కాకోరి దోపిడీ కేసు ఎవరి కాలంలో జరిగింది?
గ్రూప్స్ప్రత్యేకంఇండియన్హిస్టరీ
లార్డ్ రిప్పన్ (1880-84)
- రాష్ర్టాల్లో స్థానిక స్వపరిపాలనకు పునాదివేసి స్థానిక స్వపరిపాలన పితగా పేరుపొందాడు.
- ఇతడు లేబర్ పార్టీకి చెందినవాడు
- 1878-వెర్నాక్యులర్ ప్రెస్ యాక్ట్‌ను 1882లో సడలించి ప్రాంతీయ పత్రికలకు స్వేచ్ఛ కల్పించాడు.
- 1881లో మొట్టమొదటి ఫ్యాక్టరీ చట్టాన్ని జారీచేశాడు.
- విలియం హంటర్ అధ్యక్షతన ఒక విద్యా కమిషన్‌ను 1882లో ఏర్పాటు చేశాడు.
- ఇల్బర్ట్ బిల్లును 1883లో జారీచేశాడు. తద్వారా ఆంగ్లేయ నేరస్థులను విచారించే అధికారం భారతీయ
న్యాయమూర్తులకు కలిగింది (ఆంగ్లేయులు ఈ బిల్లు పట్ల పెద్ద ఎత్తున ఆందోళన జరపగా బిల్లును సవరించి ఐదుగురు జడ్జిలు గల బెంచీని ఏర్పాటు చేసి, అందులో ముగ్గురు ఆంగ్లేయులు ఉండాలని తెలిపారు). - రిప్పన్ పరిపాలనా విధానంలో చిన్న యూనిట్‌ను తాలూకా లేదా తహసీల్ అనేవారు.
- రిప్పన్ కాలంలోనే దేశంలో మొట్ట మొదటిసారిగా 1881లో జనాభా లెక్కలు సేకరించాడు. ఇతడు ‘డ్యూటీ ఆఫ్ ది ఏజ్’ అనే కరపత్రం రచించాడు.
- లార్డ్ నార్త్ బ్రూక్ కాలంలో ప్రారంభమైన స్వేచ్ఛా వ్యాపార విధానాన్ని రిప్పన్ పూర్తిగా అనుసరించాడు.
- సివిల్ సర్వీసుల గరిష్ఠ వయోపరిమితిని 18 నుంచి 21కి పెంచాడు.
- ప్రధాన న్యాయమూర్తి సర్ రిచర్డ్ గార్త్ సెలవులో వెళ్లినప్పుడు ఆ స్థానంలో భారతీయుడైన సర్ రమేష్ మిత్తర్ను నియమించడం రిప్పన్ ఔదార్య గుణానికి నిదర్శనం.
- బెంటింక్ కాలంలో దుష్పరిపాలనా నెపంతో తీసుకున్న మైసూర్‌ను ఇతడు వెనక్కి ఇచ్చాడు.
లార్డ్ డఫ్రిన్ (1884-88)
- ఇతడి కాలంలో భారత జాతీయ కాంగ్రెస్‌ను 1885లో స్థాపించారు.
- మూడో బర్మా యుద్ధం జరిగి, ఉత్తర బర్మా బ్రిటిష్ సామ్రాజ్యంలో విలీనం చేశారు.
- విక్టోరియా రాణి పాలనా కాలానికి చెందిన స్వర్ణోత్సవం (1887) జరిగింది.
లార్డ్ లాండ్స్ డౌన్ (1888-94)
- ఇతడి కాలంలో భారత శాసనసభల చట్టం-1892 చేశారు.
- మణిపూర్ తిరుగుబాటు ఇతడి కాలంలో జరిగింది.
- వారం వారం సెలవు మంజూరు చేస్తూ రెండో ఫ్యాక్టరీ చట్టం-1891 చేశారు.
- భారత, అఫ్గానిస్థాన్ల మధ్య సరిహద్దును నిర్ణయించడానికి డ్యూరాండ్ కమిషన్‌ను ఏర్పాటు చేశారు.
లార్డ్ రెండో ఎల్జిన్ (1894-99)
- ఇతడి కాలంలో 1896లో భారతదేశంలో భయంకరమైన కరువు ఏర్పడింది. లయల్ అధ్యక్షతన కరువు కమిషన్‌ను ఏర్పాటు చేశారు.
లార్డ్ కర్జన్ (1899-1905)
- ఇతడిని బ్రిటిష్ ఇండియా ఔరంగజేబ్ అంటారు.
- ఇతడి కాలంలో ఇంగ్లండ్ రాణి విక్టోరియా మరణించడంతో 7వ ఎడ్వర్డ్ ఇంగ్లండ్ చక్రవర్తి అయ్యాడు.
- 1901లో పురావస్తు పరిశోధన శాఖను ఏర్పాటు చేశాడు.
- 1901లో సర్ కొలన్ స్కాట్మన్ అధ్యక్షతన నీటి పారుదల కమిషన్‌ను ఏర్పాటు చేశాడు.
- 1902లో సర్ ఆండ్రూ ఫ్రేజర్ నాయకత్వంలో పోలీస్ కమిషన్‌ను నియమించాడు.
- 1904లో ప్రాచీన స్మారక నిర్మాణాల పరిరక్షణ చట్టాన్ని ఆమోదించి జారీచేశాడు.
- 1904లో భారతీయ విశ్వవిద్యాలయాల చట్టాన్ని చేశాడు.
- 1905లో బెంగాల్‌ను విభజించాడు. దీని ఫలితంగా స్వదేశీ ఉద్యమం ప్రారంభమైంది.
- రైల్వే బోర్డును ఏర్పాటు చేసి, అనేక రైల్వే లైన్ల అభివృద్ధికి పాటుపడ్డాడు.
- మెక్‌డొనాల్డ్ అధ్యక్షతన ఇరిగేషన్ కమిషన్‌ను ఏర్పాటు చేశాడు.
- 1905లో ఆగస్టులో కిచెనర్తో వివాదం కారణంగా తన పదవికి రాజీనామా చేశాడు.
లార్డ్ మింటో (1905-10)
- ఇతడి కాలంలో ఢాకాలో ముస్లిం లీగ్ (1906)ను స్థాపించారు.
- 1909లో మింటో మార్లే సంస్కరణలుగా పేరుగాంచిన భారత శాసనసభల చట్టాన్ని జారీచేశాడు.
- ఇతడి కాలంలోనే మొదటిసారిగా కాంగ్రెస్ కలకత్తా సమావేశంలో స్వరాజ్యం తన లక్ష్యంగా ప్రకటించడం జరిగింది.
- ఇతడి కాలంలో ఖుదీరామ్ బోస్‌ను ఉరితీశారు.
లార్డ్ హార్డింజ్-2 (1910-16)
- ఇతడి కాలంలో 5వ జార్జ్ రాజు భారతదేశాన్ని సందర్శించాడు. ఇతడి గౌరవార్థం 1911లో ఢిల్లీలో పట్టాభిషేక దర్బార్‌ను ఏర్పాటు చేశాడు.
- ఇతడు బెంగాల్ విభజనను రద్దుచేశాడు.
- సామ్రాజ్య రాజధాని కలకత్తా నుంచి ఢిల్లీకి బదిలీ చేయాలని 1911లో ప్రకటించి 1912లో బదిలీ చేశాడు.
- 1915లో హిందూ మహాసభ ఏర్పడింది.
- రవీంద్రనాథ్ ఠాగూర్‌కు సాహిత్యంలో నోబెల్ బహుమతి ఇతడి కాలంలో వచ్చింది.
- ఇతడి కాలంలోనే మొదటి ప్రపంచ యుద్ధం-1914 ప్రారంభమయ్యింది.
లార్డ్ చేమ్స్‌ఫర్డ్ (1916-21)
- ఇతడి కాలంలో తిలక్, అనీబిసెంట్లు హోంరూల్ లీగ్‌లను స్థాపించాడు.
- ఇతడి కాలంలో కాంగ్రెస్‌లోని అతివాదులు, మితవాదులు 1916లో లక్నో సమావేశంలో ఒకటయ్యారు.
- 1919లో భారతీయులు నల్లచట్టంగా అభివర్ణించిన రౌలత్ చట్టాన్ని జారీచేశాడు.
- ఇతడి కాలంలో 1917లో చంపారన్ సత్యాగ్రహం, 1919లో ఖిలాఫత్ ఉద్యమం, 1919 ఏప్రిల్ 13న జరిగిన జలియన్ వాలాబాగ్ ముఖ్యమైనవి.
- ఇతడి కాలంలో మాంటేగ్ చేమ్స్‌ఫర్డ్ సంస్కరణలుగా ప్రసిద్ధిచెందిన 1919 భారత శాసనసభల చట్టాన్ని చేశారు.
- వేల్స్ యువరాజు ఎడ్వర్డ్ ఇతడికాలంలోనే భారతదేశాన్ని సందర్శించాడు.
- పుణెలో మహిళా విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేశాడు.
- 1917లో విద్యాభివృద్ధి కోసం సాడ్లర్ కమిషన్‌ను ఏర్పాటు చేశాడు.
లార్డ్ రీడింగ్ (1921-26)
- ఇతడి కాలంలో చౌరీచౌరాలో అల్లర్లు జరగడంలో సహాయ నిరాకరణోద్యమం ఆగిపోయింది.
- 1920-21లో కేరళలో మోప్లా తిరుగుబాటు జరిగింది.
- 1921లో భారత కమ్యూనిస్ట్ ఆఫ్ ఇండియాను కాన్పూర్‌లో స్థాపించారు.
- 1925లో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్)ను నాగ్‌పూర్‌లో ఏర్పాటు చేశారు.
- 1925లో కాకోరి దోపిడీ కేసు ఇతడి కాలంలోనే జరిగింది.
- భారతదేశం, ఇంగ్లండ్ 1923 నుంచి ఒకేసారి ఐసీఎస్ పరీక్షలు నిర్వహించే విధానం ఏర్పాటు చేశారు.
- వైస్రాయ్‌లలో ఈయన ఒక్కడే యూదు జాతికి చెందినవాడు.
లార్డ్ ఇర్విన్ (1926-31)
- ఇతడి కాలంలో సైమన్ కమిషన్ భారతదేశాన్ని 1927లో సందర్శించింది.
- సైమన్ కమిషన్‌కు వ్యతిరేకంగా జరిపిన నిరసనలో పోలీసుల లాఠీ దెబ్బలకు లాలా లజపతిరాయ్ మృతిచెందాడు. ఇతడి మృతికి కారణం సాండర్స్ అనే పోలీస్ అధికారి లాఠీలతో కొట్టడం.
- 1927లో స్వదేశీ సంస్థానాధీశులకు, బ్రిటిష్ వారికి మధ్య సంబంధాలను పెంపొందించడానికి బట్లర్ కమిషన్‌ను ఏర్పాటు చేశారు.
- 1928లో ఆలిండియా యూత్ కాంగ్రెస్‌ను ఏర్పాటు చేశారు.
- 1928లో మోతీలాల్ నెహ్రూ రాజ్యాంగ నివేదికను తయారు చేశాడు.
- 1929లో లాహోర్‌లో నెహ్రూ అధ్యక్షతన జరిగిన ఐఎన్‌సీ సమావేశంలో పూర్ణ స్వరాజ్ ప్రతిపాదనను అంగీకరించారు.
- ఇతడి కాలంలోనే సర్ సీవీ రామన్‌కు భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతి వచ్చింది.
- ప్రసిద్ధిగాంచిన శాసనోల్లంఘన ఉద్యమం 1930లో ప్రారంభమయ్యింది.
- మొదటి రౌండ్ టేబుల్ సమావేశం 1930లో జరిగింది. ఈ సమావేశానికి కాంగ్రెస్ తరఫున ఎవరూ హాజరుకాలేదు.
- గాంధీ-ఇర్విన్ ఒడంబడిక (1931) ఇతడి కాలంలోనే జరిగింది.
- ఇతడిని క్రిస్టియన్ వైస్రాయ్ అని అంటారు.
లార్డ్ వెల్లింగ్టన్ (1931-36)
- ఇతడి కాలంలో రెండో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. దీనికి గాంధీ హాజరయ్యారు.
- బ్రిటిష్ ప్రధాని రామ్సే మెక్‌డొనాల్డ్ కమ్యూనల్ అవార్డును ప్రకటించారు. దీనివల్ల షెడ్యూల్డ్ తెగలు, తరగతులకు ప్రత్యేక నియోజకవర్గాలు ఏర్పడ్డాయి.
- ప్రత్యేక నియోజకవర్గాలను వ్యతిరేకించిన గాంధీకి, అంబేద్కర్‌కు మధ్య ఎరవాడ జైలులో పూనా ఒప్పందం జరిగింది. ఈ ఒప్పందం ప్రకారం ఎస్సీ, ఎస్టీలకు ప్రత్యేక నియోజకవర్గాలు కాకుండా రిజర్వ్ నియోజకవర్గాలు ఉంచాలనే అంశాన్ని నిర్ణయించుకున్నారు.
- 1934లో కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ ఏర్పడింది. ఇతడి కాలంలోనే ఆలిండియా కిసాన్ సభ ఏర్పడింది.
- ఇతడి కాలంలో డెహ్రాడూన్‌లో భారతీయ సైనిక అకాడమీని స్థాపించారు.
- ఇతడి కాలంలో 1935 భారత ప్రభుత్వ చట్టాన్ని చేశారు.
లార్డ్ లిన్ లిత్ గో (1936-42)
- ఇతడి కాలంలో 1935 చట్టం ప్రకారం ఎన్నికలు జరిగాయి.
- కాంగ్రెస్ 5 రాష్ర్టాల్లో పూర్తి మెజారిటీ సాధించింది.
- రెండో ప్రపంచ యుద్ధంలో జాతీయ కాంగ్రెస్ నాయకులను సంప్రదించకుండా, భారతదేశాన్ని జర్మనీకి శత్రువుగా ప్రకటించడంతో రాష్ర్టాల్లోని మంత్రి వర్గాలు రాజీనామా చేశాయి. దీన్ని ముస్లింలీగ్ విమోచన దినంగా పాటించింది.
- ఇతడి కాలంలో 6వ జార్జ్ ఇంగ్లండ్‌కు చక్రవర్తి అయ్యాడు.
- సుభాష్ చంద్రబోస్ 1939లో ఫార్వర్డ్ బ్లాక్‌ను స్థాపించారు.
- ఇతడి కాలంలో రెండో ప్రపంచ యుద్ధం (1939) ప్రారంభమయ్యింది.
- ముస్లింలీగ్ లాహోర్ సమావేశంలో ముస్లింలకు ప్రత్యేక దేశం కావాలని మహ్మద్ అలీ జిన్నా డిమాండ్ చేశాడు.
- ఇతడి కాలంలో క్రిప్స్ రాయబారం (1942) జరిగింది.
- దేశవ్యాప్తంగా క్విట్ ఇండియా ఉద్యమం (1942) ప్రారంభమయ్యింది.
లార్డ్ వేవెల్ (1943-47)
- 1944లో సీఆర్ ఫార్ములా (చక్రవర్తుల రాజగోపాల్ ఫార్ములా) వచ్చింది.
- 1945లో వేవెల్ ప్లాన్, సిమ్లా సమావేశం జరిగింది.
- భారతదేశంలో 1946లో క్యాబినెట్ మిషన్ (మంత్రివర్గ త్రయం) భారతదేశాన్ని సందర్శించింది. ముస్లింలీగ్ ప్రత్యక్ష చర్యాదినాన్ని పాటించింది (1946, ఆగస్టు 16).
- ఇతడి కాలంలో రాజ్యాంగ పరిషత్ ప్రథమ సమావేశం జరిగింది.
- ఆజాద్ హిందూ ఫౌజ్, జపాన్ దళాలు భారత భూభాగం నుంచి ఉపసంహరించుకున్నాయి.
- ఐఎన్ఏ (ఇండియన్ నేషనల్ ఆర్మీ) సైనికులపై విచారణ, బొంబాయిలో నౌకాదళం తిరుగుబాటు జరిగింది.
లార్డ్ మౌంట్ బాటన్ (1947-48)
- భారతదేశ చిట్టచివరి వైస్రాయ్, స్వతంత్ర భారతదేశ మొట్ట మొదటి గవర్నర్ జనరల్.
- 1947, జూన్ 3న దేశ విభజన అంశాన్ని మొదటిసారి ప్రకటించారు.
- 1948, జూన్ నాటికి అధికారం బదిలీ చేయడం జరుగుతుందని బ్రిటిష్ ప్రభుత్వం ప్రకటించింది. దేశ విభజన పథకాన్ని (1947) ప్రవేశపెట్టాడు.
- 1947, ఆగస్టు 15న భారతదేశ స్వాతంత్య్ర చట్టం ఆమోదించింది.
మాదిరి ప్రశ్నలు
1. ‘డ్యూటీ ఆఫ్ ది ఏజ్’ అనే కరపత్రాన్ని రచించిన గవర్నర్ జనరల్?
1) రిప్పన్ 2) లిట్టన్
3) ఇర్విన్ 4) డఫ్రిన్
2. కింది వాటిలో సరికానిది?
1) స్థానిక స్వపరిపాలన పితామహుడిగా
రిప్పన్‌ను భావిస్తారు
2) భారతదేశ శాసన సభల చట్టం-1892 చేశారు, లాండ్స్ డౌన్ కాలంలో
3) భారత జాతీయ కాంగ్రెస్‌ను స్థాపించింది లార్డ్ రిప్పన్ కాలంలో
4) హార్డింజ్-2 కాలంలో 5వ జార్జ్ భారతదేశాన్ని సందర్శించాడు.
3. రాజధానిని కలకత్తా నుంచి ఢిల్లీకి ఏ గవర్నర్ జనరల్ కాలంలో మార్పు చేశారు?
1) మింటో-2 2) హార్డింజ్-2
3) కర్జన్ 4) ఎల్జిన్-2
4. 1927లో ఏర్పాటు చేసిన ‘బట్లర్ కమిషన్’ దేనికి సంబంధించింది?
1) జలియన్ వాలాబాగ్ దురంతంపై విచారణ జరపడానికి
2) స్వదేశీ సంస్థానాధీశులకు, బ్రిటిష్ వారికి మధ్య సంబంధాలను పెంపొందించడానికి
3) బ్రిటిష్ ఇండియాలో విద్యాభివృద్ధి కోసం 4) ఏదీకాదు
5. బ్రిటిష్ ప్రధాని రామ్సే మెక్‌డొనాల్డ్ ద్వారా కమ్యూనల్ అవార్డు ఏ గవర్నర్ జనరల్ కాలంలో ప్రకటించారు?
1) వెల్లింగ్టన్ 2) వేవెల్
3) ఇర్విన్ 4) రీడింగ్
6. కింది వాటిలో సరైనవి?
1) ఇతడు 1901లో నీటిపారుదల కమిషన్‌ను నియమించారు
2) 1904లో భారతీయ విశ్వవిద్యాలయాల చట్టం చేశాడు
3) 1905లో బెంగాల్‌ను విభజించాడు
4) పైవన్నీ
7. క్విట్ ఇండియా ఉద్యమం ఏ గవర్నర్ కాలంలో ప్రారంభమయ్యింది?
1) వేవెల్ 2) లిన్ లిత్ గో
3) వెల్లింగ్టన్ 4) రీడింగ్
8. భారతదేశంలోను, ఇంగ్లండ్‌లోను ఒకేసారి ఐసీఎస్ పరీక్షలు నిర్వహించే విధానం ఏ గవర్నర్ జనరల్ కాలంలో మొదలైంది?
1) ఇర్విన్ 2) వెల్లింగ్టన్
3) రీడింగ్ 4) హార్డింజ్-1
సమాధానాలు
1-1, 2-3, 3-2, 4-2,
5-1, 6-4, 7-2, 8-3
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు