మూత్రపిండంలోని ఏ భాగంలో గుచ్ఛగాలనం జరుగుతుంది?
-
విసర్జక వ్యవస్థ
1. రొయ్య విసర్జక అవయవాలు?
ఎ) మాల్ఫీజియన్ నాళికలు
బి) కోక్సల్ గ్రంథులు
సి) హరిత గ్రంథులు
డి) మూత్రపిండాలు
2. కీటకాలు ఏ సమూహానికి చెందుతాయి?
ఎ) అమోనోటెలిక్ జంతువులు
బి) యూరియోటెలిక్ జంతువులు
సి) అనెలిడా వర్గ జంతువులు
డి) యూరికోటెలిక్ జంతువులు
3. మూత్రపిండాల విధి?
ఎ) దేహం నుంచి విష పదార్థాలను తొలగించడం
బి) రక్తానికి కొత్త పదార్థాలను మిశ్రితం చేయడం
సి) రక్త ప్రసరణ సులభతరం చేయడం
డి) శ్వాసక్రియలో తోడ్పడటం
4. డయాలసిస్‌ను ఏ జబ్బుల చికిత్సలో వినియోగిస్తారు?
ఎ) ఊపిరితిత్తులు బి) గుండె
సి) కాలేయం డి) మూత్రపిండాలు
5. మూత్రపిండాలు సక్రమంగా పనిచేయాలంటే?
ఎ) నత్రజని మలినాలు అధికంగా ఉండాలి
బి) రక్తంలో లవణాలు అధికంగా ఉండాలి
సి) రక్తపోటు సాధారణ స్థాయిలో ఉండాలి
డి) హృద్రోగాలు లేకుండా ఉండాలి
6. మానవ దేహంలో ద్రవాలు, వాటిలోని అయానుల గాఢతలను అదుపులో ఉంచేది?
ఎ) ప్లీహం బి) మెదడు
సి) ఊపిరితిత్తులు డి) మూత్రపిండం
7. దేహంలో యూరియా సంశ్లేషించే భాగం?
ఎ) మూత్రపిండం బి) గుండె
సి) కాలేయం డి) క్లోమం
8. మానవ దేహంలో అర్నిథిన్ వలయం జరిగే భాగం?
ఎ) కాలేయం బి) ప్లీహం
సి) మెదడు డి) మూత్రపిండం
9. మానవుడు మూత్రం ద్వారా విసర్జించే విటమిన్?
ఎ) ఎ బి) బి
సి) డి డి) ఇ
10. మూత్రపిండాలే కాక మానవునిలో విసర్జనకు తోడ్పడే నిర్మాణాలు?
ఎ) స్రావ గ్రంథులు బి) స్వేద గ్రంథులు
సి) అవటు గ్రంథి
డి) అధివృక్క గ్రంథులు
11. పక్షులు విసర్జించే ముఖ్యపదార్థం?
ఎ) అమ్మోనియా బి) యూరియా
సి) యూరిక్ ఆమ్లం డి) క్రియాటిన్
12. బద్దెపురుగు విసర్జకావయవాలు?
ఎ) వృక్కాలు బి) హరిత గ్రంథులు
సి) జ్వాలా కణాలు డి) మూత్రపిండాలు
13. కప్ప ఏ కోవకు చెందుతుంది?
ఎ) అమోనోటెలిక్ బి) యూరియోటెలిక్
సి) యూరికోటెలిక్ డి) స్థిరోష్ణ జీవి
14. కింది రక్తనాళాలలో దేనిలో మలిన రక్తం ఉంటుంది?
ఎ) వృక్క ధమని బి) పుపుస ధమని
సి) హార్థ్దిక సిర డి) వృక్కసిర
15. మూత్రపిండంలోని ఏ భాగంలో గుచ్ఛగాలనం జరుగుతుంది?
ఎ) వృక్క నాళిక బి) హెన్లీ శిక్యం
సి) వృక్క ద్రోణి
డి) మాల్ఫీజియన్ దేహం
16. జతపరచండి.
ఎ. కీటకాలు 1. పక్షులు
బి. మంచినీటి చేపలు 2. మాల్ఫీజియన్ నాళికలు
సి. వానపాము 3. అమోనోటెలిక్
డి. యూరికోటెలిక్ 4. వృక్కాలు 5. హరితగ్రంథులు
ఎ) ఎ-2, బి-3, సి-5, డి-1
బి) ఎ-2, బి-3, సి-1, డి-4
సి) ఎ-1, బి-4, సి-3, డి-2
డి) ఎ-2, బి-3, సి-4, డి-1
17. కింది అంశాలు అధ్యయనం చేసి సరికానివి గుర్తించండి.
ఎ. మానవుడిలో మూత్రపిండాలు యూరియాను సంశ్లేషించి, విసర్జిస్తాయి
బి. కీటకాలు వృక్కాల ద్వారా విసర్జిస్తాయి
సి. వానపాము, జలగలో మాల్ఫీజియన్ నాళికలు ముఖ్య విసర్జకావయవాలు
డి. బల్లపరుపు పురుగులు జ్వాలాకణాలతో విసర్జిస్తాయి
ఎ) ఎ, బి, సి బి) బి, సి, డి
సి) డి, సి, ఎ డి) ఎ, డి
18. పీయూష గ్రంథి నుంచి వాసోప్రెసిన్ స్రావం తగ్గితే కలిగే వ్యాధి?
ఎ) మధుమేహం
బి) డయాబెటిస్ మెల్లిటస్
సి) డయాబెటిన్ ఇన్సిపిడస్
డి) రక్తపోటు
19. మంచినీటి చేపలు విసర్జించేది?
ఎ) అమ్మోనియా
బి) యూరియా
సి) యూరిక్ ఆమ్లం
డి) క్రియాటిన్
20. జలగ విసర్జకావయవాలు?
ఎ) వృక్కాలు
బి) మాల్ఫీజియన్ నాళికలు
సి) మొప్పలు
డి) మూత్రపిండాలు
నాడీ వ్యవస్థ
1. జ్ఞాపక శక్తి, నియంత్రిత కదలికలను నియంత్రించే మానవ మెదడు భాగం?
ఎ) మస్తిష్కం బి) అనుమస్తిష్కం
సి) మజ్జాముఖం డి) పాన్స్వెరోలీ
2. శ్వాసక్రియ, హృదయస్పందన మొదలైన అనియంత్రిత క్రియలను నియంత్రించే మెదడు భాగం?
ఎ) మస్తిష్కం బి) మజ్జాముఖం
సి) అనుమస్తిష్కం డి) ఘ్రాణలంబికలు
3. కండరాల సంకోచాలను సమన్వయపరచి సమతాస్థితిని సాధించే మెదడు భాగం?
ఎ) అనుమస్తిష్కం బి) మస్తిష్కం
సి) మజ్జాముఖం డి) క్రూరాసెరిబ్రై
4. మెదడు ఏ రూపంలో సంకేతాలు స్వీకరించి తిరిగి పంపుతూ ఉంటుంది?
ఎ) విద్యుత్ బి) యాంత్రిక
సి) రసాయనిక డి) అయస్కాంత
5. నాడీవ్యవస్థకు అవసరమైన మూలకం?
ఎ) భాస్వరం బి) ఇనుము
సి) సోడియం డి) మెగ్నీషియం
6. మానవ మెదడు పరిమాణం సుమారు?
ఎ) 2000 గ్రా. బి) 1350 గ్రా.
సి) 1800 గ్రా. డి) 2500 గ్రా.
7. మానవ దేహంలో అతిపొడవైన కణం?
ఎ) అండం బి) శుక్రకణం
సి) నాడీకణం డి) తెల్ల రక్తకణం
8. నాడీప్రచోదనాలను ప్రసారం చేయడంలో పాత్రవహించే ముఖ్యమైన అయానులు?
ఎ) Ca, PO4 బి) N, PO4
సి) Ca, Na డి) Na, K
9. సహానుభూత నాడీ తంతువుల అంత్యభాగాలు స్రవించేది?
ఎ) సింపతిన్ బి) కోలిన్ ఎస్టరేజ్
సి) కార్టిసోన్ డి) ఎడ్రినలిన్
10. మానవ దేహంలో ఉష్ణోగ్రతను నియంత్రించే భాగం?
ఎ) పీనియల్ దేహం బి) హైపోథలామస్
సి) అవటు గ్రంథి డి) పీయూష గ్రంథి
11. మెదడులోని మెమరీ హౌస్?
ఎ) మజ్జాముఖం బి) మస్తిష్కం
సి) అనుమస్తిష్కం డి) పాన్స్వెరోలీ
12. రాన్వియర్ కణుపులు, నిస్సల్ రేణువులు ఏ కణాల ప్రత్యేకత?
ఎ) కాలేయ కణాలు బి) కండర కణాలు
సి) మూత్రపిండ కణాలు
డి) నాడీ కణాలు
13. మెనింజైటిస్ అనేది దేనికి సంబంధించిన వ్యాధి?
ఎ) కాలేయం బి) క్లోమం
సి) ఊపిరితిత్తులు డి) మెదడు
14. జతపరచండి.
ఎ. ఘ్రాణ లంబికలు 1. సమతాస్థితి
బి. ద్వారగోర్థం 2. హృదయ స్పందన
సి. అనుమస్తిష్కం 3. దృష్టి
డి. మజ్జాముఖం 4. ద్రవాభిసరణ
క్రమత
5. వాసన
ఎ) ఎ-5, బి-4, సి-1, బి-2
బి) ఎ-5, బి-1, సి-4, బి-2
సి) ఎ-5, బి-4, సి-2, బి-1
డి) ఎ-1, బి-2, సి-3, బి-4
15. అసంకల్పిత ప్రతీకార చర్యలను నియంత్రించేది?
ఎ) దృష్టి లంబికలు
బి) ఘ్రాణ లంబికలు
సి) అనుమస్తిష్కం
డి) వెన్నుపాము
16. మానవుడిలోని కపాలనాడుల సంఖ్య?
ఎ) 10 జతలు బి) 8 జతలు
సి) 16 జతలు డి) 12 జతలు
17. మానవుడిలోని కశేరునాడుల సంఖ్య?
ఎ) 12 జతలు బి) 31 జతలు
సి) 35 జతలు డి) 10 జతలు
18. మానవుడి కేశేరునాడుల స్వభావం?
ఎ) జ్ఞాన బి) చాలక
సి) మిశ్రమ డి) ఏదీకాదు
19. మానవ కపాలనాడుల్లో జ్ఞాననాడులు?
ఎ) I, II, VIII బి) V, VII, IX
సి) III, IV, VI డి) I, III, V
20. అంత్యతంతువు అంటే?
ఎ) మెదడు చివరిభాగం
బి) మెదడు కాండం
సి) వెన్నుపాము చివరిభాగం
డి) వెన్నెముక చివరి భాగం
21. కశేరునాడులు, కపాలనాడులను కలిపి ఏ వ్యవస్థగా పేర్కొంటారు?
ఎ) కేంద్ర నాడీవ్యవస్థ
బి) పరధీయ నాడీవ్యవస్థ
సి) సహానుభూత నాడీవ్యవస్థ
డి) సహసహానుభూత నాడీవ్యవస్థ
జ్ఞానాంగాలు
1. కన్నీటిలో ఉండే ఎంజైమ్?
ఎ) టయలిన్
బి) సెబం
సి) లైసోజైమ్ డి) పెప్సిన్
2. తక్కువ కాంతిలో చూడటానికి తోడ్పడేవి?
ఎ) రెటినా బి) కోరాయిడ్
సి) దండాలు డి) శంకువులు
3. వర్ణదృశ్యాలను చూడటానికి తోడ్పడేవి?
ఎ) దండాలు బి) రెటినా
సి) శంకువులు డి) కంటిపాప
4. మధ్య చెవిలోని ఎముకలు?
ఎ) మాలిస్ బి) ఇంకస్
సి) స్టేపిస్ డి) పైవన్నీ
5. దేహాన్ని సమతాస్థితిలో ఉంచేది?
ఎ) కన్ను బి) చెవి
సి) ముక్కు డి) నాలుక
6. దేహ ఉష్ణోగ్రతను నియంత్రించేది?
ఎ) గుండె బి) చర్మస్రావ గ్రంథులు
సి) హార్డీనియన్ గ్రంథులు
డి) స్వేద గ్రంథులు
7. మయోపియా వ్యక్తి చూడలేనివి?
ఎ) దూరపు వస్తువులు
బి) సమీప వస్తువులు
సి) రంగులు
డి) ప్రకాశవంతమైన కాంతి
8. అయోడాప్సిన్ ఏ నిర్మాణాల్లో ఉంటుంది?
ఎ) దండాలు బి) శంకువులు
సి) స్లీరా డి) కంటి కటకం
9. మానవుడి కంటిలోనిది..?
ఎ) పుటాకార కటకం
బి) కుంభాకార కటకం
సి) ద్విపుటాకార కటకం
డి) బల్లపరుపు కటకం
10. శుక్లం వచ్చినప్పుడు కంటిలో దెబ్బతినేది?
ఎ) కటకం బి) తారక
సి) రెటినా డి) ఐరిస్
11. చెవిలో ఉండే ఎముకల సంఖ్య?
ఎ) 2 బి) 1 సి) 4 డి) 3
12. జతపరచండి.
ఎ. దండాలు 1. రంగులను గుర్తించడం
బి. శంకువులు 2. చర్మం
సి. కర్ణభేరి 3. మసక వెలుతురు
డి. మెలనిన్ 4. వినికిడి
ఎ) ఎ-3, బి-1, సి-2, డి-4
బి) ఎ-4, బి-3, సి-2, డి-1
సి) ఎ-1, బి-2, సి-3, డి-4
డి) ఎ-3, బి-1, సి-4, డి-2
13. కింది వాటిలో సరైనవి గుర్తించండి.
ఎ. లోపలిచెవి దేహాన్ని సమతాస్థితిలో ఉంచుతుంది
బి. స్వేదగ్రంథులు దేహ ఉష్ణోగ్రత నియంత్రణలో తోడ్పడతాయి
సి. నాలుకపై రుచి గుళికలు ఉంటాయి
డి. చర్మస్రావ గ్రంథులు విసర్జనలో తోడ్పడతాయి
ఎ) ఎ, బి, సి బి) బి, సి, డి
సి) సి, డి, ఎ డి) ఎ, బి, డి
14. కళ్లు ఆరోగ్యంగా ఉండటానికి అవసరమైన విటమిన్?
ఎ) విటమిన్-ఎ బి) విటమిన్-బి
సి) విటమిన్-సి డి) విటమిన్-డి
15. పిన్నా అంటే?
ఎ) కంటి రెప్ప బి) నాలుకపై రుచిగుళిక
సి) చెవిడొప్ప డి) ముక్కుదూలం
- Tags
- Anatomy
- Biology
- human body
- nipuna
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు