మానవుడు నిమిషానికి ఎన్నిసార్లు శ్వాసిస్తాడు?
- జీవశాస్త్రం
1. పుస్తకాకార ఊపరితిత్తులు ఏ జీవిలో ఉంటాయి?
1) కప్ప 2) తేలు
3) రొయ్య 4) బొద్దింక
2. కింది వాటిలో సరైన వాక్యం ఏది?
1) అవాయు శ్వాసక్రియలో అధిక శక్తి
వెలువడుతుంది
2) అవాయు శ్వాసక్రియలో ఆక్సిజన్ లోటు
ఏర్పడుతుంది
3) అవాయు శాస్వసక్రియలో ఇథనాల్
ఏర్పడుతుంది
4) అవాయు శ్వాసక్రియలో మైటోకాండ్రియా పాల్గొంటుంది
3. ఎ. అవాయు శ్వాసక్రియలో లాక్టిక్ ఆమ్లం, కార్బన్ డై ఆక్సైడ్, శక్తి అంత్య ఉత్పన్నాలు బి. ఆర్థ్రోపొడా వర్గానికి చెందిన జీవులు వాయునాళ వ్యవస్థ ద్వారా శ్వాసిస్తాయి. పై వాటిలో సరైనది ఏది?
1) ఎ, బి 2) ఎ మాత్రమే
3) బి మాత్రమే 4) ఏదీ కాదు
4. వాయునాళ వ్యవస్థ కలిగిన జీవి?
1) వానపాము 2) నత్త
3) బొద్దింక 4) తాబేలు
5. కిందివాటిని జతపరచండి.
1. వాన్ హెల్మాండ్ ఎ. ఆక్సిజన్ నామకరణం
2. జోసెఫ్ బ్లాక్ బి. వివిధ వాయువులను గుర్తించడానికి ప్రయోగాలు
3. జోసెఫ్ ప్రి సి. స్థిరమైన గాలి
4. లెవోయిజర్ డి. ఆక్సిజన్
5. వాయు వినిమయం ఇ. కార్బన్ డై ఆక్సైడ్, ఆక్సిజన్
1) 1-బి, 2-సి, 3-డి, 4-ఎ, 5-ఇ 2) 1-బి, 2-డి, 3-సి, 4-ఎ, 5-ఇ
3) 1-ఎ, 2-ఇ, 3-సి, 4-డి, 5-బి 4) 1-బి, 2-ఇ, 3-డి, 4-సి, 5-ఎ
6. నిశ్చితం (ఎ): మింగేటప్పుడు ఆహారం వాయునాళంలోకి ప్రవేశించదు కారణం (ఆర్): కంఠబిలానికి ఉపజిహ్వక రక్షణగా ఉంటుంది
1) (ఎ), (ఆర్) నిజం, (ఎ)కు (ఆర్) సరైన వివరణ
2) (ఎ), (ఆర్) నిజం, (ఎ)కు (ఆర్)సరైన వివరణ కాదు
3) (ఎ) నిజం, కానీ (ఆర్) నిజం కాదు
4) (ఎ) నిజం కాదు, కానీ (ఆర్) నిజం
7. సముద్రాల లోపలికి వెళ్లి ఈతకొట్టే వాళ్లు, పర్వతారోహకులు తమ వెంట ఆక్సిజన్ సిలిండర్లను తీసుకుని వెళ్లడానికి కారణం?
1) ఆ ప్రదేశాల్లో ఆక్సిజన్ శాతం తక్కువ ఉండటం. నీటిలో కరిగిన ఆక్సిజన్‌ను
మానవులు సులభంగా పీల్చుకుంటారు
2) ఆ ప్రదేశాల్లో ఆక్సిజన్ శాతం తక్కువ, నీటిలో కరిగిన ఆక్సిజన్‌ను మానవులు
పీల్చుకోలేరు
3) ఆ ప్రదేశాల్లో ఆక్సిజన్ ఎక్కువ, నీటిలో కరిగిన ఆక్సిజన్‌ను మానవులు పీల్చుకోలేరు
4) సముద్రంలో ఉన్న ఆక్సిజన్‌ను పీల్చుకోలేరు, పర్వత ప్రాంతాల్లోని ఆక్సిజన్‌ను పీల్చుకోలేరు
8. శ్వాసకదలికలకు మానవుడిలో ఏ భాగం ముఖ్యపాత్ర వహిస్తుంది?
1) ఊపిరితిత్తులు 2) ముక్కు
3) విభాజకపటలం 4) గొంతు
9. మానవుడి శ్వాసక్రియ అంటే అర్థం ఏమిటి?
1) ఆక్సిజన్ పీల్చుకొని కార్బన్ డై ఆక్సైడ్‌ను వదలటం
2) గాలిని పీల్చుకొని బయటకు వదలటం
3) బయటి నుంచి ఊపిరితిత్తుల్లోని అత్యంత సూక్ష్మ నిర్మాణాలైన వాయుగోణులకు, వాయుగోణులు, రక్త నాళాల మధ్య వాయు వినిమయం, అక్కడి నుంచి బయటకు గాలి ప్రసరించే మార్గం 4) 1, 2
10. కింది వాటిని జతపరచండి.
1. ఉపజిహ్వక ఎ. ఫ్లూరా
2. స్వరపేటిక బి. వాయు రవాణా
3. వాయుగోణులు సి. వాయు వినిమయం
4. ఊపిరితిత్తులు డి. స్వర తంత్రులు
5. హిమోగ్లోబిన్ ఇ. ఆహారం, వాయువుల నియంత్రణ
1) 1-డి, 2-బి, 3-ఇ, 4-సి, 5-ఎ 2) 1-ఎ, 2-బి, 3-డి, 4-సి, 5-ఇ
3) 1-ఇ, 2-డి, 3-సి, 4-ఎ, 5-బి 4) 1-ఇ, 2-డి, 3-ఎ, 4-సి, 5-బి
11. కింది వాటిలో జాన్‌డాపర్ ప్రతిపాదించిన వాక్యాల్లో సరికాని వాటిని గుర్తించండి.
ఎ. జీవులు గ్రహించే పదార్థాల్లో దహనం చెందడానికి వీలైనవి నీరు, ఆక్సిజన్ ప్రధానంగా ఉంటాయి
బి. నీరు, ఆక్సిజన్ ఒకదానిపై ఒకటి ఆధారపడి జరిపే చర్యల వల్ల, భౌతికంగా జీవక్రియలు జరుగుతాయి
3. శరీరం నుంచి విడుదలయ్యే విసర్జితాల్లో నీరు, కార్బన్ డై ఆక్సైడ్, పాస్ఫరస్, సల్ఫర్ ఉంటాయి
4. జీవుల్లో ఎటువంటి జీవక్రియలకు నీరు, ఆక్సిజన్ అవసరం లేదు
1) ఎ, బి, సి 2) సి, డి
3) డి 4) బి, సి
12. మానవుడిలో శ్వాసకేంద్రం మెదడులోని ఏ భాగంలో ఉంటుంది?
1) మస్తిష్కం 2) అనుమస్తిష్కం
3) క్రూరా సెరిబ్రై 4) మజ్జాముఖం
13. మానవుడిలో శ్వాసక్రియారేటు కింది ఏ సమయంలో మారుతుంది?
1) మానసిక ఆందోళన 2) వ్యాయామం
3) వయస్సు 4) పైవన్నీ
14. వాయుమార్గంలో తేమ లేకుంటే ఏమవుతుంది?
1) దుమ్ము, ధూళి కణాలు గాలి నుంచి తొలగిపోవు
2) గాలి ఉష్ణోగ్రత మారదు
3) ఊపిరితిత్తులు చెడిపోతాయి
4) పైవన్నీ
15. కప్పలో జరిగే శ్వాసక్రియ ఏ రకానికిచెందినది?
1) ఆస్యకుహర, చర్మ, పుపుస
2) వాయురహిత, జలశ్వాస, చర్మ
3) వాయురహిత, చర్మ, పుపుస
4) జలశ్వాస, ఆస్యకుహర, చర్మ
16. ఫ్లూరా ప్రాధాన్యతను గుర్తించండి.
1) శ్వాస కదలికలను నియంత్రిస్తుంది
2) శ్వాస కదలికల్లో ఘర్షణను నియంత్రిస్తుంది
3) శ్వాసక్రియలో పాల్గొంటుంది
4) ఊపిరితిత్తులకు రక్షణ కల్పిస్తుంది
1) 1, 2 2) 2, 3
3) 2, 4 4) 1, 4
17. కింది దేనిలో వాయుసహిత శ్వాసక్రియజరుగుతుంది?
1) ప్లాస్మోడియం 2) ఎంటామీబా
3) టీనియా సోలియం 4) కొలంబా
18. కింది వాటిని జతపరచండి.
1. వాయునాళాలు ఎ. రాచపీత
2. పుస్తకాకార మొప్పలు బి. తేలు
3. పుస్తకాకార ఊపిరితిత్తులు సి. బొద్దింక
4. చర్మం డి. జలగ
1) 1-సి, 2-డి, 3-బి, 4-ఎ
2) 1-సి, 2-ఎ, 3-డి, 4-బి
3) 1-సి, 2-ఎ, 3-డి, 4-బి
4) 1-ఎ, 2-ఇ, 3-బి, 4-డి
19. ైగ్లెకాలిసిస్లో ఒక గ్లూకోజ్ నుంచి ఏర్పడే పైరువిక్ ఆమ్ల అణువులు ఎన్ని?
1) 1 2) 2 3) 3 4) 4
20. ఆహార, వాయు మార్గాలను నియంత్రిస్తూ ఆహారాన్ని, గాలిని తమ వ్యవస్థల్లోకి పంపించే ట్రాఫిక్ పోలీస్మెన్లా పనిచేసే కండరపు కవాటం ఏది?
1) గ్రసని 2) నాసికాకుహరం
3) ఉపజిహ్వక 4) అలిందం
21. లేవోయిజర్ ప్రకారం వస్తువులు దహనం చెందినప్పుడు వెలువడే వాయువులు ఏవి?
1) స్థిర వాయువు లేద బొగ్గుపులుసు వాయువు
2) ఖర్చయ్యే గాలి
3) మార్పు చెందని గాలి 4) నత్రజని
22. జంతువులు చేయలేని ప్రక్రియ ఏది?
1) కిరణజన్య సంయోగక్రియ
2) జీర్ణక్రియ
3) శ్వాసక్రియ 4) పునరుత్పత్తి
23. కిందివాటిలో సరైన దాన్ని గుర్తించండి.
1) గుండె నుంచి ఊపిరితిత్తులకు ముదురు ఎరుపు రంగులో ఉండే ఆక్సిజన్ రహిత రక్తం ప్రవహిస్తుంది
2) ఊరిపితిత్తుల నుంచి గుండెకు ప్రకాశవంతమైన ఎరుపు రంగు ఆక్సిజన్ సహిత రక్తం ప్రవహిస్తుంది
3) గుండె నుంచి ఊపిరితిత్తులకు ముదురు ఎరుపు రంగులో ఉండే ఆక్సిజన్ సహిత రక్తం ప్రవహిస్తుంది 4) 1, 2 సరైనవి
24. శ్వాసనాళాల వాపు (బ్రాంకైటిస్) దేనిఅస్వాభవికత?
1) కాలేయం 2) శ్వాసనాళం
3) మూత్రపిండాలు 4) రక్తం
25. ఏ జంతువులో చర్మం శ్వాసక్రియఅంగంగా ఉండదు?
1) బొద్దింక 2) వానపాము
3) జలగ 4) సాలమాండర్
26. కింది వాటిని జతపరచండి.
1. మానవుడి ఊపిరితిత్తుల సామర్థ్యం ఎ. 2500 మి.లీ- 300 మి.లీ
2. విశ్రాంతి సమయంలో లోపలికి బి. 5800 మి.లీ
తీసుకుని బయటకు వదిలే గాలి
3. ఊపిరితిత్తుల్లో మిగిలి ఉండే గాలి సి. 500 మి.లీ
4. ఉచ్ఛాస నిలువ ఘనపరిమాణం డి. 1200 మి.లీ
1) 1-బి, 2-డి, 3-సి, 4-ఎ 2) 1-బి, 2-సి, 3-ఎ, 4-డి
3) 1-బి, 2-సి, 3-డి, 4-ఎ 4) 1-సి, 2-డి, 3-ఎ, 4-బి
27. కణశక్త్యాగారాలు అని వేటిని పిలుస్తాం?
1) గాల్జీ దేహాలు 2) రైబోసోమ్‌లు
3) లైసోసోమ్‌లు 4) క్రోమోజోమ్‌లు
28. లెవోయిజర్ ప్రతిపాదించిన వాటిలో సరికాని వాక్యాన్ని గుర్తించండి.
1) బొగ్గుపొడిని మండించినప్పుడు గంటజాడీలో వెలువడిన వాయువును స్థిరమైన వాయువు అని గుర్తించాడు
2) మనం పీల్చే వాయువు పదార్థాలను మండించడానికి కూడా తోడ్పడుతుంది
3) గాలిలో స్థిరమైన వాయువు 1/6వ వంతు పరిమాణంలో ఉంటుంది
4) మనం విడిచే గాలి సున్నపు నీటిపై ఎటువంటి ప్రభావాన్ని చూపదు
29. నాసికా కుహరంలో గాలి పొందే మార్పులు ఏమిటి?
1) గాలి ఉష్ణోగ్రత, శరీర ఉష్ణోగ్రతకు దాదాపు సమానమవుతుంది
2) గాలిలోకి తేమ చేరుతుంది
3) 1, 2 4) పైవేవీ కాదు
30. రక్తంలో హిమోగ్లోబిన్ ఉపయోగం ఏమిటి?
1) రక్తం గడ్డకట్టకుండా కాపాడటం
2) ఆక్సిజన్ రవాణా
3) ఎర్ర రక్తకణాల ఉత్పత్తి
4) కార్బన్ డై ఆక్సైడ్ రవాణా
31. మానవుడిలో ఉచ్ఛాసం జరిగేటప్పుడు శ్వాసవ్యవస్థలోని వివిధ భాగాల్లోకి వాయువు ప్రవేశించే మార్గాన్ని గుర్తించండి.
1) నాసికా రధ్రాలు- వాయుకోశ గోణులు- వాయునాళం- గ్రసని
2) గ్రసని- వాయునాళం- వాయుకోశ గోణులు- నాసికారంధ్రాలు
3) నాసికా రంధ్రాలు- గ్రసని- వాయునాళం- వాయుకోశ గోణులు
4) గ్రసని-నాసికా రంధ్రాలు- వాయుకోశ గోణులు- వాయునాళం
32. మానవుడు నిమిషానికి ఎన్నిసార్లు శ్వాసిస్తాడు?
1) 18 2) 72 3) 120 4) 80
33. జతపరచండి.
1. పుపుస వెంటిలేషన్
2. బాహ్య శ్వాసక్రియ
3. కణ శ్వాసక్రియ
4. అంతర శ్వాసక్రియ
ఎ. దైహిక రక్తనాళాలు, కణజాలాల మధ్య వాయు వినిమయం
బి. కణాల్లో ఆహార పదార్థాల ఆక్సీకరణ
సి. ఊపిరితిత్తుల్లో ఆక్సిజన్ గ్రహింపబడి కార్బన్ డై ఆక్సైడ్ బయటకు పంపబడుతుంది
డి. వాయుకోశాలు రక్తనాళాల మధ్య వాయు వినిమయం
1) 1-సి, 2-డి, 3-ఎ, 4-బి
2) 1-సి, 2-డి, 3-బి, 4-ఎ
3) 1-సి, 2-బి, 3-డి, 4-ఎ
4) 1-సి, 2-బి, 3-ఎ, 4-డి
34. చేప వేటి ద్వారా శ్వాసిస్తుంది?
1) మొప్పలు 2) ఊపిరితిత్తులు
3) చర్మం 4) ఆస్యకుహరం
35. శ్వాసక్రియలో ఏ ప్రక్రియ వల్ల ఎక్కువ శక్తిజనిస్తుంది?
1) క్రెబ్స్ వలయం 2) ఎలక్ట్రాన్ రవాణా
3) ైగ్లెకాలసిస్ 4) పులియడం
36. రాము శ్వాసక్రియలోని వాయు సంఘటనల గురించి కొన్ని వ్యాఖ్యానాలు చేశాడు. అందులో సరికాని దాన్ని గుర్తించండి.
1) ఉచ్ఛాస సమయంలో ఆక్సిజన్‌ను 21 శాతం తీసుకుని నిశ్వాస సమయంలో 16 శాతం బయటకు విడిచిపెడతాం
2) నిశ్వాసంలో నత్రజని శాతం పెరుగుతుంది
3) ఉచ్ఛాస సమయంలో కార్బన్ డై ఆక్సైడ్‌ను 0.03 శాతం తీసుకుని నిశ్వాస సమయంలో 4.4 శాతం విడిచిపెడతాం
4) నిశ్వాస సమయంలో ఆక్సిజన్‌ను విడిచిపెట్టం
1) 1, 2 2) 2, 3
3) 2, 4 4) 3, 4
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు