పదార్థ ద్వంద్వ స్వభావాన్ని వివరించిన శాస్త్రవేత్త?
ఆధునిక భౌతికశాస్త్రం
1. ఉత్సర్గనాళ ప్రయోగాన్ని నిర్వహించి పరమాణు నమూనాను వివరించిన శాస్త్రవేత్త?
ఎ) జేజే థామ్సన్ బి) రూథర్ ఫర్డ్
సి) నీల్స్ బోర్ డి) సోమర్ ఫీల్డ్
2. ఉత్సర్గ నాళంలో 0.4mm Hg పీడనం వద్ద కనిపించే చీకటి, ప్రకాశవంతమైన చారలతో నిండిన పట్టీలను ఏమంటారు?
ఎ) అబ్సిరేషన్స్ బి) స్ట్రయేషన్స్
సి) ఆసిలేషన్స్ డి) నోడ్స్
3. ఉత్సర్గనాళంలో కాథోడ్ కిరణాల వేగం?
ఎ) 0.1 C బి) 0.01 C
సి) 0.001 C డి) 0.0001 C
4. కింది వాటిలో కాథోడ్ కిరణాలు దేనిలో ఉంటాయి?
ఎ) సాధారణ టీవీ
బి) సాధారణ కంప్యూటర్ మానిటర్
సి) ట్యూబ్‌లైట్ డి) పైవన్నీ
5. కాథోడ్ కిరణాలకు సంబంధించి కింది వాటిలో సరైనది?
ఎ) జింక్ సల్ఫైడ్ తెరపై ప్రతిదీప్తిని కలుగజేస్తాయి
బి) విద్యుత్ క్షేత్రంలో ధనఫలకవైపునకు వంగుతాయి
సి) ఇవి దాదాపు కాంతి వేగంలో పదోవంతు వేగంతో ప్రయాణిస్తాయి డి) పైవన్నీ
6. న్యూట్రాన్లను కనుగొన్న శాస్త్రవేత్త?
ఎ) జేజే థామ్సన్ బి) గోల్డ్‌స్టేయిన్
సి) చాడ్విక్ డి) నీల్స్‌బోర్
7. పరమాణు కేంద్రకంలో ఉండే కణాలు?
ఎ) ఎలక్ట్రాన్లు బి) ప్రోటాన్లు
సి) న్యూట్రాన్లు డి) బి, సి
8. పరమాణు నిర్మాణాన్ని ‘సౌరమండల నమూనా’గా వివరించింది?
ఎ) జేజే థామ్సన్ బి) నీల్స్‌బోర్
సి) రూథర్‌ఫర్డ్ డి) ప్లాంక్
9. పరమాణు కేంద్రకం ఆవేశం?
ఎ) ధనావేశం బి) రుణావేశం
సి) ఆవేశం లేదు
డి) పరమాణువును బట్టి ఉంటుంది
10. పరమాణు ఆవేశం?
ఎ) ధనావేశం బి) రుణావేశం
సి) తటస్థం డి) ఎ లేదా బి
11. రూథర్ ఫర్డ్ పరమాణు నమూనాలో లోపాన్ని సరిచేసింది?
ఎ) మాక్స్ ప్లాంక్ బి) నీల్స్‌బోర్
సి) జేజే థామ్సన్ డి) చాడ్విక్
12. ప్రోటాన్ ద్రవ్యరాశి ఎలక్ట్రాన్ ద్రవ్యరాశితో పోల్చితే ఎన్నిరెట్లు ఉంటుంది?
ఎ) 1836 బి) 1386
సి) 1368 డి) 1686
13. హీలియం పరమాణు కేంద్రకాన్ని కింది విధంగా కూడా అంటారు.
ఎ) a- కణం
బి) b- కణం
సి) మెసాన్ డి) పాజిట్రాన్
14. a- కణం పై ఉండే ఆవేశం?
ఎ) 1 యూనిట్ ధనావేశం
బి) 1 యూనిట్ రుణావేశం
సి) 2 యూనిట్ల ధనావేశం
డి) 2 యూనిట్ల రుణావేశం
15. కూలిడ్జ్ నాళంలో భారలోహంతో తయారు చేసిన లక్ష్య ఫలకంపై వేగంగా చలించే ఎలక్ట్రాన్లు పతనం అయినప్పుడు ఉత్పత్తి అయ్యేవి?
ఎ) అతినీలలోహిత కిరణాలు
బి) X- కిరణాలు
సి) గామా కిరణాలు
డి) పరారుణ కిరణాలు
16. X- కిరణాల వేగం?
ఎ) కాంతి వేగం కంటే ఎక్కువ
బి) కాంతి వేగం కంటే కొద్దిగా తక్కువ
సి) కాంతి వేగంతో సమానం
డి) ధ్వని వేగంతో సమానం
17. X-కిరణాలను ఉత్పత్తి చేయడానికి కూలిడ్జ్ నాళంలోని లక్ష్యఫలకానికి ఉండాల్సిన లక్షణం?
ఎ) అధిక ద్రవీభవన ఉష్ణోగ్రత
బి) తక్కువ ద్రవీభవన ఉష్ణోగ్రత
సి) అధిక బాష్పీభవన ఉష్ణోగ్రత
డి) తక్కువ బాష్పీభవన ఉష్ణోగ్రత
18. విద్యుత్‌క్షేత్రంలో X- కిరణాల ప్రవర్తనకు సంబంధించి కింది వాటిలో సరైనది ఏది?
ఎ) ధన ఫలక వైపునకు వంగుతాయి
బి) రుణ ఫలక వైపునకు వంగుతాయి
సి) రెండు ఫలకల నుంచి దూరంగా ప్రయాణిస్తాయి
డి) ఎటువైపు వంగకుండా ప్రయాణిస్తాయి
19. కాంతి విద్యుత్ ఫలితాన్ని వివరించిన
శాస్త్రవేత్త?
ఎ) ఐన్‌స్టీన్ బి) నీల్స్‌బోర్
సి) హెర్ట్ డి) ష్రోడింజర్
20. చీకటి పడగానే తమంటతతాముగా వెలిగి, వెలుతురు రాగానే ఆరిపోయే దీపాల్లో ఇమిడి ఉన్న సూత్రం?
ఎ) కాంతి విద్యుత్ ఫలితం
బి) రామన్ ఫలితం
సి) స్టార్క్ ఫలితం డి) జీమన్ ఫలితం
21. పదార్థ ద్వంద్వ స్వభావాన్ని వివరించిన శాస్త్రవేత్త ఎవరు?
ఎ) ఐన్‌స్టీన్ బి) ప్లాంక్
సి) డీబ్రాయ్ డి) మోస్లీ
22. న్యూక్లియానులు అని వేటికి పేరు?
ఎ) ఎలక్ట్రాన్లు బి) ప్రోటాన్లు
సి) న్యూట్రాన్లు డి) బి, సి
23. పరమాణు సంఖ్యకు సరైన వివరణ?
ఎ) కేంద్రకంలోని ప్రోటాన్ల సంఖ్య
బి) కేంద్రకంలోని న్యూట్రాన్ల సంఖ్య
సి) కేంద్రకంలోని ప్రోటాన్లు, న్యూట్రాన్ల మొత్తం సంఖ్య
డి) పరమాణువులోని ఎలక్ట్రాన్లు,
ప్రోటాన్లు, న్యూట్రాన్ల మొత్తం సంఖ్య
24. పరమాణు ద్రవ్యరాశి సంఖ్య అంటే?
ఎ) ప్రోటాన్ల సంఖ్య
బి) న్యూట్రాన్ల సంఖ్య
సి) కేంద్రక కణాల సంఖ్య
డి) ఎలక్ట్రాన్లు, ప్రోటాన్లు, న్యూట్రాన్ల
మొత్తం సంఖ్య
25. ‘పరమాణు ద్రవ్యరాశి ప్రమాణము’ను ఏ విధంగా నిర్వచిస్తారు?
ఎ) C12 పరమాణు ద్రవ్యరాశిలో
1/12వ వంతు
బి) O16 పరమాణు ద్రవ్యరాశిలో
1/16వ వంతు
సి) C13 పరమాణు ద్రవ్యరాశిలో
1/13వ వంతు
డి) O17 పరమాణు ద్రవ్యరాశిలో
1/17వ వంతు
26. ఐన్‌స్టీన్ ద్రవ్యరాశి శక్తి తుల్యత సమీకరణం?
ఎ) M=EC2 బి) C=ME2
సి) C=EM2 డి) E=MC2
27. 1 పరమాణు ద్రవ్యరాశి ప్రమాణానికి సమానమైన ద్రవ్యరాశి?
ఎ) 1.66×10-24 గ్రా.
బి) 1.66×10-27 గ్రా.
సి) 1.66×10-19 గ్రా.
డి) 1.66×10-31 గ్రా.
28. 1 కి.గ్రా. ద్రవ్యరాశి విధ్వంసమైనప్పుడు ఉత్పత్తి అయ్యే శక్తి?
ఎ) 9x109J బి) 9x1012J
సి) 9x1016J డి) 9x1024J
29. 1 పరమాణు ద్రవ్యరాశి ప్రమాణం పదార్థం ఎంత శక్తికి సమానం?
ఎ) 931.5 eV బి) 931.5 KeV
సి) 931.5 MeV డి) 931.5 GeV
30. సహజ రేడియో ధార్మికతను ప్రదర్శించే మూలకాల పరమాణు సంఖ్య ఎంతకంటే ఎక్కువగా ఉంటుంది?
ఎ) 49 బి) 64 సి) 81 డి) 82
31. ‘పిచ్ బ్లెండ్’ ఏ మూలకం ఖనిజం?
ఎ) ఇనుము బి) పాదరసం
సి) బంగారం డి) యురేనియం
32. పరమాణు కేంద్రకం నుంచి ఉద్భవించే ఎలక్ట్రాన్లను ఏమంటారు?
ఎ) a- కణాలు
బి) b- కణాలు
సి) మెసాన్లు
డి) మ్యూయాన్లు
33. a- కణాలకు సంబంధించి కింది వాటిలో సరైన వివరణ కానిదేది?
ఎ) ప్రోటాన్ ద్రవ్యరాశికి 4 రెట్లు ఉంటాయి
బి) విద్యుత్‌క్షేత్రంలో రుణఫలక వైపునకు వంగి ప్రయాణిస్తాయి
సి) అయస్కాంత క్షేత్రంలో రుజుమర్గంలో ప్రయాణిస్తాయి
డి) ప్రోటాన్ ఆవేశానికి 2 రెట్లు ఆవేశం ఉంటుంది
34. గామా( కిరణాల వేగం (c = కాంతి వేగం)?
ఎ) 0.1 c బి) c
సి) 2c డి) 0.5 c
35. రేడియో ధార్మిక కేంద్రకం ఒక బీటా కణాన్ని ఉద్గారం చేసినప్పుడు దాని పరమాణు సంఖ్య?
ఎ) 1 యూనిట్ తగ్గుతుంది
బి) 1 యూనిట్ పెరుగుతుంది
సి) 2 యూనిట్లు తగ్గుతుంది
డి) మారదు
36. రేడియోధార్మిక కేంద్రకం ఒక బీటా కణాన్ని ఉద్గారం చేసినప్పుడు దాని ద్రవ్యరాశి సంఖ్య?
ఎ) 1 యూనిట్ తగ్గుతుంది
బి) 1 యూనిట్ పెరుగుతుంది
సి) 2 యూనిట్లు తగ్గుతుంది
డి) మారదు
37. కింది వాటిలో కృత్రిమ రేడియోధార్మిక శ్రేణి?
ఎ) నెప్ట్యూనియం బి) యురేనియం
సి) ఆక్టీనియం డి) థోరియం
38. ఒక రేడియోధార్మిక శ్రేణిలో చివరగా ఏర్పడే స్థిర మూలకం?
ఎ) టంగ్స్టన్ బి) బేరియం
సి) క్రిప్టాన్ డి) సీసం
39. రేడియోధార్మిక జడవాయువు?
ఎ) రేడియం బి) రేడాన్
సి) థోరియం డి) హీలియం
40. అర్ధ జీవితకాలం 1 రోజుగా ఉన్న 100 గ్రాముల రేడియోధార్మిక పదార్థం నాలుగు రోజులకు ఎంతగా మిగులుతుంది?
ఎ) 50 గ్రా. బి) 25 గ్రా.
సి) 12.5 గ్రా. డి) 6.25 గ్రా.
41. కార్బన్ (146 c) అర్ధ జీవిత కాలం ఎంత?
ఎ) 5730 సం.లు బి) 7530 సం.లు
సి) 5370 సం.లు డి) 5073 సం.లు
42. ఐసోటోపులకు సంబంధించి కింది వాటిలో సరైన వివరణ?
ఎ) ఒకే పరమాణు సంఖ్యను కలిగి ఉంటాయి
బి) వేరు వేరు ద్రవ్యరాశి సంఖ్యలను కలిగి ఉంటాయి
సి) న్యూట్రాన్ల సంఖ్య వేరువేరుగా ఉంటుంది
డి) పైవన్నీ సరైనవే
43. కింది వాటిలో హైడ్రోజన్ ఐసోటోపు?
ఎ) డ్యుటీరియం బి) ట్రిటియం
సి) ఎ, బి డి) పెంటియం
44. సమాన సంఖ్యలో న్యూట్రాన్లను కలిగి ఉన్న మూలకాలను ఏమంటారు?
ఎ) ఐసోటోపులు బి) ఐసోటోనులు
సి) ఐసోబారులు డి) ఐసోమర్లు
45. 137N అనే సంకేతంతో సూచించే పరమాణువులో ఉండే న్యూట్రాన్ల సంఖ్య?
ఎ) 6 బి) 7 సి) 13 డి) 14
46. థైరాయిడ్ గ్రంథి పనితీరును పరీక్షించడానికి ఉపయోగించే ఐసోటోపు ఏది?
ఎ) కోబాల్ట్ బి) సోడియం
సి) అయోడిన్ డి) కార్బన్
47. శిలాజాల వయస్సును నిర్ధారించడానికి ఉపయోగపడే ఐసోటోపు ఏది?
ఎ) లెడ్ బి) కార్బన్
సి) సోడియం డి) కోబాల్ట్
48. భూమి, శిలల వయస్సును నిర్ధారించడానికి ఉపయోగపడే ఐసోటోపు?
ఎ) కార్బన్ బి) సోడియం
సి) క్రోమియం డి) యురేనియం
49. కింది వాటిలో రేడియోధార్మికతను కొలిచే ప్రమాణం?
ఎ) క్యూరీ బి) బెకరల్
సి) రూథర్‌ఫర్డ్ డి) పైవన్నీ
50. కేంద్రక బలాలకు సంబంధించి కింది వాటిలో సరైన వివరణ ఏది?
ఎ) ఆవేశంపై ఆధారపడవు, స్పిన్‌పై ఆధారపడతాయి
బి) అల్పవ్యాప్తి బలాలు
సి) ఆకర్షణ బలాలు డి) పైవన్నీ
51. యురేనియం కేంద్రక విచ్ఛిత్తిలో ఉపయోగపడే న్యూట్రాన్?
ఎ) ఉష్ణ న్యూట్రాన్ బి) శీతల న్యూట్రాన్
సి) తటస్థ న్యూట్రాన్ డి) వేగ న్యూట్రాన్
52. యురేనియం కేంద్రక విచ్ఛిత్తిలో వెలువడే సగటు విఘటన శక్తి ఎంత?
ఎ) 212 eV బి) 2.12 eV
సి) 212 eV డి) 212 MeV
53. అనియంత్రిత శృంఖల చర్యలో న్యూట్రాన్ల సంఖ్య ఏవిధంగా పెరుగుతుంది?
ఎ) అంకశ్రేఢిలో బి) గుణశ్రేఢిలో
సి) హరాత్మక శ్రేఢిలో డి) ఘాతాంకంగా
54. కేంద్రక రియాక్టర్లో భారజలం చేసే పని?
ఎ) చర్యావేగాన్ని నియంత్రించడం
బి) న్యూట్రాన్ల వేగాన్ని నియంత్రించడం
సి) చర్యను ప్రోత్సహించడం
డి) రక్షణ కోసం
55. భార జలం అంటే?
ఎ) హైడ్రోజన్ పెరాక్సైడ్
బి) డ్యుటీరియం ఆక్సైడ్
సి) లవణాలు కలిగిన నీరు
డి) శుద్ధి చేసిన నీరు
56. ఆటంబాంబు సూత్రం?
ఎ) కేంద్రక సంలీనం
బి) కేంద్రక వియోగం
సి) కేంద్రక విచ్ఛిత్తి
డి) పరమాణు దహనం
57. సూర్యుడు, నక్షత్రాలలో శక్తికి కారణం?
ఎ) కేంద్రక సంలీనం
బి) కేంద్రక విచ్ఛిత్తి
సి) కేంద్రక దహనం
డి) పరమాణు దహనం
58. ఎలక్ట్రాన్ ద్రవ్యరాశి సమాన ద్రవ్యరాశి,సమానస్థాయిలో ధనావేశం గల కణం?
ఎ) న్యూట్రాన్ బి) పాజిట్రాన్
సి) మ్యూయాన్ డి) మెసాన్
59. శుద్ధి చేసిన యురేనియం ఆక్సైడ్ ఖనిజాన్ని ఏమంటారు?
ఎ) ఎల్లోకేక్ బి) పింక్ కేక్
సి) గ్రీన్ కేక్ డి) వైట్ కేక్
60. కేంద్రకంలోని ఎలక్ట్రాన్ల సంఖ్య ఎప్పుడూ?
ఎ) 10 బి) 1 సి) -1 డి) 0
61. హైడ్రోజన్ కేంద్రకంలోని ఎలక్ట్రాన్ల సంఖ్య?
ఎ) 2 బి) 0 సి) -1 డి) 1
62. కింద పేర్కొన్న ఏ కేంద్రకంలో న్యూట్రాన్లు ఉండవు?
ఎ) హీలియం బి) నియాన్
సి) రేడియం డి) హైడ్రోజన్
63. రేడియోధార్మిక శ్రేణిలో చివరగా ఏర్పడే స్థిర కేంద్రకం లెడ్ అర్ధ జీవిత కాలం?
ఎ) అనంతం బి) సున్నా
సి) 5.7×1011 సం.లు
డి) 365 రోజులు
64. కేంద్రక విచ్ఛిత్తి ప్రక్రియలో ఒక న్యూక్లియాన్‌కు వెలువడే శక్తి?
ఎ) 7 MeV బి) 0.8 MeV
సి) 231 MeV డి) 931.5 MeV
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు