శూన్యంలో విద్యుదయస్కాంత తరంగాల వేగం?
విద్యుత్తు – అయస్కాంతత్వం (అక్టోబర్ 8 తరువాయి)
58. ఏకాంతర ప్రవాహాన్ని ఇచ్చే డైనమో (AC డైనమో)లో ఉండనిది ఏది?
ఎ) ఆర్మేచర్
బి) అయస్కాంత ధృవాలు
సి) కమ్యూటర్ డి) స్లిప్రింగ్లు
59. ఏకముఖ ప్రవాహాన్నిచ్చే(DC) డైనమోలో ఉండనిది ఏది?
ఎ) ఆర్మేచర్
బి) అయస్కాంత ధృవాలు
సి) కమ్యూటర్ డి) స్లిప్రింగ్లు
60. DC డైనమోలో కమ్యూటేటర్ చేసే పని?
ఎ) ప్రేరణ విద్యుత్‌ను పుట్టించడం
బి) (AC)ను (DC)గా మార్చడం
సి) అయస్కాంత క్షేత్రాన్ని ఏర్పరచడం
డి) డైనమో కాలిపోకుండా రక్షించడం
61. రెండు సమాంతర తీగల్లో విద్యుత్ ప్రవాహం ఒకే దిశలో ఉంటే వాటి మధ్య పనిచేసే బలం?
ఎ) వికర్షణ బి) ఆకర్షణ
సి) బలాలు పనిచేయవు
డి) ఎ లేదా బి
62. స్ప్రింగ్ ద్వారా విద్యుత్‌ను పంపినప్పుడు స్ప్రింగ్?
ఎ) సంకోచిస్తుంది
బి) పొడవు పెరుగుతుంది
సి) డోలనాలు చేస్తుంది
డి) కొంత కోణం చేస్తూ ఉంటుంది
63. బల్బు ఫిలమెంట్ బాగా వేడెక్కుతుంది కానీ దాన్ని పట్టుకొనే కొనలు అంతగా వేడెక్కకపోవడానికి కారణం?
ఎ) అవి అధిక నిరోధాన్ని కలిగి ఉండటం
బి) అవి అల్ప నిరోధాన్ని కలిగి ఉండటం
సి) అవి ఉష్ణబంధకాలు అవడం
డి) అవి విద్యుద్బంధకాలు అవడం
64. బెడ్‌లైట్‌లో ఉపయోగించేది?
ఎ) డోలకం
బి) స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్
సి) స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్
డి) బి, సి
65. షార్ట్ సర్క్యూట్ (లఘు వలయం) అంటే?
ఎ) వేర్వేరు పొటెన్షియల్‌లు గల బిందువుల మధ్య విద్యుత్ నేరుగా ప్రవహించడం
బి) ఒకే పొటెన్షియల్‌లు గల బిందువుల మధ్య విద్యుత్ నేరుగా ప్రవహించడం
సి) ఒకే విద్యుత్ క్షేత్రం గల బిందువుల మధ్య విద్యుత్ నేరుగా ప్రవహించడం
డి) వేర్వేరు విద్యుత్ క్షేత్రాలు గల బిందువుల మధ్య విద్యుత్ నేరుగా ప్రవహించడం
66. విద్యుత్ ప్రవాహం వల్ల కలిగే మంటలను ఆర్పడానికి నీటిని ఎందుకు ఉపయోగించకూడదు?
ఎ) ఇది మరో షార్ట్ సర్క్యూట్‌ను
కలిగించవచ్చు
బి) ఇది జల విశ్లేషణను కలిగించవచ్చు
సి) వైరింగ్‌ను పాడు చేస్తుంది
డి) మరణం సంభవించవచ్చు
67. ఇనుముపై జింక్‌తో పూత పూయడాన్ని ఏమంటారు?
ఎ) ఎలక్ట్రోప్లేటింగ్
బి) గాల్వనైజేషన్ సి) అయనీకరణం
డి) పైవేవీకావు
68. ఫ్యూజును విద్యుత్ వలయంలో ఉపయోగించడానికి కారణం?
ఎ) విద్యుత్ప్రవాహంలోని హెచ్చుతగ్గులను నియంత్రించడానికి
బి) అధిక విద్యుత్ప్రవాహాల నుంచి విద్యుత్ ఉపకరణాలను రక్షించడానికి
సి) ఇంట్లో అన్ని గదులకు విద్యుత్
పంచడానికి
డి) అన్నీ సరైనవే
69. ఫ్యూజ్ తీగ లక్షణం?
ఎ) తక్కువ ద్రవీభవన స్థానం, అధిక నిరోధం
బి) వాహకత్వం తక్కువ
సి) అధిక ద్రవీభవనస్థానం, తక్కువ నిరోధం
డి) తక్కువ ద్రవీభవనస్థానం, తక్కువ
నిరోధం
70. శూన్యంలో విద్యుదయస్కాంత తరంగాల వేగం?
ఎ) 3X108 cm/sec
బి) 3X108 m/sec
సి) 3X108 km/sec
డి) 331 km/sec
71. విద్యుదయస్కాంత తరంగాల్లో విద్యుత్, అయస్కాంత క్షేత్రాలు ఎలా ఉంటాయి?
ఎ) పరస్పరం లంబంగా
బి) సమాంతరంగా
సి) ప్రతిసమాంతరంగా
డి) 120 డిగ్రీల కోణంలో
72. ఒక తరంగం పౌనఃపున్యాన్ని నిర్ణయించేది?
ఎ) తరంగ జనకం బి) యానకం
సి) ఎ, బి డి) గ్రాహకం
73. ఒక తరంగం వేగాన్ని నిర్ణయించేది?
ఎ) తరంగ జనకం బి) యానకం
సి) ఎ, బి డి) కంపన పరిమితి
74. తరంగం ఒక యానకం నుంచి మరో యానకంలోకి వెళ్లినప్పుడు ఈ తరంగ పరిమితుల్లో మారేది?
ఎ) పౌనఃపున్యం బి) తరంగదైర్ఘ్యం
సి) వేగం డి) బి, సి
75. విద్యుదయస్కాంత వర్ణపటానికి సంబంధించి సరైనది ఏది?
ఎ) పౌనఃపున్యం పెరిగితే తరంగదైర్ఘ్యం
పెరుగుతుంది
బి) పౌనఃపున్యం పెరిగితే వేగం పెరుగుతుంది
సి) పౌనఃపున్యం పెరిగితే తరంగదైర్ఘ్యం
తగ్గుతుంది
డి) పౌనఃపున్యం పెరిగితే వేగం తగ్గుతుంది
76. కింది తరంగాలను తరంగదైర్ఘ్యాల ఆరోహణ క్రమంలో అమర్చినప్పుడు సరైన క్రమాన్ని సూచించేది?
1. పరారుణ 2. అతినీలలోహిత
3. దృశ్యకాంతి 4. X-కిరణాలు
ఎ) 4,3,2,1 బి) 4,2,3,1
సి) 2,4,3,1 డి) 2,4,1,3
77. దృశ్యకాంతి తరంగదైర్ఘ్యాల వ్యాప్తి?
ఎ) 0.3 – 0.7
బి) 0.4 – 0.7
సి) 0.3 nm – 0.7 nm
డి) 0.4 nm – 0.7 nm
78. స్ఫటికాల్లో పరమాణువుల మధ్యదూరాన్ని గణించడానికి ఉపయోగపడే కిరణాలు?
ఎ) గామా కిరణాలు బి) X-కిరణాలు
సి) దృశ్య కాంతి
డి) పరారుణ కిరణాలు
79. పదార్థంలోకి ఎక్కువ లోతుగా చొచ్చుకుపోగల విద్యుదయస్కాంత తరంగాలు?
ఎ) అతినీలలోహిత బి) పరారుణ
సి) X-కిరణాలు
డి) గామా కిరణాలు
80. ఒక ఆంగ్‌స్ట్రామ్ ఎన్ని నానోమీటర్లకు సమానం?
ఎ) 10 బి) 100
సి) 1000 డి) 10000
81. ఓజోను పొర అడ్డుకునే తరంగాలు ఏవి?
ఎ) అతి నీలలోహిత బి) పరారుణ
సి) X-కిరణాలు డి) గామా కిరణాలు
82. సూర్యుని నుంచి భూమికి వేడి ఏ తరంగాల రూపంలో వస్తుంది?
ఎ) అతి నీలలోహిత బి) పరారుణ
సి) విశ్వకిరణాలు
డి) గామా కిరణాలు
83. RADAR పూర్తి రూపం?
ఎ) Radio Detection and Ranging
బి) Radio Analysis Detection and Recording
సి) Radio Detection and Recording
డి) Radio Analysis Detection and Ranging
84. రేడియోగ్రఫీలో ఉపయోగపడేవి?
ఎ) గామా కిరణాలు
బి) X-కిరణాలు
సి) పరారుణ కిరణాలు
డి) UV కిరణాలు
85. కింది వాటిలో దేన్ని ‘లోడ్‌స్టోన్’ అని కూడా పిలుస్తారు?
ఎ) సహజ అయస్కాంతం
బి) కృత్రిమ అయస్కాంతం
సి) విద్యుత్ అయస్కాంతం
డి) పైవన్నీ
86. ప్రకృతిలో సహజంగా దొరికే అయస్కాంత ఖనిజం ఏది?
ఎ) బాక్సైట్ బి) ఇల్మనైట్
సి) మాగ్నటైట్ డి) క్వార్ట్ ్జ
87. కింది వాటిలో అయస్కాంత పదార్థం ఏది?
ఎ) ఇనుము బి) గెడలోనియం
సి) డిస్ప్రోసియం డి) పైవన్నీ
88. కింది వాటిలో అయస్కాంత పదార్థం కానిది?
ఎ) ఆల్నికో బి) మెగ్నీషియం
సి) నికెల్ డి) కోబాల్ట్
89. నౌకల్లో కంటెయినర్లను ఎక్కించడానికి, దించడానికి క్రేన్లలో ఉపయోగించే అయస్కాంతాలు?
ఎ) శాశ్వత అయస్కాంతాలు
బి) సహజ అయస్కాంతాలు
సి) విద్యుదయస్కాంతాలు
డి) పైవన్నీ
90. అన్నింటి కంటే శక్తిమంతమైన అయస్కాంతం కింది వాటిలో ఏది?
ఎ) విద్యుత్ అయస్కాంతం
బి) సహజ అయస్కాంతం
సి) ఆల్నికో
డి) ఇనుము
91. అయస్కాంతాలకు సంబంధించి కింది వాటిలో సరైనది?
ఎ) సజాతి ధృవాలు వికర్షించుకుంటాయి
బి) అయస్కాంతంలో ఎప్పుడూ రెండు ధ్రువాలుంటాయి
సి) స్వేచ్ఛగా వేలాడదీసిన అయస్కాంతం ఎప్పుడూ ఉత్తర-దక్షిణ దిశలను చూపిస్తుంది
డి) పైవన్నీ
92. అయస్కాంత దిక్సూచి కింది ఏ ధర్మం ఆధారంగా పనిచేస్తుంది?
ఎ) ధ్రువ ధర్మం
బి) జంటధ్రువాల ధర్మం
సి) దిశా ధర్మం
డి) ప్రేరణ ధర్మం
93. అయస్కాంతాల్లో అయస్కాంతత్వం ఎక్కడ బలంగా ఉంటుంది?
ఎ) చివరల వద్ద
బి) మధ్యలో
సి) అన్ని ప్రదేశాల్లో సమానంగా ఉంటుంది
డి) అయస్కాంత ఆకారాన్ని బట్టి
మారుతుంది
94. ఒక ఇనుప కడ్డీ అయస్కాంతమో, కాదో తెలుసుకోవడానికి సరైన పరీక్ష?
ఎ) ఆకర్షణ బి) వికర్షణ
సి) ప్రేరణ డి) పైవన్నీ
95. ఒక అయస్కాంతం తన అయస్కాంతత్వ ధర్మాన్ని కోల్పోయే ఉష్ణోగ్రతను ఏమంటారు?
ఎ) క్యూరీ బి) పియరీ
సి) తటస్థ డి) విభజన
96. ఇనుము క్యూరీ ఉష్ణోగ్రత?
ఎ) 5500 C బి) 6600 C
సి) 7700 C డి) 8800 C
97. కింది వాటిలో డయా అయస్కాంత పదార్థం ఏది?
ఎ) బంగారం బి) రాగి
సి) నీరు డి) పైవన్నీ
98. కింది వాటిలో ఫెర్రో అయస్కాంత పదార్థం కానిదేది?
ఎ) నికెల్ బి) కోబాల్ట్
సి) డిస్ప్రోసియం డి) క్రోమియం
99. ఇనుప కడ్డీని అయాస్కాంతంగా మారిస్తే దాని పొడవు ఎంత?
ఎ) కొద్దిగా పెరుగుతుంది
బి) కొద్దిగా తగ్గుతుంది
సి) 3/4 వంతుకు తగ్గుతుంది
డి) మారదు
100. ఒక అయస్కాంతం తన అయస్కాంతత్వాన్ని కోల్పోవడానికి సరైన కారణం?
ఎ) ఎక్కువ కాలం సజాతి ధృవాలను కలిపి ఉంచడం
బి) ఎక్కువ ఎత్తు నుంచి కిందికి పడవేయడం
సి) ఎక్కువ ఉష్ణోగ్రతకు వేడి చేయడం
డి) పైవన్నీ
101. భూ అయస్కాంతానికి సంబంధించి సరైన వాక్యం ఏది?
ఎ) భూ అయస్కాంత ఉత్తర ధ్రువం
భౌగోళిక ఉత్తరం వైపు ఉంటుంది
బి) భూ అయస్కాంత ఉత్తర ధ్రువం
భౌగోళిక తూర్పు వైపు ఉంటుంది
సి) భూ అయస్కాంత ఉత్తర ధ్రువం
భౌగోళిక పడమర వైపు ఉంటుంది
డి) భూ అయస్కాంత ఉత్తర ధ్రువం
భౌగోళిక దక్షిణం వైపు ఉంటుంది
102. దిక్సూచి ఎప్పుడూ ఉత్తర, దక్షిణాలను సూచించడానికి కారణం?
ఎ) భూమి పై ఉండే వాతావరణం
బి) భూమి ఒక అయస్కాంతం లాగా
పనిచేయడం
సి) భూమి సూర్యుని చుట్టూ తిరగటం
డి) భూమి భ్రమణం చెందడం
103. భూమి భౌగోళిక అక్షానికి అయస్కాంత అక్షానికి మధ్య గల కోణం?
ఎ) దిక్పాతం బి) అవపాతం
సి) అనుపాతం డి) ప్రతిపాతం
104. భూ అయస్కాంత భూమధ్యరేఖ దేశంలో ఏ ప్రాంతం నుంచి వెళుతుంది?
ఎ) తుంబా బి) హైదరాబాద్
సి) శ్రీహరికోట డి) డెహ్రాడూన్
105. ఒకే దిక్పాతం గల ప్రాంతాలను కలుపుతూ గీసిన రేఖలను ఏమంటారు?
ఎ) ఐసోబార్స్ బి) ఐసోటోన్
సి) ఐసోక్లీనిక్లు డి) ఐసోగోనిక్లు
106. ఒకే అవపాతం గల ప్రాంతాలను
కలుపుతూ గీసిన రేఖలను ఏమంటారు?
ఎ) ఐసోబార్లు బి) ఐసోటోప్లు
సి) ఐసోక్లీనిక్లు డి) ఐసోగోనిక్లు
107. మాగ్నటైట్ రసాయన ఫార్ములా?
ఎ) Fe2O3 బి) Fe3O4
సి) FeSO4 డి) FeO
108. 10 సెం.మీ. పొడవు గల అయస్కాంతాన్ని 5 సెం.మీ. పొడవు గల రెండు అయస్కాంతాలుగా విడగొట్టి మొదటి అయస్కాంతంతో పోలిస్తే ముక్కల ధ్రువసత్వాలు ఏవిధంగా ఉంటాయి?
ఎ) సగం బి) రెట్టింపు
సి) నాలుగింతలు డి) మారదు
109. ఒక దండయస్కాంతాన్ని అక్షీయ రేఖ వెంబడి రెండు సమాన భాగాలుగా చీల్చితే ఆ ముక్కల ధ్రువసత్వం ఏమవుతుంది?
ఎ) సగం బి) రెట్టింపు
సి) నాలుగింతలు డి) మారదు
110. కొంతదూరంలో ఉన్న రెండు అయస్కాంత ధ్రువాల మధ్య ‘F’ బలం పనిచేస్తుంది. ఆ రెండు ధ్రువాల మధ్య దూరాన్ని సగానికి తగ్గిస్తే వాటి మధ్య పనిచేసే బలం ఏమవుతుంది?
ఎ) F/2 బి) F సి) 2F డి) 4F
111. దండయస్కాంతం వల్ల ఎన్ని తటస్థ బిందువులు ఏర్పడతాయి?
ఎ) 1 బి) 2
సి) 3 డి) 4
తెలుగు అకాడమీ సౌజన్యంతో
- Tags
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు