్పోరమ్ వల్ల
వ్యాపిస్తుంది
3- ఈతకొలనుల్లో, తేమ కలిగిన
ప్రాంతాల్లో ఫంగస్ ద్వారా వ్యాపిస్తుంది
ఎ) 1, 2, 3 బి) 1, 2
సి) 2, 3 డి) 1, 3
40. కింది వాటిలో సరైనవి గుర్తించండి.
1- సాధారణంగా టీకాల ద్వారా
రోగనిరోధక వ్యవస్థ పెంపొందిస్తారు
2- 1798లో ఎడ్వర్డ్ జెన్నర్ పరిశోధనల వల్ల టీకాలు అభివృద్ధి చెందాయి
3- 1880 నుంచి రోగనిరోధక
విధానాలను లూయీ పాశ్చర్ ఇతర
రోగాలకు కూడా అభివృద్ధి చేశారు
ఎ) 1, 2 బి) 1, 3
సి) 2, 3 డి) 1, 2, 3
సమాధానాలు
1.సి 2.బి 3.ఎ 4.బి
5.సి 6.బి 7.బి 8.ఎ
9.సి 10.బి 11.సి 12.సి
13.సి 14.బి 15.సి 16.సి
17.బి 18.ఎ 19.సి 20.సి
21.సి 22.సి 23.ఎ 24.డి
25.డి 26.బి 27.ఎ 28.ఎ
29.డి 30.సి 31.ఎ 32.ఎ
33.డి 34.సి 35.సి 36.బి
37.ఎ 38.బి 39.ఎ 40.డి
- Tags
- nipuna news
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?