ఎక్కువగా లవణీయతను కలిగిన ప్రవాహాలు?
సముద్ర ఉపరితల క్షితిజ సమాంతర ఉష్ణోగ్రత విస్తరణ
- ఇది అన్ని ప్రాంతాల్లోను, అన్ని రుతువుల్లోను, అన్ని సముద్రాల్లోను ఒకే విధంగా ఉండదు.
- కింది అంశాలను బట్టి మారుతుంది.
అక్షాంశం
- అయనరేఖా అధిక పీడన మండలంలోని సముద్ర జలాలు గరిష్ఠ ఉష్ణోగ్రత కలిగి ఉంటాయి. ఇక్కడి జల ఉష్ణోగ్రత 33 డిగ్రీల సెంటిగ్రేడ్ వరకు ఉంటుంది.
- ఈ ప్రాంతం నుంచి ధృవాల వైపుగాని, భూమధ్య రేఖ వైపుగాని వెళ్లేకొద్ది ఉష్ణోగ్రతలు తగ్గుతుంటాయి.
- ధృవ ప్రాంతాల్లో సముద్ర జలాలు ఉష్ణోగ్రత సుమారు -17 డిగ్రీల సెంటిగ్రేడ్ భూమధ్య రేఖ ప్రాంతంలో దాదాపు 26.7 డిగ్రీ సెంటిగ్రేడ్ వరకు ఉంటుంది.
- భూమధ్య రేఖా మండలంలో సూర్యకిరణాలు నిట్టనిలువుగా పడినప్పటికి అధికంగా కురిసే సంవహన వర్షాల వల్ల అయనరేఖా మండలంలోని ఉష్ణోగ్రత కన్నా ఇక్కడ ఉష్ణోగ్రత తక్కువగా ఉంటుంది.
2) రుతువుల్లో మార్పు
రుతువుల ప్రభావం జలభాగం కంటే భూ భాగంపైనే అధికంగా ఉంటుంది. 200-300 అక్షాంశాల మధ్య సముద్ర నీటిలో నమోదైన రుతువుల మధ్య తారతమ్య ఉష్ణోగ్రత 1.2 డిగ్రీల సెంటిగ్రేడ్, అత్యధిక రుతు తారతమ్యాలు అట్లాంటిక్‌లోని న్యూఫౌండ్‌ల్యాండ్ వద్ద 4.5 డిగ్రీల సెంటిగ్రేడ్ నమోదయ్యాయి.
3) భూపరివేష్టిత సముద్ర జలాలు
అత్యధిక సముద్ర ఉష్ణోగ్రత భూమధ్య సముద్ర వేసవి సగటు ఉష్ణోగ్రత 29 డిగ్రీల సెంటిగ్రేడ్ అయినప్పటికీ ఎర్రసముద్రంలో 38 డిగ్రీల సెంటిగ్రేడ్ నమోదయ్యింది.
4) సముద్ర ప్రవాహాలు
- సముద్రాల్లోని శీతల, ఉష్ణజల ప్రవాహాలు, అవి ప్రయాణించే ప్రదేశాల్లోని ఉష్ణోగ్రతను ప్రభావితం చేస్తాయి. ఉదా: ఉత్తర అట్లాంటిక్ ప్రవాహం వల్ల ఇంగ్లండ్, నార్వే తీర ప్రాంతంలో ఉష్ణోగ్రత మామూలుగా ఉండాల్సిన దానికంటే 10 డిగ్రీల నుంచి 20 డిగ్రీల సెంటిగ్రేడ్ వరకు అధికంగా ఉంటుంది.
- ఈ ప్రభావం శీతాకాలంలో ఎక్కువగా కనిపిస్తుంది. అదేవిధంగా లాబ్రడార్ శీతల జల ప్రవాహం వల్ల అట్లాంటిక్ పశ్చిమ తీరంలో ఉష్ణోగ్రతలు తక్కువగా ఉంటున్నాయి.
- ఉష్ణ ప్రవాహాల మూలంగా ఉష్ణోగ్రత పెరగడమే కాక వర్షపాతం కూడా పెరుగుతుంది.
- శీతల ప్రవాహాల వల్ల తీర ప్రాంతాలకు ఉష్ణోగ్రత తగ్గడంతో పాటు ఆ ప్రాంతంలో వర్షపాతం తగ్గి, కొన్ని ప్రాంతాలు ఎడారులుగా మారుతున్నాయి.
ఉదా: కలహారి, అటకామా ఎడారులు
5) పవనాలు
సముద్ర ఉష్ణోగ్రతకు మార్పును కలుగజేస్తున్నాయి. ఉదా-1: వ్యాపార పవనాలు 15…0-35…0 అక్షాంశాల మధ్య ఖండాల పశ్చిమ తీర ప్రాంతాల్లోని నీటిని అవి వీచే దిశగా నెట్టుకెళ్లడం వల్ల, ఆయా ఖండతీర సముద్ర అడుగు భాగం నుంచి చల్లని నీరుపైకి వస్తుంది.
ఉదా-2: 45 డిగ్రీల నుంచి ధృవాల వైపు ఖండాల పశ్చిమ భాగంలో వేడిగాను, తూర్పు భాగంలో చల్లగాను సముద్రపు నీరు ఉంటుంది. ఇది పశ్చిమ పవనాల ప్రభావం వల్ల ఇలా జరుగుతుంది.
6) మంచుకొండలు
ధృవాల నుంచి మంచుకొండలు నీటిలో తేలుతూ దాదాపు 50 డిగ్రీల అక్షాంశం వరకు ప్రయాణం చేస్తాయి.
మంచుకొండల పరిమాణంలో ఒక భాగం నీటి మట్టానికి పైన ఉండి 8 భాగాలు నీటిలో మునిగి ఉంటాయి. ఉత్తర అట్లాంటిక్‌లో వేలాది తేలుతున్న మంచుకొండలు కనిపిస్తాయి.
సముద్ర ఊర్ధ ఉష్ణోగ్రతల విస్తరణ
సముద్ర జల ఉష్ణోగ్రత లోతుకు వెళ్లేకొద్ది తగ్గుతుంది.
100 మీటర్ల లోతు వరకు ఉష్ణోగ్రత ఉపరితల ఉష్ణోగ్రతలను పోలి ఉంటుంది. ఇంకా లోతుకు వెళ్లినట్లయితే సాధారణంగా తగ్గుతుంది. కారణం సముద్ర ప్రవాహాల ప్రభావం సూర్యకిరణాల సౌరశక్తిలో దాదాపు 90 శాతం శక్తిని సముద్ర ఉపరితలం నుంచి 60 అడుగుల లోతు వరకు ఉన్న ప్రాంతం గ్రహిస్తుంది. అందువల్ల సముద్ర చలనం ఎంతగా ఉన్నప్పటికీ సముద్రంలో లోపలి భాగం అతిశీతలంగా ఉంటుంది.
దాదాపు సముద్రాల్లోని 80 శాతం నీటి ఉష్ణోగ్రత స్థిరంగా 4.5 డిగ్రీల సెంటిగ్రేడ్ కంటే తక్కువగా ఉంటుంది.
2000 మీ. వరకు ఉష్ణోగ్రత శీఘ్రగతిన తగ్గి దీనికి దిగువన మాత్రం దాదాపు స్థిరంగా ఉంటుంది.
n అన్ని సముద్రాల్లోను అట్టడుగు నీరు ధృవ ప్రాంతాల నుంచి మంచుగడ్డలు కరగడం వల్ల ఏర్పడిన అతి చల్లని నీటితో వ్యాపించి ఉన్నాయి.
n భూమధ్య రేఖ నుంచి ధృవాల వైపు వెళ్లిన కొద్ది ఊర్ధ ఉష్ణోగ్రత తగ్గుతుంది. తగ్గుదల రేటు ధృవాల వద్ద కంటే భూమధ్యరేఖ వద్ద అధికంగా ఉంటుంది.
దైనిక ఉష్ణోగ్రత వ్యత్యాసం
సౌరశక్తి, ఉష్ణవికిరణం మధ్యగల సంతులనమే దైనిక సంవత్సర ఉష్ణోగ్రత వ్యత్యాసాలను నియంత్రిస్తుంది. ఇది రుతువులను బట్టి మారుతుంది.
ఈ వ్యత్యాసం వాయుస్థితి ఆకార నిర్మలత్వం, సముద్ర ఉపరితల స్వభావం వంటి అంశాలపై ఆధారపడి ఉంటుంది.
ఆకాశం నిర్మలంగా ఉండి ప్రతి చక్రవాత పరిస్థితులు ఏర్పడి అంతే దైని ఉష్ణోగ్రత వ్యత్యాసం ఎక్కువగా ఉంటుంది. గరిష్ఠ ఉష్ణోగ్రత మధ్యాహ్నం రెండు గంటల సమయంలో, కనిష్ఠ ఉష్ణోగ్రత ఐదు గంటల సమయంలో ఉంటుంది.
పసిఫిక్ మహాసముద్రంలోని ఉష్ణోగ్రతల తేడాల వల్ల ఏర్పడే ‘ఎల్ నినో, లా నినా’ల వల్ల భారత దేశ నైరుతి రుతుపవనాలు ప్రభావితమవుతాయి.
సాధారణంగా మహాసముద్రాల ఉష్ణోగ్రత 2 డిగ్రీల నుంచి 29 డిగ్రీల సెంటిగ్రేడ్ మధ్య ఉంటుంది. మొదటి ఒక కి.మీ. లోతుకు ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతాయి. 5 కి.మీ. లోతు వరకు ఉష్ణోగ్రతలు క్రమేపి తగ్గుతాయి. ఇంకా లోతుల్లో సుమారు 2 డిగ్రీల సెంటిగ్రేడ్ వద్ద ఉంటాయి.
మహాసముద్రాల లవణీయత
సముద్రాల్లో కలిసే నదులు శిలల నుంచి ప్రవహించినప్పుడు అది శైథిల్య క్రియ వల్ల అనేక లవణాలను గ్రహించి సముద్రంలోకి చేరుస్తాయి. అందువల్ల సముద్రాల్లో నీరు ఉప్పగా ఉంటుంది. ఈ ఉప్పదనాన్ని లవణీయత అంటారు.
ఈ లవణీయత అన్ని సముద్రాల్లో ఒకే రకంగా ఉండక వేర్వేరుగా ఉంటుంది. అలాగే సముద్రం పై భాగాన ఉప్పునీరు, లోతుగా ఉన్న నీటికంటే ఎక్కువ లవణీయత కలిగి ఉంటుంది.
100 గ్రాముల సముద్రపు నీటిలో కరిగా ఉన్న లవణాల మొత్తం పరిమాణాన్ని లవణీయత అంటారు. 1000 గ్రాముల నీటిలో 35 గ్రాముల లవణీయత ఉన్నట్లయితే దాన్ని సామాన్య లవణీయత అంటారు.
సముద్రపు లవణీయతలో మార్పు కింది కారణాలపై ఆధారపడి ఉంటుంది.
సముద్రంలోని నీరు ఆవిరి కావడం: ఉష్ణోగ్రత పెరిగినట్లయితే నీరు అధికంగా ఆవిరి అవుతుంది. మిగిలిన నీటిలో లవణాల సాంద్రత ఎక్కువై లవణీయత పెరుగుతుంది.
ఉప అయనరేఖా అధిక పీడన ప్రాంతాల్లో గాలి పొడిగాను, ఆకాశం నిర్మలంగాను పవనాలు వేగంగాను వీయడం వల్ల నీరు ఎక్కువగా ఆవిరిగా మారి సముద్ర లవణీయత ఎక్కువగా ఉంటుంది.
వర్షపాతం: అధిక వర్షపాతం లవణీయతను తగ్గిస్తుంది. అందువల్ల ఎక్కువ వర్షపాతం వచ్చే భూమధ్యరేఖా ప్రాంతంలో ఎక్కువ మంచుపడే ధృవ ప్రాంతంలో లవణీయత తక్కువగా ఉంటుంది.
భూమధ్యరేఖా ప్రాంతంలో లవణీయత 33-34 శాతం వరకు ఉండగా, ధృవ ప్రాంతాల్లో 25-10 శాతం వరకు ఉంటుంది. తక్కువ వర్షపాతం పడే ఉప అయనరేఖ అధిక పీడన ప్రాంతాల్లో లవణీయత ఎక్కువగా 36-37 శాతం ఉంటుంది.
నదులు సముద్రంలో కలవడం: పెద్ద పెద్ద నదులు సముద్రాల్లో కలవడంవల్ల లవణీయత తక్కువగా ఉంటుంది. ఉదా: అమెజాన్, మిసిసిపి, నైలు, గంగా నదుల ముఖద్వారాల వద్ద సముద్ర లవణీయత తక్కువగా ఉంటుంది.
సముద్ర ప్రవాహాలు: ఉష్ణ ప్రవాహాలు భూమధ్యరేఖ నుంచి ధృవాలవైపు, శీతల ప్రవాహాలు ధృవాల నుంచి భూమధ్యరేఖ వైపు ప్రయాణిస్తాయి.
సాధారణంగా ఉష్ణ ప్రవాహాలు ఎక్కువగా లవణీయతను, శీతల ప్రవాహాలు తక్కువ లవణీయతను కలిగి ఉంటాయి.
సముద్రపు లవణీయత విస్తరణ భూమధ్యరేఖా ప్రాంతంలో ఆవిరయ్యే సముద్రపు నీటి కంటే, వర్షం వల్ల సంభవించే నీరు ఎక్కువగా ఉంటుంది.
అందువల్ల ఈ ప్రాంతం సముద్ర లవణీయత 34 శాతం ఉంటుంది. ఈ ప్రాంతంలో లవణీయత సామాన్య లవణీయత కంటే తక్కువగా ఉండటానికి కారణం ఎక్కువ రోజులు ఆకాశం మేఘావృతమై ఉండటం, నీరు ఎక్కువగా ఆవిరి కాకపోవడం వాతావరణంలో ఆర్ధ్రత ఎక్కువగా ఉండటం.
వ్యాపార పవనాలు వీచే అక్షాంశాల ప్రాంతంలో లవణీయత అధికంగా 36 శాతం ఉంటుంది. కారణం వర్షపాతం తక్కువగా ఉండటం, వాతావరణం నిర్మలంగా, గాలి పొడిగా ఉండటంవల్ల నీరు అధికంగా ఆవిరి కావడం.
సమశీతోష్ణ ధృవ ప్రాంతాల్లో లవణీయత తక్కువగా ఉంటుంది. అనేక నదులు సముద్రాల్లో కలవడం నిరంతరం మంచు కురవడం ధృవ మంచు కరిగి అతి తక్కువ లవణీయత గల నీరు సముద్రంలో కలవడం వల్ల ఆర్కిటిక్, అంటార్కిటిక్ సముద్రాల్లో లవణీయత 20 శాతం వరకు ఉంది. అలాగే ధృవాలవైపు వెళ్లేకొద్ది ఉష్ణోగ్రత తగ్గడం వల్ల నీరు ఆవిరి కావడం కూడా తక్కువగా ఉంటుంది. నదుల వల్ల మంచినీరు సముద్రాల్లో కలవడం వల్ల ఖండతీర ప్రాంతాల్లో లవణీయత తక్కువగా ఉంటుంది.
భూపరివేష్టిత సముద్రాలు-లవణీయత
నీటి లవణీయతపై అక్షాంశాల ప్రభావం అంతగా ఉండదు. మధ్యధరా సముద్రం, ఎర్ర సముద్రం, బాల్టిక్ సముద్రాలు భూభాగంలో ఆవరించి సన్నని ముఖద్వారాలతో కూడి ఉన్నాయి.
మధ్యధరా సముద్రంలో జిబ్రాల్టర్ జలసంధి వద్ద లవణీయత 36.5 శాతం ఉండగా తూర్పు సిరియా తీరంలో 39 శాతం ఉంది.
ఎర్ర సముద్రంలో దక్షిణ తీరంలో 36.5 శాతం ఉండగా పర్షియన్ సింధు శాఖ వద్ద 36-41 శాతం మధ్య ఉంది.
బాల్టిక్ సముద్రంలో ఫిన్లాండ్ సింధు శాఖ వద్ద లవణీయత 10 శాతం కంటే తక్కువగా ఉంది. ఇది అతిశీతల మండలంలో ఉండటం వల్ల తక్కువగా నీరు ఆవిరి అవడం, పెద్ద నదులు దీనిలో కలవడం కారణం.
ఖండాంతర్గత సముద్రాలు, సరస్సుల లవణీయత
ఇవి అధిక లవణీయతను కలిగి ఉంటాయి. ఉదా: జోర్డాన్‌లోని మృతసముద్రం లవణీయత 23.7 శాతం వరకు ఉంది.
అధిక ఉష్ణోగ్రతల వల్ల నీరు ఎక్కువగా ఆవిరి కావడం, ఎడారి కావడం వల్ల నదులేవీ లేకపోవడం, ఖండాల మధ్యన ఉండటం వల్ల, ఇతర సముద్రాల్లోని నీటిలో కలవకపోవడం వల్ల నీటిలో అత్యధిక లవణీయత ఉంది.
ఒకే సరస్సులో వివిధ ప్రాంతాల్లో లవణీయత భేదాలు ఉండవచ్చు. ఉదా: కాస్పియన్ సముద్ర ఉత్తర భాగంలో లవణీయత 14 శాతం ఉంటే తూర్పు భాగంలో 17 శాతం ఉంది.
లవణీయత అనే పదం 1000 గ్రాముల సముద్రపు నీటిలో ఎంత ఉప్పు (గ్రాముల్లో) కలిగి ఉందో సూచిస్తుంది. దీన్ని సాధారణంగా వెయ్యిలో ఎంత మోతాదు (పార్ట్ పర్ థౌజెండ్-పీపీటీ-శాతం 0)గా వ్యక్తపరుస్తారు.
సముద్రపు నీటిలో పెద్ద మొత్తంలో కరిగిన ఖనిజాలు ఉంటాయి. వీటిలో ఉప్పు ఒక్కటే 77.8 శాతం ఉంటుంది.
అధిక నీటి లవణీయత
1) సముద్రపునీరు, ఉప్పునీటి సరస్సు- 30-50 శాతం
2) నదీముఖ ద్వారాలు, చిత్తడిభూములు, మడ అడవులు- 5-30 శాతం
3) ఎర్రసముద్రం- 40 శాతం
4) మధ్యధరా సముద్రం- 35 శాతం
5) సాధారణ లవణీయత- 35 శాతం
6) నల్లసముద్రం- 15 శాతం
7) బాల్టిక్ సముద్రం- 8 శాతం
8) వ్యవసాయ నీరు- 3 శాతం
9) నదుల నీటిలో- 2 శాతం
10) తాగునీరు- 1 శాతం
ప్రపంచంలో అత్యధిక లవణీయతగల జలభాగాలు
- వాన్ సరస్సు (తుర్కియే (టర్కీ))- 330 శాతం
- మృత సముద్రం (ఇజ్రాయెల్)- 238 శాతం
- మహాలవణ సరస్సు (అమెరికా)- 220 శాతం
- తక్కువ లవణీయత జలభాగాలు
- బాల్టిక్ సముద్రం- 3-15 శాతం
- హడ్సన్ అఖాతం- 3-15 శాతం
- సమలవణీయతా రేఖ: సముద్రంలో ఒకే లవణీయత ఉన్న ప్రాంతాలను కలిపే రేఖ. దీన్ని సమ లవణీయత రేఖ (Isohaline)

03
-జీ గిరిధర్
సీనియర్ ఫ్యాకల్టీ ఫైవ్ మంత్ర ఇన్స్టిట్యూట్
అశోక్‌నగర్ 9966330068
- Tags
- nipuna news
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు






