విదేశీ రాయబారిగా పనిచేసి రాష్ట్రపతి అయినవారు?
పాలిటీ
జనవరి 3 తరువాయి
22. ఉపరాష్ట్రపతి పదవికి సంబంధించి కింది వాటిలో సరికానిది ఏది?
1) 35 ఏళ్లు నిండి ఉండాలి
2) పార్లమెంటుకు ఎన్నిక కావొద్దు
3) రాజ్యసభకు ఎన్నిక కావడానికి అర్హతలు ఉండాలి
4) భారతీయ పౌరుడై ఉండాలి
23. కింది వారిలో ఉప రాష్ట్రపతి కాకుండా నేరుగా రాష్ట్రపతి అయినవారు ఎవరు?
1) రాజేంద్రప్రసాద్ 2) అబ్దుల్ కలాం
3) నీలం సంజీవరెడ్డి
4) పైవారందరూ
24. మంత్రిమండలి గురించి రాజ్యాంగంలోని ఏ అధికరణలు తెలియజేస్తాయి?
1) 74, 75 2) 76, 77
3) 80, 81 4) 90, 91
25. రాష్ట్రపతి వీటో చేయడానికి అవకాశం లేని బిల్లులు?
1) ద్రవ్య బిల్లులు
2) రాజ్యాంగ సవరణ బిల్లులు
3) రాష్ర్టాల పునర్ వ్యవస్థీకరణ బిల్లులు
4) పైవన్నీ
26. భారతదేశంలో రాష్ట్రపతికి ఉన్న ఆర్డినెన్స్ జారీ చేసే అధికార మూలాలు ఏ చట్టంలో ఉండేవి?
1) కౌన్సిళ్ల చట్టం – 1861
2) భారత ప్రభుత్వ చట్టం – 1935
3) భారత ప్రభుత్వ చట్టం – 1919
4) రెగ్యులేటింగ్ చట్టం – 1773
27. రాజ్యసభ సమావేశాలకు ఎవరు అధ్యక్షత వహిస్తారు?
1) స్పీకర్ 2) డిప్యూటీ స్పీకర్
3) ఉపరాష్ట్రపతి 4) రాష్ట్రపతి
28. ప్రతిపాదన (ఎ): భారత రాష్ట్రపతి రాజ్యాంగాధినేత హేతువు (ఆర్): ప్రధానమంత్రి నాయకత్వం వహించే మంత్రి మండలికి అన్ని అధికారాలు ఉన్నాయి
1) (ఎ), (ఆర్) లు రెండూ సరైనవే. (ఆర్), (ఎ) కు సరైన వివరణ
2) (ఎ), (ఆర్)లు రెండూ సరైనవే. (ఆర్), (ఎ) కు సరైన వివరణ కాదు
3) (ఎ) సరైంది కానీ (ఆర్) సరైంది కాదు
4) (ఎ) సరైంది కాదు కానీ (ఆర్) సరైంది
29. వీపీ సింగ్ తరువాత దేశ ప్రధానమంత్రి పదవిని చేపట్టినవారు?
1) చంద్రశేఖర్ 2) చరణ్‌సింగ్
3) రాజీవ్‌గాంధీ 4) దేవెగౌడ
30. జత పరచండి.
1. రాష్ట్రపతి ఎ) లోక్‌సభ అధ్యక్షుడు
2. స్పీకర్ బి) న్యాయ సమీక్ష చేస్తాడు
3. సుప్రీంకోర్టు సి) ఆర్డినెన్సులు జారీ చేస్తాడు
4. ఉపరాష్ట్రపతి డి) మంత్రిమండలికి నాయకుడు
5. ప్రధాని ఇ) రాజ్యసభ అధ్యక్షుడు
1) 1-డి, 2-ఇ, 3-సి, 4-ఎ, 5-బి
2) 1-ఇ, 2-సి, 3-ఎ, 4-బి, 5-డి
3) 1-సి, 2-ఎ, 3-బి, 4-డి, 5-ఇ
4) 1-సి, 2-ఎ, 3-బి, 4-ఇ, 5-డి
31. భారత ఉపరాష్ట్రపతిని ఎన్నుకొనే సభ్యులు?
1) లోక్‌సభ సభ్యులు
2) రాజ్యసభ సభ్యులు
3) రాష్ట్ర విధాన సభ సభ్యులు
4) లోక్‌సభ-రాజ్యసభ సభ్యులు ఉమ్మడిగా
32. రాష్ట్రపతి లోక్‌సభకు నియమించే ఆంగ్లో-ఇండియన్ సభ్యులకు సంబంధించి కింది వాటిలో సరైంది.
ఎ) రాష్ట్రపతి ఎన్నికల్లో పాల్గొంటారు
బి) ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో పాల్గొంటారు
సి) రాష్ట్రపతిని తొలగించడంలో పాల్గొంటారు
డి) ఉప రాష్ట్రపతి తొలగింపులో పాల్గొంటారు
1) బి, సి 2) బి, సి, డి
3) ఎ, సి, డి 4) బి, డి
33. రాష్ట్రపతికి ఏ రాజ్యాంగ ప్రకరణం ప్రకారం క్షమాభిక్ష అధికారాలు సంక్రమించాయి?
1) ఆర్టికల్ 72 2) ఆర్టికల్ 73
3) ఆర్టికల్ 74 4) ఆర్టికల్ 75
34. ప్రధానమంత్రి, ఉప ప్రధానమంత్రిగా రెండు పదవులూ చేపట్టిన వారెవరు?
1) మొరార్జీదేశాయ్, వీపీ సింగ్
2) చరణ్‌సింగ్, చంద్రశేఖర్
3) మొరార్జీదేశాయ్, ఐకే గుజ్రాల్
4) చరణ్‌సింగ్, మొరార్జీదేశాయ్
35. కింది వాటిలో సరైనవి ఏవి?
ఎ) లోక్‌సభను సమావేశపరిచేది-రాష్ట్రపతి
బి) లోక్‌సభ కాలపరిమితిని పొడిగించేది-
పార్లమెంట్
సి) లోక్‌సభ సమావేశాన్ని తాత్కాలికంగా వాయిదా వేసేది -స్పీకర్
డి) లోక్‌సభ సీట్లు పెంచేది – కేంద్ర
ప్రభుత్వం
1) ఎ, బి, డి 2) బి, సి, డి
3) ఎ, సి, డి 4) ఎ, బి, సి
36. జతపరచండి.
1. రాష్ట్రపతి ఆర్థిక అత్యవసర పరిస్థితిని ప్రకటిస్తారు ఎ) ఆర్టికల్ 53
2. రాష్ట్రపతి దేశ రక్షణ కోసం అంతరంగిక అత్యవసర పరిస్థితిని ప్రకటిస్తారు
బి) ఆర్టికల్ 74
3. రాష్ర్టాలలో రాష్ట్రపతి పాలన విధిస్తారు సి) ఆర్టికల్ 360
4. కార్యనిర్వహణాధికారాలన్నీ రాష్ట్రపతి పేరు మీద చలాయిస్తారు
డి) ఆర్టికల్ 356
5. రాష్ట్రపతికి సలహా సహాయాలకు ప్రధాని నాయకత్వంలో మంత్రిమండలి ఉంటుంది
ఇ) ఆర్టికల్ 352
1) 1-సి, 2-ఇ, 3-డి, 4-ఎ, 5-బి
2) 1-ఇ, 2-సి, 3-ఎ, 4-డి, 5-బి
3) 1-సి, 2-ఇ, 3-ఎ, 4-బి, 5-డి
4) 1-బి, 2-ఎ, 3-సి, 4-ఇ, 5-డి
37. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి లభ్యం కానప్పుడు రాష్ట్రపతిగా ఎవరు వ్యవహరిస్తారు?
1) భారత ప్రధాన న్యాయమూర్తి
2) ప్రధాన ఎన్నికల అధికారి
3) ప్రధానమంత్రి
4) అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా
38. కింది వాటిలో సరైంది ఏది?
1) సాధారణ బిల్లు విషయంలో లోక్‌సభకు ఎక్కువ అధికారాలు ఉన్నాయి
2) నూతన రాష్ర్టాల ఏర్పాటులో రెండు సభలకు సమాన అధికారాలున్నాయి
3) ఆర్థిక అత్యవసర పరిస్థితి విధించినప్పుడు ద్రవ్య బిల్లును రాజ్యసభ తిరస్కరించవచ్చు
4) రాష్ట్రపతిని తొలగించే తీర్మానాన్ని ముం దుగా రాజ్యసభలో మాత్రమే ప్రవేశపెట్టాలి
39. జతపరుచుము.
1. 18 సం.ల వయస్సు ఎ) గవర్నర్
2. 25 సం.ల వయస్సు బి) రాష్ట్రపతి
3. 30 సం.ల వయస్సు సి) వయోజన ఓటు హక్కు
4. 35 సం.ల వయస్సు డి) లోక్‌సభ సభ్యుడి అర్హత
5. 35 సం.ల వయస్సు ఇ) రాజ్యసభ సభ్యుడి అర్హత
1) 1-సి, 2-డి, 3-ఇ, 4-ఎ, 5-బి
2) 1-డి, 2-సి, 3-ఎ, 4-ఇ, 5-బి
3) 1-సి, 2-ఇ, 3-డి, 4-బి, 5-ఎ
4) 1-ఇ, 2-డి, 3-ఎ, 4-సి, 5-బి
40. కేంద్ర మంత్రిమండలిలో ఎన్ని రకాల మంత్రులు ఉంటారు?
1) 4 2) 3 3) 2 4) 1
41. రాష్ట్రపతిని ఎన్నుకునే ఎలక్ట్రోరల్ కాలేజీలో ఎవరు సభ్యులుగా ఉంటారు?
1) అసెంబ్లీ సభ్యులు
2) ఎన్నికైన పార్లమెంట్ సభ్యులు, ఎన్నికైన విధానసభ సభ్యులు
3) పార్లమెంట్ సభ్యులు మాత్రమే
4) ఎప్పటికప్పుడు ఎన్నికల సంఘం నిర్ణయిస్తుంది
42. అతి తక్కువ కాలం రాష్ట్రపతిగా పని చేసింది ఎవరు?
1) జాకీర్‌హుస్సేన్
2) ఫకృద్దీన్ అలీ అహ్మద్
3) వీవీ గిరి 4) నీలం సంజీవరెడ్డి
43. విదేశీ రాయబారిగా పనిచేసి రాష్ట్రపతి అయిన వ్యక్తి ఎవరు?
1) జాకీర్ హుస్సేన్
2) కేఆర్ నారాయణన్
3) ఫకృద్దీన్ అలీ అహ్మద్
4) నీలం సంజీవరెడ్డి
44. కింది వాటిలో సరైన వాక్యం ఏది?
1) అధికరణ-108 ప్రకారం రాష్ట్రపతి పార్లమెంట్ ఉమ్మడి సమావేశాన్ని ఏర్పాటు చేస్తారు
2) అధికరణ-72 ప్రకారం నేరస్థులకు క్షమాభిక్ష పెట్టవచ్చు. శిక్ష తగ్గించవచ్చు
3) అధికరణ-143 ప్రకారం రాష్ట్రపతి
సుప్రీంకోర్టు సలహాను కోరవచ్చు
4) పైవన్నీ
45. కిందివారిలో ఎవరికి సభలో సభ్యత్వం లేకపోయినా నిర్ణాయక ఓటు హక్కు ఉంటుంది?
1) లోక్‌సభ స్పీకర్ 2) రాజ్యసభ చైర్మన్
3) విధాన పరిషత్ అధ్యక్షులు
4) రాజ్యసభ డిప్యూటీ చైర్మన్
46. ఉప రాష్ట్రపతి పదవి ఖాళీ ఏర్పడినప్పుడు తాత్కాలిక ఉప రాష్ట్రపతిగా ఎవరు కొనసాగుతారు?
1) రాజ్యసభ ఉపాధ్యక్షుడు
2) లోక్‌సభ స్పీకర్
3) ప్యానెల్ స్పీకర్
4) పైవారెవరూ కాదు
47. తక్కువ కాలం ప్రధానిగా పని చేసినవారు ఎవరు?
1) అటల్ బిహారి వాజ్‌పేయి
2) చంద్రశేఖర్
3) వీపీ సింగ్ 4) దేవెగౌడ
48. కిందివాటిలో సరికానిది ఏది?
1) జాతీయ ప్రభుత్వాన్ని నడిపిన ప్రధాని జవహర్లాల్ నెహ్రూ
2) మైనార్టీ ప్రభుత్వాన్ని నడిపిన ప్రధాని పీవీ నరసింహారావు
3) సంకీర్ణ ప్రభుత్వాన్ని ఎక్కువ కాలం నడిపిన ప్రధాని వాజ్‌పేయి
4) సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన మొదటి ప్రధాని మొరార్జీదేశాయ్
49. ఎవరి జన్మదినాన్ని సుపరిపాలన దినోత్సవంగా ప్రకటించారు?
1) జవహర్లాల్ నెహ్రూ
2) గుల్జారీలాల్ నందా
3) లాల్ బహదూర్‌శాస్త్రి
4) అటల్ బిహారి వాజ్‌పేయి
50. 1947లో నెహ్రూ ఏర్పాటు చేసిన మంత్రివర్గంలో విదేశాంగ శాఖను నిర్వహించిన మంత్రి ఎవరు?
1) సర్దార్ వల్లభాయ్ పటేల్
2) జగ్జీవన్‌రామ్
3) ఎస్పీ ముఖర్జీ 4) నెహ్రూ
భారత పార్లమెంటు
1. స్టేట్మెంట్లను పరిశీలించండి
‘పార్లమెంటు సమావేశంలో ఉన్నప్పుడు నల్లగొండలోని శాలిగౌరారం పోలీస్ స్టేషన్‌పై నక్సలైట్లు దాడి చేయగా పోలీసులతో పాటు, పౌరులు కూడా మరణించారు.
కింది వాటిలో ఏ విధానం ద్వారా పై అంశాన్ని లోకసభలో లేవనెత్తడానికి అవకాశం ఉంటుంది?
1) 377 రూల్ ప్రకారం చర్చ
2) సావదాన తీర్మానం
3) తక్షణ తీర్మానం
4) సంక్షిప్త సమయ చర్చ
2. కింది ఏ విషయంలో రాజేంద్రప్రసాద్ నెహ్రూ మీద హిందూ కోడ్ బిల్లుపై విభేదించారు?
1. రాజ్యాంగ నిర్మాణానికి, పాలనకు పార్లమెంటు నిర్మాణం జరిగింది. ఇది సాధారణ ఎన్నికలు జరిగేంత వరకు ప్రభుత్వాన్ని నడుపుతుంది కాబట్టి ఈ పార్లమెంటు ఎలాంటి బిల్లు చేయరాదు
2. పార్లమెంటు బిల్లుపై ఎన్నికలు జరిగేంత వరకు ప్రభుత్వాన్ని నడుపుతుంది
3. పార్లమెంటు బిల్లుపై చట్టం చేయడానికి న్యాయపర హక్కు కలిగి లేదు
4. ఈ బిల్లు హిందువుల జీవితాల్లో విప్లవాత్మకమైన మార్పులు తేవడంతో పాటు వివాదాలు సృష్టిస్తుంది.
పై వాటిలో సరైనది ఏది?
1) 1, 2 2) 2
3) 2, 4 4) 1, 3, 4
3. లోక్‌సభ స్పీకర్‌కు ‘కాస్టింగ్ ఓటు’ కల్పించిన రాజ్యాంగ అధికరణం?
1) 100వ అధికరణం
2) 101వ అధికరణం
3) 102వ అధికరణం
4) 103వ అధికరణం
4. శాసన ప్రక్రియకు సంబంధించిన దశలను సరైన వరుస క్రమంలో అమర్చండి.
1. నక్షత్ర గుర్తు గల ప్రశ్నలకు మంత్రులు రాత పూర్వకంగా సమాధానమిస్తారు
2. నక్షత్ర గుర్తు లేని ప్రశ్నలకు మంత్రులు మౌఖికంగా సమాధానమిస్తారు
3. అనుబంధ ప్రశ్నలకు అవకాశం నక్షత్ర గుర్తు ప్రశ్నలకు మాత్రమే ఉంటుంది
1) 1, 3 2) 1, 2, 3
3) 2, 3 4) పైవేవీ కావు
5. రహస్య బ్యాలెట్ పద్ధతి కింది ఏ ఎన్నికల్లో అనుసరించబడదు.
1) లోక్‌సభ సభ్యులు
2) రాష్ట్ర విధానసభ సభ్యులు
3) రాజ్యసభ సభ్యులు
4) పంచాయతీ సర్పంచి
6. ఆర్థిక బిల్లులకు సంబంధించి సరికానిది ఏది?
1) ఆర్థిక బిల్లులు ఏ సభలోనైనా ప్రవేశ పెట్టవచ్చు
2) రాజ్యసభ 14 రోజులకు మించి ఉంచరాదు
3) సంయుక్త సమావేశం ఏర్పాటు చేయరాదు
4) రాష్ట్రపతి ఆమోదం తప్పనిసరి
7. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి కింది స్టేట్మెంట్లలో సరైనవి ఏవి?
1. రాజ్యాంగం ప్రకారం కేబినెట్ మంత్రులందరూ కచ్చితంగా లోక్‌సభ సభ్యులై ఉండాలి
2. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సూచనల ప్రకారం యూనియన్ కేబినెట్ సెక్రెటేరియట్ పని చేస్తుంది
1) 1, 2 2) 2
3) 1, 2 4) ఏదికాదు
8. భారత పార్లమెంటులో, రాష్ట్ర శాసనసభల్లో మహిళలకు ప్రత్యేక కోటా కావాలనే డిమాండ్ విధానం ఏ దేశంలో విజయవంతం కావడంతో పెరిగింది?
1) యూకే, కెనడా
2) స్కాండినేవియన్ దేశాలు
3) అమెరికా
4) ఆస్ట్రేలియా, న్యూజిలాండ్
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు