బిందుసారుడిని సింహసేనుడు అని పేర్కొన్న జైన గ్రంథం?
భారతదేశ చరిత్ర
1. పురాణాల్లో ‘దర్శకుడు’గా పేరొందిన మగధ సామ్రాజ్య చక్రవర్తి?
1) నాగదాసకుడు 2) కాలాశోకుడు
3) ఉదయనుడు 4) అనిరుద్దుడు
2. జాబితా-1లో ఇచ్చిన జనపదాలను జాబితా-2లో వాటిని పరిపాలించిన రాజులతో జతపరచండి.
జాబితా-1 జాబితా-2
ఎ. మగధ 1. చేతకుడు
బి. గాంధార 2. పుష్కరశరి
సి. వైశాలి 3. చూళని బ్రహ్మదత్తుడు
డి. పాంచాల 4. అనిరుద్దుడు
సరైన సమాధానాలను గుర్తించండి.
1) ఎ-1, బి-2, సి-3, డి-4
2) ఎ-4, బి-2, సి-3, డి-1
3) ఎ-4, బి-2, సి-1, డి-3
4) ఎ-3, బి-4, సి-2, డి-1
3. షోడశ మహాజనపదాల్లో మగధరాజ్యం గొప్ప సామ్రాజ్యంగా అవతరించడానికి గల కారణాలకు సంబంధించి సరికానిది గుర్తించండి.
1) మగధ రాజ్యం సారవంతమైన, సస్యశ్యామలమైన గంగా మైదాన ప్రాంతంలో ఉండటం
2) మగధ రాజ్యంలో లభించే ఇనుప ఖనిజ వనరుల వల్ల ఆయుధాలను సమీకరించుకోవడం సులభమవడం
3) మగధ రాజ్యం అధిక సంఖ్యలో గజ బలాన్ని సమకూర్చుకోవడం వల్ల సైనికరంగంలో మిగిలిన రాజ్యాల కంటే పటిష్ఠ స్థితిలో ఉండటం
4) వాయవ్య భారతదేశానికి దగ్గరగా ఉండి నిరంతరం విదేశీదాడులను ఎదుర్కోవడం
4. మగధ సామ్రాజ్యాన్ని పరిపాలించిన రాజ వంశాల వరుస క్రమాన్ని గుర్తించండి.
1) హర్యంక-నంద-శిశునాగ-మౌర్య-శుంగ వంశాలు
2) హర్యంక-శిశునాగ-మౌర్య-శుంగ-నంద వంశాలు
3) హర్యంక-శిశునాగ-నంద-మౌర్య-శుంగ వంశాలు
4) హర్యంక-మౌర్య-శిశునాగ-నంద-శుంగ వంశాలు
5. ప్రతిపాదన (ఎ): క్రీ.పూ. 6వ శతాబ్దం నాటి లేదా మహా జనపదాల కాలం నాటి సామాజిక వ్యవస్థలో స్త్రీలను బానిసలుగా విక్రయించే దురాచారం ఉండేది కారణం (ఆర్): మహా జనపదాల కాలం నాటి సమాజంలో వేద, వేదాంగ శాస్ర్తాల్లో నిష్ణాతులై, పాండిత్యం సంపాదించిన విదుషీమణులను ‘బ్రహ్మ వాదినులు’గా పిలిచేవారు
సరైన సమానాధానం గుర్తించండి.
1) ఎ, ఆర్ లు సరైనవి
2) ఎ సరైనది ఆర్ తప్పు
3) ఎ, ఆర్ లు సరైనవి ఎ కు ఆర్ సరైన వివరణ
4) ఎ, ఆర్ లు సరైనవి ఆర్ ఎ కు సరైన వివరణ కాదు
6. పురాణాల్లో ‘కాకవర్ణుడు’గా పేర్కొన్న మగధ సామ్రాజ్య చక్రవర్తి?
1) కాలాశోకుడు 2) శిశునాగుడు
3) నాగదాసకుడు 4) అశోకుడు
7. మౌర్య చంద్రగుప్తుడికి సంబంధించి కింది ప్రవచనాల్లో సరికానిది?
1) గ్రీకు గ్రంథాల్లో సాండ్ర కోటస్ గా పేర్కొన్నారు
2) వాయవ్య భారతదేశానికి గ్రీకుల పాలన నుంచి విముక్తిని కల్పించడం
3) ముద్రారాక్షసం నాటకంలో ఇతడిని వృషలుడు, కుల హీనుడు అని సంబోధించారు
4) మయూర పోషణమే జీవనంగా గల ఒక గ్రామ పెద్ద కూతురుకు ఇతడు జన్మించాడని విష్ణుపురాణం చెబుతుంది
8. గ్రీకు రచనల్లో ‘అగ్రమెస్’గా పేర్కొన్న మగధ సామ్రాజ్య చక్రవర్తి?
1) మహాపద్మ నందుడు
2) కాలాశోకుడు
3) ధన నందుడు 4) నాగదాసకుడు
9. అజాతశత్రువుకు సంబంధించి కింది ప్రవచనాల్లో సరైనది?
ఎ. లిచ్ఛవీగణ రాజ్య కూటమి లేదా వజ్జి గణరాజ్య కూటమితో సుదీర్ఘ కాలం యుద్ధం చేసి విజయం సాధించడం
బి. రాజగృహంలో మొదటి బౌద్ధ సంగీతిని నిర్వహించడం
సి. కాశీ గ్రామం కోసం కోసల రాజైన ప్రసేనజిత్తో యుద్ధం చేయడం
డి. తన ఆస్థాన రాజ వైద్యుడైన జీవకుడి ప్రోత్సాహంతో బుద్ధుడిని దర్శించి బౌద్ధమతాన్ని స్వీకరించడం
1) ఎ, బి సరైనవి
2) ఎ, బి, సి, డి సరైనవి
3) ఎ, సి సరైనవి 4) ఎ, డి సరైనవి
10. నంద రాజు భార్య ముర అనే శూద్ర స్త్రీకి మౌర్య చంద్రగుప్తుడు జన్మించాడని వివరించే గ్రంథం?
1) పరిశిష్ఠ పర్వం 2) విష్ణు పురాణం
3) ముద్రారాక్షసం 4) రాజ తరంగిణి
11. షోడశ మహా జనపదాలకు సంబంధించిన సమాచారాన్ని వివరించే బౌద్ధ గ్రంథం?
1) దిఘనికాయ 2) మజ్జిమనికాయ
3) అంగుత్తురనికాయ
4) సంయుత్తనికాయ
12. జాబితా-1లో ఇచ్చిన జనపదాలను జాబితా-2లో ఇచ్చిన వాటిని పరిపాలించిన రాజులతో జతపర్చండి.
జనపదాలు పాలకులు
ఎ. కురు రాజ్యం 1. ఉదయనుడు
బి. వత్స రాజ్యం 2. బ్రహ్మదత్తుడు
సి. అశ్మక రాజ్యం 3. శిశుపాలుడు
డి. దేవి రాజ్యం 4. ఇసుకార
సరైన సమాధానం గుర్తించండి.
1) ఎ-4, బి-1, సి-2, డి-3
2) ఎ-4, బి-1, సి-3, డి-2
3) ఎ-4, బి-2, సి-3, డి-1
4) ఎ-1, బి-2, సి-3, డి-4
13. భారత యుద్ధతంత్రానికి మహాశిలకంఠిక, రథముసలం వంటి నూతన ఆయుధాలను పరిచయం చేసిన మగధ సామ్రాజ్య చక్రవర్తి?
1) అజాతశత్రువు
2) బింబిసారుడు
3) బిందుసారుడు
4) మహాపద్మనందుడు
14. భారతదేశంపై దండయాత్ర చేసిన మొట్టమొదటి విదేశీయులు?
1) పర్షియన్లు 2) గ్రీకులు
3) అరబ్బులు 4) తురుష్కులు
15. జాబితా-1లో ఇచ్చిన జనపదాలను జాబితా-2లో ఇచ్చిన వాటి రాజధానులతో జతపర్చండి.
జనపదాలు రాజధానులు
ఎ. అవంతి రాజ్యం 1. వైశాలి
బి. కాంభోజ రాజ్యం 2. చంపానగరం
సి. అంగ రాజ్యం 3. రాజపురం
డి. వజ్జి రాజ్యం 4. మాహిశ్మతీ నగరం
సరైన సమాధానాన్ని గుర్తించండి.
1) ఎ-1, బి-2, సి-3, డి-4
2) ఎ-4, బి-3, సి-2, డి-1
3) ఎ-4, బి-3, సి-1, డి-2
4) ఎ-4, బి-1, సి-2, డి-3
16. అవంతి రాజైన చండప్రద్యోతనుడికి సోకిన కామెర్ల వ్యాధిని తన ఆస్థాన రాజవైద్యుడైన జీవకుడి చేత చికిత్స చేయించి తన మద్దతుదారుడిగా మార్చుకున్న మగధ రాజ్య చక్రవర్తి?
1) బిందుసారుడు 2) అజాతశత్రువు
3) బింబిసారుడు
4) చంద్రగుప్త మౌర్యుడు
17. భాసుడు రాసిన స్వప్నవాసవదత్త నాటకంలోని కథానాయకుడు?
1) మగధ రాజైన ఉయనుడు
2) వత్సరాజైన ఉదయనుడు
3) అవంతి రాజైన మహాసేనుడు
4) వైశాలి రాజైన చేతకుడు
18. పూర్వకాలంలో మాలినీ అని కూడా పిలువబడిన ప్రసిద్ధ వ్యాపార కేంద్రంగా విలసిల్లిన నగరం?
1) ఇంద్రప్రస్థం 2) చంపానగరం
3) కౌశాంబి 4) తక్షశిల
19. కింద ఇచ్చిన మగధ సామ్రాజ్య చక్రవర్తులను వారి ఇతర పేర్లతో జతపరచండి.
ఎ. బింబిసారుడు 1. కునిక
బి. అజాతశత్రువు 2. సేనియ
సి. బిందుసారుడు 3. అమిత్రఖాధ
డి. మహాపద్మనందుడు 4. ఉగ్రసేనుడు
1) ఎ-2, బి-1, సి-3, డి-4
2) ఎ-2, బి-3, సి-1, డి-4
3) ఎ-1, బి-2, సి-3, డి-4
4) ఎ-3, బి-4, సి-2, డి-1
20. కింద ఇచ్చిన ప్రవచనాల్లో సరైనది ఏది?
ఎ. చంద్రగుప్త మౌర్యుడు తన పరిపాలన చివరికాలంలో జైనమతంను స్వీకరించినట్లు పరిశిష్ఠపర్వం చెబుతుంది
బి. అజాతశత్రువు వజ్జి గణ రాజ్య కూటమిని జయించడానికి ఖేధోపాయ విధానాన్ని అవలంబించాడు.
సి. బిందుసారుడి కాలంలో తక్షశిలలో జరిగిన తిరుగుబాటును అశోకుడు అణచివేసినట్లు బౌద్ధ గ్రంథాలైన అశోకవదనం, దివ్యావదనంలు తెలియజేస్తున్నాయి.
డి. మగధలో పన్నెండు సంవత్సరాలపాటు క్షామం సంభవించనట్లు పరిశిష్ఠ పర్వం
చెబుతుంది
1) ఎ, బి 2) ఎ, బి, సి, డి
3) ఎ, సి, డి 4) ఎ, డి
21. జాబితా-1లో ఇచ్చిన రాజులను జాబితా-2లో ఇచ్చిన వారి మంత్రులతో జతపరచండి.
రాజులు మంత్రులు
ఎ. అజాతశత్రువు 1. ఖల్లాటకుడు
బి. చండప్రద్యోతనుడు 2. పుణిక
సి. బిందుసారుడు 3. వస్సకార
డి. చంద్రగుప్త మౌర్యుడు 4. చాణక్యుడు
సరైన సమాధానం గుర్తించండి.
1) ఎ-1, బి-2, సి-3, డి-4
2) ఎ-3, బి-2, సి-1, డి-4
3) ఎ-3, బి-2, సి-4, డి-1
4) ఎ-3, బి-4, సి-2, డి-1
22. బిందుసారుడిని సింహసేనుడు అని పేర్కొన్న జైన గ్రంథం?
1) స్థవిరవలి చరిత్ర 2) పరిశిష్ఠపర్వం
3) రాజావళి కథ 4) పురాణాలు
23. చంద్రగుప్త మౌర్యుడు నిమ్నకులస్థుడు, శూద్రుడు, వేశ్యాక్షురకుల సంతతికి చెందినవాడని పేర్కొన్న గ్రంథం?
1) పరిశిష్ఠపర్వం 2) రాజవావళి కథ
3) పురాణాలు 4) కథాసరిత్సాగరం
24. మౌర్య చంద్రగుప్తుడి కాలంలో గిర్నార్ వద్ద సుదర్శనతటాకంను నిర్మించిన సౌరాష్ట్ర పాలకుడు?
1) తుషాస్ప 2) పుష్యగుప్తుడు
3) రుద్రదాముడు 4) స్కందగుప్తుడు
25. శాద్వాదం, అనేకాంతవాదం ఏ మతానికి చెందిన తాత్విక సిద్ధాంతాలు?
1) బౌద్ధ మతం 2) అజీవక మతం
3) జైన మతం 4) భాగవత మతం
26. కింది వాటిలో సరైన జతకానిది గుర్తించండి.
1) గచ్ఛ- జైన సన్యాసుల సంఘం
2) బసది- జైన దేవాలయం, జైన సన్యాసుల వసతి గృహం
3) చైత్యం- బౌద్ధుల ప్రార్థనా మందిరం
4) ఆరామం- బౌద్ధుల సమాధులు
27. కింది వాటిని జతపరచండి.
బౌద్ధ పండితులు తత్వం
1. మైత్రేయనాథుడు ఎ. శూన్యవాదం
2. ఆచార్య బి. స్వతంత్ర
నాగార్జునుడు మాధ్యమిక వాదం
3. బుద్ధ పాలితుడు సి. యోగ కారపాదం
4. భావవివేకుడు డి. ప్రాసాంగిక
మాధ్యమిక వాదం
1) 1-సి, 2-ఎ, 3-డి, 4-బి
2) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
3) 1-సి, 2-బి, 3-ఎ, 4-డి
4) 1-సి, 2-ఎ, 3-బి, 4-డి
28. బుద్ధుడి బోధనల్లో అత్యంత ముఖ్యమైన నాలుగు ఆర్య సత్యాలు, అష్టాంగ మార్గాలు సుత్తపీటకం కాని ఏ భాగంలో చేర్చారు?
1) దిఘనికాయ 2) ఖుద్ధకనికాయ
3) అంగుత్తరనికాయ 4) మజ్జిమనికాయ
29. కింద ఇచ్చిన అవైదిక మత శాఖలను వాటి స్థాపకులతో జతపరచండి.
1. శ్వేతాంబరులు 2. దిగంబరులు
3. అజీవక మతం 4. ఛార్వాక మతం
ఎ. అజితకేశ కంబలి బి. స్థూల బాహు
సి. భద్ర బాహు డి. మాకరిగోపాల పుత్ర
1) 1-బి, 2-సి, 3-డి, 4-ఎ
2) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
3) 1-బి, 2-సి, 3-ఎ, 4-డి
4) 1-బి, 2-ఎ, 3-సి, 4-డి
30. త్రిపీఠకాలపై వ్యాఖ్యానమైన విసుద్ధిమగ్గ గ్రంథ కర్త?
1) ఆచార్య నాగార్జునుడు
2) బుద్ధపాలితుడు
3) సిద్ధ నాగార్జునుడు
4) బుద్ధ ఘోషుడు
31. బుద్ధుడి పూర్వజన్మలైన బోధిసత్వుల గురించి తెలియజేసే గ్రంథాలేవి?
1) అభిధమ్మపీఠకం 2) వినయపీఠకం
3) జాతక కథలు 4) మిళింద పన్హా
32. బౌద్ధ సమావేశాలకు సంబంధించి కింది వాటిని జతపరచండి.
సమావేశం నగరం
1. మొదటి బౌద్ద ఎ. రాజగృహం సమావేశం
2. రెండో బౌద్ధ బి. పాటలీపుత్రం సమావేశం
3. మూడో బౌద్ధ సి. వైశాలి సమావేశం
4. నాలుగో బౌద్ధ డి. కుందలవనం సమావేశం (కశ్మీర్)
1) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
2) 1-ఎ, 2-సి, 3-బి, 4-డి
3) 1-ఎ, 2-సి, 3-డి, 4-బి
4) 1-డి, 2-బి, 3-సి, 4-ఎ
33. కింది వాటిలో బుద్ధుడి జీవితంలో జరిగిన సంఘటనల చిహ్నాలకు సంబంధించి సరైన జత కానిది గుర్తించండి.
1) జ్ఞానోదయం-బోధి వృక్షం
2) జననం- తామర పుష్పంలో ఎద్దు
3) తొలి బోధన-ధర్మ చక్రం
4) మరణం- చైత్యం
34. బౌద్ధ మతానికి మూలమైన వేదాంత సూత్రాలు కింది ఏ గ్రంథంలో కనిపిస్తాయి?
1) వినయపీఠక 2) సుత్త పీఠక
3) జాతక కథలు 4) అభిధమ్మ పీఠక
35. మహావీరుడి బోధనలను అనుసరించేవారిని మొదట ఏ పేరుతో పిలుస్తారు?
1) జైనులు 2) అరిహంత్‌లు
3) కేవలన్లు 4) నిగ్రంథులు
36. కింది వాటిలో సరైన జతను గుర్తించండి.
ఎ. ప్లసుక-శతపథ బ్రహ్మణం ప్రకారం వరినాట్లు వేసి పండించడం
బి. స్వస్థిక- వరిని వర్షాకాలంలో అరవై రోజుల్లో పండించడం
సి. కుసుదిన్- అప్పు తీసుకున్న వ్యక్తి
డి. శతమాన- బ్రాహ్మణులకు గౌరవంగా ఇచ్చే బంగారు కానుక
1) ఎ, బి 2) ఎ, బి, సి, డి
3) ఎ, సి 4) ఎ, సి, డి
37. భారతీయులను ఎక్కువ సంఖ్యలో తన సైన్యంలో నియమించుకున్న పర్షియా చక్రవర్తి?
1) సైరస్ 2) మొదటి డేరియస్
3) జెరెక్స్ 4) కాంబైసిస్
– శేఖర్‌రెడ్డి, హిస్టరీ ఫ్యాకల్టీ
మేడిపల్లి, హైదరాబాద్
9652578639
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు