గోండ్వానా భూభాగంలో భాగంకాని ప్రాంతం ఏది?
1. కింది వాటిలో సరికానిది ఏది?
ఎ) అగ్నిశిలలు కఠినమైన స్వభావాన్ని కలిగి ఉండి స్పటికాలుగా ఏర్పడటానికి వీలుగా ఉంటాయి
బి) అవక్షేప శిలలు కఠినమైన స్వభావాన్ని కలిగి ఉండి స్పటికాలుగా ఏర్పడటానికి వీలుగా ఉంటాయి
సి) అవక్షేప శిలలు కఠినమైన స్వభావాన్ని కలిగి ఉండి స్పటికాలుగా ఏర్పడతాయి
డి) అవక్షేప శిలలు సచ్చిద్ర శిలలు అగ్నిశిలలు అచిద్రశిలలు
2. ఎగువ ప్రావారపు పొరకు దిగువ ప్రావారపు పొరకు మధ్యగల ప్లాస్టిక్ ధర్మాలు కలిగి ఉండే భూభాగాన్ని ఏమంటారు?
ఎ) ఎస్తనోస్పియర్ బి) లిథోస్పియర్
సి) అశ్మావరణం డి) ఏదీకాదు
3. జతపరచండి?
1) తేలికైన గ్రానైట్ శిలలతో ఏర్పడినవి (సియాల్) ఎ) ఖండ భూతలాలు
2) బరువైన ఐస్టాల్ శిలలతో ఏర్పడినవి బి) సముద్ర భూతలాలు
3) భూ పటలం ఎగువ ప్రావారపు పొరను కలిపి ఏమంటారు సి) శిలావరణం
ఎ) 1-ఎ, 2-సి, 3-బి బి) 1-ఎ, 2-బి, 3-సి
సి) 1-సి, 2-బి, 3-ఎ డి) 1-బి, 2-ఎ, 3-సి
4. జతపరచండి?
1) భూపటలం, భూ ప్రావారం మధ్యగల సరిహద్దు ఎ) గుట్బెర్గ్ విచ్ఛిన్నతల
2) భూప్రావారం, భూ కేంద్రం మధ్యగల సరిహద్దు బి. మెహరోవిక్ విచ్ఛిన్నత
3) సియాల్, సిమా పొరలను వేరు చేస్తున్న సరిహద్దు సి) కాండ్రిడ్ విచ్ఛిన్నత
ఎ) 1-ఎ, 2-బి, 3-సి బి) 1-ఎ, 2-సి, 3-బి
సి) 1-బి, 2-ఎ, 3-సి డి) 1-బి, 2-సి, 3-ఎ
5. కిందివాటని జతపరచండి?
1) భూ ఉపరితలం నుండి 40 కి.మీ. ఎ. భూకేంద్ర మండలం
లోతు వరకు విస్తరించిన పొర
2) భూపటలం నుంచి సగటున 2900 కి.మీ. బి. భూ ప్రావారం
లోతు వరకు విస్తరించిన పొర
3) భూ ప్రావారం నుంచి పగటున 3500 కి.మీ. లోతు సి. భూ పటలం
వరకు విస్తరించిన పొర
ఎ) 1-సి, 2-ఎ, 3-బి బి) 1-బి, 2-సి, 3-ఎ
సి) 1-సి, 2-బి, 3-ఎ, డి) 1-ఎ, 2-బి, 3-సి
6. భూ పటలంలో అధికంగా ఉండే మూలకాల వరుస క్రమం ఏది?
ఎ) ఆక్సిజన్, అల్యూమినియం, ఐరన్, సిలికాన్
బి) ఆక్సిజన్, సిలికాన్, అల్యూమినియం, ఐరన్
సి) ఐరన్, ఆక్సిజన్, అల్యూమినియం, సిలికాన్
డి) సిలికాన్, అల్యూమినియం, ఐరన్, ఆక్సిజన్
7. భూమి లోపల అధికంగా ఉండే మూలకం ఏది?
ఎ) ఐరన్ బి) సిలికాన్
సి) ఆక్సిజన్ డి) అల్యూమినియం
8. కింది వాటిలో సరికానిది ఏది?
ఎ) భూ పటలం అత్యంత తేలికైన ప్రాంతం
బి) భూ ప్రావారం అత్యంత బరువైన ప్రాంతం
సి) భూ పటలాన్ని బాహ్యపొర (వెలుపలి పొర) అని అంటారు
డి) ఏదీకాదు
9. కిందివాటిని జతపరచండి.
1) భూ పటలం ఎ) సిమా (సిలికాన్, మెగ్నీషియం)
2) భూ ప్రావారం బి) సియాలు (సిలికాన్, అల్యూమినియం)
3) భూ కేంద్ర మండలం సి) నిఫె (నికెల్, ఫెర్రస్, ఐరన్)
ఎ) 1-సి, 2-బి, 3-ఎ బి) 1-బి, 2-ఎ, 3-సి
సి) 1-బి, 2-సి, 3-ఎ డి) 1-ఎ, 2-బి, 3-సి
10. జత పరచండి.
1) బాహ్య భూ కేంద్ర మండల స్థితి ఎ) కొల్లాయిడ్ స్థితి
2) మధ్య భూ కేంద్ర మండల స్థితి బి) ద్రవ స్థితి
3) అంతర భూ కేంద్ర మండలం స్థితి సి) ఘన స్థితి
ఎ) 1-సి, 2-బి, 3-ఎ బి) 1-బి, 2-ఎ, 3-సి
సి) 1-బి, 2-సి, 3-ఎ డి) 1-ఎ, 2-బి, 3-సి
11. భూమి పరితలం నుంచి లోపలికి పోయేకొద్ది ప్రతి 32 మీటర్లకు 19 సెంటీగ్రేడ్ చొప్పున ఉష్టోగ్రత ఏమవుతుంది?
ఎ) పెరుగుతుంది బి) తగ్గుతుంది
సి) ఎలాంటి మార్పు ఉండదు
డి) ఏదీకాదు
12. భూ అంతర్భాగం లోపలికి పోయే ఉష్ణోగ్రతకు ఎలాంటి మార్పు (ఏ విధంగా) ఉండును?
ఎ) అనులోమానుపాతంలో
బి) విలోమానుపాతంలో
సి) ఎలాంటిమార్పు ఉండదు
డి) ఏదీకాదు
13. జతపరచండి?
1) భూ పటలం యొక్క విశిష్ట సాంద్రత ఎ) 9.5 నుంచి 5.5 గ్రా/ సె.మీ.3
2) భూ ప్రావారం విశిష్ట సాంద్రత బి) 4.3 నుంచి 3.5 గ్రా/ సె.మీ.3
3) భూ కేంద్ర మండలం విశిష్ట సాంద్రత సి) 5.517 నుంచి 5.5 గ్రా/ సె.మీ.3
4. భూమి సరాసరి విశిష్ట యొక్క విశిష్ట సాంద్రత వరకు డి) 11 నుంచి 18 గ్రా / సె.మీ.
ఎ) 1-ఎ, 2-సి, 3-బి, 4-డి బి) 1-బి, 2-ఎ, 3-సి, 4-డి
సి) 1-ఎ, 2-బి, 3-డి, 4-సి డి) 1-బి, 2-ఎ, 3-డి, 4-సి
14. భూ కేంద్రం వద్ద ఉష్ణోగ్రత ఎంత ఉంటుంది?
ఎ) 6000oC బి) 7000oC
సి) 6500oC డి) 7500oC
15. భూమి లోపలికి పోయే కొలది ఉష్ణోగ్రత పెరగడానికి కారణం ఏమిటి?
ఎ) రేడియోథార్మిక పదార్థాలు విచ్ఛిన్నం కావడం
బి) హాలోజన్ విచ్ఛిన్నం కావటం
సి) లాంథనైయిడ్స్ విచ్ఛిన్నం కావటం
డి) హాల్కోజన్ పదార్థాలు విచ్ఛిన్నం కావడం
16. జతపరచండి?
1) సముద్ర భూ స్వరూపాలు ఎ) సిస్టాక్స్. అఖాతాలు / బే, స్టాలక్ మైట్స్, కోన్
2) కార్డ్స్ (అంతర భూజల) బి) సైఫ్‌లు, బ్యాంక్స్/ ఇసుక దిబ్బలు, కందకాలు
భూ స్వరూపాలు
3) నదుల భూస్వరూపాలు సి) లాగూన్, మియాండర్లు, చిధ్రములు
ఎ) 1-ఎ, 2-బి, 3-సి బి) 1-ఎ, 2-సి, 3-బి
సి) 1-సి, 2-బి, 3-ఎ డి) 1-బి, 2-ఎ, 3-సి
17. జతపరచండి.
1. పక్షిపాద డెల్టా కలిగిన నది ఎ) గంగానది (భారతదేశం)
2. డిజిటల్ డెల్టా కలిగిన నది బి) మిసిసిపి నది (ఉత్తరఅమెరికా)
3. లోబెట్ డెల్టా కలిగిన నది సి) మహానది (భారతదేశం)
4. కస్పేట్ డెల్టా కలిగిన నది డి. విస్తూలనది (పొలాండ్), ఎల్బ్నది (రష్యా) ఓడర్ నది (జర్మని)
ఎ) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి బి) 1-బి, 2-ఎ, 3-డి, 4-సి
సి) 1-బి, 2-ఎ, 3-సి, 4-డి డి) 1-బి, 2-సి, 3-ఎ, 4-డి
18. కింది వాటిని జతపరచండి.
1. పవన భూస్వరూపాలు ఎ) యార్డాంగ్స్, ప్లయాలు, జోడిగుట్టలు (ఇన్సెల్ బర్గ్)
2) నదుల భూస్వరూపాలు బి) కాస్కేడ్లు కెమ్స్, హగ్బాక్లు, ప్పర్స్లు
3) హిమనీ నదాలు U ఆకారపు లోయలు సి) ఎరిటే, ఫియోర్డ్స్, హర్త్, భూస్వరూపాలు
ఎ) 1-బి, 2-ఎ, 3-సి బి) 1-ఎ, 2-సి, 3-బి
సి) 1-ఎ, 2-బి, 3-సి డి) 1-సి, 2-బి, 3-ఎ
19. జతపరచండి. (పర్వతాంతర పీఠభూమి)
1) దక్షిణ అమెరికాలోని పర్వతాంతర పీఠభూమి ఎ) మెక్సికో పీఠభూమి
2) మెక్సికోలోని పర్వతాంతర పీఠభూమి బి) బొలీవియా పీఠభూమి
3) మంగోలియాలోని పర్వతాంతర పీఠభూమి సి) మంగోలియా పీఠభూమి
ఎ) 1-సి, 2-బి, 3-ఎ బి) 1-బి, 2-ఎ, 3-సి
సి) 1-బి, 2-సి, 2-ఎ డి) 1-ఎ, 2-బి, 3-సి
20. ప్రపంచ పైకప్పు (ప్రపంచంలోనే అతి ఎత్తయిన పీఠభూమి) అని ఏ పీఠభూమిని పిలుస్తారు?
ఎ) బొలీవియా పీఠభూమి
బి) మంగోలియా పీఠభూమి
సి) పామీర్ పీఠభూమి
డి) మెక్సికో పీఠభూమి
21. లారెన్షియా భూభాగంలో భాగం కాని ప్రాంతం / ఖండం ఏది?
ఎ) ఉత్తర అమెరికా బి) యూరప్
సి) ఆసియా (దక్షిణ భారత
ద్వీపకల్పం మినహా) డి) ఏదీకాదు
22. జతపరచండి.
1. రెండు ఖండపలకలు ఎ. ముడుత పర్వతాలు దగ్గరగా వస్తే ఏర్పడే భూ స్వరూపాలు
2. రెండు సముద్ర పలకలు బి. అగాధాలు దగ్గరగా వస్తే ఏర్పడే భూ స్వరూపాలు
3. రెండు ఖండపలకలు సి. మహా సముద్రాల దూరంగా కదిలినప్పుడు ఏర్పడే భూ స్వరూపాలు
4. రెండు సముద్ర పలకలు డి. రిడ్లవి దూరంగా కదిలినప్పుడు ఏర్పడే భూ స్వరూపాలు
ఎ) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి బి) 1-ఎ, 2-సి, 3-బి, 4-డి
సి) 1-ఎ, 2-బి, 3-డి, 4-సి డి) 1-సి, 2-బి, 3-ఎ, 4-డి
23. జతపరచండి.
1) రాజస్థాన్ ఎ. అపలేచియన్
2) ఉత్తర అమెరికా బి. ఆరావళీ పర్వతాలు
3) రష్యా సి. గ్రేట్ డివైడింగ్ రేంజ్
4) ఆస్ట్రేలియా డి. యూరల్ పర్వరాలు
5) ఆఫ్రికా (మొరాకో) ఇ) అట్లాస్ పర్వతాలు
ఎ) 1-బి, 2-డి, 3-ఎ, 4-సి, 5-ఇ
బి) 1-బి, 2-ఎ, 3-డి, 4-డి, 5-ఇ
సి) 1-బి, 2-సి, 3-ఎ, 4-డి, 5-ఇ
డి) 1-బి, 2-ఎ, 3-సి, 4-డి, 5-ఇ
24. గోండ్వానా భూభాగంలో భాగంకాని ప్రాంతం ఏది?
ఎ) దక్షిణ అమెరికా, ఆఫ్రికా
బి) ఆస్ట్రేలియా, అంటార్కిటికా
సి) దక్షిణ భారత ద్వీపకల్పం డి) ఏదీకాదు
25. జతపరచండి.
1) పేంజియా భూభాగాన్ని ఆవరించి ఉన్న సముద్రం ఎ. టెథిస్
2) పేంజియాకు మధ్యలో గల భూభాగం పేరు బి. పాంథాలసా
3) టెథిస్‌కు ఉత్తరంగా ఉన్న భూభాగం పేరు సి) అంగారా (లారెన్షియా)
ఎ) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి బి) 1-బి, 2-ఎ, 3-డి, 4-సి
సి) 1-బి, 2-డి, 3-ఎ, 4-సి డి) 1-బి, 2-ఎ, 3-సి, 4-డి
26. ఖండచలన సిద్ధాంతం ప్రకారం ప్రారంభంలో ఉన్న మహా భూభాగం పేరు ఏమిటి?
ఎ) పాంథాలసా బి) పేంజియా
సి) అంగారా డి) లారెనియా
27. పర్వతాలు అవి ఉన్న రాష్ర్టాలను జతపరచండి.
1) రాజస్థాన్ ఎ) నీలగిరి కొండలు
2) జార్ఖండ్ బి) ఆరావళీ పర్వతాలు
3) తమిళనాడు సి) రాజ్ మహల్ కొండలు
ఎ) 1-ఎ, 2-బి, 3-సి
బి) 1-సి, 2-బి, 3-ఎ
సి) 1-బి, 2-సి, 3-ఎ
డి) 1-బి, 2-ఎ, 3-సి
28. కిందివాటిలో సరైనది?
ఎ) ఆఫ్గానిస్థాన్‌లోని పర్వత శ్రేణి జస్కార్ర, కారకోరం శ్రేణి
బి) ఇండియాలోని పర్వత శ్రేణి హిందూకుష్ శ్రేణి
సి) పై రెండు డి) ఏదీకాదు
29. నవీన ముడుత పర్వతాలను వాటి ఖండాలతో జతపరచండి?
1. భారత ఉపఖండం ఎ) ఆల్ఫ్స్ పర్వతాలు
2) ఐరోపా బి) హిమాలయాలు
3) ఉత్తర అమెరికా సి) రాకీ పర్వతాలు
4) దక్షిణ అమెరికా డి) అండీస్ పర్వతాలు
ఎ) 1-బి, 2-ఎ, 3-డి, 4-సి
బి) 1-బి, 2-సి, 3-ఎ, 4-డి
సి) 1-బి, 2-ఎ, 3-సి, 4-డి
డి) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
30. ఖండ పర్వతాలను జతపరచండి.
1) భారత్ ఎ) వింద్యా,
సాత్పురా పర్వతాలు
2) దక్షిణాఫ్రికా బి) డ్రాకెన్ బర్గ్
పర్వతాలు
3) ఫ్రాన్స్ సి) వాజస్ పర్వతాలు
4) జర్మనీ డి) బ్లాక్ ఫారెస్ట్ పర్వతాలు
ఎ) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
బి) 1-ఎ, 2-బి, 3-డి, 4-సి
సి) 1-ఎ, 2-సి, 3-బి, 4-డి
డి) 1-సి, 2-బి, 3-ఎ, 4-డి
సమాధానాలు
1-బి 2-ఎ 3-డి 4-సి 5-సి 6-బి 7-ఎ 8-డి 9-బి 10-బి 11-ఎ 12-ఎ 13-డి 14-ఎ 15-ఎ 16-ఎ 17-సి 18-సి 19-బి 20-సి
21-డి 22-ఎ 23-బి 24-డి 25-బి 26-బి 27-సి 28-సి 29-సి 30-ఎ
టాపర్స్ ఇన్స్టిట్యూట్, మేడిపల్లి, హైదరాబాద్ 9652578639
- Tags
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు