ద్రవ్యత్వాభిరుచి వడ్డీ సిద్ధాంతాన్ని ఎవరు ప్రతిపాదించారు?
- ఎకానమీ
1. కేంద్రీకృత ఆర్థిక వ్యవస్థకు ఉదాహరణ?
ఎ) భారతదేశం బి) రష్యా
సి) అమెరికా డి) జర్మనీ
2. వస్తుసేవల ఉత్పత్తిలోని పెరుగుదలతోపాటు సాంఘిక ఆర్థిక వ్యవస్థాపూర్వక మార్పులను సూచించేది ఏది?
ఎ) ఆర్థికాభివృద్ధి
బి) ఆర్థిక వృద్ధి
సి) అభివృద్ధి సూచికలు డి) పైవన్నీ
3. మానవాభివృద్ధి సూచిక (హెచ్‌డీఐ) ఏ సంవత్సరంలో ప్రతిపాదించారు?
ఎ) 1990 బి) 1995
సి) 1997 డి) 1998
4. మూడో ప్రపంచ దేశాలు అంటే?
ఎ) పెట్టుబడి/ సామ్యవాద దేశాలు
బి) అభివృద్ధి చెందుతున్న దేశాలు
సి) వర్తమాన దేశాలు డి) పైవన్నీ
5. 2011 నాటికి భారతదేశంలో లింగనిష్పత్తి ఎంత?
ఎ) 943:1000 బి) 988:1000
సి) 948:1000 డి) 978:1000
6. ప్రస్తుతం అమల్లో ఉన్న ఆర్థిక వ్యవస్థను మార్చడానికి ప్రయత్నం చేసే ప్రణాళికను ఏమంటారు?
ఎ) కార్యాత్మక ప్రణాళిక
బి) నిర్మాణాత్మక ప్రణాళిక
సి) సాధారణ ప్రణాళిక
డి) నిరంతర ప్రణాళిక
7. స్వావలంబన అంటే?
ఎ) స్వయం నిర్ణయ స్థితి
బి) ఇతరులపై ఆధారపడక పోవడం
సి) స్వయం ప్రతిపత్తి
డి) పైవన్నీ
8. ఒక వ్యక్తి ఒక సంవత్సరంలో 6 నెలల కన్నా తక్కువ పనిచేస్తే వారిని ఏమంటారు?
ఎ) ప్రధాన కార్మికుడు
బి) ఉపాంత కార్మికుడు
సి) దైనందిన కార్మికుడు
డి) ఉపాధి లేని కార్మికుడు
9. శ్రామికులు ఒక వృత్తి నుంచి మరొక వృత్తిలోకి మార్పు చెందే కాలంలో ఏర్పడే నిరుద్యోగిత?
ఎ) ఘర్షణ నిరుద్యోగిత
బి) సంఘృష్టి నిరుద్యోగిత
సి) టర్నోవర్ నిరుద్యోగిత
డి) పైవన్నీ
10. అభివృద్ధి ఫలాలు ఆర్థిక వ్యవస్థలోని అన్ని వర్గాలకు చేరి పేదరికం నిరుద్యోగం
తగ్గుతుందని ప్రభుత్వ విధాన కర్తలు భావించడాన్ని ఏమంటారు?
ఎ) గ్లాస్ కర్టన్ ఆర్థిక వ్యవస్థ
బి) ట్రికిల్ డౌన్ ఎఫెక్ట్ సిద్ధాంతం
సి) ఎ, బి
డి) సుస్థిర అభివృద్ధి
11. పేదరిక లెక్కింపు పద్ధతిలో పి-ఇండెక్స్‌ను ఏమంటారు?
ఎ) సెన్ ఇండెక్స్
బి) తలల లెక్కింపు నిష్పత్తి
సి) పేదరిక అంతర సూచి
డి) గిని ఇండెక్స్
12. గ్రామాల నుంచి పట్టణాలకు శాశ్వతంగా వలస వెళ్తే దాన్ని ఏమంటారు?
ఎ) అంతర్గత వలస
బి) దేశీయ వలస
సి) ట్రాన్స్లొకేటరీ వలస
డి) సోపాన వలస
13. బ్రిటిష్ వలస పాలన కాలంలో భారతీయ నేరస్థులను అండమాన్ దీవులకు పంపడం
ఏ రకమైన వలస అవుతుంది?
ఎ) దుర్బిక్ష వలస బి) నిర్బంధ వలస
సి) చక్రీయ వలస డి) సోపాన వలస
14. గ్రామదానోద్యమాన్ని ప్రారంభించింది ఎవరు?
ఎ) వినోబా భావే
బి) థామస్‌మన్రో
సి) సుభాశ్ చంద్రబోస్ డి) నౌరోజీ
15. నాబార్డ్ ప్రజలకు ఏ విధంగా ఆర్థిక
సహాయాన్ని అందిస్తుంది?
ఎ) ప్రత్యక్షంగా బి) పరోక్షంగా
సి) ఎ, బి డి) క్రెడిట్ కార్డ్ ద్వారా
16. సూక్ష్మ విత్తం లక్ష్యం?
ఎ) గ్రామీణ పేదలకు విత్త సహాయం
అందించడం
బి) పట్టణ పేదలకు విత్త సహాయం
అందించడం
సి) స్వయం ఉపాధి లబ్ధిదారులకు ఆర్థిక సహాయం అందించడం
డి) పైవన్నీ
17. సాంద్ర వ్యవసాయ ప్రాంతాల కార్యక్రమం ఎప్పడు ప్రారంభించారు?
ఎ) 1964 బి) 1965
సి) 1966 డి) 1967
18. ప్రజాపంపిణీ ద్వారా ప్రజలకు ఆహార ధాన్యాలను పంపిణి చేసేటప్పుడు వసూలు చేసే ధరను ఏమంటారు?
ఎ) జారీ ధరలు బి) చౌకధరలు
సి) ఎ, బి డి) సగటు ధరలు
19. వ్యవసాయ ఉత్పాదకాలను అందించే పరిశ్రమలను ఏమంటారు?
ఎ) అగ్రి పరిశ్రమలు
బి) ఆగ్రో పరిశ్రమలు సి) ఎ, బి
డి) సంస్థాగత పరిశ్రమలు
20. రసాయనిక ఎరువుల ఉత్పత్తిలో పెరుగుదలను ఏమంటారు?
ఎ) రెయిన్బో విప్లవం
బి) బూడిదరంగు విప్లవం
సి) వలయ విప్లవం
డి) వెండినారీ విప్లవం
21. ఫెమా ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది?
ఎ) 2000 జూన్ 1 బి) 2001 జూన్ 1
సి) 2002 జూలై 1 డి) 2001 జూలై 1
22. సెజ్ (SEZ) అంటే?
ఎ) సెకెండ్ ఎకనమిక్ జోన్స్
బి) స్పెషల్ ఎకనమిక్ జోన్స్
సి) సెకెండ్రీ ఎకనమిక్ జోన్
డి) సోషల్ ఎకనమిక్ జోన్
23. భారత పారిశ్రామిక విత్త సంస్థ (ఐఎఫ్సీఐ) ఎప్పడు ఏర్పాటు చేశారు?
ఎ) 1945 బి) 1946
సి) 1947 డి) 1948
24. ముద్రా బ్యాంక్‌ను దేనికి అనుబంధ సంస్థగా స్థాపించారు?
ఎ) ఐడీబీఐ బి) ఎస్ఐడీబీఐ
సి) ఐఎఫ్సీఐ డి) ఐసీఐసీఐ
25. జీవిత బీమా సంస్థ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది?
ఎ) ముంబై బి) కలకత్తా
సి) మద్రాస్ డి) న్యూఢిల్లీ
26. గ్రీన్ కాలర్ పనివారు ఎప్పటి నుంచి ప్రాచుర్యంలోకి వచ్చారు?
ఎ) 1980 బి) 1982
సి) 1983 డి) 1984
27. ఒక ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ప్రభుత్వ ఆదాయం, వ్యయం సమానంగా ఉంటే దానిని ఏమంటారు?
ఎ) మిగులు బడ్జెట్
బి) సంతులిత బడ్జెట్
సి) స్థిర బడ్జెట్
డి) శూన్య ఆధార బడ్జెట్
28. అమర్థ్యసేన్ అర్థశాస్త్రంలో నోబెల్ బహుమతి ఏ సంవత్సరంలో పొందారు?
ఎ) 1996 బి) 1997
సి) 1998 డి) 1999
29. ప్రభుత్వం తాను తీసుకున్న రుణాన్ని తిరిగి చెల్లించడాన్ని ఏమంటారు?
ఎ) రుణ విమోచనం
బి) రుణ నిరాకరణ
సి) రుణ పరివర్తన డి) పైవన్నీ
30. బ్యాంకు ద్రవ్యానికి మరొక పేరు?
ఎ) యోగ్యమైన ద్రవ్యం
బి) పరపతి ద్రవ్యం
సి) ఖాతా ద్రవ్యం
డి) అంతర్గత ద్రవ్యం
31. ఆర్బీఐని ఎప్పుడు జాతీయం చేశారు?
ఎ) 1935 బి) 1949
సి) 1955 డి) 1960
32. బ్యాంకుల జాతీయీకరణ ఎవరి ఆధ్వర్యంలో జరిగింది?
ఎ) ఇందిరాగాంధీ బి) రాజీవ్‌గాంధీ
సి) నర్సింహారావు డి) వాజ్‌పేయి
33. ద్రవ్యత్వాభిరుచి వడ్డీ సిద్ధాంతాన్ని ఎవరు ప్రతిపాదించారు?
ఎ) జె.ఎం. కీన్స్ బి) జె.బి. కీన్స్
సి) డాల్టన్ డి) క్రౌథర్
34. డబ్ల్యూటీవో (WTO) ఎప్పడు ఏర్పడింది?
ఎ) 1995-1-1 బి) 1994-1-1
సి) 1996-1-1 డి) 1993-1-1
35. జీఎస్టీ అనేది?
ఎ) ప్రత్యక్ష పన్ను బి) పరోక్ష పన్ను
సి) అనుపాత పన్ను డి) పైవన్నీ
36. సంపద పన్నును ఎవరి సిఫారసు ఆధారంగా ప్రవేశపెట్టారు?
ఎ) కాల్ధార్ బి) కృష్ణమాచారి
సి) కార్వే డి) వాంచూ
37. సేవల ఎగుమతులు, దిగుమతులను నమోదు చేసే ఖాతాను ఏమంటారు?
ఎ) దృశ్య ఖాతా బి) అదృశ్య ఖాతా
సి) ఎ, బి డి) మూలధన ఖాతా
38. ప్రస్తుతం WTO డైరెక్టర్ జనరల్ ఎవరు?
ఎ) ఒకోండో చినూవా
బి) ఒకోండో ఇంకేబా
సి) ఒకోంబే ఇవేలా
డి) ఒకోండో ఇఫే
39. 1929-30 ఆర్థిక మాద్యానికి గురికాని ఏకైక దేశం?
ఎ) అమెరికా బి) రష్యా
సి) భారతదేశం డి) ఇంగ్లండ్
40. నేషనల్ హౌసింగ్ బోర్డ్ స్థాపన
ఎ) 1980 బి) 1985
సి) 1987 డి) 1988
41. ప్రజాపంపిణీ వ్యవస్థను సూచించిన కమిటీ?
ఎ) దారియా కమిటీ
బి) వాంఛూ కమిటీ
సి) భూర్వాల్ కమిటీ
డి) చక్రవర్తి కమిటీ
42. అజాద్హెస్సెన్ కమిటీ దేనికి సంబంధించినది?
ఎ) మెగా పరిశ్రమలు
బి) పెద్ద పరిశ్రమలు
సి) మధ్యతరగతి పరిశ్రమలు
డి) చిన్న పరిశ్రమలు
43. పదో పంచవర్ష ప్రణాళిక రూపకర్త ఎవరు?
ఎ) కేసీ పంత్
బి) మధు దండేవతే
సి) అహ్లూవాలియా డి) లాక్డావాలా
44. కిందివారిలో సంక్షేమ అర్థశాస్ర్తానికి చెందినవారు?
1) పీగూ పారెటో 2) పారెటో కీన్స్
3) పీగూ, ఆడంస్మిత్ 4) పైవన్నీ
45. అవకాశ వ్యయాలు అనే భావనను సూచించినది?
ఎ) జెమిడ్ బి) జె.ఎస్. మిల్
సి) హబర్లార్ డి) రాబిన్సన్
46. ‘ఎస్’ బ్యాంక్ టాగ్లైన్ ఏది?
ఎ) Experience our expertise
బి) Smart way to bank
సి) Lets get it done
డి) A friend you can bank on
47. వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌కు ఎన్నికైన తొలి భారతీయుడు?
ఎ) సీడీ దేశ్‌ముఖ్ బి) జేఆర్డీ టాటా
సి) రాహుల్ బజాజ్
డి) సుభాశ్ చంద్రబోస్
48. 1952 జాతీయ అటవీ విధానం ప్రకారం ఎంత శాతం అటవీ విస్తీర్ణం ఉండాలి.
ఎ) 22.2 శాతం బి) 33.3 శాతం
సి) 44.4 శాతం డి) 34.5 శాతం
49. వ్యవసాయక గణాంకాలను ఎప్పటి నుంచి విడుదల చేస్తున్నారు?
ఎ) 1960-61 బి) 1970-71
సి) 1980-81 డి) 1990-91
50. అధిక అక్షరాస్యత గల కేంద్ర పాలిత ప్రాంతాలు ఏవి?
ఎ) లక్షదీవులు, డామన్ డయ్యు
బి) డామన్ డయ్యు, పాండిచ్చేరి
సి) లక్షదీవులు, అండమాన్దీవులు
డి) అండమాన్దీవులు, పాండిచ్చేరి
51. ప్రపంచంలో అత్యధిక జనసాంద్రత గల దేశం?
ఎ) చైనా బి) భారతదేశం
సి) బంగ్లాదేశ్ డి) రష్యా
52. కింది వాటిలో ఎక్కువ మంది ఆర్థిక వేత్తలు ఆమోదించిన సిద్ధాంతం?
ఎ) థియరీ ఆఫ్ పాపులేషన్
బి) జనాభా పరిణామ సిద్ధాంతం
సి) బిగ్‌పుష్ సిద్ధాంతం
డి) ఆధునిక ద్రవ్యరాశి సిద్ధాంతం
53. 2021 డిసెంబర్ నాటికి అధిక విదేశీ మారక నిల్వలు కలిగిన దేశాల వరుస క్రమం?
ఎ) రష్యా, చైనా, జపాన్, స్విట్జర్లాండ్
బి) చైనా, జపాన్, స్విట్జర్లాండ్, ఇండియా
సి) అమెరికా, రష్యా, చైనా, ఇండియా
డి) చైఆన, అమెరికా, జపాన్, ఇండియా
54. 2021 మార్చి 31 నాటికి భారత ప్రభుత్వం మొత్తం రుణం ఎన్ని లక్షల కోట్లు?
ఎ) 110.40 బి) 112.80
సి) 117.04 డి) 118.40
55. రాజ్యాంగంలో బడ్జెట్ అనే పదం?
ఎ) లేదు బి) ఉంది
సి) ఆర్టికల్ అని ఉంది
డి) ఏదీకాదు
56. ప్రస్తుత ఆధార సంవత్సరం?
ఎ) 2011-12 బి) 2015-16
సి) 2018-29 డి) 2019-20
57. జీఎస్టీఈ డే ఏ రోజున నిర్వహిస్తారు?
ఎ) జనవరి 1 బి) మార్చి 1
సి) ఏప్రిల్ 1 డి) జూలై 1
58. ఆర్బీఐ ద్రవ్య విధాన కమిటీలో ఎంతమంది ఉంటారు?
ఎ) ఒకచైర్మన్- ఆరుగురు సభ్యులు
బి) ఒకచైర్మన్- ఐదుగురు సభ్యులు
సి) ఒకచైర్మన్- నలుగురు సభ్యులు
డి) ఒకచైర్మన్- ఇద్దరు సభ్యులు
59. జాతీయ విద్యా విధానం -2020 ఎప్పడు ఆమోదించబడింది?
ఎ) 2020 జనవరి 1
బి) 2020 జూన్ 1
సి) 2020 జూలై 29
డి) 2020 జూన్ 1
60. ప్రపంచ ఆకలి సూచి 2020 ప్రకారం మొత్తం 107 దేశాల్లో భారత్ స్థానం ఎంత?
ఎ) 90 బి) 92 సి) 94 డి) 96
61. దశాంశ పద్ధతిని ఏ సంవత్సరంలో ప్రవేశ పెట్టారు?
ఎ) 1950 బి) 1955
సి) 1956 డి) 1957
62. సీఎస్ఓ, ఎన్ఎస్ఎస్ఓ ను కలిపి ఎలా ఏర్పాటు చేశారు?
ఎ) ఎన్ఎస్ఓ బి) ఎస్సీఓ
సి) ఎన్ఈఎస్ డి) సీఈఓ
63. ప్రపంచంలో అధిక అటవీ విస్తీర్ణం గల దేశాలు?
ఎ) బ్రెజిల్, చైనా బి) పెరూ, చైనా
సి) బ్రెజిల్, పెరూ డి) బ్రెజిల్, భారత్
64. నాలుగు రంగాల నమూనాను రూపొందించినది?
ఎ) ఫిల్డ్మెన్ బి) మహలనోబిస్
సి) రాబిన్స్ డి) అశోక్మెహత
సమాధానాలు
1-బి 2-బి 3-ఎ 4-డి
5-ఎ 6-బి 7-డి 8-బి
9-డి 10-బి 11-ఎ 12-సి
13-బి 14-ఎ 15-బి 16-డి
17-డి 18-సి 19-ఎ 20-బి
21-బి 22-బి 23-డి 24-బి
25-ఎ 26-డి 27-బి 28-సి
29-ఎ 30-బి 31-బి 32-ఎ
33-ఎ 34-ఎ 35-బి 36-ఎ
37-బి 38-సి 39-బి 40-డి
41-ఎ 42-డి 43-ఎ 44-ఎ
45-సి 46-ఎ 47-సి 48-బి
49-బి 50-ఎ 51-సి 52-బి
53-బి 54-సి 55-ఎ 56-ఎ
57-డి 58-ఎ 59-సి 60-సి
61-డి 62-ఎ 63-సి 64-బి
-పానుగంటి కేశవ రెడ్డి రచయిత
వైష్ణవి పబ్లికేషన్స్ గోదావరిఖని
9949562008
- Tags
- nipuna news
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?