‘జబ్ ఖేత్ జాగే’ అనే నవల ఆధారంగా తీసిన సినిమా?
1. తెలంగాణ పోరాటంలో పిట్టలదొర వేషాన్ని సమర్థవంతంగా ప్రదర్శించిన వ్యక్తి?
1) సర్వాయి పాపన్న 2) కడార్ల రామయ్య
3) సుద్దాల హనుమంతు 4) ఎవరూకాదు
2. కింది ఏ నృత్యానికి ‘ఖడ్గనృత్యం’ అని పేరు కలదు?
1) గరగ 2) సిద్దీ
3) గుస్సాడీ 4) వీరనాట్యం
3. కింది వాటిలో సరైనవి?
ఎ. గొల్లభామ చీరలకు తెలంగాణలోని సిద్దిపేట ప్రాంతం ప్రసిద్ధి
బి. రంజన్ కుండల తయారీకి ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ప్రసిద్ధి
1) ఎ సరైనది, బి సరికాదు
2) ఎ సరికాదు, బి సరైనది
3) ఎ, బి సరైనవి కావు
4) ఎ, బి సరైనవి
4. కింది వాటిలో సరైనవి?
ఎ. బ్రాహ్మణులు పోషించే కళ సిల్వర్ ఫిలిగ్రీ
బి. మహిష/సదర్ పండుగను జరిపేది- యాదవులు
1) ఎ సరైనది, బి సరికాదు
2) ఎ సరికాదు, బి సరైనది
3) ఎ, బి సరికావు
4) ఎ, బి సరైనవి
5. కింది ఏ హస్తకళ బీదర్ నుంచి హైదరాబాద్‌లో స్థిరపడింది?
1) డోక్రామెటల్ క్రాఫ్ట్స్ 2) బిద్రీ క్రాఫ్ట్స్
3) స్క్రోల్ పెయింటింగ్ 4) ఏదీకాదు
6. మోదుగుపూలకు కింది ఏ పండుగతో సంబంధం కలదు?
1) దసరా 2) బతుకమ్మ
3) హోలి 4) ఏదీకాదు
7. ‘ఉమెన్ ఆఫ్ గాడ్ అండ్ రిచ్ మెన్, ఏ పీప్ ఇన్టు జోగిన్స్ లైఫ్’ శీర్షికల ద్వారా జోగినీ వ్యవస్థ నిర్మూలనకు కృషిచేసిన పత్రికలు?
ఎ. న్యూస్‌టైమ్స్ బి. దక్కన్ టైమ్స్
సి. న్యూస్‌టుడే
1) ఎ, సి 2) ఎ, బి
3) బి, సి 4) ఏదీకాదు
8. ‘సిడి’ అనే కార్యక్రమం జరిగే జాతర కిందివాటిలో ఏది?
1) కొడవటంచ 2) కురుమూర్తి
3) లింగంపల్లి 4) ఏదీకాదు
9. ‘ఓ చెల్లీ, ఓ జోగినీ చైతన్యం లే, లేచి విజృంభించు’ అనే పదాలతో పూర్తయ్యే గేయం రచించినవారు?
1) ఆశామూర్తి
2) హేమలతా లవణం
3) జ్ఞానకుమారి హెడ 4) ఎవరూకాదు
10. 35 అడుగుల ఎత్తుగల ‘ఆండాళ్ల స్తంభం’ కలిగి ఉండి, సంతానం కోసం ఆ స్తంభానికి చీర కట్టించి ఒడిబియ్యం పోసే ఆచారం గల ఆలయానికి సంబంధించిన జాతరను గుర్తించండి?
1) నల్లకొండ 2) సింగరాయ
3) బెజ్జంకి 4) ఏదీకాదు
11. కింది ఏ జాతర ఆదిలాబాద్ జిల్లాలో జరుగుతుంది?
ఎ. తేగడ బి. బుర్నూరు
సి. వేలాల డి. సిద్దులగుట్ట
1) ఎ, బి 2) బి, సి
3) సి, డి 4) ఎ, డి
12. కింది వాటిలో అత్యధిక రోజులు జరిగే జాతరను గుర్తించండి?
1) కురుమూర్తి 2) నాగోబా
3) ఏడుపాయల 4) గొల్లగట్టు
13. గొల్లగట్టు జాతరకు సంబంధించి కింది వాటిలో సరైనవి గుర్తించండి?
ఎ. తెలంగాణలో రెండో అతిపెద్ద జాతర
బి. దైవం- లింగమంతుల స్వామి
సి. ఐదురోజుల పాటు నిర్వహిస్తున్నారు (గత మూడేండ్లుగా)
1) ఎ, బి 2) ఎ, బి, సి
3) బి, సి 4) ఎ, సి
14. కింది వాటిలో సరిగా జతపరచనది?
1) జోగినాథుని జాతర- ఉమ్మడి మెదక్ జిల్లా
2) కోదండాపురం జాతర- ఉమ్మడి నల్లగొండ జిల్లా
3) మల్దగల్ జాతర- ఉమ్మడి వరంగల్ జిల్లా
4) కేతకి సంగమేశ్వర జాతర- ఉమ్మడి కరీంనగర్ జిల్లా
15. మేడారం అనుబంధ జాతరలకు సంబంధించి సరికానివి?
ఎ. చౌడమ్మ జాతర
బి. వేల్పులమ్మ జాతర
సి. గుంజేడు ముసలమ్మ జాతర
1) ఎ, బి 2) ఎ
3) బి, సి 4) బి
16. నిశ్చిత వాక్యం (ఎ): మొఘల్ రాజులు పీర్లను భారతదేశంలో ప్రతిష్ఠించడం ప్రారంభించారు కారణం (ఆర్): మొఘల్ చక్రవర్తులు దేశాన్ని పాలించే కాలంలో తైమూర్ సైనికులు ఈ పండుగ కోసం ఇరాక్ వెళ్లకుండా ఈ విధంగా ప్రారంభించడం
1) ఎ, ఆర్ రెండూ సరైనవి. ఎ కు ఆర్ సరైన వివరణ
2) ఎ, ఆర్ రెండూ సరైనవి. ఎ కు ఆర్ సరైన వివరణ కాదు
3) ఎ సరికాదు, ఆర్ సరైనది
4) ఎ సరైనది, ఆర్ సరికాదు
17. కామదేవోత్సవం, ఫాల్గుణోత్సవం, వసంతోత్సవం అని పిలిచే కింది పండుగను గుర్తించండి?
1) రథసప్తమి 2) హోలి
3) సదర్ 4) ఏదీకాదు
18. ఇటలీ యాత్రికుడు మార్కోపోలో కాకతీయ సామ్రాజ్యాన్ని సందర్శించినప్పుడు కింది
ఏ హస్తకళను తన రచనల్లో పేర్కొన్నాడు?
1) పేరిణి నృత్యం 2) వరంగల్ తివాచీ
3) ఆసియా రుమాల్ 4) ఏదీకాదు
19. ఎక్కడా ఒక అతుకు లేకుండా జానపద డిజైన్లు, నెమళ్లు, ఏనుగులు, దీపారాధనలు వంటివి తయారు చేసే హస్తకళ?
1) డోక్రా మెటల్ క్రాఫ్ట్స్
2) లంబాడా ఎంబ్రాయిడరీ
3) సిల్వర్ ఫిలిగ్రీ 4) బిద్రీ వస్తువులు
20. కింది ఏ కళ, హిందూముస్లిం ప్రభావానికి లోనై ఒక లౌకిక కళా నైపుణ్యంగా అభివృద్ధి చెందింది?
1) ఇక్కత్ వస్త్రకళ
2) స్క్రోల్ పెయింటింగ్స్
3) నిర్మల్ ఆర్ట్వేర్
4) పెంబర్తి-ఇత్తడి కళ
21. కింది ఏ కళలో ఇండియన్, మొఘలుల శైలి కనిపిస్తుంది?
1) పెంబర్తి-ఇత్తడి కళ
2) బిద్రీ వస్తువులు
3) నిర్మల్ ఆర్ట్వేర్ 4) ఏదీకాదు
22. నిర్మల్ ఆర్ట్వేర్లో భాగం అయినవి గుర్తించండి?
ఎ. నిర్మల్ చెక్కబొమ్మలు
బి. నిర్మల్ వస్ర్తాలు
సి. నిర్మల్ పెయింటింగ్స్
డి. నిర్మల్ ఇంటి సామగ్రి
1) ఎ, బి, సి 2) బి, సి, డి
3) ఎ, బి, డి 4) ఎ, సి, డి
23. కింది వారిలో ఓల్లమాదేవి జానపద కథను గానం చేసేవారు?
1) రుంజు 2) మందెచ్చులు
3) విప్ర వినోదులు 4) ఎవరూకాదు
24. యథావాక్కుల అన్నమయ్య తాను రచించిన సర్వేశ్వర శతకంలో కింది దేని గురించి ప్రస్తావించారు?
1) తోలుబొమ్మలాట 2) దొమ్మరి ఆట
3) పగటివేషాలు 4) ఏదీకాదు
25. సంగీతం, సాహిత్యం, చిత్రలేఖనం, శిల్పం, నాట్యం అనే లలితకళల సమాహారం?
1) యక్షగానం 2) ఒగ్గుకథ
3) జముకుల కథ 4) తోలుబొమ్మలాట
26. శ్రీశైలం శివరాత్రి ఉత్సవాల్లో కింది ఏ కళలను ప్రదర్శించే వారిని పాల్కురికి సోమనాథుడు తన పండితారాధ్య చరిత్రలో పేర్కొన్నారు?
ఎ. తోలుబొమ్మలాట
బి. దొమ్మరి ఆట సి. పగటివేషాలు
1) ఎ, బి 2) బి, సి
3) ఎ, సి 4) ఎ, బి, సి
27. తెలంగాణ సాయుధ పోరాటం నేపథ్యంలో ‘వీర తెలంగాణ’ అనే యక్షగానాన్ని రచించినవారు?
ఎ. పొద్దుటూరి ఎల్లారెడ్డి
బి. సుద్దాల హనుమంతు
సి. సుద్దాల అశోక్‌తేజ
1) ఎ, బి 2) బి, సి
3) సి, డి 4) ఎ, డి
28. శ్రీనాథుని పల్నాటి వీరచరిత్రను 15 రాత్రులు వదలకుండా చెప్పేవారు ఏ కళకు సంబంధించిన వారు?
1) బుర్ర కథలు 2) పిచ్చుకుంట్ల కథలు
3) జంగం కథలు 4) ఏదీకాదు
29. కింది ఏ కళను ప్రదర్శించవద్దని నిజాం ప్రభుత్వం నిషేధం విధించింది?
1) బుర్ర కథలు 2) పిచ్చుకుంట్ల కథలు
3) శారదా కథలు 4) జంగం కథలు
30. కింది వాటిలో ఖమ్మం ఏజెన్సీ ప్రాంతాల్లో మాత్రమే కనిపించే నృత్యం?
1) లంబాడి నృత్యం
2) మయూరి నృత్యం
3) సిద్ది నృత్యం 4) ఏదీకాదు
31. కింది వాటిలో సరైనది?
ఎ. ఏడుపాయల కనకదుర్గమ్మ ఆలయం మంజీర నదీతీరంలో ఉంది
బి. నాచగిరి లక్ష్మీనరసింహ ఆలయం హరిద్రా నదీతీరంలో ఉంది
1) ఎ, బి సరికావు 2) ఎ, బి సరైనవి
3) ఎ సరికాదు, బి సరైనది
4) ఎ సరైనది, బి సరికాదు
32. మెదక్ చర్చి గురించి సరైనవి గుర్తించండి?
ఎ. చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియాగా ప్రసిద్ధి
బి. రెవరెండ్ చార్లెస్ వాకర్ ఫాస్నెట్ నిర్మాణం చేపట్టాడు
సి. గోథిక్ వాస్తు శైలి
1) ఎ, బి 2) బి, సి
3) ఎ, బి, సి 4) ఎ, సి
33. మూగజీవాలకు ఎలాంటి వ్యాధులు సోకకుండా చేపట్టే ‘దాటుడు పండుగ’తో కింది ఏ వేడుకలకు అంకురార్పణ జరుగుతుంది?
1) తీజ్ 2) సీత్లా భవాని
3) పెద్దదేవుడు 4) రాజల్ముండ
34. పరిగిపిట్టను దేవునికి బలి ఇచ్చి, ఆ పరిగిపిట్ట, మేక రక్తాన్ని ఒక కుండలో ఉంచి దేవుని ముందు నైవేద్యంగా పెట్టే పండుగ?
1) అకిపెన్ 2) పెర్సిపెన్
3) పెద్దదేవుడు 4) సీత్లాభవాని
35. కింది వాటిని జతపర్చండి?
1. అయోధ్య రామయ్య కవి ఎ. నైజాం విప్లవం
2. నూతి నర్సయ్య బి. తెలంగాణ వీరయోధులు
3. సుంకర సత్యనారాయణ సి. తెలంగాణ ఆలేరు కాల్పులు
1) 1-ఎ, 2-బి, 3-సి 2) 1-సి, 2-బి, 3-ఎ
3) 1-ఎ, 2-సి, 3-బి 4) ఏదీకాదు
36. ఏ ఆశ్రిత కులంలోని స్త్రీలు పచ్చబొట్లు పొడిచి సంపాదనలో సహకరించేవారు?
1) దాసర్లు 2) వీరముష్టివారు
3) విప్రవినోదులు 4) ఎవరూకాదు
37. కింది ఏ చిత్రలేఖన కళాకారుడు సుమారు 5 సంవత్సరాల పాటు కృషిచేసి రూపొందించిన ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ చిత్రం పార్లమెంట్ భవనంలో ఉంది?
1) సూర్యప్రకాష్
2) సయీద్ బిన్ మహ్మద్
3) పీఎస్ చంద్రశేఖర్ 4) ఎవరూకాదు
38. ఆరుబయట పశువుల మేత దృశ్యాలు, తెలంగాణ ప్రాంత వీధుల్లో నడిచే స్త్రీ, పురుష దృశ్యాలు, బావుల వద్ద నీటి కోసం నిలుచున్న స్త్రీల చిత్రాలు గీసిన ప్రముఖ చిత్రకారుడు?
1) బదరీ నారాయణ
2) ఎక్కా యాదగిరి
3) ఏలె లక్ష్మణ్
4) జగన్మోహనాచార్య
39. నాగబంధం శిల్పాలు గల కింది కాకతీయుల కాలం నాటి గుడి?
1) స్వయంభూ కేశవాలయం
2) గణపురం కోటగుళ్లు
3) రామప్ప దేవాలయం 4) ఏదీకాదు
40. దాసి సినిమాకు సంబంధించి సరైనదాన్ని గుర్తించండి?
ఎ. దర్శకుడు- బీ నర్సింగరావు
బి. తెలంగాణలో దాసీ వ్యవస్థ గురించి చిత్రించారు
సి. ఈ సినిమాలో నటించిన ‘అర్చన’కు జాతీయ ఉత్తమ నటి అవార్డు లభించింది
1) ఎ, బి 2) ఎ, సి
3) ఎ, బి, సి 4) బి, సి
41. తెలంగాణ మాండలిక పదాలు, వాటి అర్థాల్లో సరికానిది?
ఎ. కచ్చురం- ఎడ్లబండి
బి. కాగు- పెద్దకుండ
సి. తైబందీ- రెండో పంట
డి. గిర్దావరు- పోలీస్ ఇన్స్పెక్టర్
1) ఎ 2) బి 3) సి 4) డి
42. కింది చిత్రలేఖనకారులు చిత్రాలకు సంబంధించి సరికాని జత?
ఎ. కొండపల్లి శేషగిరిరావు- చివరి కౌగలి
బి. కాపు రాజయ్య- కోలాటం
సి. పాకాల తిరుమల రెడ్డి- పల్లెటూరి బడిపంతులు
డి. ఎక్కా యాదగిరిరావు- చంద్రముఖి
1) ఎ 2) బి 3) సి 4) డి
43. ‘జబ్ ఖేత్ జాగే’ అనే ఉర్దూ నవల ఆధారంగా తీసిన సినిమా?
1) మా భూమి 2) దాసి
3) ఇంకెన్నాళ్లు 4) చివరకు మిగిలేది
44. టెంటేషన్ శీర్షికతో చిత్రాలను రచించిన చిత్రకారుడు?
1) ఎక్కా యాదగిరి 2) పీఎస్ చంద్రశేఖర్
3) బదరీ నారాయణ 4) ఏదీకాదు
45. కింది వాటిని జతపర్చండి?
1. శూర్పణక వేషం ఎ. రంగంవారు
2. ఇంద్రజాల ప్రదర్శన బి. ఆసాదులు
3. దేవుని మనుషులు సి. పగటివేషగాళ్లు
4. శూద్రకుల అర్చకులు
డి. సాధనాశూరులు
1) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
2) 1-డి, 2-సి, 3-బి, 4-ఎ
3) 1-సి, 2-డి, 3-బి, 4-ఎ
4) 1-సి, 2-బి, 3-డి, 4-ఎ
సమాధానాలు
1-3, 2-2, 3-1, 4-2, 5-2, 6-3, 7-2, 8-3, 9-3, 10-3, 11-2, 12-1, 13-2, 14-4, 15-4, 16-1, 17-2, 18-2, 19-1, 20-4, 21-3, 22-4, 23-2, 24-3, 25-4, 26-4, 27-2, 28-2, 29-1, 30-2, 31-2, 32-3, 33-1, 34-3, 35-3, 36-2, 37-2, 38-3, 39-2, 40-3, 41-4, 42-4, 43-1, 44-2, 45-3,
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు